ఈ సమ్మర్ వివాహాల సీజన్. పెళ్లితో ఒక్కటైన నూతన జంట హనీమూన్‌కు ప్రణాళికలు వేసుకునే సమయం. నూతన వధూవరులకు హనీమూన్ ఒక మధురానుభూతి. మరి... ఆ టూర్ అంతే అందంగా సాగాలంటే విడిదే కీలకం. ఈ హాట్.. హాట్ సమ్మర్‌లో కూల్..కూల్ ప్లేస్ అయితేనే బాగుంటుంది. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలోని హనీమూన్ స్పాట్స్ ఇదిగో.
సాక్షి, సిటీబ్యూరో : హిమాచల్‌ప్రదేశ్‌లోని షిమ్లా, మనాలి.. వెస్ట్‌బెంగాల్‌లోని సిక్కిం, డార్జిలింగ్.. కర్టాటకలోని కూర్గ్.. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్, రాజస్థాన్‌లోని పింక్‌సిటీ జైసల్మేర్, తమిళనాడులోని ఊటి, జమ్మూకశ్మీర్, గోవా, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు తదితర ప్రాంతాలు మన దేశంలో హనీమూన్ స్పాట్స్‌గా ప్రసిద్ధి చెందాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో ప్యారిస్, మారిషస్, మాల్దీవులు, థాయ్‌లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్, మెక్సికో, గ్రీస్, ఫ్రాన్స్, ఇటలీ, కరేబియన్ దీవులు ఫేమస్. తెలంగాణలోని లక్నవరం కూడా ఇప్పుడిప్పుడే హనీమూన్ స్పాట్‌గా ఆకట్టుకుంటోంది. కొత్త జంటలు ఇక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతుండడం విశేషం.
ప్రణాళిక ముఖ్యం...
♦ ముందుగా హనీమూన్ ప్రణాళిక వేసుకోవడంచాలా ముఖ్యం. బడ్జెట్‌కు అనుగుణంగాప్రాంతాలను ఎంచుకోవాలి.
♦ వీలైనంత వరకు తక్కువ లగేజీ ఉండేలా చూసుకోవాలి.
♦ హనీమూన్ స్పాట్‌లో ఉండే వాతావరణానికి అనుగుణంగాప్రిపరేషన్ ఉండాలి. అవసరమైన మెడిసిన్ తీసుకెళ్లాలి.
♦ ఈ టూర్‌లో ప్రతి క్షణం.. ఒక మధుర జ్ఞాపకం.వీటన్నింటినీ బంధించేందుకు కెమెరా తీసుకెళ్తే బాగుంటుంది.
♦ ఆభరణాలు ఎక్కువగా తీసుకెళ్లకపోవడం మంచిది. భద్రత పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే విధంగా నగదు కూడా ఎక్కువగా వెంట ఉంచుకోవద్దు. అవసరమైనప్పుడల్లా ఏటీఎంలలో తీసుకుంటే సరి.
♦ ఆయా ప్రాంతాల గురించి ముందుగా తెలుసుకోవడం మంచిది. అక్కడి ఆచార వ్యవహారాలు, వాతావరణం, కరెన్సీ... ఇలా విభిన్న సమాచారం నెట్‌లో తెలుసుకోవచ్చు.
తెలుసుకోండిలా..
నగరంలోని వివిధ ట్రావెల్ ఏజెన్సీలు హనీమూన్ ప్యాకేజీలు అందజేస్తున్నాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల టూరిజం సంస్థలు కూడా దీనిపై సమాచారం ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని టూరిజం ప్రాంతాల సమాచారం కోసం 180042546464, 04023414334, 04023400516 , 04065574231, 04023052028 నంబర్లలో సంప్రదించొచ్చు. అదే విధంగా జాతీయ, అంతర్జాతీయ ప్రాంతాల సమాచారం కోసం ఇండియన్ టూరిజం సెంటర్ 04023409199 నంబర్‌లో సంప్రదించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment