
జెనీవా : కుక్కలేంటి విమానాన్ని లాగటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా! ఇక్కడ 3 టన్నుల విమానాన్ని లాగింది ఓ కుక్కే.. కానీ! అది మామూలు కుక్కకాదు రోబో కుక్క. విషయమేంటంటే.. ఇటలీకి చెందిన‘‘ ఇస్టిట్యూటో ఇటాలియానో డి టెక్నలాజియా(ఐఐటీ)కి చెందిన శాస్త్రవేత్తల బృందం ‘‘హైక్యూ రియల్’’ అనే రోబో కుక్కను రూపొందించారు. దీన్ని రూపొందించటానికి గల ప్రధాన కారణం ఆపద సమయంలో మనుషులకు సహాయం చేయటం. అంతే కాకుండా ఆపద సమయాల్లో మనషులను మోయగలిగేలా కూడా రోబో కుక్కను రూపొందించారు. అయితే కుక్క సామర్థాన్ని పరీక్షించటానికి జెనీవాలోని విమానాశ్రయంలో దాన్ని 3 టన్నుల బరువున్న ఓ విమానానికి కట్టి లాగేలా చేశారు.
గేమ్ కంట్రోలర్ సహాయంతో శాస్త్రవేత్తలు దాన్ని కదిలేలా చేశారు. వారిని ఆశ్చర్యపరుస్తూ దాదాపు 30 అడుగల వరుకు విమానాన్ని లాగింది ఆ కుక్క. దీంతో దాని రూపకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీన్ని ముఖ్యంగా విపత్తుల సమయంలో, వ్యవసాయ పనులకు, ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చునని వారు చెబుతున్నారు. ఇంతకు కొద్దిరోజుల ముందు సాఫ్ట్ బ్యాంకుకు చెందిన కొన్ని రోబో కుక్కలు ఓ ట్రక్కును లాగిన సంగతి తెలిసిందే.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
3 టన్నుల విమానాన్ని లాగిన రోబో కుక్క
Comments
Please login to add a commentAdd a comment