
రచనారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, హైకోర్టున్యాయవాది రచనారెడ్డి ఆదివారం బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో వీరు బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ కూడా బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆగస్టు 2 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. యాదగిరిగుట్ట నుంచి ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా బీజేపీలో చేరతారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసమే ఆయన తన మద్దతుదారులతో మంతనాలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరోపక్క కాంగ్రెస్ కూడా ఆయనను బుజ్జగించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. (క్లిక్: డైలమా, వెనకడుగు నా రక్తంలోనే లేదు: కోమటిరెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment