నేడు టెన్త్ స్పాట్ బహిష్కరణ
Published Tue, Apr 11 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM
కర్నూలు సిటీ: ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలకు నిరసనగా నేడు ఫ్యాప్టో, జాక్టో సంఘాల ఆధ్వర్యంలో టెన్త్ స్పాట్‌ను బహిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు పాయింట్లు, వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేపడుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాయింట్ల ఆధారిత విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లపై ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలుపనున్నాయి.
Advertisement
Advertisement