robot dog
-
3 టన్నుల విమానాన్ని లాగిన రోబో కుక్క
-
విమానాన్ని కుక్క లాగటం చూశారా?
జెనీవా : కుక్కలేంటి విమానాన్ని లాగటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా! ఇక్కడ 3 టన్నుల విమానాన్ని లాగింది ఓ కుక్కే.. కానీ! అది మామూలు కుక్కకాదు రోబో కుక్క. విషయమేంటంటే.. ఇటలీకి చెందిన‘‘ ఇస్టిట్యూటో ఇటాలియానో డి టెక్నలాజియా(ఐఐటీ)కి చెందిన శాస్త్రవేత్తల బృందం ‘‘హైక్యూ రియల్’’ అనే రోబో కుక్కను రూపొందించారు. దీన్ని రూపొందించటానికి గల ప్రధాన కారణం ఆపద సమయంలో మనుషులకు సహాయం చేయటం. అంతే కాకుండా ఆపద సమయాల్లో మనషులను మోయగలిగేలా కూడా రోబో కుక్కను రూపొందించారు. అయితే కుక్క సామర్థాన్ని పరీక్షించటానికి జెనీవాలోని విమానాశ్రయంలో దాన్ని 3 టన్నుల బరువున్న ఓ విమానానికి కట్టి లాగేలా చేశారు. గేమ్ కంట్రోలర్ సహాయంతో శాస్త్రవేత్తలు దాన్ని కదిలేలా చేశారు. వారిని ఆశ్చర్యపరుస్తూ దాదాపు 30 అడుగల వరుకు విమానాన్ని లాగింది ఆ కుక్క. దీంతో దాని రూపకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీన్ని ముఖ్యంగా విపత్తుల సమయంలో, వ్యవసాయ పనులకు, ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చునని వారు చెబుతున్నారు. ఇంతకు కొద్దిరోజుల ముందు సాఫ్ట్ బ్యాంకుకు చెందిన కొన్ని రోబో కుక్కలు ఓ ట్రక్కును లాగిన సంగతి తెలిసిందే. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 3 టన్నుల విమానాన్ని లాగిన రోబో కుక్క -
కొత్తప్రపంచం 17th June 2018
-
రోబో డాగ్‌తో రియల్ డాగ్ డిష్షూం డిష్షూం!
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ రూపొందించిన రోబో డాగ్ 'స్పాట్' తొలిసారిగా నిజమైన కుక్కను కలిసే ప్రయత్నం చేసింది. బుజ్జికుక్క మచ్చిక చేసుకొని స్నేహం చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఈ నాలుగు కాళ్ల జంతువుని చూడటంతోనే బుజ్జి కుక్క 'ఫిడో' అరుపులు లంకించుకుంది. 'స్పాట్' దగ్గరికొస్తున్నకొద్దీ బిగ్గరగా మొరుగుతూ దానిని దూరం తరిమే ప్రయత్నం చేసింది. దీంతో రోబో డాగ్ 'స్పాట్'- బుజ్జికుక్క 'ఫిడో' మధ్య తాము ఆశించినట్టు స్నేహం కుదరదని, ఇవి రెండూ కలిసి ఇప్పట్లో సహజీవనం చేయలేవని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. అమెరికా సైనిక అవసరాల కోసం వినియోగించేందుకు గత ఏడాది ఈ రోబో కుక్కను రూపొందించారు. ఇది బిగ్గరగా మొరగడమే కాదు.. విధేయంగా మానవ ఆదేశాలనూ నిర్వర్తిస్తుంది. సైనిక విధుల్లో క్రియాశీలంగా ఉపయోగించుకోవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బోస్టన్లోని గూగుల్ కు చెందిన డైనమిక్స్ సంస్థ దీనిని రూపొందించింది. ఈ యాంత్రిక జంతువుకు కూడా స్నేహితులను కుదిర్చాలన్నది శాస్త్రవేత్తల తాపత్రయం. అందులో భాగంగానే బుజ్జికుక్క 'ఫిడో' వద్దకు తీసుకెళ్లి 'స్పాట్'ను వదిలేశారు. స్పాట్ చాలానే ట్రై చేసింది ఫిడో తో స్నేహం చేయడానికి, కానీ ఫిడో ఒప్పుకొంటు కదా! నాలుగు కాళ్ల 'స్పాట్'ను చూడగానే అదిరిపడి మొరగుతూ అల్లరి అల్లరి చేసింది ఫిడో. ఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది.