ఆదికవి నన్నయలో స్పాట్ అడ్మిషన్లు
Published Tue, Nov 1 2016 11:42 PM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి స్మాట్ అడ్మిషన్లు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి రిజిస్టార్ ఆచార్య ఎ. నరసింహరావు మంగళవారం తెలిపిన వివరాలు ఉన్నాయి. రెండేళ్ల కాలవ్యవధితో కూడిన బీఈడీ కోర్సులో చేరదలచుకున్న అర్హత గల విద్యార్థులు ఈ నెల ఐదులోగా తమ దరఖాస్తులను అందజేయవలసి ఉంది. అలాగే బీఏ, బికాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీటెక్ మున్నగు డిగ్రీలలో కూడా ప్రవేశాలు తీసుకుంటున్నారు. బీసీ విద్యార్థులు ఇంటర్‌లో 40 శాతం, ఇతరులు 50 శాతం మార్కులతోను, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది. ప్రవేశ పరీక్ష రాయకపోయినా బీటెక్‌లో చేరేందుకు ప్రస్తుతం అవకాశం కల్పించారు. ఆసక్తి ఉండి తగిన అర్హతలు ఉన్న విద్యార్థులు ఈ నెల ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు (ఒరిజనల్, నకలుతో సహా) తీసుకుని ప్రభుత్వం నిర్ణయించి రూ.16,500 ప్రవేశ రుసుంతో యూనివర్సిటీలోని డీఓఏ కేంద్రంలో డాక్టర్ మట్టారెడ్డిని కలవాలన్నారు.
నేడు నన్నయలో ప్రారంభం కానున్న ‘వికాస్’ శిక్షణ
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం): ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ’వికాస్’ సంస్థ ద్వారా చేపట్టే శిక్షణ కార్యక్రమాలను ఆ సంస్థ చైర్మన్, జిల్లా కలెక్టరు హెచ్. అరుణ్‌కుమార్ బుధవారం ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో నన్నయ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్టార్ ఆచార్య ఎ. నరసింహరావు, తదితరులు పాల్గొంటారని యూనివర్సిటీ పీఆర్వో మంగళవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు.
Advertisement
Advertisement