రోబో డాగ్‌తో రియల్ డాగ్ డిష్షూం డిష్షూం! | Google robot dog meets real dog for the first time | Sakshi
Sakshi News home page

రోబో డాగ్‌తో రియల్ డాగ్ డిష్షూం డిష్షూం!

Published Thu, Mar 3 2016 6:00 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

రోబో డాగ్‌తో రియల్ డాగ్ డిష్షూం డిష్షూం!

రోబో డాగ్‌తో రియల్ డాగ్ డిష్షూం డిష్షూం!

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ రూపొందించిన రోబో డాగ్‌ 'స్పాట్‌' తొలిసారిగా నిజమైన కుక్కను కలిసే ప్రయత్నం చేసింది. బుజ్జికుక్క మచ్చిక చేసుకొని స్నేహం చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఈ నాలుగు కాళ్ల జంతువుని చూడటంతోనే బుజ్జి కుక్క 'ఫిడో' అరుపులు లంకించుకుంది. 'స్పాట్' దగ్గరికొస్తున్నకొద్దీ బిగ్గరగా మొరుగుతూ దానిని దూరం తరిమే ప్రయత్నం చేసింది. దీంతో రోబో డాగ్ 'స్పాట్‌'- బుజ్జికుక్క 'ఫిడో' మధ్య తాము ఆశించినట్టు స్నేహం కుదరదని, ఇవి రెండూ కలిసి ఇప్పట్లో సహజీవనం చేయలేవని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.

అమెరికా సైనిక అవసరాల కోసం వినియోగించేందుకు గత ఏడాది ఈ రోబో కుక్కను రూపొందించారు. ఇది బిగ్గరగా మొరగడమే కాదు.. విధేయంగా మానవ ఆదేశాలనూ నిర్వర్తిస్తుంది. సైనిక విధుల్లో క్రియాశీలంగా ఉపయోగించుకోవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బోస్టన్‌లోని గూగుల్‌ కు చెందిన డైనమిక్స్ సంస్థ దీనిని రూపొందించింది. ఈ యాంత్రిక జంతువుకు కూడా స్నేహితులను కుదిర్చాలన్నది శాస్త్రవేత్తల తాపత్రయం. అందులో భాగంగానే బుజ్జికుక్క 'ఫిడో' వద్దకు తీసుకెళ్లి 'స్పాట్‌'ను వదిలేశారు. స్పాట్‌ చాలానే ట్రై చేసింది ఫిడో తో స్నేహం చేయడానికి, కానీ ఫిడో ఒప్పుకొంటు కదా! నాలుగు కాళ్ల 'స్పాట్‌'ను చూడగానే అదిరిపడి మొరగుతూ అల్లరి అల్లరి చేసింది ఫిడో. ఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌ చల్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement