సాక్షి, నెల్లూరు: వీఆర్‌ఓ ఫలితాల్లో జిల్లాకు రెండు రాష్ట్ర స్థాయి ర్యాంకులు లభించాయి. ఈ నెల 2న జరిగిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలకు సంబంధించి శనివారం ఫలితాలు వెలువడ్డాయి. వీఆర్‌ఓలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో 20 లోపు జిల్లాకు రెండు ర్యాంకులు దక్కాయి. నెల్లూరుకు చెందిన టీవీఎం కృష్ణప్రసాద్ (హాల్‌టికెట్:109116967) 98 మార్కులతో జిల్లాలో ప్రథమ, రాష్ట్ర స్థాయిలో 18వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. పొదలకూరు మండలం ప్రభగిరిపట్నానికి చెందిన గోగుల రమేష్ (109110704) 98 మార్కులతో జిల్లాలో రెండో స్థానాన్ని, రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంక్‌ను దక్కించుకున్నారు. వీఆర్‌ఏ ఫలితాల్లో కావలి రూరల్ మండలానికి చెందిన వి.అనిల్‌కుమార్‌రెడ్డి (209100191) 89 మార్కులతో జిల్లాలో ప్రథమస్థానాన్ని కైవసం చేసుకున్నారు. వీఆర్‌ఓ పరీక్షలకు జిల్లా నుంచి 35,608 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 31,932 మంది పరీక్షకు హాజరయ్యారు. వీఆర్‌ఏ పరీక్షకు 2,352 మంది దరఖాస్తు చేసుకోగా 2,045 మంది హాజరయ్యారు. ఫలితాలు చూసుకునేందుకు అభ్యర్థులు పోటీపడ్డారు. అయితే వెబ్‌సైట్‌లో ఓపెన్‌కాక ఫలితాలు కోసం ఇంటర్‌నెట్‌ల వద్ద ఎదురుచూశారు.
రోస్టర్ ఆధారంగా...
ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు మార్కులతోపాటు రోస్టర్ ఆధారంగా జిల్లా వారీగా ర్యాంకులను ప్రకటిస్తారు. అనంతరం ఆ ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. శనివారం రాత్రి నుంచే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఈ ప్రక్రియకు కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థులు జిల్లాలో తమ మార్కులు, కుల ప్రాతిపదికన ర్యాంకుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
భర్తీకానున్న 48 వీఆర్‌ఓ పోస్టులు
జిల్లాలో 48 వీఆర్‌ఓ పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి 1:2 ప్రకారం 96 మంది అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపనున్నారు. 25వ తేదీ నుంచి కలెక్టరేట్‌లో సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. వీఆర్‌ఏ అభ్యర్థులను క్లస్టర్ స్థాయిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు ఒర్జినల్ సర్టిఫికెట్స్, జెరాక్స్ కాపీలు, పాస్ పోర్టు సైజు ఫొటోలతో హాజ రు కావాల్సి ఉంటుంది. వీఆర్‌ఓలకు సంబంధించి మెరిట్ సాధించిన 98 మంది అభ్యర్థుల జాబితాను ఆదివారం కలెక్టరేట్‌లో ప్రచురిస్తారు. ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరుడాట్‌కామ్ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల జాబితా పొందుపరిచారు.
జిల్లాకు రెండు ర్యాంకులు
Published Sun, Feb 23 2014 3:20 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement