కుక్కలేంటి విమానాన్ని లాగటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా! ఇక్కడ 3 టన్నుల విమానాన్ని లాగింది ఓ కుక్కే.. కానీ! అది మామూలు కుక్కకాదు రోబో కుక్క. విషయమేంటంటే.. ఇటలీకి చెందిన‘‘ ఇస్టిట్యూటో ఇటాలియానో డి టెక్నలాజియా(ఐఐటీ)కి చెందిన శాస్త్రవేత్తల బృందం ‘‘హైక్యూ రియల్’’ అనే రోబో కుక్కను రూపొందించారు. దీన్ని రూపొందించటానికి గల ప్రధాన కారణం ఆపద సమయంలో మనుషులకు సహాయం చేయటం. అంతే కాకుండా ఆపద సమయాల్లో మనషులను మోయగలిగేలా కూడా రోబో కుక్కను రూపొందించారు. అయితే కుక్క సామర్థాన్ని పరీక్షించటానికి జెనీవాలోని విమానాశ్రయంలో దాన్ని 3 టన్నుల బరువున్న ఓ విమానానికి కట్టి లాగేలా చేశారు.