భర్త హనీమూన్ ప్లాన్తో అసిన్ థ్రిల్ | Asin the thrill of the honeymoon with her ​​husband plan | Sakshi
Sakshi News home page

భర్త హనీమూన్ ప్లాన్తో అసిన్ థ్రిల్

Published Mon, Feb 1 2016 7:02 PM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

భర్త హనీమూన్ ప్లాన్తో అసిన్ థ్రిల్

భర్త హనీమూన్ ప్లాన్తో అసిన్ థ్రిల్

ముంబై:  హీరోయిన్ అసిన్,  బిజినెస్ మేన్ రాహుల్ శర్మ ప్రేమ, పెళ్లి వ్యవహారం మొదటి నుంచి  ఆసక్తికర వార్తలు గానే నిలిచాయి.. ఇపుడు ఈ కొత్త దంపతుల  హనీమూన్ ట్రిప్ కూడా సర్ప్రైజింగ్ గానే ఉంది.  తన డార్లింగ్ తో హనీమూన్ సందర్భంగా స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసాడట రాహుల్ శర్మ. ముందుగా అనుకున్నట్లు  కాకుండా ప్లాన్ మార్చి ఆమెను థ్రిల్ చేశాడట.   

అయితే ఈ నవదంపతులు తొలుత హార్వర్డ్ బోస్టన్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారట.  కానీ అసిన్ ను సర్‌ప్రైజ్ చేయడానికి ఆమెకు ముందుగా చెప్పని లొకేషన్లకు తీసుకెళ్లి  ఆశ్చర్యంలో ముంచెత్తాలనేది రాహుల్ ఆలోచన. తన ముద్దులభార్యకు  తెలియకుండా డిఫరెంట్ డిఫరెంట్  ప్రదేశాలకు తీసుకెళ్లడం ద్వారా  తమ హనీమూన్ మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని  రాహుల్ నిర్ణయించాడట.  

కాగా  బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో నటించిన సమయంలో అసిన్ కు రాహుల్ శర్మ  పరిచయం, ప్రేమ, పెళ్లి  తెలిసిన విషయాలే.  జనవరి 19న రెండు సంప్రదాయాల  ప్రకారం వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement