మాంటిస్సోరి పాఠశాలలోని పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని శనివారం గుంటూరు ఆర్‌జేడీ, స్పాట్ ప్రత్యేక పరిశీలకుడు శ్రీనివాసరెడ్డి పరిశీలించాడు.
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మాంటిస్సోరి పాఠశాలలోని పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని శనివారం గుంటూరు ఆర్‌జేడీ, స్పాట్ ప్రత్యేక పరిశీలకుడు శ్రీనివాసరెడ్డి పరిశీలించాడు. ఉపాధ్యాయులకు మూల్యాంకనంలో సలహాలు, సూచనలు ఇస్తూ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఆదివారంతో(16వతేదీ) స్పాట్ వాల్యుయేషన్ ముగుస్తుందన్నారు. మే మొదటి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట డీఈఓ తహెర సుల్తానా, పలువురు డీవైఈఓలు ఉన్నారు.