సాక్షి, న్యూఢిల్లీ : రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోని ప్రధాన విపక్షం మహాత్మా గాంధీ చూపిన బాటను విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని మత, కుల ప్రాతిపదికన విభజిస్తూ వారసత్వ సంస్కృతిని ప్రోత్సహిస్తోందని ప్రధాని మోదీ తన బ్లాగ్‌లో రాసిన వ్యాసంలో దుయ్యబట్టారు.
న్యాయం, సమానత్వాన్ని కాంక్షిస్తూ ఉప్పు సత్యాగ్రహం చేపట్టిన మహాత్మా గాంధీ, ఆయన వెంట నడిచిన వారందరికీ ధన్యవాదాలంటూ మోదీ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. మహాత్మా గాంధీ పలు సందర్భాల్లో తాను అసమానత, కులాల పరంగా సమాజాన్ని విడదీయడానికి వ్యతిరేకమని స్పష్టం చేయగా, సమాజాన్ని విడగొట్టడంలో కాంగ్రెస్ ఎన్నడూ వెనుకాడలేదని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో కుల ఘర్షణలు, దళితుల ఊచకోతలు యధేచ్చగా సాగాయని ఆరోపించారు.కాంగ్రెస్ సంస్కృతిని పసిగట్టినందునే మహాత్మా గాంధీ 1947 తర్వాత కాంగ్రెస్‌ను రద్దు చేయాలని సూచించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, అవినీతి ఒకే నాణేనికి రెండు వైపుల వంటివని, అవినీతిలో ఆ పార్టీ నేతలు నిండా మునిగారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు తమ సొంత బ్యాంక్ ఖాతాలను నింపుకుని, పేదలకు అందించాల్సిన మౌలిక వసతులను సైతం విస్మరించి విలాసవతమైన జీవితాలను అనుభవిస్తున్నారని ప్రధాని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment