
హైదరాబాద్ : నగరంలోని గన్‌పార్క్ వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరవీరులకు నివాళులర్పించడానికి రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు గన్‌పార్క్ వద్దకు భారీగా చేరుకున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ నివాళులు అర్పించి వెళ్లిన తర్వాత అమరవీరుల స్థూపాన్ని శుద్ధి చేస్తామని ఇదివరకే టీఆర్‌ఎస్ నాయకులు చెప్పిన సంగతి తెల్సిందే.
రాహుల్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా భారీగా గన్‌పార్క్ వద్దకు చేరుకున్నారు. రాహుల్ రాక సందర్భంగా గన్‌పార్క్ వద్ద పోలీసు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment