spot
-
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగి.. స్పాట్లో రిజైన్! ఎందుకంటే..
Employee Quits Job On Spot: ఉద్యోగం ఆర్థిక స్థిరత్వాన్ని అందించినప్పటికీ చాలా మంది ఒత్తిడికి ఇదే మూల కారణం. సోషల్ మీడియా ముఖ్యంగా రెడ్డిట్ (Reddit).. ఉద్యోగులు విధుల్లో ఎదుర్కొంటున్న బాధలను పంచుకునే కేంద్రంగా మారింది. ఇటీవల CrazieIrish అనే పేరుతో ఉన్న ఒక రెడ్డిట్ యూజర్ తమ టాక్సిక్ బాస్ బూతు మాట అనడంతో స్పాట్లో ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లు షేర్ చేశారు. దీని గురించి మరింత వివరణ అడిగినప్పుడు ఆ యాజర్ కామెంట్స్‌లో పూర్తిగా తెలియజేశారు."నేను ఇంటి నుంచి పని చేస్తున్నా. కొత్త కంప్యూటర్‌కు యాక్సెస్ పొందడానికి సపోర్ట్ కోసం అతనికి (బాస్) కాల్ చేయాల్సి వచ్చింది. ఖాళీ సమయంలో కంప్యూటర్ను సెటప్ చేయనందుకు కోపంగా ఉన్న అతను బూతు మాట (F*** Off) అన్నాడు. దీంతో స్పాట్లో జాబ్ వదిలేస్తున్నట్లు చెప్పాను" అని రాసుకొచ్చారు. ఈ ఈమెయిల్‌కు తమకు ఎలాంటి రిప్లై రాలేదని పేర్కొన్నారు. ఈ రెడ్డిట్ పోస్ట్ షేర్ చేసిన కేవలం 20 గంటల్లోనే 37,000 కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. చాలా మంది ఇంటర్నెట్ యాజర్లు కామెంట్ల రూపంలో స్పందించారు. ఉద్యోగి తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది సమర్థించారు. So, I Quit My Job byu/CrazieIrish inantiwork -
HYD: కేబుల్‌బ్రిడ్జి దగ్గరకు వెళ్తున్నారా.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే.!
హైదరాబాద్(మాదాపూర్): కేబుల్‌బ్రిడ్జి సూసైడ్ స్పాట్‌గా మారింది. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారు కేబుల్‌బ్రిడ్జి వద్దకు వచ్చి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎత్తు తక్కువగా ఉండడంతో ఇక్కడకు వచ్చి చెరువు మధ్యలోకి దూకుతున్నారు. అక్కడ ఎక్కువ లోతుగా ఉండడంతో దూకిన వారు బురదలో చిక్కుకుంటున్నారు. ఇటీవల తొమ్మిదిమంది ఆత్మహత్యాయత్నం చేయగా లేక్ పోలీసులు ముగ్గురిని కాపాడారు. మాదాపూర్‌లో దుర్గం చెరువు ఏరియా చుట్టుపక్కల ప్రాంతాల వారికి దూరాన్ని తగ్గించేందుకు కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. చూపరులను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసిన ఈ తీగల వంతెనను నిత్యం సందర్శకులు సందర్శిస్తుంటారు. అయితే ఈ కేబుల్ బ్రిడ్జి సూసైడ్ స్పాట్‌గా మారింది. ►కేబుల్ బ్రిడ్జిపై కేవలం 4 అడుగుల ఎత్తు ఉండడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ►లేక్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ►ఆకస్మాత్తుగా చెరువు మధ్య భాగంలో దూకడంతో ఊబిలోకి చొచ్చుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ►చెరువు మధ్యభాగంలో దాదాపు 40 అడుగుల లోతు ఉండడంతో బయటకు తీయాలంటే ఎక్కువ సమయం పడుతోంది. ►ఇప్పటికి 9 మంది సూసైడ్ చేసుకున్నారని అందులో ముగ్గురిని రక్షించినట్టు తెలిపారు. ►కేబుల్‌బ్రిడ్జిపై 12 నుండి 14 అడుగుల ఎత్తు ఉండే విధంగా రక్షణ కంచె ఏర్పాటు చేయాలని దుర్గం చెరువు లేక్‌పోలీసులు తెలిపారు. ►సూసైడ్ చేసుకునే వారు పైకిఎక్కే క్రమంలో తొందరగా స్పందించవచ్చన్నారు. ►ఎవరైనా అదృశ్యమైతే వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, ఈ సమాచారం వల్ల ప్రాణాలను కాపాడవచ్చన్నారు ► కాగా సందర్శకులు కేబుల్‌బ్రిడ్జిపై నిలబడకుండా ఐటీ పెట్రోలింగ్ 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది. అయిన ప్రమాదాలు జరుగుతున్నాయి. ►ఎత్తైన కంచెను ఏర్పాటు చేస్తే కొంతవరకు ఆత్మహత్యలను నివారించవచ్చని సీనియర్ సిటిజన్లు తెలిపారు. ►అనుమతులు లేకుండా డ్రోన్లు వాడకూడదన్నారు. ►లేక్ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు జమీందర్లు, ఇద్దరు కానిస్టేబుళ్లును అందుబాటులో ఉంచారు. వీరితో పాటు ఒక ఎస్సై ఉంటారు. ►రిస్క్ చేసేందుకు ఒక స్పీడ్ బోటు ఉన్నాయి. చెరువు చుట్టూరా తిరిగేందుకు నాలుగు బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ►చెరువులో పడ్డ వారిని ఏ విధంగా రక్షించాలో ఫైర్ సిబ్బంది శిక్షణ పొందారు ►పైనుంచి దూకిన వారిని, నీటిలో మునిగిపోతున్న వారిని ఏ విధంగా కాపాడాలో, బయటికి తీసుకువచి్చన తరువాత ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలో శిక్షణ ఇచ్చారు. ►మూడు పద్దతులలో కాపాడనున్నట్టు తెలిపారు. డ్రైలాండ్ రిసు్క, సెమి కాంటాక్ట్, ఫుల్ కాంటాక్ట్ పద్ధతులను వాడాలని పోలీసులు తెలిపారు. ►బోట్ నడిపే విధానం, బోటు చెడిపోతే బాగు చేసుకునే పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. సమస్యలకు చావు పరిష్కారం కాదు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అలా అని చావు పరిష్కారం కాదు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో, బంధువులతో కలసి మాట్లాడి పరిష్కరించుకోవాలి. అధైర్యపడవద్దు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సూసైడ్లు చేసుకోవద్దు. విలువైన కట్టడానికి అర్థం మారిపోతుంది. ఎవరైనా అదృశ్యమైనా, అనుమానాస్పదంగా ఉన్నా పోలీస్‌స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేస్తే ఫోన్ ట్రేస్ చేసి లోకేషన్‌ని గుర్తించి ప్రాణాలను కాపాడవచ్చు. –మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి -
‘రోబో డాగ్’ చేసే పనులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
సాధారణంగా చాలా మంది పెంపుడు జంతువులుగా కుక్కలను పెంచుకుంటారు. ఆ మూగజీవాలు మన రక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ భవిష్యత్తులో వాటిని కూడా రోబోలతో భర్తీ చేస్తామేమో..! అవును మీరు చదివింది నిజమే.. రానున్న కాలంలో రోబోలే మనకు కాపలాగా ఉండనున్నాయి. కెనడాకు చెందిన ఆల్బార్టా షెల్ రిఫైనరీ కంపెనీ ‘స్పాట్’ అనే రెండు రోబో డాగ్‌లను కాపలా ఉద్యోగులుగా చేర్చుకున్నారు. ప్లాంట్‌లో అత్యంత ప్రమాదకరమైన పనులను ఈ రోబో డాగ్‌లు చూడనున్నాయి. వీటితో ప్లాంట్‌లో ప్రాణనష్టం తక్కువని భావించి ఈ రోబోలను వారి కంపెనీలో చేర్చుకున్నారు. ఈ రోబో డాగ్‌లను అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ అనే సంస్థ రూపొందించింది. స్పాట్ రోబో డాగ్ ధర సుమారు లక్ష డాలర్లు. స్పాట్ ప్రత్యేకతలివే.. స్పాట్ చేసే పని చూస్తే ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. ఈ రోబో డాగ్‌లు గంటకు మూడు మైళ్ల గరిష్ట వేగాన్ని అందుకోగలవు. అంతేకాకుండా వీటికి అమర్చిన 360 డిగ్రీల కెమెరాలతో వాటికి ఎదురయ్యే అడ్డంకుల నుంచి సులువుగా తప్పించుకోగలవు. సుమారు పద్నాలుగు కిలోల వరకు బరువును మోయగలవు. స్పాట్‌ను అత్యల్పంగా -20 డిగ్రీల సెల్సియస్ నుంచి, అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద ఆపరేట్ చేయవచ్చు. అంతేకాకుండా ఆయిల్, గ్యాస్ కంపెనీలో జరిగే లీకేజీలను కూడా ఇవి పసిగట్టగలవు. ఈ రోబో డాగ్‌లను పలు క్లిష్టమైన పనులకు ఉపయోగించవచ్చునని బోస్టన్ డైనమిక్స్ తెలిపింది. అండర్‌గ్రౌండ్ మైనింగ్, రేడియేషన్ ఎక్కువగా ఉండే న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఆయిల్ రిఫైనరీ కంపెనీలో వీటిని వాడొచ్చుననీ పేర్కొంది. బోస్టన్ డైనమిక్స్ స్పాట్ రోబో డాగ్‌లతో పాటు, బిగ్ డాగ్, హ్యాండిల్, చీతా, పెట్మెన్, అట్లాస్ లాంటి హ్యూమనాయిడ్ రోబోలను రూపొందించింది. వీటిలో ప్రస్తుతం స్పాట్ రోబో డాగ్‌లను మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. -
విరుష్క... ఆ స్వర్గమేంటో తెలిసిపోయింది
సాక్షి, స్పోర్ట్స్/సినిమా : డిసెంబర్ 11న వివాహం తర్వాత అనుష్క-కోహ్లి హనీమూన్ ఎక్కడికి వెళ్లారంటూ ఆరాలు తీయటం కొందరి వంతు అయ్యింది. ఇంతలో అనుష్క స్వర్గంలో ఉన్నామంటూ ఓ ఫోటోను షేర్ చేయటంతో ఆ ఆత్రుత మరింతగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో దర్శనమివ్వటంతో ఎవరికి తోచిన రీతిలో వారు కథనాలు, మరికొందరు కామెంట్లతో సెటైర్లు పేల్చారు. సౌతాఫ్రికా, ఆస్టేలియా గోల్డ్ కోస్ట్, ఫ్రెంచ్ రివరియా, మాల్దీలు ఇలా ఎవరికి తోచిన పేర్లను వారు చెప్పేశారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆ సస్పెన్స్ వీడింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఫిన్లాండ్లో ఉన్నట్లు చేస్తున్నారని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. మొన్న ప్రచురించిన ఫోటో కూడా అక్కడిదేనని.. రోవనేమి, ల్యాప్‌లాండ్ ప్రాంతంలో వీరు బస చేశారని అందులో పేర్కొంది. ఫిన్లాండ్లో వీరిద్దరి స్వేచ్ఛా విహారం గురించి అక్కడి మీడియా సంస్థ కూడా కథనం ప్రచురించింది కూడా. ఇటలీలోని 13వ శతాబ్దానికి చెందిన బోర్గో ఫినోచ్చిటో రిసార్ట్‌లో వైభవంగా ఈ జంట వివాహం చేసుకున్న వివాహం తెలిసిందే. In heaven, literally 😇😍 A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Dec 15, 2017 at 12:25am PST -
మలుపులో మాటు!
నారాయణరెడ్డి హత్యకు రెండు ప్రాంతాల్లో స్పాట్ - రామకృష్ణాపురం వద్ద కొండల్లో మరో టీం కాపు - మొదటి స్పాట్ పూర్తి కాగానే ఫోన్లో సమాచారం - జంట హత్యల్లో వెలుగులోకి మరో కోణం - ఆ వ్యక్తులు ఎవరనే విషయం వెలుగులోకి రాని వైనం - పోలీసుల దర్యాప్తు ఆ దిశగా సాగాలనే డిమాండ్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని హత్య చేసేందుకు పక్కా ప్లాన్ సాగిందా? ఒకవేళ కల్వర్టు వద్ద దాడి చేసే అవకాశం దక్కకపోతే మరో ప్రాంతంలో అటాక్ చేసేందుకు పథకం రచించారా? రామకృష్ణాపురం సమీపంలో కొండ చరియల మలుపుల వద్ద మరో 25 మంది టీంతో అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా? అక్కడ కూడా మరో రెండు ట్రాక్టర్లు, వేట కొడవళ్లు, బాంబులతో దాడి చేసే ప్లాన్ ఉందా? కల్వర్టు ప్రాంతంలోనే దాడి జరిగి నారాయణ రెడ్డి హతం కావడంతో రెండో ప్రాంతంలో ఉన్న టీం కాస్తా తప్పించుకుందా? అనే వరుస ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఒకవేళ నారాయణ రెడ్డిపై కల్వర్టు ప్రాంతంలో దాడి చేసేందుకు వీలుపడకపోతే.. కొండ చరియల మలుపుల వద్ద దాడి జరిగే అవకాశం ఉందని అక్కడ సంచరించిన వారితో పాటు గ్రామస్తులు తెలుపుతున్న వివరాల ప్రకారం తెలుస్తోంది. కల్వర్టు ప్రాంతంలోనే నారాయణ రెడ్డి చనిపోవడంతో అక్కడ కాపు కాసిన టీంకు ఫోన్ల ద్వారా ఇక్కడి వారు సమాచారం చేరవేయడంతో వారు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ కోణంలో పోలీసులు విచారిస్తే మరింత మంది నిందితుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్కడ కాపు కాసిందెవరు? వాస్తవానికి ఇప్పటి వరకు నారాయణ రెడ్డి హత్య కేసులో హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న నిందితుల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. ఒకవేళ కల్వర్టు వద్ద నారాయణ రెడ్డిని హతమార్చడం మిస్ అయితే.. రామకృష్ణాపురం గ్రామానికి సమీపంలో కొండ మలుపుల వద్ద మరోసారి అటాక్ చేసేందుకు నిందితులు పక్కా ప్లాన్ రచించుకున్నారు. ఇక్కడ కూడా మరో 25 మంది కాపు కాసినట్టు తెలుస్తోంది. మరి ఇక్కడ కాపు కాసి.. అటాక్ చేసేందుకు ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగాల్సిన అవసరం ఉంది. వారి పేర్లు ఇప్పటివరకు బయటకు రాలేదు. అంతేకాకుండా ప్రస్తుతం దొరికిన 12 మంది నిందితులు కూడా కొండ చరియల వద్ద మరో టీం ఉందనే విషయం బయటకు వెల్లడించలేదు. ఈ పరిస్థితుల్లో కొండ చరియల వద్ద కాపు కాసిన టీంలోని వారిని కూడా అదుపులోకి తీసుకుంటే తప్ప ఈ హత్య కేసులో ఉన్న లోతెంతో అర్థమయ్యే పరిస్థితి లేదనే అభిప్రాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెలిబుచ్చుతున్నారు. కల్వర్టు పనులను ఆపిందెవరు? కల్వర్టు ప్రాంతంలో హత్య చేసేందుకు వీలుగా 15 రోజుల నుంచి రెక్కీ జరిగిందని తెలుస్తోంది. పక్కాగా 20 నుంచి 25 మంది వ్యక్తులు నేరుగా అక్కడ సంచరించి మాత్రమే హత్యకు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ జరగాల్సిన పనులను చేయవద్దంటూ అధికార పార్టీ నేతల నుంచే ఒత్తిళ్లు వచ్చినట్టు సమాచారం. ఒకవేళ రోడ్డు పనులు జరిగితే పనులు చేసే వారు సంచరిస్తూ తమ ప్లాన్‌కు అడ్డు వస్తారని భావించే పనులు నిలిపివేశారని తెలుస్తోంది. దీంతో అసలు పనులు చేయవద్దని వారించి నిలువరించిందెవరనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగించాల్సి ఉంది. అయితే, ఇప్పటికే నిందితులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నందున ఈ వివరాలన్నింటినీ పోలీసులు సేకరించే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని పోలీసు కస్టడీకి అడిగితే తప్ప కేసులో మరింత లోతైన విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
టెన్త్ స్పాట్ కేంద్రం పరిశీలన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మాంటిస్సోరి పాఠశాలలోని పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని శనివారం గుంటూరు ఆర్జేడీ, స్పాట్ ప్రత్యేక పరిశీలకుడు శ్రీనివాసరెడ్డి పరిశీలించాడు. ఉపాధ్యాయులకు మూల్యాంకనంలో సలహాలు, సూచనలు ఇస్తూ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఆదివారంతో(16వతేదీ) స్పాట్ వాల్యుయేషన్ ముగుస్తుందన్నారు. మే మొదటి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట డీఈఓ తహెర సుల్తానా, పలువురు డీవైఈఓలు ఉన్నారు. -
నేడు టెన్త్ స్పాట్ బహిష్కరణ
కర్నూలు సిటీ: ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలకు నిరసనగా నేడు ఫ్యాప్టో, జాక్టో సంఘాల ఆధ్వర్యంలో టెన్త్ స్పాట్‌ను బహిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు పాయింట్లు, వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేపడుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాయింట్ల ఆధారిత విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లపై ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలుపనున్నాయి. -
ఆదికవి నన్నయలో స్పాట్ అడ్మిషన్లు
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి స్మాట్ అడ్మిషన్లు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి రిజిస్టార్ ఆచార్య ఎ. నరసింహరావు మంగళవారం తెలిపిన వివరాలు ఉన్నాయి. రెండేళ్ల కాలవ్యవధితో కూడిన బీఈడీ కోర్సులో చేరదలచుకున్న అర్హత గల విద్యార్థులు ఈ నెల ఐదులోగా తమ దరఖాస్తులను అందజేయవలసి ఉంది. అలాగే బీఏ, బికాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీటెక్ మున్నగు డిగ్రీలలో కూడా ప్రవేశాలు తీసుకుంటున్నారు. బీసీ విద్యార్థులు ఇంటర్లో 40 శాతం, ఇతరులు 50 శాతం మార్కులతోను, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది. ప్రవేశ పరీక్ష రాయకపోయినా బీటెక్‌లో చేరేందుకు ప్రస్తుతం అవకాశం కల్పించారు. ఆసక్తి ఉండి తగిన అర్హతలు ఉన్న విద్యార్థులు ఈ నెల ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు (ఒరిజనల్, నకలుతో సహా) తీసుకుని ప్రభుత్వం నిర్ణయించి రూ.16,500 ప్రవేశ రుసుంతో యూనివర్సిటీలోని డీఓఏ కేంద్రంలో డాక్టర్ మట్టారెడ్డిని కలవాలన్నారు. నేడు నన్నయలో ప్రారంభం కానున్న ‘వికాస్’ శిక్షణ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం): ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ’వికాస్’ సంస్థ ద్వారా చేపట్టే శిక్షణ కార్యక్రమాలను ఆ సంస్థ చైర్మన్, జిల్లా కలెక్టరు హెచ్. అరుణ్‌కుమార్ బుధవారం ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో నన్నయ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్టార్ ఆచార్య ఎ. నరసింహరావు, తదితరులు పాల్గొంటారని యూనివర్సిటీ పీఆర్వో మంగళవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. -
‘స్పాట్’ ముసుగులో ఫీ‘జులుం’
ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల అక్రమాలు.. మేనేజ్మెంట్ పేరిట ‘స్పాట్’ అమ్మకాలు కమాన్‌చౌరస్తా : పాలిసెట్ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను పలు కాలేజీలు పాతరేశాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నెల 21న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాల్సి ఉండగా, పలు కాలేజీలు దోపిడీకి తెరలేపాయి. స్పాట్ అడ్మిషన్లు చేపట్టకుండా... మేనేజ్మెంట్ కోటాలో సీట్లను అమ్ముకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్పాట్ అడ్మిషన్లపై ఆశతో గురువారం ఆయా కాలేజీల్లో హాజరైన విద్యార్థులు.. అడిగినంత ఇచ్చుకోలేక వెనుదిరిగిన సంఘటనలున్నాయి. మూడు రెట్లు అధికంగా..? స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వ కళాశాలల్లో రూ.4,600 ఫీజు ఉండగా, ప్రైవేట్ కాలేజీల్లో 16,500లుగా ప్రభుత్వం నిర్ణయించింది. పలు ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు సుమారు రెండు నుంచి మూడు రెట్లు వసూలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకే సీటివ్వాలని కొంతమంది విద్యార్థులు, తల్లిదండ్రులు వాదిస్తే... సీట్లు నిండిపోయాయని కుంటిసాకులు చెప్పి తప్పించుకున్నాయి. నిబంధనల ప్రకారం పత్రిక ప్రకటన జారీ చేసి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాల్సి ఉండగా.. చాలా కాలేజీలు దానిని పక్కపెట్టి అందనంత దండుకున్నాయనే విమర్శలున్నాయి. ఖాళీలున్నా... కాసుల వర్షం.. జిల్లాలో నాలుగు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లు పది ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 840 సీట్లలో 90 శాతం వరకు భర్తీకాగా 10శాతం సీట్లు స్పాట్‌కు మిగిలాయి. అవికూడా గురువారం సుమారుగా వందశాతానికి చేరినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. ప్రైవేట్ కాలేజీల్లో సుమారుగా రెండు వేల సీట్లుండగా, రెండు దశల్లో కలిపి 75 శాతం సీట్లు భర్తీకాగా, 25 శాతం సీట్లు మిగిలాయి. ఇందులో గురువారం వరకు కేవలం 10 నుంచి 15 శాతం వరకు విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు సమాచారం. ఆందోళనలో విద్యార్థులు.. స్పాట్ అడ్మిషన్ల ద్వారా సీట్లు పొందాలనుకున్న విద్యార్థులు అధిక ఫీజులతో ఆందోళనకు గురువుతున్నారు. పలు కారణాల వల్ల రెండు దశల కౌన్సెలింగ్‌లో సీట్లు పొందనివారు, దూరప్రాంతాల్లో సీటు వచ్చినా వెళ్లలేని పరిస్థితులో ఉన్నవారు స్పాట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ అవకాశం కూడా లేకపోవడంతో సంవత్సరం వృథా అవుతుందని భావించి కొందరు ఎంత చెబితే అంత ముట్టజñ ప్పి ప్రవేశాలు తీసుకుంటున్నారు. మరికొందరు ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రవేశాలు పొందలేక బాధపడుతున్నారు. స్పాట్ అడ్మిషన్లపై విచారణ నిర్వహించి, అక్రమాలు జరిగిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
రోబో డాగ్‌తో రియల్ డాగ్ డిష్షూం డిష్షూం!
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ రూపొందించిన రోబో డాగ్ 'స్పాట్' తొలిసారిగా నిజమైన కుక్కను కలిసే ప్రయత్నం చేసింది. బుజ్జికుక్క మచ్చిక చేసుకొని స్నేహం చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఈ నాలుగు కాళ్ల జంతువుని చూడటంతోనే బుజ్జి కుక్క 'ఫిడో' అరుపులు లంకించుకుంది. 'స్పాట్' దగ్గరికొస్తున్నకొద్దీ బిగ్గరగా మొరుగుతూ దానిని దూరం తరిమే ప్రయత్నం చేసింది. దీంతో రోబో డాగ్ 'స్పాట్'- బుజ్జికుక్క 'ఫిడో' మధ్య తాము ఆశించినట్టు స్నేహం కుదరదని, ఇవి రెండూ కలిసి ఇప్పట్లో సహజీవనం చేయలేవని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. అమెరికా సైనిక అవసరాల కోసం వినియోగించేందుకు గత ఏడాది ఈ రోబో కుక్కను రూపొందించారు. ఇది బిగ్గరగా మొరగడమే కాదు.. విధేయంగా మానవ ఆదేశాలనూ నిర్వర్తిస్తుంది. సైనిక విధుల్లో క్రియాశీలంగా ఉపయోగించుకోవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బోస్టన్లోని గూగుల్ కు చెందిన డైనమిక్స్ సంస్థ దీనిని రూపొందించింది. ఈ యాంత్రిక జంతువుకు కూడా స్నేహితులను కుదిర్చాలన్నది శాస్త్రవేత్తల తాపత్రయం. అందులో భాగంగానే బుజ్జికుక్క 'ఫిడో' వద్దకు తీసుకెళ్లి 'స్పాట్'ను వదిలేశారు. స్పాట్ చాలానే ట్రై చేసింది ఫిడో తో స్నేహం చేయడానికి, కానీ ఫిడో ఒప్పుకొంటు కదా! నాలుగు కాళ్ల 'స్పాట్'ను చూడగానే అదిరిపడి మొరగుతూ అల్లరి అల్లరి చేసింది ఫిడో. ఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. -
ఇంటర్ స్పాట్ పైకం పెంపు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ పరీక్షలు, మూల్యాంకనం (స్పాట్) నిర్వహణలో పాల్గొనే అధికారులకు, అధ్యాపకులకు ఇంటర్మీడియెట్ బోర్డు తీపికబురు అందించింది. ప్రస్తుతం అందజేస్తున్న రెమ్యూనిరేషన్కు మరో 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకొంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎంవీ సత్యనారాయణ జారీచేశారు. దీంతో ఇంటర్ పరీక్షలతోపాటు, మూల్యాంకనంలోను పాల్గొనే సుమారు రెండు వేల మంది మంది అధికారులు, అధ్యాపకులు, సిబ్బందికి లబ్ధిచేకూరనుంది. ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సైతం పెంచిన రెమ్యూనిరేషన్ వర్తించనుంది. ప్రతి మూడేళ్లకొకసారి పెంపు ఇదిలా ఉండగా ఇకపై ప్రతి మూడేళ్లకు ఒకసారి ఇంటర్మీడియెట్ పరీక్షలు, మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బంది రెమ్యూనిరేషన్ పెంచాలని బోర్డు భావించింది. ప్రస్తుతం రోజుకు 30 పేపర్లు దిద్దే ఎగ్జామినర్లకు పేపర్‌కు రూ.12.10 చొప్పున రూ.363 చెల్లిస్తుండగా పెరిగిన రెమ్యూనిరేషన్‌తో రూ.15.125 చొప్పున రూ.453 చెల్లించనున్నారు. పెరుగుతున్న నిత్యవసర ధరలు, భోజన, బస్సు ఛార్జీల నేపథ్యంలో ప్రతి మూడేళ్లకొకసారి రెమ్యూనిరేషన్ను కనీసం 20 శాతం పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని బోర్డు కూడా స్పష్టం చేసింది. డీఏ కూడా పెరగనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన బోర్డుకు, జూనియర్ లెక్చరర్ల సంఘం మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ప్రస్తుతం పెరిగిన ధరలతో పోలిస్తే ఈ రెమ్యూనిరేషన్ ఏ మూలకు సరిపోదని అధ్యాపకులు భావిస్తున్నారు. మూడేళ్లకొకసారి కాకుండా ప్రతి ఏడాది కనీసం 10 శాతం మేర రెమ్యూనిరేషన్ పెంచేలా బోర్డు చొరవతీసుకోవాలని అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వెలువడిన షెడ్యూల్.. ఇదిలా ఉండగా మార్చి 2వ తేదీ నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానుండగా మార్చి 16తో జనరల్ కోర్సుల పరీక్షలు ముగియనున్నాయి. దాదాపు మార్చి 17 నుంచి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను మొదలుపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు జిల్లా అధికార యంత్రంగం ఇప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. -
ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు?
‘రక్తచరిత్ర’ వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి? ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు? తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయ్? ఈ ప్రశ్నలకు సమాధానంగా రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పాట్’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మూడో షెడ్యూల్‌కి చేరుకుంది. ఫ్యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.