సాక్షి, స్పోర్ట్స్/సినిమా : డిసెంబర్ 11న వివాహం తర్వాత అనుష్క-కోహ్లి హనీమూన్ ఎక్కడికి వెళ్లారంటూ ఆరాలు తీయటం కొందరి వంతు అయ్యింది. ఇంతలో అనుష్క స్వర్గంలో ఉన్నామంటూ ఓ ఫోటోను షేర్ చేయటంతో ఆ ఆత్రుత మరింతగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో దర్శనమివ్వటంతో ఎవరికి తోచిన రీతిలో వారు కథనాలు, మరికొందరు కామెంట్లతో సెటైర్లు పేల్చారు.
సౌతాఫ్రికా, ఆస్టేలియా గోల్డ్ కోస్ట్, ఫ్రెంచ్ రివరియా, మాల్దీలు ఇలా ఎవరికి తోచిన పేర్లను వారు చెప్పేశారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆ సస్పెన్స్ వీడింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఫిన్‌లాండ్‌లో ఉన్నట్లు చేస్తున్నారని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. మొన్న ప్రచురించిన ఫోటో కూడా అక్కడిదేనని.. రోవనేమి, ల్యాప్‌లాండ్ ప్రాంతంలో వీరు బస చేశారని అందులో పేర్కొంది.
ఫిన్‌లాండ్‌లో వీరిద్దరి స్వేచ్ఛా విహారం గురించి అక్కడి మీడియా సంస్థ కూడా కథనం ప్రచురించింది కూడా. ఇటలీలోని 13వ శతాబ్దానికి చెందిన బోర్గో ఫినోచ్చిటో రిసార్ట్‌లో వైభవంగా ఈ జంట వివాహం చేసుకున్న వివాహం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment