గ్రేటర్‌లో ఉష్ణోగ్రతలు మంగళవారం ఒక్కసారిగా వేడెక్కాయి. గరిష్టంగా 36.9 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ : గ్రేటర్‌లో ఉష్ణోగ్రతలు మంగళవారం ఒక్కసారిగా వేడెక్కాయి. గరిష్టంగా 36.9 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణదిశ, తూర్పు దిశ నుంచి నగరంపైకి వీస్తున్న వేడిగాలులతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు. వచ్చే 24 గంటల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్టు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. మరో వారం రోజుల్లో నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయని తెలిపింది.