గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/ నాగాయలంక/తిరుపతి కల్చరల్: అంత ర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసి యేషన్ (ఏపీపీజేఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఫొటో కాంపిటీషన్ ఫలితాలను జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు విడుదల చేశారు. గురువారం విజయవాడలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏపీపీజేఏ అధ్యక్షుడు సీహెచ్‌వీఎస్ విజయ భాస్కర రావు, ప్రధాన కార్యదర్శి వి.రూబెన్ బెసాలి యల్‌తో కలిసి కలెక్టర్ ఫలితాలను విడుదల చేశారు.
పోటీల్లో జనరల్ కేటగిరీలో ఎండీ నవాజ్ (సాక్షి, వైజాగ్) ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. ఫొటో జర్నలిజం కేటగిరీలో సాక్షి ఫొటోగ్రాఫర్లు పి.లీలా మోహన్‌రావు (వైజాగ్), వి. శ్రీనివాసులు (కర్నూలు), కందుల చక్రపాణి (విజయవాడ), పి.మను విశాల్ (విజయవాడ), కె.శివకుమార్ (యాదాద్రి), కె.జయ శంకర్ (శ్రీకాకుళం), కేతారి మోహన్‌కృష్ణ (తిరుపతి), ఎస్.లక్ష్మీ పవన్ (విజయవాడ) కన్సొలేషన్ బహుమ తులు గెలుచుకున్నారు.
జనరల్ కేటగిరీలో సాక్షి ఫొటోగ్రాఫర్ ఎస్ లక్ష్మీపవన్ (విజయ వాడ) కన్సొలేషన్ బహుమతి గెలుచుకు న్నాడు. ఈ సందర్భంగా ఏపీపీజేఏ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన పత్రికా ఫొటోగ్రాఫర్ల నుంచి 700 ఎంట్రీలు వచ్చాయన్నారు. విజేతలకు ఈనెల 19న విజయవాడ ప్రెస్ క్లబ్‌లో నిర్వ హించే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.
జాతీయ ఫొటో పోటీల్లో కృష్ణప్రసాద్‌కు మెరిట్ అవార్డు
వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా నిర్వ హించిన నేషనల్ ఫొటో కాంటె స్ట్–2023లో కృష్ణాజిల్లా నాగాయ లంకకు చెందిన ఫొటోగ్రాఫర్ సింహాద్రి కృష్ణప్రసాద్ పంపిన ఛాయా చిత్రానికి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కింది.
ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (పీఏఐ), ఇండియా ఇంటర్నే షనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్ (ఐఐపీసీ) ఆధ్వర్యంలో జాతీయస్థా యిలో నిర్వహించిన ఫొటో పోటీల్లో స్పెషల్ థీమ్ మ్యాని ఫెస్టేషన్స్ ఆఫ్ నేచర్‌లో అండర్ స్టాండింగ్ ది క్లౌడ్స్ విభాగంలో ఆయన పంపిన ‘క్లౌడ్స్ అంబరిల్లా టూ గాడ్’ ఛాయచిత్రం ప్రథమ సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment