mohan reddy
-
దళితులు, YSRCP సానుభూతిపరులపై దాడులు పెరిగిపోయాయి: మోహన్ రెడ్డి
-
సైయెంట్ మోహన్ రెడ్డికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటెలిజెంట్ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారం లభించింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాలకు ఆయన అందించిన సేవలకు గాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐవోడీ) నుంచి గోల్డెన్ పీకాక్ అవార్డును అందుకున్నారు. ఇటీవల లండన్‌లో జరిగిన ఐవోడీ వార్షిక సదస్సులో దీన్ని ప్రదానం చేశారు. మోహన్ రెడ్డి గతంలో నాస్కామ్ చైర్మన్‌గా వ్యవహరించారు. టీ–హబ్ ఫౌండింగ్ డైరెక్టర్లలో ఆయన ఒకరు కాగా, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ రూర్కీ గవర్నర్స్ బోర్డ్‌లకు చైర్మన్‌గా ఉన్నారు. కార్పొరేట్ రంగంలో అత్యుత్తమ ప్రమాణంగా గోల్డెన్ పీకాక్ అవార్డులకు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. -
ప్రజల నెత్తిన బాబు టోపీ సూపర్ సిక్స్ అంతా తుస్సు: Mohan Reddy
-
పెళ్లి పేరుతో ఘరానా మోసం
గాందీనగర్(విజయవాడ సెంట్రల్): పెళ్లి పేరుతో ఒంటరి, విడాకులు తీసుకున్న మహిళలను మోసం చేస్తున్న కేటుగాడిని విజయవాడ గవర్నర్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన తుమ్మా మోహన్‌రెడ్డి వ్యసనాలకు బానిసై భార్య, పిల్లలను వదిలేశాడు. ఉన్న డబ్బులన్నీ షేర్ మార్కెట్లో పోగొట్టుకున్నాడు. అనంతరం సులభంగా డబ్బులు సంపాదించేందుకు ‘పెళ్లి కొడుకు’ అవతారం ఎత్తాడు. తెలుగు మ్యాట్రిమోని, షాదీ డాట్ కామ్ తదితర వెబ్సైట్లలో రకర కాల పేర్లతో రిజిస్టర్ చేసుకున్నాడు. ఒంటరి మహిళలను పరిచయం చేసుకునేవాడు. మాయమాటలతో నమ్మించి.. డబ్బు, బంగారం తీసుకొని పారిపోయేవాడు. ఈ క్రమంలో తెలుగు మ్యాట్రిమోని ద్వారా విజయవాడకు చెందిన ఓ మహిళను పరిచయం చేసుకున్నాడు. తన పేరు ‘కార్తీక్‌రెడ్డి.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని.. విల్లాలు ఉన్నాయి’ అంటూ మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుందామని ఒప్పించాడు. ఫొటోషూట్ కోసం నగలతో రావాలని సూచించాడు. ఆ ఫొటోలను తన తల్లిదండ్రులకు చూపించి పెళ్లికి ఒప్పిస్తానని ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె ఈ ఏడాది ఏప్రిల్ 14న విజయవాడలోని ఓ హోటల్‌కు వెళ్లింది. ఫొటోషూట్ కోసం సిద్ధమై రావాలని ఆమెను వాష్‌రూమ్‌కు పంపించాడు. ఆమె తెచ్చిన 16 తులాల బంగారం, సెల్‌ఫోన్‌తో హోటల్ నుంచి ఉడాయించాడు. దీనిపై బాధితురాలు గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా.. అతని మోసాలన్నీ బయటపడ్డాయి. మోహన్‌రెడ్డి మోసాలివే.. » 2021 సెపె్టంబర్లో తెలంగాణలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఓ మహిళ కారును తీసుకెళ్లిపోయి అమ్మేశాడు. » 2023 నవంబర్‌లో గుంటూరుకు చెందిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రూ.7 లక్షలు తీసుకుని పారిపోయాడు. » 2023 నవంబర్‌లో తెలంగాణలో ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 25 తులాల బంగారం అపహరించాడు. » 2023 జనవరిలో తెలంగాణలోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్న డాక్టర్‌ను పరిచయం చేసుకుని.. ఆమె క్రెడిట్ కార్డు ద్వారా రూ.లక్షలు వాడుకుని పారిపోయాడు. -
అవకాశం ఇవ్వండి నేనేంటో చూపిస్తా..! : వడ్డి మోహన్‌రెడ్డి
సాక్షి, నిజామాబాద్: 'అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో, తానేంటో చూపిస్తానని బోధన్ బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమవుతుందని గ్రహించిన ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బోధన్‌లో అవినీతి పేరుకు పోయిందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని అన్నారు. ఎమ్మెల్యేగా తొలిసారిగా పోటీచేస్తున్నానని ప్రజలు ఆదరించి బీజేపీని గెలిపించాలని కోరారు.' అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వడ్డి మోహన్‌రెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. – బోధన్ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? ► నియోజకవర్గంలో నేను ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. యువగర్జన సభకు ఎంపీ అర్వింద్ హాజరయ్యారు. నియోజకవర్గంలో రెండో రోజుల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా రానున్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రజా సమస్యలపై మీ సమాధానం? ► బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో అంతా అవినీతే జరిగింది. నియోజక వర్గంలో అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట రుణమాఫీ, భూసమస్యలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ సమస్యతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలపై ఎమ్మెల్యే షకీల్ దృష్టి సారించలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి తప్పకుండా సాధ్యమవుతుంది. పదేళ్లలో అభివృద్ధి ఎలా ఉంది? ► బోధన్ గత వైభవాన్ని కోల్పోయింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. దీంతో చెరుకు రైతులు, వ్యాపార వర్గాలు, కార్మికులకు ఎంతో నష్టం కలిగింది. ప్రభుత్వ వివిధ శాఖల కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏం జరగలేదు. ఎన్నికల పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యేనా..? ► ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి గెలిచే అవకాశం లేదు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌ను ఓడించాలంటే బీజేపీతోనే సాధ్యమనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో విజయం. నిజాంషుగర్స్ పునరుద్ధరణపై మీరిచ్చే హామీ..? ► ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తాం. ఇచ్చిన హామీని బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఫ్యాక్టరీ ప్రారంభమైతే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటే అన్న ఆరోపణపై..? ► బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలు. ఆ పార్టీలే లోపాయి కారి ఒప్పందాలతో రాజకీయాలు చేస్తున్నాయి. 2006లో నవీపేట జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు తనను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయి. ప్రజలకు మీరిచ్చే హామీలు? ► బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అన్ని హామీలను నెరవేరుస్తాం. మూతపడిన నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం. యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. తెల్లరేషన్‌కార్డు ఉన్న వారికి ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. రూ. పది లక్షల వరకు ఆరోగ్య బీమా, ఆడపిల్లల వివాహాలకు రూ.2 లక్షలు అందిస్తాం. ప్రజల నుంచి ఏమైనా ఆశిస్తున్నారా..? ► నేను 25 ఏళ్ల నుంచి రాజకీయ ప్రజా జీవితంలో కొనసాగుతున్నా.. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడిని. తొలిసారిగా బోధన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నా. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లను గెలిపించిన ప్రజలు ఈ సారి బీజేపీకి అవకాశం కల్పించాలని కోరుకుంటన్నారు. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఇవి చదవండి: ప్రజలే నా ధైర్యం.. నమ్మకం! : బిగాల గణేశ్‌గుప్తా -
Hyderabad: మ్యాట్రిమోనీని అడ్డుపెట్టుకొని మోసాలు..! అసలేం చేశాడంటే?
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి: మాట్రిమోనీలో పెళ్లిళ్ల కోసం నమోదు చేసుకున్న మహిళలను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 27 తులాల బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. గురువారం ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో మహంకాళి ఏసీపీ రవీందర్, మార్కెట్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, డీఐ వెంకటరమణలతో కలిసి వివరాలు వెల్లడించారు. జిల్లా కందుకూరు మండలం నెడనూర్ గ్రామానికి చెందిన తుమ్మ మోహన్‌రెడ్డి (38) 2011లో కల్వకుర్తికి చెందిన మహిళతో వివాహం జరిగి గొడవలు రావడంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. మ్యాట్రిమోనీలో శ్రీనాథ్ అనే పేరుతో పేరు నమోదు చేసికున్నాడు. భారత్ మాట్రిమోనీలో విడాకులు తీసుకున్న ఓ మహిళ రెండవ పెళ్లి కోసం నమోదు చేసుకోగా ఆమె ప్రొఫైల్‌ను సేకరించాడు. ఆమెకు ఫోన్ చేసి తాను పెళ్లి చేసుకుంటానని అయితే ఒక సారి నేరుగా కలుద్దామని చెప్పాడు. వచ్చే సమయంలో నగలతో పాటు వస్తే ఫొటో తీసుకుని తన తల్లిదండ్రులకు చూపించి పెళ్లి చేసికుంటానని నమ్మించాడు. దీన్ని నమ్మిన ఆ మహిళ ఈ నెల 7న సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాత్రి ఇన్ హోటల్‌కు వచ్చారు. రెడీ అయ్యే ముందు వాష్ రూమ్‌కు వెళ్లి ఫ్రెష్అప్ కావాలని చెప్పాడు. దీంతో ఆమె వాష్ రూమ్‌కు వెళ్లి వచ్చే లోపు ఆమెకు చెందిన 27 తులాల బంగారు ఆభరణాలున్న బ్యాగును తీసుకుని హోటల్ నుంచి పరారయ్యాడు. నిందితున్ని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివిధ కేసుల్లో నిందితుడు.. ► ఇదే విదంగా నిందితుడు మోహన్‌రెడ్డి షాదీ డాట్ కామ్‌లో గౌతమ్‌రెడ్డి పేరుతో పేరు నమోదు చేసికుని ఓ మహిళను నమ్మించాడు. ఆమెకు నమ్మకం కలిగిన తర్వాత ఆమె క్రెడిట్ కార్డు ద్వారా రూ.6.20 లక్షలతో బంగారు నగలు కొనుగోలు చేసి పరారయ్యాడు. ► మరో మాట్రిమోనీలో విజయరెడ్డి పేరుతో పేరు నమోదు చేసికుని రూ.9లక్షలు తన అకౌంట్లో వేసుకున్నాడు. ► కల్వకుర్తిలో ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తూ 10వ తరగతి చదువుతున్న బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించి 3 నెలలు జైలుకు వెళ్లివచ్చాడు. ► కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తన బంధువుకే కారు పేరుతో రూ.4.50లక్షలు మోసం చేశాడు. మాదాపూర్‌లోని హాస్టల్లో ఉంటూ రూ.70వేల విలువ చేసే ల్యాప్‌టాప్ తదితర వస్తువులను దొంగతనం చేశాడు. ► చైతన్యపురిలో మరో హాస్టల్లో రూ.40వేల విలువ చేసే ల్యాప్‌టాప్ దొంగతనం చేశాడు. ఇలా పలు కేసుల్లో నిందితుడు పరారీలో ఉన్నాడు. -
బీఆర్ఎస్లోకి మోహన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ఉపాధ్యాయ కోటా మాజీ ఎమ్మెల్సీ, పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు బి.మోహన్‌రెడ్డి గురువారం మంత్రి కేటీ రామారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సారథ్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ అంశాలపైన కలిసి పని చేసేందుకు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ త్వరలో బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహా్వనిస్తున్న బీఆర్ఎస్, తాజాగా బిత్తిరి సత్తితోనూ సంప్రదింపులు జరిపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావుతో బిత్తిరి సత్తి గురువా రం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ముదిరాజ్ సామాజికవర్గంతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారు బీఆర్ఎస్తో కలిసి పనిచేయాలని కేటీఆర్, హరీశ్ కోరినట్లు సమాచారం. బీఆర్ఎస్లో చేరికకు అంగీకరించినట్లు బిత్తిరి సత్తి ‘సాక్షి’కి వెల్లడించారు. ముదిరాజ్ సామాజికవర్గానికి మరికొందరు కీలక నేతలు కూడా త్వరలో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబు తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఓ పార్టీకి చెందిన కీలక నేత కూడా బీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
బ్రహ్మండం..కాణిపాకం బ్రహ్మోత్సవం
సత్యప్రమాణాల దేవుడు శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సల ఏర్పాట్లకు దేవస్థానం రెండు నెలల ముందే శ్రీకారం చుట్టింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తజనాన్ని దృష్టిలో ఉంచుకుని మహా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. సెప్టెంబర్ 18వ తేదీ వినాయక చవితి నుంచి 21 రోజుల పాటు నిర్వహించి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్ద పీటవేస్తు, ఉభయదారులు, ప్రజాప్రతినిధులు, వీఐపీలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి చిన్న పొరబాటు చోటు చేసుకోకుండా దర్శనం కల్పించేలా ముందస్తు ఏర్పాట్లను ప్రారంభించింది. కాణిపాకం(యాదమరి): కాణిపాకంలో స్వయంభుగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈఓ వెంకటేశు రెండు నెలల ముందే తగు ఏర్పాట్లుకు నడుం బిగించారు. గతంలో కంటే ప్రస్తుతం వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివస్తున్నారు. నిత్యం భక్తులు 20 వేలకు పైగా విచ్చేస్తున్నారు. సెలవురోజుల్లో, పండుగ రోజుల్లో 50 వేలకు పైగా భక్తులు వస్తున్నారు. ఒక్కోసారి దర్శనానికి 6,7 గంటల సమయం కూడా పడుతోంది. బ్రహ్మోత్సల సమయంలో దర్శనం, ఉత్సవమూర్తుల ఊరేగింపు చూసేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులతో ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈఓ వెంకటేశు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తు పలు అంశాలను చర్చిస్తూ, ఏర్పాట్లకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా గతంలో బ్రహ్మోత్సవాలకు ముందు హడావుడిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారు. భక్తులకు ఈ సౌకర్యాలు సరిపోయేవి కావు. దీంతో ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రత్యేక క్యూలు, నిత్య అన్నప్రసాదం, లడ్డూ, పులిహోరా ప్రసాదాలు, వాహనాల పార్కింగ్ స్థలాలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, తాగునీటి వసతి, వీఐపీలు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ దర్శనాలు, మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయంలో, ఊరేగింపులో స్వామివారిని దర్శించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తున్నారు. భక్తులకు సంతృప్తి కలిగించేలా.. శ్రీవినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండ కర్ణాటక, తమిళనాడు, మహరాష్ట్రాల నుంచి కూడా అశేషంగా తరలివస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో మాదిరి కాకుండా రెండు నెలలకు ముందు నుంచే మహా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాం. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వీఐపీలకు ప్రత్యేక సమయం కేటాయించి ప్రత్యేక దర్శనం కల్పిస్తే బాగుంటుందని చర్చిస్తున్నాం. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు చాలా బాగా దర్శనం చేసుకున్నాం అనే సంతృప్తి కలిగించేలా ఏర్పాట్లు చేస్తాం. –మోహన్‌రెడ్డి, ఆలయ చైర్మన్ భక్తులందరికీ నిత్య అన్న ప్రసాదం ప్రస్తుతం నిత్యాన్నదానంలో 7 వేల మందికి భోజనం పెడుతున్నాం. బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్న ప్రసాదం అందించాలని భావిస్తున్నాం. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉండాలనే రెండు నెలలకు ముందే ముందస్తు చర్యలు ప్రారంభించాం. బ్రహ్మోత్సవాలకు వారం ముందే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులతో సమీక్షిస్తూ సలహాలు తీసుకుంటున్నాం. అన్నిశాఖల అధికారులు, ఉభయదారులతో సమన్వయంగా పనిచేస్తూ విస్తృత ఏర్పాట్లు చేస్తాం –వెంకటేశు, ఆలయ ఈఓ ఆలయంలో భక్తుల రద్దీ కాణిపాకం(యాదమరి):కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిట లాడింది. స్వామివారి దర్శనార్థం ఉదయం నుంచి భక్తులు తరలి రావడంతో కంపార్ట్మెంట్లు, క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులకు త్వరితగతిన దర్శనం చేసుకునేలా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. -
బీజేపీలోకి హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, హైకోర్టున్యాయవాది రచనారెడ్డి ఆదివారం బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో వీరు బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ కూడా బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆగస్టు 2 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. యాదగిరిగుట్ట నుంచి ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా బీజేపీలో చేరతారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసమే ఆయన తన మద్దతుదారులతో మంతనాలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరోపక్క కాంగ్రెస్ కూడా ఆయనను బుజ్జగించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. (క్లిక్: డైలమా, వెనకడుగు నా రక్తంలోనే లేదు: కోమటిరెడ్డి) -
ఫోటో తీసినందుకు ట్రాఫిక్ పోలీసును దూషించిన మోహన్ రెడ్డి
-
తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు
-
తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు
చిట్యాల: కాలువ విస్తరణ పనులు చేస్తున్న ఓ జేసీబీ డ్రైవర్‌ను రాష్ట్ర మాజీ మంత్రి గుత్తా మోహన్‌రెడ్డి తుపాకీతో బెదిరించిన సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పెద్దకాపర్తి చెరువు మీదుగా ఉరుమడ్ల గ్రామం వరకు పిలాయిపల్లి కాల్వ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు తమ పొలం మీదుగా జరుగుతున్నాయని తెలుసుకున్న మాజీ మంత్రి అక్కడికి వచ్చి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన కాల్వ పనులు చేస్తున్న వారిని తన తుపాకీతో బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు విచారణ చేపట్టారు. (చదవండి: శ్రీవాణి హత్యకేసును ఛేదించిన పోలీసులు) -
తీరు మారకుంటే మున్ముందు తిప్పలే!
ఇంతవరకు ప్రపంచమంతటా కొనసాగుతూ వచ్చిన అపరిమిత అభివృద్ధి నమూనాపై కోవిడ్–19 ఇప్పుడు ప్రశ్నలు సంధించింది. ప్రకృతి వనరులు, మానవ వనరులను విచ్చలవిడిగా దోచుకోవడం ద్వారా అపరిమితమైన భౌతిక సంపదను సృష్టించడం కోసం పాటుపడే దురాశ కనీవినీ ఎరుగని కష్టాలను కొనితెస్తోంది. మహాత్మా గాంధీ ఆనాడే చెప్పినట్లుగా, ‘మనిషి అవసరాలను సంతృప్తి పరచడం భూమికి సాధ్యమవుతుంది కానీ ప్రతి మనిషి పేరాశలను సంతృప్తి పరచలేదు’. భూగ్రహం మంచి కోసం, భవిష్యత్ తరాల బాగు కోసం.. ఆడంబర జీవిత విధానంపై మనం ఇప్పుడు పునరాలోచించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ 19 ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ 200 దేశాల్లో దావానలంలా వ్యాపిం చింది. ఇది అనేక ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేసింది. ప్రపంచ జనాభాలో అత్యధిక భాగానికి ప్రత్యేకించి వ్యాధికి సులభంగా గురయ్యే బడుగువర్గాల్లో భయాన్ని, ఆందోళనను సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు తీవ్రమైన ఒత్తిడిలో పడిపోయాయి. సాంకేతికంగా ముందంజ వేసిన దేశాల్లో ఆత్మవిశ్వాసం ప్రకంపనలకు గురవుతోంది. ప్రపంచం జనాభాలో దాదాపు సగం వరకు లాక్ డౌన్లో ఉంటోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై, వందలాది కోట్ల ప్రజానీకం జీవితాలపై కోవిడ్–19 పూర్తి ప్రభావాన్ని అంచనా వేయటం కష్టమే. కానీ మానవులు ఆశావాదంతో మనుగడ సాగించే జాతి. మనం గతంలో కూడా సాంక్రమిక వ్యాధులను ఎదుర్కొన్నాం. వ్యాక్సిన్ కనుక్కోవడం, వ్యాధికి నివారణను కనిపెట్టడం ద్వారా ప్రస్తుత ఉపద్రవాన్ని మనం కచ్చితంగా అధిగమించగలుగుతాం. హెచ్చరికలపై తీవ్ర నిర్లక్ష్యం చాలామంది ప్రజలకు కరోనా వైరస్ ఎక్కడుందో కనిపించడం లేదు కానీ సాంక్రమిక వ్యాధుల నిపుణులు అలాంటి సాంక్రమిక వ్యాధి గురించి సంవత్సరాలుగా హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ వ్యాధులు మళ్లీ మళ్లీ సంభవిస్తూనే ఉంటాయి. ఇది వాతావరణ సమస్య కాకపోవచ్చు. కానీ, అడవుల నిర్మూలన అనేది జంతువుల నుంచి మానవుల వరకు మలేరియా, డెంగ్యూ, ఇతర ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి అనుకూల పరిస్థితులను సృష్టించిందని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. కరోనా వైరస్ గబ్బిలాల నుంచి జంతువులకు, మానవులకు వ్యాపించిందని నమ్ముతున్నారు. ప్రకృతి వనరులను ఇష్టానుసారం ధ్వంసం చేసుకుంటూ పోతే కలిగే పర్యవసానాల గురించి ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో డేవిడ్ క్వామెన్ నొక్కి చెప్పారు. ‘‘ఉష్ణమండల అరణ్యాలను, ఇతర వణ్యప్రాణులు నివసించే అటవీప్రాంతాలను మనం ఆక్రమించేశాం. ఇవి అనేక జంతువులు, వృక్షాలకు నెలవుగా ఉంటున్నాయి. ఈ జీవుల్లోనే అనేక తెలియని వైరస్లు ఉంటున్నాయి. మనం చెట్లను నరికేస్తాం; జంతువులను వధిస్తాం లేక బంధించి మార్కెట్లకు పంపుతాం. అంటే పర్యావరణవ్యవస్థలను మనం విచ్ఛిన్నం చేస్తున్నాం. అంతకుమించి వైరస్లు తాము సహజంగా ఉండే ప్రకృతి నెలవుల నుంచి వెలుపలికి వచ్చేలా మనం ప్రకృతిని కుళ్లబొడిచేస్తున్నాం. వైరస్ల నెలవులు కదిలిపోయినప్పుడు, హరించుకుపోయినప్పుడు ఆ వైరస్లు తమకు ఆశ్రయమిచ్చే కొత్త అతిథేయులను ఎంచుకుంటాయి. అదెవరో కాదు మానవులే’’. మరొక సైలెంట్ కిల్లర్ ప్రపంచ వాతావరణ మార్పు అనే మరొక ప్రమాదం నిశ్శబ్దంగా ప్రపంచమంతటా వ్యాపిస్తోంది. తీవ్రమైన వేడి, తుపానులు, కరువులు, సముద్రమట్టాలు పెరగడం వంటి రూపాల్లో ఈ కొత్త ఉపద్రవం వ్యక్తం కావచ్చు. కానీ మానన జీవితంపై దీని ప్రభావమే వాస్తవమైనది. ఒక అంచనా ప్రకారం వాతావరణ మార్పు వల్ల ప్రతిసంవత్సరం 3 లక్షలమంది ప్రజలు మరణించారని, 32 కోట్ల 50 లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారని ప్రతి ఏటా 125 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాలు కలుగుతున్నాయని తెలుస్తోంది. ఇక భారతదేశంలో 2018–19 సంవత్సరంలోనే వరదలు, తుపానులు వంటి తీవ్రమైన వాతావరణ వైపరీత్యాల కారణంగా 2,400 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ చెబుతోంది. ప్రస్తుత కరోనా సాంక్రమిక వ్యాధి తగ్గుముఖం పట్టగానే ప్రపంచ నేతలందరూ తమ ఆర్థిక వ్యవస్థలను సాధారణ స్థాయికి తీసుకురావడం ఖాయం. సాధారణ స్థాయి అంటే మునుపటిలా వాణిజ్యాన్ని యథాతథంగా కొనసాగించుకోవడమే అని భావించే ప్రమా దం పొంచుకుని ఉంది. అంతే తప్ప వీరు కరోనా వైరస్ నుంచి గుణపాఠాలు తీసుకోకపోవచ్చు కూడా. ఇంతవరకు ప్రపంచమంతటా కొనసాగుతూ వచ్చిన అపరిమిత అభివృద్ధి నమూనాపై కోవిడ్–19 ఇప్పుడు ప్రశ్నలు సంధించింది. ప్రకృతి వనరులు, మానవ వనరులను విచ్చలవిడిగా దోచుకోవడం ద్వారా అపరిమితమైన భౌతిక సంపదను సృష్టించడం కోసం పాటుపడే దురాశ కనీవినీ ఎరుగని కష్టాలను కొని తెస్తోంది. గాంధీజీ ఆనాడే చెప్పినట్లుగా, ‘మనిషి అవసరాలను సంతృ ప్తిపరచడం భూమికి సాధ్యమవుతుంది కానీ ప్రతి మనిషి పేరాశలను కాదు. భూగ్రహం మంచి కోసం, భవిష్యత్ తరాల బాగు కోసం, ఆడంబర జీవిత విధానంపై మనం ఇప్పుడు పునరాలోచించాల్సి ఉంది. బహుళ సంక్షోభాలు శిలాజ ఇంధనాలను మండించడంతో విషపూరిత వాయువులు విడుదలై మన గాలిని, నీటిని, భూమిని కూడా కలుషితం చేసిన నేపథ్యంలో మన ప్రాకృతిక వాతావరణం చాలావరకు ప్రమాదంలో పడిపోయింది. గ్రీన్ హౌస్ వాయువులను మోతాదుకు మించి వాతావరణంలోకి విడుదల చేయడంతో మన భూమి వేడెక్కడం ప్రారంభించింది. దీంతో వ్యవసాయ రుతువులు, పంటల క్రమం కూడా మార్పు చెందడం మొదలైంది. వరి, గోధుమ పంటల దిగుబడి తగ్గిపోయింది. సముద్రమట్టాలు పెరిగి కొన్ని తీరప్రాంతాలు, దీవులను ముంచేశాయి. అడవులకు నిప్పు పెట్టడంతో కాలిఫోర్నియా నుంచి ఆస్ట్రేలియా వరకు లక్షలాది హెక్టార్లలో ఉన్న అడవుల ఉనికే ప్రమాదంలో పడిపోయింది. ‘స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్’ గ్రంథకర్త ఇ.ఎఫ్. షూమేకర్ చెప్పినట్లుగా, ప్రపంచం మూడు విధాల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ‘వనరుల సంక్షోభం, పర్యావరణ సంక్షోభం, సామాజిక సంక్షోభం.’ కొంతమంది ఆధ్యాత్మికవాదులైతే, మానవులు ప్రకృతిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ, సహజవనరులను మితిమీరి దోచుకుంటున్నందువల్ల ప్రకృతి ఇప్పుడు పగ తీర్చుకుంటోందని విశ్వసిస్తున్నారు. మనం ప్రపంచ వనరులకు యజమానులం కాదు. దాని ట్రస్టీలం మాత్రమే. భూగ్రహాన్ని ఆరోగ్యకరంగా ఉంచి దాన్ని భవిష్యత్ తరానికి అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. అయితే, ప్రస్తుత అభివృద్ధి పంథాను ఇలాగే కొనసాగిస్తే, మరికొన్ని దశాబ్దాలలోపే ప్రకృతి సహజ వనరులన్నింటినీ మనం ధ్వంసం చేయటం ఖాయం. ముందడుగు వేయడమెలా? మనం జీవిస్తున్న విధానం గురించి తాజాగా ఆలోచించుకోవడానికి, పర్యావరణంతో దాని జీవరాసులతో మన సంబంధాలను పునర్నిర్మించుకోవడానికి కోవిడ్–19 మనకు ఇప్పుడు సువర్ణావకాశాన్ని కల్పించింది. ఇప్పుడు కింద పేర్కొన్న అంశాలకు అనుగుణంగా పనిచేయవలసిన లేక వాటిలో కొన్నింటినయినా పాటించాల్సిన సమయం ఆసన్నమైంది. 1. మొక్కల పెంపకాన్ని భారీస్థాయిలో చేపట్టాలి. భూమిని వృక్షాలతో కప్పి ఉంచినట్లయితే అది పర్యావరణ మార్పును, భవిష్యత్ సాంక్రమిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలుగుతుంది. ప్రభుత్వం మాత్రమే ఈ పనిని చేయలేదు. ఇది ప్రజా ఉద్యమంగా సాగాలి. భారతదేశంలో వృక్షాల శాతం 2000లో 12.3 శాతం ఉండగా 2018 నాటికి అది 10.6 శాతానికి పడిపోయింది. గత సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లో పది లక్షల మంది ప్రజలు ఒక్క రోజులో 22 కోట్ల మొక్కలను నాటి ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తే అది భారత్‌లో అడవులను ఒక శాతం పెంచేందుకు దారితీస్తుంది. 2. వచ్చే 15 సంవత్సరాల కాలంలో శిలాజ ఇంధనాల స్థానంలో విద్యుత్ ఉత్పత్తిని తీసుకురావాలి. పునర్వినియోగ ఉత్పత్తుల సమ్మేళనంతో చమురు వినియోగాన్ని తొలగించాలి. 3. పట్టణ ప్రాంతాల్లో వర్షపునీటిని నిల్వచేయాలి. అటవీ ప్రాంతాల్లో వాటర్ షెడ్ నిర్వహణను తప్పనిసరిగా అమలు చేయాలి. త్వరలో మనకు తాగునీరు కూడా లభ్యం కాకపోవచ్చు. 4. ప్రజారవాణాను ప్రోత్సహించి, ప్రైవేట్ కార్ల ఉపయోగాన్ని తగ్గించాలి. కార్ల ఉత్పత్తిదారులకు ఇచ్చే సబ్సిడీలను పబ్లిక్ బస్సులు, రైళ్ల తయారీకి మళ్లించాలి. 5. వాతావరణ సంక్షోభంపై అప్రమత్తతను పెంచాలి. పాఠశాలల్లో వాతావరణం గురించి క్లాసులు ప్రవేశపెట్టాలి. 6. ఎలెక్ట్రిసిటీ గ్రిడ్‌పై ఆధారపడటాన్ని తగ్గించి విద్యుత్తును వికేంద్రీకరించాలి. సోలార్ ఇతర పునర్వినియోగ ఇంధనాలను ఉపయోగించేలా సమాజాలను ప్రోత్సహించాలి. 7. భూమికి ఉపశమనం కలిగించి వాతావరణ మార్పును సర్దుబాటు చేయడానికి నిధులను పెంచాలి. మన జీవితాలను మార్చుకునే ఎన్నో అవకాశాలు మన చేతుల్లోనే ఉన్నాయి. కోవిడ్–19 వంటి ప్రకృతి వైపరీత్యాలను నిరోధించడానికి, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడటానికి మన ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభించేందుకు ఇదే తగిన తరుణం. హోమో సెపియన్ బుద్ధిజీవులుగా మనకు అసాధ్యమైనది ఏదీలేదు. మోహన్ రెడ్డి, సంస్థాపకుడు, జెనీత్ ఎనర్జీ క్లైమేట్ ఫౌండేషన్, హైదరాబాద్ డాక్టర్ డిసిల్వా, వ్యవసాయ, పర్యావరణ సైంటిస్టు, ముంబై -
ఉన్నత చదువులకెళ్లి తిరిగిరాని లోకాలకు..
గుంటూరు, ముప్పాళ్ల: ఉన్నత చదువుల కోసం వెళ్లిన బిడ్డ శవమై తిరిగి రావటాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేక పోయింది. కుటుంబ వారసుడు కళ్లముందు శవమై కనిపించటంతో వారి రోదన మిన్నంటింది. ఉన్నతంగా వస్తాడనుకుంటే శవమై వచ్చాడయ్యా అంటూ కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. మండల కేంద్రమైన ముప్పాళ్లకు చెందిన లోకసాని మోహన్‌రెడ్డి(25) ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లాడు. తమ బిడ్డ చదువుల కోసం తల్లిదండ్రుల తీవ్రంగా కష్టపడ్డారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం మోహన్‌రెడ్డి అకాల మృతి చెందాడు. గురువారం ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. బిడ్డ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
ఏఎస్ఐ మోహన్‌రెడ్డిపై ఏసీబీ పంజా!
సాక్షి, కరీంనగర్: వివాదాస్పదమైన మాజీ ఏఎస్ఐ బొబ్బల మోహన్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) మరోసారి దృష్టి సారించింది. అప్పుల కింద బాధితుల నుంచి భూములను స్వాధీనం చేసుకొని బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించిన కేసుల్లో రెండేళ్ల క్రితమే పలు అరెస్టులు జరిగాయి. వివిధ కేసుల్లో పలువురు నిందితులు రిమాండ్‌కు వెళ్లి వచ్చారు కూడా. నిందితులుగా ఉన్న బినామీలు ఒకటి రెండు కేసుల్లో ఏసీబీ మీదే ఎదురు తిరిగి కోర్టులను ఆశ్రయించడంతో అవినీతి నిరోధక శాఖ మళ్లీ కొరడా విదిల్చింది. గతంలో పరారీలో చూపించిన మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులను తాజాగా అరెస్టు చేశారు. మంగళవారం మోహన్‌రెడ్డి కుమారుడు అక్షయ్‌రెడ్డి(క్రైం నెంబర్ 06/2018 కేసులో ఏ–3)ని, బుధవారం ఆయన తండ్రి బొబ్బల ఆదిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో మోహన్‌రెడ్డి బినామీల నుంచి ఏసీబీ అధికారులు బాధితులకు భూములను, ఇతర ఆస్తులను వారికే తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు. కాగా కొందరు బినామీలు ఏసీబీ అధికారులే బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఎదురు తిరుగుతుండడంతో ఏసీబీ మళ్లీ పంజా విసరుతోందని సమాచారం. ఈ నెలలో నలుగురి అరెస్టు భూకబ్జాలు, బినామీల పేరిట భూముల రిజిస్ట్రేషన్ తదితర కేసుల్లో ఈ నెలలోనే ఏసీబీ అధికారులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడంతో మోహన్‌రెడ్డి బినామీల గుండెల్లో గుబులు రేగుతోంది. ఈ నెల 13న సింగిరెడ్డి మహిపాల్‌రెడ్డి, బాణాల రమణారెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్ చేశారు. మంగళవారం మోహన్‌రెడ్డి కొడుకు బొబ్బల అక్షయ్‌రెడ్డిని మధ్యాహ్నం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం మోహన్‌రెడ్డి తండ్రి బొబ్బల ఆదిరెడ్డి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిమ్మాపూర్ కేసులో.. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన కిన్నెర సారయ్య భూ కబ్జా కేసులో 8 మంది నింది తులున్నారు. రామకృష్ణ కాలనీకి చెందిన కిన్నెర సారయ్యతోపాటు అతని వ్యాపార భాగస్వాములకు సంబంధించిన 30 గుంటల భూమిని, రూ.50 లక్షల విలువ చేసే కిన్నెర సారయ్యకు సంబంధించిన ఇళ్లను మోహన్‌రెడ్డి తదితరులు ఆక్రమించుకున్నారనేది ఫిర్యాదు. మోహన్‌రెడ్డి బినామీ అయిన శ్రీపాల్‌రెడ్డి మామ అమరం రాజిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశాడని కిన్నెర సారయ్య 2018 ఫిబ్రవరి 17న ఫిర్యాదు చేశారు. మోహన్‌రెడ్డి వద్ద డబ్బులు అప్పుగా తీసుకొని అసలు, వడ్డీ చెల్లించినప్పుటికీ, తనఖా పెట్టిన భూమిని ఇతరుల పేరుమీదికి మార్చాడని ఆరోపిస్తూ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1 మోహన్‌రెడ్డి కాగా, ఏ2 లత(మోహన్‌రెడ్డి భార్య), ఏ3 అక్షయ్‌రెడ్డి(మోహన్‌రెడ్డి కుమారుడు), ఏ4 మహేందర్‌రెడ్డి(మోహన్‌రెడ్డి తమ్ముడు), ఏ5 బొబ్బల ఆదిరెడ్డి(మోహన్‌రెడ్డి తండ్రి), ఏ6 శ్రీపాల్‌రెడ్డి(మోహన్‌రెడ్డి బావమరిది), ఏ7 బి.రమణారెడ్డి(మోహన్‌రెడ్డి సమీప బంధువు), ఏ8 అమరం రాజిరెడ్డి(శ్రీపాల్‌రెడ్డి మామ)లు నిందితులుగా పేర్కొన్నారు. ఏసీబీ పైనే రివర్స్ నోటీసులు? మోహన్‌రెడ్డి బినావీులపై 2017 చివరలో, 2018లో ఏసీబీ అధికారులు అరెస్టులు చేసి వారి వద్ద నుంచి బాధితులకు భూములను రిజిస్ట్రేషన్లు చేయించారు. మోహర్‌రెడ్డి బినామీల వద్ద నుంచి గత సంవత్సరం బా«ధితులకు ఏసీబీ రిజిస్ట్రేషన్లు చేయించింది. అప్పుడు మోహన్‌రెడ్డి, అతని బావమరిది శ్రీపాల్‌రెడ్డి ఇద్దరు వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. మోహన్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డిలు బెయిల్‌పై విడుదలైన తర్వాత ఏసీబీ అధికారులు బినావీులను బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని మోహన్‌రెడ్డితోపాటు అతని బినామీలు కోర్టు ద్వారా ఏసీబీ వాళ్లకు నోటీసులు పంపించినట్లు సమాచారం. దీంతో ఏసీబీ మళ్లీ బినావీులపై పంజా విసురుతోందని తెలుస్తోంది. దాడి సుధాకర్ భూమి కేసులో సీన్ రివర్స్ దాడి సుధాకర్ అనే వ్యక్తికి సంబంధించిన భూమి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌కు చెందిన సీహెచ్.రమణారెడ్డి అనే వ్యక్తి(మోహన్‌రెడ్డి బినావీు)కి గతంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ కేసులో ఏసీబీ పోలీసులు సీహెచ్.రమణారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించి బాధితుడు దాడి సుధాకర్ భూమిని తిరిగి అతనికి ఇప్పించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. కాగా మోహన్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి జైలు నుంచి విడుదలైన తర్వాత సీహెచ్.రమణారెడ్డిని సంప్రదించి దాడి సుధాకర్ వల్ల చాలా నష్టపోయామని, తిరిగి అతనిపై కేసు వేస్తే ఎంతోకొంత డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో రమణారెడ్డితో న్యాయవాది ద్వారా కోర్టులో కేసు వేయించినట్లు సమాచారం. ఏసీబీ అధికారులే బలవంతంగా రమణారెడ్డి వద్ద నుంచి దాడి సుధాకర్‌కు భూమిని రిజిస్ట్రేషన్ చేయించారని ఏసీబీ అధికారులకే నోటీసులు పంపించినట్లు తెలిసింది. ఇలాగే మరికొందరు బినావీులతో కూడా కోర్టు ద్వారా నోటీసులు పంపించడంతో ఇప్పుడు ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోందని భావిస్తున్నారు. -
మరో వివాదంలో మాజీ ఏఎస్ఐ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్‌లోని కెన్‌క్రెస్ట్ పాఠశాల అధినేత ప్రసాదరావు ఆత్మహత్య కేసు లో ప్రధాన నిందితుడిగా ఉన్న అక్రమ ఫైనాన్స్ నిర్వాహకుడు, మాజీ ఏఎస్ఐ బి.మోహన్‌రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఓ కేసు విచారణ నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో సెటిల్మెంట్ చేసి.. ఎస్కార్టు పోలీసులతో ఏసీ కారులో బయటకు వెళ్తున్న వీడియో దృశ్యాలు బయటపడ్డాయి. వీడియో దృశ్యాలను చిత్రీకరించిన మోహన్‌రెడ్డి బాధితు ల సంఘం, లోక్‌సత్తా ఈ వ్యవహారాన్ని మీడియాకు రిలీజ్ చేసింది. సబ్‌కోర్టులో కేసు నం 416లో విచారణ నిమిత్తం వరంగల్ సెంట్రల్ జైలు నుంచి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో జిల్లా కోర్టు పక్కన గల ‘రెడ్డిగారి వంటిల్లు’లో భోజనానికి వెళ్లి సన్నిహితులతో ములాఖత్ కావడం వివాదా స్పదంగా మారింది. గతంలో కోర్టు ముందు గల ఉడిపి హోటల్లో సెటిల్మెంట్ నిర్వహించి డబ్బులు పంపిణీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల పుటేజీల ద్వారా బట్టబయలయ్యాయి. ఈ వ్యవహారంలో ఎస్కార్టు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఈ నెల ఒకటిన కరీంనగర్ కోర్టుకు వచ్చినప్పు డు సమీపంలోని భోజనశాలలో కూర్చొని సన్నిహితులతో ములాఖత్ నిర్వహించడం మరోమారు వివాదాస్ప దమైంది. మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డితోపా టు ఆయనకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మహేందర్‌రెడ్డి, సాయన్న ఒక ప్రకటనలో కోరారు. ప్రైవేట్ వాహనాన్ని అనుమతించి మోహన్‌రెడ్డి ప్రైవేట్ ములాఖత్‌కు సహకరించిన ఎస్కార్ట్ పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణకు కూడా ఆదేశించామని కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
మోహన్‌రెడ్డిపై మరో ఏసీబీ కేసు
కరీంనగర్ క్రైం: మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డిపై మరో ఏసీబీ కేసు నమోదు అయింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన కిన్నర సారయ్య, వేల్పుల ఓదయ్య, దాడి కనుకయ్య కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. వీరు వ్యాపారం నిమిత్తం మోహన్‌రెడ్డి వద్ద 2014 నవంబర్ 17న రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఇందుకు రేణికుంట టోల్గేట్ వద్ద ఉన్న 30 గుంటల భూమిని తనఖా పెట్టారు. దీనికి మోహన్‌రెడ్డి తమ్ముడైన మహేందర్‌రెడ్డి పేరు మీద సేల్కమ్ జీపీఏ చేయించారు. వీటితోపాటు ముగ్గురికి చెందిన ప్రామిసరి నోట్లు, బాండ్ పేపర్లు, తెల్ల కాగితాలు రాయించుకున్నారు. 2015 వరకు మొత్తం రూ.30 లక్షలు చెల్లించామని, అయినా భూమిని తిరిగి ఇవ్వకుండా గన్‌తో బెదిరించాడని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. -
మోహన్‌రెడ్డిపై మరో కేసు
కరీంనగర్ క్రైం: మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. కరీంనగర్‌కు చెందిన తనిగెల అనిల్‌కుమార్ కుటుంబ అవసరాల దృష్ట్యా 2008లో మోహన్‌రెడ్డి వద్ద రూ.17 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అనిల్ తన భార్య మణెమ్మ పేరుమీద ఉన్న ఇంటిని మోహన్‌రెడ్డి సూచన మేరకు కాసర్ల మహేందర్‌రెడ్డి పేరు మీద జీపీఏ కం సేల్‌డీడ్ రాసిచ్చాడు. ప్రతినెలా వాయిదాలు కడుతున్న సమయంలో అనిల్‌కు తెలియకుండా మోహన్‌రెడ్డి, కొండబత్తిని సాంబ మూర్తితోపాటు మరొకరి పేరు మీద సేల్‌డీడ్ చేశాడు. దీనిపై మోహన్‌రెడ్డిని అనిల్ నిలదీయగా అప్పు చెల్లిస్తేనే ఇంటిని ఇస్తానని చెప్పడంతో వడ్డీతో కలిపి రూ.30 లక్షలు చెల్లించాడు. అయినా మోహన్‌రెడ్డి ఇంటిని అనిల్ భార్య పేరు మీద చేయలేదు. 2012లో మోహన్‌రెడ్డి, రేండ్ల నర్సింగం, పులుగం మల్లేశం, పూర్మ శ్రీధర్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి మణమ్మను తుపాకీతో బెదిరించి ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో అనిల్ కుటుంబం హైదరాబాద్ వలస వెళ్లింది. తర్వాత ఇల్లు పోయిందని మణెమ్మ గుండెపోటుతో మృతిచెందింది. -
మనోవేదనతో ‘మోహన్‌రెడ్డి’ బాధితుడి మృతి
కరీంనగర్ క్రైం: మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డి బాధితుడు ఒకరు బుధవారం మృతి చెందాడు. రూ. 5 లక్షల అప్పు కింద రూ. కోటి విలువైన ఇంటిని కోల్పోయిన బాధితుడు మనోవేదనతోనే మృతి చెందినట్లు మోహన్‌రెడ్డి బాధిత సంఘంతో పాటు బంధువులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గోదాంగడ్డకు చెందిన ఎండీ గోరిమా తన భర్త ముజీబ్ వైద్యం కోసం హోంగార్డ్ పూదరి శ్రీనివాస్ ద్వారా మోహన్‌రెడ్డిని కలసి రూ. 5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఇందుకోసం తన ఇంటిని మోహన్‌రెడ్డి తండ్రి ఆదిరెడ్డి పేరిట జీపీఏ చేయించింది. వడ్డీ రూపంలో రూ. 50 వేలు చెల్లించింది. పూర్తి రుణం చెల్లించే పరిస్థితి లేకపోవడంతో మోహన్‌రెడ్డి, పూదరి శ్రీనివాస్, బొబ్బల మహేందర్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, బొబ్బల ఆదిరెడ్డిలు 2015 సెప్టెంబర్ 6న వచ్చి.. దంపతులను బెదిరించి సదరు ఇంటిని నిమ్మ మాలతి పేరిట సేల్‌డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇల్లు కూడా ఖాళీ చేయించారు. సుమారు రూ. కోటి విలువ చేసే ఇంటిని రూ. 5 లక్షల కింద పోగొట్టుకోవడంతో ముజీబ్ మనస్తాపానికి గురయ్యాడు. హైదరా బాద్ వెళ్లి ఆటో డ్రైవర్‌గా కొన్నాళ్లు పని చేశాడు. సోదరుడు చనిపోవటంతో తిరిగి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. మోహన్‌రెడ్డి అరెస్టు అయిన తర్వాత పలు నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఇల్లు పోయిందన్న బెంగతో అనారోగ్యం పాలైన ముజీబ్ బుధవారం చనిపోయాడు. మోహన్‌రెడ్డి బాధితుల సంఘం సభ్యులు వెళ్లి నివాళులు అర్పించారు. -
మోహన్‌రెడ్డి కేసులో కీలక మలుపులు
కరీంనగర్‌క్రైం: గతంలో రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చిన మోహన్‌రెడ్డిపై తర్వాత ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. 9 నెలల క్రితం వరకూ సీఐడీ, ఇతర ఠాణాల్లో నమోదైన కేసులు కొలిక్కి వస్తున్నాయనుకున్న సమయంలో ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. దీంతోపాటు వెను వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. అప్పటి నుంచీ మోహ న్‌రెడ్డి జైలులోనే ఉండిపోయాడు. ఏసీబీ కూడా బెయి ల్ రాకుండా పటిష్ట చర్యలూ తీసుకుంటోంది. దీంతో పాటు మోహన్‌రెడ్డి, అతని కుటుంబసభ్యులకు చెంది న సుమారు రూ.5 కోట్లకు పైగా ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే కేసు విచారణ వేగం పెం చింది. దీంతో బాధితులు కూడా ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఏసీబీకి ఫిర్యాదులు అందిస్తున్నారు. విచా రణ చేపట్టి వెంటనే బినామీ పేరుతో ఉన్న ఆస్తులను బాధితులకు బదలాయింపు చేస్తుండడంతో బాధితుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మొదటి కేసు నమోదైన 26 నెలల తర్వాత బాధితులకు ఊరట లభిస్తుం డడంతో మళ్లీ కేసుల నమోదు పరంపర మొదలైంది. ఇప్పటికే 56 కేసులు నమోదయ్యాయి. తాజాగా.. సో మవారం ఐటీ టవర్ల ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్‌కు చిగురుమామిడి మండలం నవాబ్‌పేటకు చెం దిన కాంతాల స్వప్న తన ఫిర్యాదను అందించింది. ఆమెకు సంబంధించి 7.04 ఎకరాల భూమి ఉంది. డబ్బు అవసరం ఉండగా.. విషయం తెలుసుకున్న మోహన్‌రెడ్డి అనుచరులు రవీందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ముత్యంరెడ్డి, స్వరూపలు రంగంలోకి దిగారు. ఆమెకు రూ.5 లక్షల అప్పు ఇప్పించారు. తర్వాత ఎప్పటిలాగే తనఖా పెట్టిన భూమిని కబ్జా చేశారు. అయితే.. బాధితురాలు గతంలో సీఎం కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయడంతో మోహన్‌రెడ్డి అనుచరులు బెదిరింపులకు దిగారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని బాధితురాలు కేటీఆర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ పోలీస్ అధికారులను ఆదేశించారని తెలిసింది. నాడు సీఐడీ పేర్కొన్న బినామీలు.. మోహన్‌రెడ్డికి పెద్ద ఎత్తున బినామీలు ఉన్నారని సమాచారం. నాడు విచారణ సందర్భంగా పలువురు బినామీల పేర్లు బయటకొచ్చాయి. విశ్వనీయ సమాచారం మేరకు బినామీల్లో పుర్మ శ్రీధర్‌రెడ్డి, పుల్గం మల్లేశం, ఇట్టిరెడ్డి శ్రీపాల్‌రెడ్డి, బొబ్బల ఆదిరెడ్డి, బొబ్బల మహేందర్‌రెడ్డి, ఇట్టిరెడ్డి రాజిరెడ్డి, కొమటిరెడ్డి పద్మ, ఎస్.మహిపాల్‌రెడ్డి, జ్ఞానేశ్వర్, మేనేని సుమతీదేవి, కలకొండ ఆనందరావు, దేవులపల్లి మోహన్‌దాస్, ఇనుగంటి రామ్మోహన్రావు, చింతలపల్లి తిరుపతిరెడ్డి, సూరారం తిరుపతిరెడ్డి, కత్తి రమేశ్, అన్నాడి తిరుపతిరెడ్డి, బొబ్బల మమత, బొబ్బల లత, బొబ్బల రాంరెడ్డి, బొబ్బల నిర్మల, మంజుల, శ్యాంసుందర్‌రెడ్డి, కొల్లి మమత, నారాయణరెడ్డి, కుంట లలిత, కుంట రవీందర్‌రెడ్డి, కుంట రమణారెడ్డి, సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, జలేందర్‌రెడ్డి, తిప్పిరెడ్డి రాంరెడ్డి, బానాల రమణారెడ్డి, సూరారపు తిరుపతిరెడ్డి, నర్సింగం, సంపత్ శ్రీధర్‌రెడ్డి, బొబ్బల వజ్రమ్మ, సింగిరెడ్డి బాలకృష్ణరెడ్డి, సింగిరెడ్డి కమల, సింగిరెడ్డి రాజిరెడ్డి, నాగేంద్రచారి, బూరుగు రవీందర్‌రెడ్డి ఉన్నట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో చాలా మందికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అయితే.. తర్వాత ప్రభుత్వం నుంచి ఒత్తిడి కారణంగానే కేసును నీరుగార్చడానికి ప్రయత్నాలు చేసిందని బాధితులు ఆరోపించారు. తాజాగా నమోదైన కేసులో.. కరీంనగర్ జ్యోతినగర్‌లోని కమలాహైట్స్ ప్లాట్ నంబర్ 602కు చెందిన గుర్రం అమరేంద్రి అనే మహిళ కుటుంబç అవసరాల కోసం 2009లో మోహన్‌రెడ్డి వద్ద రూ.13 లక్షలు అప్పుగా తీసుకుంది. దీనికి గాను 7 ఖాళీ చెక్కులు, 6 ప్రామీసరి నోట్లు బాండ్ పేపర్స్‌పై సంతకాలు తీసుకున్నారు. మంకమ్మతోటలోని కోటి రూపాయల విలువైన ఇంటికి మోహన్‌రెడ్డి బినామీ అయిన బత్తిని తిరుపతిగౌడ్ పేరు మీద జీపీఏ చేయించారు. తర్వాత ఎనిమిది నెలల్లో రూ.8.32 లక్షలు చెల్లించారు. వడ్డీ కాకుండా మరో రూ.6 లక్షలు ఇచ్చారు. అయితే.. మరో 7 లక్షల రూపాయలు రావాలని.. వాటిని వెంటనే ఇవ్వాలని మోహన్‌రెడ్డి అనుచరులు భయబ్రాంతులకు గురిచేశారు. కాగా.. రెండు నెలల గడువు కోరారు. 2010 జూన్ 6వ తేదీన మోహన్‌రెడ్డి ధర్మారానికి చెందిన మాజీ నక్సలైట్ నర్సింగం వచ్చి తుపాకీతో బెదిరించారు. తర్వాత ఇట్టిరెడ్డి శ్రీపాల్‌రెడ్డి, పుర్మం శ్రీధర్‌రెడ్డి, పర్మిందర్‌సింగ్, పులుగం మల్లేశం, బొబ్బల మహేందర్‌రెడ్డి, పర్శరాములు, పూదర శ్రీనివాస్ వచ్చి ఇంటి నుంచి వెళ్లగొట్టి ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత తిరుపతిగౌడ్ ఆ ఇంటిని పింగలి అలియా అయిరెడ్డి శ్యామలాదేవికి అమ్మకం చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. కాగా.. అక్రమంగా తన ఇంటిని స్వాధీనం చేసుకుని.. తమకు తెలియకుండా అమ్మకాలు చేసిన వారందరిపై చర్య తీసుకోవాలని కోరుతూ అమరేంద్రి శనివారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేశ్‌గౌడ్ తెలిపారు. మరో ఆస్తిని తిరిగిచ్చేశారు.. కరీంనగర్ మండలంలోని తీగలగుట్టపల్లి గ్రామంలో సంపత్‌రావు, సునిల్రావుకు చెందిన 6 గుంటల స్థలం ఉండేది. వారి అవసరం కోసం మోహన్‌రెడ్డి వద్ద 2014లో రూ.12 లక్షలు తీసుకుని తిరిగి చెల్లించారు. అయినా భూమిని ఇవ్వకుండా దానిని బెజ్జంకి మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే.. బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రవీందర్‌రెడ్డి తన పేరు మీద ఉన్న భూమిని మంగళవారం బాధితులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ సందర్భంగా బాధితులు ఏసీబీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
మరో వివాదంలో మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి
-
మరో వివాదంలో మాజీ ఏఎస్ఐ
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: మాజీ ఏఎస్ఐ బొబ్బల మోహన్‌రెడ్డిపై తాజాగా మరో కేసు నమోదైంది. కరీంనగర్‌కు చెందిన పోతర్ల గట్టయ్య అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అడిషనల్ ఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్ గురువారం కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయనపై 50 పైగా కేసులు నమోదు కాగా, సగం కేసులపై చార్జీషీట్లు దాఖలయ్యాయి. డబ్బులు కట్టే వరకు తన తల్లి కర్మకాండలకు మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి హాజరు కానివ్వలేదని కరీంనగర్ కోతిరాంపూర్‌కు చెందిన పోతర్ల గట్టయ్య ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 8–7–166 నంబరు గల ఆర్సీసీ బిల్డింగ్‌ను మోహన్‌రెడ్డికి చెందిన ప్రైవేటు ఫైనాన్స్‌లో తనఖా పెట్టి అప్పు తీసుకుంటే.. వడ్డీ పెరిగిందని ఇతర ఆస్తులను కూడా తాకట్టు పెట్టుకున్నాడని.. చివరికి తన బినామీల పేరుమీద బలవంతంగా కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జీపీఏ రిజిస్ట్రేషన్‌కు బదులు 1608/2013 ప్రకారం సేల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు. అంతడితో ఆగకుండా ఆయన అనుచరుడైన పర్మిందర్సింగ్ను ఇంటికి పంపించి బలవంతంగా బోయవాడలోని తన ప్రైవేట్ ఫైనాన్స్‌కు పిలిపించి వడ్డీ డబ్బులు కట్టాలని నిర్బంధించారని గట్టయ్య తెలిపారు. ‘ఇంటి వద్ద నా తల్లి కర్మకాండలు నిర్వహించాల్సి ఉంది..తర్వాత వస్తాను..’అన్న కూడా వినకుండా ‘వడ్డీ డబ్బులు కట్టి కర్మకాండ జరుపుకో’అని ఆయన అకౌంటెంట్ జ్ఞానేశ్వర్ సమక్షంలో బెదిరించాడని, చేసేది లేక తన కొడుకు పోతర్ల పూర్నేశ్ అప్పు తెచ్చి తను విడిపించుకెళ్లాడని గట్టయ్య పేర్కొన్నారు. -
బోటు ప్రమాదం నన్ను తీవ్రంగా కలచి వేసింది
-
‘డిఫ్ట్రానిక్స్– 2017’తో హైదరాబాద్‌కు గుర్తింపు
సైయింట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్‌రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్: రక్షణ రంగంలో ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించి ‘డిఫ్ట్రానిక్స్–2017’ పేరిట ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనున్న సదస్సు ద్వారా హైదరాబాద్‌కు మరింత గుర్తింపు వస్తుందని సైయింట్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి చెప్పారు. శుక్రవారమిక్కడి జెనెక్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమికండక్టర్ అసొసియేషన్ (ఐఈఎస్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న డిఫ్ట్రానిక్స్–2017 సదస్సు ప్రాధాన్యాన్ని వివరించారు. రక్షణ రంగంలో ఎలక్ట్రానిక్స్ యంత్రాల తయారీకి కేంద్రం డీపీపీ–16, బై ఇండియా, ఐడీడీఎం వంటి ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఆచరణలో వృద్ధి సాధిస్తే ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. తెలంగాణ ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కరమ్‌పురి మాట్లాడుతూ డిఫ్ట్రానిక్స్–2017లో తెలంగాణ ప్రభుత్వం కంపెనీల స్థాపన కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తామని చెప్పారు. -
17.13బి. డాలర్లకు భారత్-జర్మనీ వాణిజ్యం
జర్మనీ గౌరవ కాన్సుల్‌గా మోహన్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇంజినీరింగ్ ఐటీ సేవల సంస్థ సైయంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి తాజాగా జర్మనీ గౌరవ కాన్సుల్‌గా నియమితులయ్యారు. ఇరు దేశాల వాణిజ్య, సాంస్కృతిక బంధాలు పటిష్టం చేసేందుకు ఆయన తోడ్పాటు అందించనున్నారు. నియామకం పురస్కరించుకుని బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో మోహన్‌రెడ్డి, భారత్‌లో జర్మనీ దౌత్యవేత్త మార్టిన్ నెయ్, తెలంగాణ..ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల కాన్సుల్ జనరల్ అహిమ్ ఫ్యాబిగ్ పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం 17.33 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉందని ఈ సందర్భంగా మోహన్ రెడ్డి తెలిపారు. గతేడాది జర్మనీ నుంచి బిలియన్ డాలర్ల పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్‌కి వచ్చాయని వివరించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలు, వృత్తి సంబంధ నైపుణ్యాల శిక్షణ, చిన్న మధ్య తరహా సంస్థల అభివృద్ధి తదితర విభాగాల్లో జర్మనీ సహకారం భారత్‌కు ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉంటున్న జర్మనీ పౌరులకు కాన్సులర్పరమైన సహాయ సహకారాలను గౌరవ కాన్సుల్ హోదాలో మోహన్ రెడ్డి అందిస్తారు. భారత్‌లో జర్మనీకి గౌరవ కాన్సుల్ ఇప్పటిదాకా గోవాలో మాత్రమే ఉండగా.. రెండో కాన్సుల్ హోదా మోహన్‌రెడ్డికి దక్కింది. భారత వ్యాపార భాగస్వామ్య దేశాల్లో జర్మనీది ఆరో స్థానమని మార్టిన్ నెయ్ వివరించారు. దాదాపు 1,700 పైచిలుకు జర్మన్ కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయని, 120 పైగా సంస్థలు గతేడాది మరిన్ని పెట్టుబడులు పెట్టాయన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న పెట్టుబడుల రక్షణ ఒప్పందాన్ని మరింతగా మెరుగుపర్చుకోవాల్సి ఉందని తెలిపారు. యూరోపియన్ యూనియన్‌తో ఇండియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చల విషయంలో పురోగతి కనిపిస్తోందని మార్టిన్ చెప్పారు. తమ దేశంలో విద్యాభ్యాసానికి వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య గత అయిదేళ్లుగా గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా భేటీ అయిన సందర్భంగా స్మార్ట్ సిటీలకు తోడ్పాటు తదితర అంశాలు చర్చించినట్లు మార్టిన్ తెలిపారు. -
మోహన్‌రెడ్డి మళ్లీ అరెస్టు
- నారాయణరెడ్డి ఆత్మహత్య కేసులో సెప్టెంబర్ 6 వరకు రిమాండ్ -నయూమ్‌తో సంబంధాలపై విచారిస్తున్న పోలీసులు కరీంనగర్ క్రైం/కరీంనగర్ లీగల్: అక్రమ ఫైనాన్స్ దందాతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఏఎస్సై బి.మోహన్‌రెడ్డిని పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. కరీంనగర్‌లోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య కేసులో మోహన్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కేసును పరిశీలించిన కోర్టు ఆయనకు సెప్టెంబర్ 6 వరకు రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. బెజ్జంకి మండలం గుండ్లపల్లికి చెందిన చాడ నారాయణరెడ్డి కరీంనగర్లో నివాసం ఉండేవాడు. ఆయన ఈ నెల 9న ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలు కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఈ మేరకు మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్రెడ్డిలపై కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నారాయణరెడ్డి భార్య, కూతురు.. తిరిగి సాయంత్రం మాట మార్చారు. తన తండ్రి ఆత్మహత్యతో మోహన్‌రెడ్డికి సంబంధం లేదంటూ ఫిర్యాదును వాపస్ తీసుకున్నారు. కానీ, అప్పటికే ఎఫ్ఐఆర్ నమోదరుుంది. ఈ కేసులో శ్యాంసుందర్‌రెడ్డి ముందస్తు బెరుుల్ పొందగా... మంగళవారం మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నయూమ్‌తో సంబంధాలపై విచారణ: నయూమ్‌తో మోహన్‌రెడ్డికి సంబంధాలున్నాయని, ఇందుకు సంబంధించిన ఆధారాలున్నాయని మోహన్‌రెడ్డి బాధితుల సండ ఘం అధ్యక్షుడు ముస్కు మహేందర్‌రెడ్డి కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. ఈ కోణంలోనూ మోహన్‌రెడ్డిని విచారించినట్లు సమాచారం. నయూమ్‌తో సంబంధాలపై ఆరోపణలు చేసిన ముస్కు మహేందర్‌రెడ్డిని ఆధారాలు సమర్పించాలని కోరగా ఎలాంటి ఆధారాలను అందించలేదని సమాచారం. మోహన్‌రెడ్డికి నయూమ్‌తో ఉన్న సంబంధాలపై విచారించడానికి పోలీసు అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. న్యాయపరంగా పోరాడుతా: మోహన్‌రెడ్డి కొందరు దురుద్దేశంతో తనకు నయూమ్‌తో సంబంధాలు అంటగడుతున్నారని, వారిపై న్యాయపరంగా పోరాడుతానని మంగళవారం కోర్టుకు వచ్చిన సందర్భంగా మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చాడ నారాయణరెడ్డి ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. -
'నయీం ముఠాతో మోహన్‌రెడ్డికి సంబంధాలు'
కరీంనగర్ : నయీం మూఠాతో ఏఎస్సై మోహన్‌రెడ్డికి సంబంధాలున్నాయని మోహన్‌రెడ్డి బాధితుల సంఘం అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం కరీంనగర్లో మహేందర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.... నయీం తరహాలోనే మోహన్‌రెడ్డి ఆయుధాలతో బెదిరించి అరాచకాలకు పాల్పడ్డాడని విమర్శించారు. మోహన్‌రెడ్డికి లైవ్ డిటెక్ట్ పరీక్షలు నిర్వహిస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. మోహన్‌రెడ్డి ఇంటి వద్దే అతని అడ్డా అని విమర్శించారు. మణిరత్నాబార్ సీసీ కెమెరా పుటేజీని సిట్ స్వాధీనం చేసుకోవాలని మహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
'నయీం తరహాలో మోహన్‌రెడ్డి అరాచకాలు'
కరీంనగర్: గ్యాంగ్‌స్టర్ నయీం తరహాలోనే మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడ్డాడని మోహన్‌రెడ్డి బాధితుల సంఘం అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆరోపించారు. నయీం గ్యాంగ్‌తో మాజీ ఏఎస్ఐకి సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. అందుకు నయీం డైరీలో కేఎన్ఆర్ హెచ్‌సీ అని రాసి ఉండటమే నిదర్శనమన్నారు. శనివారం కరీంనగర్లో మహేందర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... మోహన్‌రెడ్డితోపాటు అతడి తండ్రి ఆదిరెడ్డిని అరెస్ట్ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. 432 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తే మోహన్‌రెడ్డి, నయీంల బినామీలు.. వారి మధ్య సంబంధాలు వెలుగులోకి వస్తాయని మహేందర్ రెడ్డి తెలిపారు. -
అస్తికలు గోదావరిలో కలపడానికి వెళ్లి..
- 25 మందికి గాయాలు మంథని(కరీంనగర్) తమ పూర్వికుల అస్థికలను గోదావరిలో కలిపి కుటుంబ సభ్యులంతా కలిసి తిరిగి వస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం పొదురుపల్లి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్ జిల్లా మొగళ్లపల్లి మండలం ఎస్ పేటకు చెందిన మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ తల్లిదండ్రుల అస్థికలను కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిపి తిరిగి బొలేరో వాహనంలో వస్తుండగా.. వాహనం పొదురుపల్లి వద్దకు చేరుకోగానే ముందు టైర్ పగిలి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మోహన్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మల్లారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను వేధించిన వ్యక్తికి రెండేళ్ల జైలు
కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురి చేశాడో ప్రబుద్ధుడు. వేధింపులు తాళలేక భార్య కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన మెట్రోపాలిటన్ కోర్టు ఆ వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు,రూ. 20 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. వివరాలు.... నాచారం మల్లాపూర్ ప్రాంతంలో నివాసముండే మోహన్‌రెడ్డి, అంజలి భార్యాభర్తలు. అంజలి తల్లిదండ్రులు వీరి వివాహాన్ని అప్పట్లో ఘనంగా నిర్వహించారు.పెళ్లి అయిన కొంతకాలానికే మోహన్‌రెడ్డి అంజలిని అదనపు కట్నం కోసం వేధించ డంతో పోలీసులను ఆశ్రయించింది. -
ఏఎస్ఐ సంపాదన వంద కోట్లా?
సాక్షి, హైదరాబాద్: పోలీసుగా ఉంటూ భారీ మొత్తాలను వడ్డీకి ఇవ్వడమే కాక, వడ్డీ కోసం తీవ్ర ఒత్తిడి తెచ్చి ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారకుైడైన కరీంనగర్ ఏఎస్ఐ బొబ్బల మోహన్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం అతను దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో వడ్డీ వ్యాపారం ద్వారా మోహన్‌రెడ్డి రూ.100 కోట్లకు పైగా సంపాదించినట్లు అదనపు పీపీ రామిరెడ్డి ద్వారా తెలుసుకున్న న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. ఓ ఏఎస్ఐ సంపాదన వంద కోట్లా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు చెందిన కెన్ క్రెస్ట్ స్కూల్స్ అధినేత రామవరం ప్రసాదరావు ఏఎస్ఐ మోహన్‌రెడ్డి నుంచి రూ.75 లక్షలు అప్పు తీసుకున్నారు. ఇందులో రూ.50 లక్షలు తిరిగి చెల్లించారు. మిగిలిన మొత్తం విషయంలో వడ్డీ కోసం ప్రసాదరావుపై మోహన్‌రెడ్డి ఒత్తిడి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. మోహన్‌రెడ్డి, మరికొందరు తన ఆత్మహత్యకు కారణమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రసాదరావు భార్య గౌతమి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది. మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు కింది కోర్టు నిరాకరించడంతో ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సోమవారం న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. సీఐడీ అధికారుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి వాదనలు వినిపిస్తూ మోహన్‌రెడ్డి ఏఎస్ఐ విధులు నిర్వర్తిస్తూనే భారీ మొత్తాలను వడ్డీకి ఇస్తూ వ్యాపారం చేశారన్నారు. దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే దాని ప్రభావం సాక్షులపై ఉంటుందని ఆయన కోర్టుకు నివేదించారు. -
క్రైస్తవులకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
-
చిత్రగుప్తుడి చిట్టాలో చిత్రాలెన్నో!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: మోహన్‌రెడ్డి పైనాన్స్ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న జ్ఞానేశ్వర్ చెప్పిన లెక్కలు కొత్త ప్రశ్నలకు తావిస్తున్నాయి. కీలక పత్రాలతో ఉడాయించిన జ్ఞానేశ్వర్ దొరికితే అక్రమ ఫైనాన్స్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన వారు బయటకు వస్తారని భావించగా, ఆయన చెప్పిన మాటలకు.. ఇక్కడి లెక్కలకు మధ్య తేడా ఉండడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సీఐడీ రిమాండ్ నివేదికలో పేర్కొన అంశాలు పరిశీలిస్తే జ్ఞానేశ్వర్ నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు అంత కీలకం కాదని తెలుస్తోంది. అయితే, జ్ఞానేశ్వర్ విలువైన పత్రాలను దాచిపెట్టినట్లు భావిస్తున్నారు. 15 రోజులపాటు అజ్ఞాతంలో ఉన్న అతను హైదరాబాద్, తిరుపతి ప్రాంతాల్లో సంచరించినట్లు అనుమానిస్తున్న పోలీసులు పత్రాలను ఆయా ప్రాంతాల్లోనే దాచి ఉంచాడని భావిస్తున్నారు. రాయలసీమలోని పలువురు ఫ్యాక్షన్ నేతలతో మోహన్‌రెడ్డికి సంబంధాలు ఉండటంతో జ్ఞానేశ్వర్ వ్యూహాత్మకంగా తిరుపతి వరకు వెళ్లి వారివద్దే ఈ డాక్యుమెంట్లు ఉంచారని ప్రచారం జరుగుతోంది. చిట్టాలో చిత్రాలెన్నో... సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పలువురు పోలీసు అధికారులతో పాటు వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారులు పెట్టుబడులు పెట్టినట్లుగా జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. కానీ, వాటిని మొత్తం కలిపితే రూ.3.84 కోట్లుగా తేలింది. కానీ, అదే నివేదికలో మోహన్‌రెడ్డి నుంచి పలువురు ప్రముఖులు, ఉద్యోగులు తీసుకున్న అప్పు రూ.8.34 కోట్లుగా తేలింది. అట్లాంటప్పుడు మిగిలిన రూ.4.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో మాత్రం అందులో పేర్కొనలేదు. ఇవేకాకుండా వందలాది ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఇళ్లు మోహన్‌రెడ్డి, ఆయన బినామీల పేరిట ఉన్నాయి. జ్ఞానేశ్వర్ నుంచి రాబట్టిన సమాచారం చూస్తే... మోహన్‌రెడ్డి దందాకు సంబంధించి కొన్ని విషయాలు మాత్రమే బయటపెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోనే కాకుండా నిర్మాతలకు సంబంధించిన ఆస్తులనూ తనఖా పెట్టుకుని సుమారు రూ.200 కోట్ల వరకు అప్పులిచ్చాడని ఆరోపణలున్నాయి. అయితే,జ్ఞానేశ్వర్ చెప్పిన వివరాలు చూస్తే పొంతనే లేకుండా ఉంది. జ్ఞానేశ్వర్ నోటి వెంట... కిరణ్‌రావు మాట జ్ఞానేశ్వర్ నోట రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరణ్‌రావు పేరు రావడం చర్చనీయాంశమైంది. మోహన్‌రెడ్డికి కిరణ్‌రావు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అతని సూచనల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి ఎన్నికల ముందు రూ.3 కోట్లు అప్పు ఇచ్చారని రిమాండ్ షీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం హైదారాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కిరణ్‌రావు నుంచి మరి కొంతమందికి కూడా మోహన్‌రెడ్డి పెద్ద మొత్తంలో అప్పులిప్పించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఐడీ అధికారులు తాజాగా కిరణ్‌రావు వ్యాపారాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం. మోహన్‌రెడ్డికి రిమాండ్ పొడిగింపు ఏఎస్సై మోహన్‌రెడ్డి రిమాండ్‌ను న్యాయమూర్తి అజహర్ హుస్సేన్ పొడిగించారు. శుక్రవారంతో రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. రిమాండ్‌ను న్యాయమూర్తి మరో 14రోజులు పొడిగిం చారు. దోనపాటి వెంకట రమణారెడ్డిని ఆస్తుల ను అక్రమంగా స్వాధీనం చేసుకున్న కేసులో నిందితుడు మోహన్‌రెడ్డి బినామీ పూర్మ శ్రీధర్‌రెడ్డి బెయిల్ ఫిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తి విచారణ ఈనెల 30కి వాయిదా వేశారు. విచారణ ముందుకు సాగేనా..? ఈ కేసులో సీఐడీ అధికారులకు కొత్తగా రాజకీయ ప్రముఖుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. విచారణ మరింత లోతుగా వెళితే బడా వ్యాపారులు, ఎస్పీ స్థాయి అధికారులు, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయని, అదే జరిగితే ఇబ్బందని భావిస్తున్న సదరు నేతలు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడితో కేసును నీరుగార్చేలా సీఐడీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పెద్ద నేతతో మంతనాలు చేశారని, అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే సీఐడీ దూకుడుకు కళ్లెం పడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు మోహన్‌రెడ్డిపై ఫిర్యాదులు చేసిన బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఏసీబీకి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ప్రతి రోజు 5 నుంచి 7 ఫిర్యాదులు వస్తున్నాయని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. -
ఏఎస్ఐ మోహన్‌రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఏఎస్ఐ మోహన్‌రెడ్డి అక్రమ వడ్డీ వ్యాపారం దందా మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు.. మోహన్‌రెడ్డికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరి వివరాలు సేకరించింది. ఆయనకు తాకట్టు పెట్టిన ఆస్తుల విలువ రూ.50 కోట్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. వాటి క్రయ విక్రయాలు జరుపవద్దని తాజాగా సీఐడీ ఆదేశాలు జారీ చేసింది. వాటి రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని అధికారులను కోరింది. దీంతోపాటు, 2006లో మోహన్‌రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించి ఆస్తుల కేసును తిరగదోడింది. ఇందుకు సంబంధించి 68మంది సాక్షులను కోర్టులో హాజరుపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ఏడాది సీఐడీ నమోదు చేసిన 27 కేసుల్లో మోహన్‌రెడ్డికి సంబంధించినవే నాలుగు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసు శాఖ ఏఎస్పీ నుంచి హోంగార్డు స్థాయి వరకు 12 మందిపై వేటువేసింది. మరో ఇద్దరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మోహన్‌రెడ్డిపై పోలీసులు ఇప్పటికే 20కిపైగా కేసులు నమోదు చేశారు. మరోపక్క, మోహన్ రెడ్డి కేసులో ఆరుగురుని సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ తో జైలుకు తరలించారు. -
ఏఎస్ఐ మోహన్ రెడ్డికి బెయిల్ తిరస్కరణ
కరీంనగర్ : ఏఎస్ఐ మోహన్ రెడ్డికి కరీంనగర్ జిల్లా కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కావాలంటూ ఏఎస్సై దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారణ చేసిన అనంతరం కరీంనగర్ జిల్లా కోర్టు తిరస్కరించింది. బెయిల్ మంజూరు చేస్తే మోహన్ రెడ్డి కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని సీఐడీ అధికారులు కోర్టుకు వివరించారు. వడ్డీ వ్యాపారిగా మారి సామాన్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఏఎస్సై ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పలువురు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. ఏఎస్సై మోహన్ రెడ్డి ముఖ్య అనుచరులు పరశురాం గౌడ్, పంకజ్ సింగ్, జ్ఞానేశ్వర్ల కోసం సీఐడీ బృందాలు గాలిస్తున్నాయి. సీఐడీ ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నట్లు కనిపిస్తోంది. -
ఏఎస్సై కేసులో పలువురు పోలీసులపై బదిలీ వేటు
-
ఏఎస్సై కేసులో పలువురు పోలీసులపై బదిలీ వేటు
కరీంనగర్: వడ్డీ వ్యాపారిగా మారి సామాన్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తును సీఐడీ మరింత వేగమంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసుకు సంబంధించి పలువురు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. కోరుట్ల సీఐ సురేందర్, ముధోల్ సీఐ గణపతియాదవ్లను డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. హెడ్ కానిస్టేబుల్ శంకర్ సింగ్, కానిస్టేబుళ్లు నివాస్, శంకర్లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ కేటాయింపులు జరిగాయి. ఏఎస్ఐ మోహన్‌రెడ్డి ముఖ్య అనుచరులు పరశురాంగౌడ్, పంకజ్ సింగ్, జ్ఞానేశ్వర్ల కోసం సీఐడీ అధికారులు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఏఎస్ఐ మోహన్‌రెడ్డి కేసుకు సంబంధించి ఆయనకు సహకరించడంతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు పోలీస్ అధికారులకు సీఐడీ ఇటీవలే నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. గత శనివారం జారీ చేసిన ఈ నోటీసులలో ఏఎస్పీ జనార్ధన్ రెడ్డితో పాటు మరో 30 మంది పేర్లను పేర్కొంది. ముగ్గురు డీఎస్పీలు బుచ్చి రాములు, భాస్కర్ రాజు, సాయి మనోహర్లకు, సీఐలు ప్రకాశ్, మల్లయ్యలకు నోటీసులు జారీ చేసినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. -
ఏఎస్సైకు రిమాండ్ పొడిగింపు
కరీంనగర్: పోలీసుల అదుపులో ఉన్న ఏఎస్సై మోహన్‌రెడ్డి రిమాండ్‌ను కరీంనగర్ కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించింది. వడ్డీ వ్యాపారిగా మారి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలపై ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మోహన్‌రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను కరీంనగర్ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కాగా, ఈ కేసుతో సంబంధమున్న ఎస్పీ జనార్ధనరెడ్డిపై ఇప్పటికే ఉన్నతాధికారులు వేటు చేశారు. మరికొందరిపై చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసు శాఖ సిద్ధమవుతోంది. -
సుఖసంతోషాలతో జీవించాలి
కర్నూలు(అగ్రికల్చర్): ముస్లింలు సుఖసంతోషాలతో జీవించాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చివరిరోజున శుక్రవారం ముస్లింలకు కలెక్టర్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. స్టేట్ గెస్ట్‌హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులు తరలివచ్చారు. కార్యక్రమానికి జిల్లాపరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, జేసీ హరికిరణ్, దేశం నేతలు కేఈ ప్రతాప్, నాగేశ్వరరావు యాదవ్, ముస్లిం మైనార్టీ నేతలు హఫీజ్ ఖాన్, అల్లా బకాష్, పర్వేజ్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ మస్తాన్ వలీ, ఆల్మేవ నేతలు రోషన్ అలీ, సయ్యద్ హుసేన్, అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలసి కలెక్టర్, ఎస్పీ, జేసీ, ప్రజాప్రతినిధులు ప్రార్థనలు జరిపారు. పవిత్ర రంజాన్ పర్వదినం జరుపుకోనున్న ముస్లిం సోదరులందరికి కలెక్టర్ తదితరులు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ఇచ్చిన ఇఫ్తార్ విందు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ పర్వదినం అన్ని ముస్లిం కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు. ముస్లింలకు ఎస్పీ రంజాన్ శుభాకాంక్షలు కర్నూలు: రంజాన్ పండుగను పురస్కరించుకుని జిల్లాలోని ముస్లింల కు, పోలీసు శాఖలోని సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఎస్పీ ఆకే రవికృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు జిల్లా మతసామరస్యానికి ప్రతీక అని, కులమతాలకు అతీతం గా అందరూ కలసిమెలసి ఉంటారని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతో పవిత్రంగా నెలరోజుల పాటు దీక్షలు చేసి కుటుంబ సభ్యులతో రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ మరో ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ ఆయన ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. -
అధైర్య పడొద్దు
కంబదూరు : ఎవరూ అధైర్య పడాల్సిన పనిలేదని త్వరలోనే మంచి రోజులు వస్తాయని బాధిత రైతు కుటుంబాలకు వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా యాత్ర చేపడతారని నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఎల్ఎం మోహన్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రఘునాథ్‌రెడ్డి, కళ్యాణదుర్గం మండల కన్వీనర్ దొణస్వామి, సింగిల్ విండో అధ్యక్షుడు బాబురెడ్డి, ములకనూరు తిమ్మరాయుడు, గోవిందరెడ్డి, ఎంపీటీసీ గుద్దెళ్ల నాగరాజు, సర్పంచ్ హరినాథ్ క లిసి జగన్ చేపట్టబోయే భరో సా యాత్ర రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. కంబదూరు మండలం తిమ్మాపురంలో ఆత్మహత్య చేసుకున్న వడ్డే నారాయణప్ప కుటుంబ సభ్యులైన ఆయన భార్య లక్ష్మీదేవి, కుమారుడు మారెన్నలను కలిసి ధైర్యం చెప్పారు. కంబదూరులో జగన్ బసచేసే ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ఒంటారెడ్డిపల్లిలో ఆత్మహత్య చేసుకున్న కురుబ రామాంజనేయులు అనే రైతు భార్య గంగమ్మ ఇంటికి వెళ్లి పరామర్శించారు. కురాకులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాజేష్ కుటుంబ సభ్యులైన తల్లి లక్ష్మీదేవి, తమ్ముడు శ్రీధర్‌లను ఓదార్చారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా ఉంటారన్నారు. పర్యటనలో వైఎస్ఆర్ సీపీకి చెందిన కళ్యాణదుర్గం పట్టణ కన్వీనర్ జయరాంపూజారి, ములకనూరు గోవిందు, గోళ్లసూరి, అంజిబాబు, దీమేష్, నీలి శంకరప్ప పాల్గొన్నారు. -
మానసిక ఒత్తిళ్లపై పరిశోధనలు అవసరం
కర్నూలు(జిల్లా పరిషత్): ‘ఒకప్పుడు పిచ్చిపట్టిన వారు మాత్రమే మానసిక వైద్యుల వద్దకు వెళ్లేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ మానసిక వైద్యుని అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో మానసిక ఒత్తిళ్లపై పరిశోధనలు ఎంతైనా అవసరం.’ అని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో 35వ రాష్ట్రస్థాయి సైకియాట్రిస్ట్‌ల సదస్సు(ఏపీ సైకాన్-2015) శనివారం స్థానిక మౌర్య ఇన్‌లో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కర్నూలులో మానసిక వైద్యాలయం ఏర్పాటు అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. కార్పొరేట్ సంస్థల్లోనూ సైకియాట్రిస్ట్‌లను నియమించి కౌన్సెలింగ్ ఇస్తున్నారని గుర్తు చేశారు. మానసిక ఒత్తిళ్లు నాడు, నేడు ఉన్నాయని.. కానీ ఒత్తిళ్లలో తేడా ఉందన్నారు. యువత సైతం నిరుద్యోగం, పేదరికం కారణంగా క్రిమినల్స్‌గా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఏపీ చాప్టర్ నూతన అధ్యక్షునిగా పూర్వ అధ్యక్షుడు డాక్టర్ కృపాకర్ కొరడా నుంచి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సురేష్‌కుమార్(వైజాగ్) మాట్లాడుతూ సైకియాట్రిస్టుల సేవలు పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయని, గ్రామీణ ప్రాంతాలకు చేరడం లేదన్నారు. ఆల్కహాల్, గంజాయి వంటి మత్తుపదార్థాల స్థానంలో నేడు ఇంటర్నెట్ వాడకం వ్యసనంగా మారిందని, సోషల్ మీడియా ప్రభావం యువతపై తీవ్రంగా పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మానసిక వైద్యుల సంఖ్య మరింతగా పెరగాల్సి ఉందన్నారు. కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రాంప్రసాద్ మాట్లాడుతూ పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ నేడు మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. సమాజంలో సైకియాట్రిస్టు నిపుణుల కొరత ఉందని, ఆ కొరతను ప్రభుత్వం తీర్చాలన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరస్వామి మాట్లాడుతూ మానసిక ఒత్తిళ్ల కారణంగా ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రీజనల్ సైకియాట్రిక్ ఇన్సిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం సావనీర్‌ను ప్రిన్సిపాల్ డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ కరి రామారెడ్డి రచించిన మనసులో ఒకరు పుస్తకాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి ఆవిష్కరించారు. సదస్సుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి 12 మంది స్పీకర్లు(సైకియాట్రిస్ట్‌లు) హాజరై పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఐఎంఏ కర్నూలు శాఖ అధ్యక్షులు డాక్టర్ బి.శంకరశర్మ, కార్యక్రమం నిర్వాహక చైర్మన్ డాక్టర్ బి.రమేష్‌బాబు, కార్యదర్శి డాక్టర్ కె. నాగిరెడ్డి, కోశాధికారి డాక్టర్ రమేష్ చంద్రబాలాజి, ఎడిటర్ డాక్టర్ పి.లోకేష్‌రెడ్డి, అసోసియేషన్ సౌత్ జోన్ ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఏపీ చాప్టర్ నూతన కార్యవర్గం ఎన్నిక ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఏపీ చాప్టర్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. శనివారం ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో కర్నూలులో ఏపీపీసైకాన్-2015 పేరిట మానసిక వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డాక్టర్ జి.సురేష్‌కుమార్(వైజాగ్), సెక్రటరీగా డాక్టర్ బి.రమేష్‌బాబు(కర్నూలు), ఉపాధ్యక్షులుగా డాక్టర్ కె.నాగిరెడ్డి(కర్నూలు), కోశాధికారిగా డాక్టర్ రమేష్ చంద్రబాలాజి(నెల్ల్లూరు), ఎడిటర్‌గా డాక్టర్ పి.లోకే శ్వరరెడ్డి(తిరుపతి) ఎన్నికయ్యారు. -
మేమెంతో ‘సెల్ఫీ’ష్!
-
‘మండలి’లో మొండిచేయి?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ కోటా సభ్యుడి ఎన్నికలో ప్రధాన పార్టీల టికెట్లు ఆశిస్తున్న పాలమూరు నేతలకు మొండిచేయి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుండగా బీజేపీ మినహా ఇతర పార్టీల అభ్యర్థులు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ కోటా సభ్యుడి ఎన్నికలో ప్రధాన పార్టీల టికెట్లు ఆశిస్తున్న పాలమూరు నేతలకు మొండిచేయి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుండగా బీజేపీ మినహా ఇతర పార్టీల అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. ప్రముఖ న్యాయవాది రాంచందర్‌రావు పేరును బీజేపీ ఇప్పటికే ఖరారు చేసింది. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, టీపీఆర్టీయూ అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు ఉపాధ్యాయ సంఘం నేతలు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాల్సిందిగా సీఎం స్థాయి లో ప్రయత్నాలు సాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పూలరవీందర్, కాటేపల్లి జనార్దన్‌రెడ్డితో కలిసి వెంకట్‌రెడ్డి ఇటీవల సీఎంను కలిసినట్లు సమాచారం. నియోజకవర్గ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పీఆర్టీయూ బలమైన యూనియన్‌గా ఉన్నందున తమకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ పేరు దాదాపు ఖాయమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇద్దరు నేతల ప్రయత్నాలు ఫలిస్తాయా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. గతంలో టీడీపీనుంచి ఇదే స్థానంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన హైదరాబాద్ వాసి పీఎల్ శ్రీని వాస్ ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉండటంతో జిల్లా నేతలకు అవకాశం దక్కడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. 2007 ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పోటీచేశారు. తదనంతర పరిణామాల్లో శ్రీనివాసరెడ్డి బీజేపీగూటికి చేరారు. 2009 ద్వైవార్షిక ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దించకుండా, సిట్టింగ్ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికింది. ఎమ్మెల్సీ నాగేశ్వర్ మూడో పర్యాయం పోటీ చేయడంపై స్పష్టత కొరవడింది. మరోవైపు తమను సంప్రదించకుండానే బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంపై టీడీపీ శ్రేణులు తొలుత కొంత అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే మండలి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ద్వైవార్షిక ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి టీడీపీ మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. పోటీకి దూరంగా కాంగ్రెస్? పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు కాంగ్రెస్ మొదటి నుంచి దూరంగా ఉంటూ వస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో నిలబడే అభ్యర్థి ఎవరనే అంశంపై జిల్లా నేతల్లో స్పష్టత కొరవడింది. పార్టీలతో సంబంధం లేకుండా సొంతంగానే బరిలోకి దిగేందుకు కొందరు ఔత్సాహికులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రజా సంఘాలు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు, రిటైర్డు ఉద్యోగులు నామినేషన్ వేసేందుకు సన్నిహితులతో సంప్రదింపులు సాగిస్తున్నారు. -
‘కమలం’లో నూతనోత్సాహం
ఇబ్రహీంపట్నం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పర్యటన ఇబ్రహీంపట్నం నియోజక వర్గం బీజేపీ శ్రేణులల్లో నూతనోత్సాహన్ని నింపింంది. ఈ కార్యక్రమంలో పూర్వనేతలుసొంతగూటికి చేరుకోవడంతోపాటుగా మరికొంతమంది ప్రముఖులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఆ పార్టీకి కొంతమేర బలాన్ని ఇచ్చిందనే చెప్పొచ్చు. బీజేపీ అసెంబ్లీ నియోజక క న్వీనర్ ముతాల్య భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీడీ పీ సీనియర్ నాయకుడు గుర్రం శ్రీనివాస్‌రెడ్డితోపాటు ప్రముఖ న్యాయవాది అంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో పది మంది న్యాయవాదులు బీజేపీలో చేరారు. గు ర్రం శ్రీనివాస్‌రెడ్డి బీజేపీ మండల పార్టీ నేతగా, జిల్లా నేతగా బాధ్యతలు నిర్వహించి కొంతకాలం క్రితం టీడీపీలో చే రారు. ఇదే కార్యక్రమంలో కందుకూరు ఎంపీపీ అశోక్ కూడా బీజేపీలో చేరారు. కాషాయమయం కిషన్‌రెడ్డి పర్యటనను పురస్కరించుకున ని ఆ పార్టీ నేతలు ఇబ్రహీంపట్నాన్ని కాషాయమయం చేశారు. శేరిగూడ నుంచి ఇబ్రహీంపట్నం వరకు భారీ స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో పార్టీ పతాకావిష్కరణను పురస్కరించుకుని భారీగా ప్లెక్సీలతో హోరెత్తించారు.ఈ సందర్భంగా నగరపంచాయతీ కౌన్సిలర్లు ముత్యాల భాస్కర్, బండి విజయనిర్మల,నాయిని సత్యనారాయణ, టేకుల రాంరెడ్డిల ఆధ్వర్యంలో కిషన్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్, కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొరెడ్డి అర్జున్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు దొండ రమణారెడ్డి, సర్పంచ్ల సంఘం నాయకురాలు పొరెడ్డి సుమతీ అర్జున్‌రెడ్డి, దళిత మోర్చా నాయకుడు బోసుపల్లి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. వినతి పత్రం సమర్పించిన ఎంఎస్ఎఫ్ నేతలు కిషన్‌రెడ్డికి ఎంఎస్ఎఫ్ నేతలు కొండ్రు ప్రవీణ్‌కుమార్,ఎమ్మార్పీస్ నాయకుడు నర్కుడు అంజయ్యలు వినతి పత్రం అందజేశారు. మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వికలాంగులు, వృద్ధాప్య, వితంతు పింఛన్లు అర్హులైన వారందరకీ ఇచ్చేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. -
సోషల్ మీడియాతో వ్యాపారాభివృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారాభివృద్ధిలో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడీయా కీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటిని ఉపయోగించుకొని చిన్న మధ్య స్థాయి కంపెనీలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని సెయైంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బి.వి.ఆర్.మోహన్ రెడ్డి తెలిపారు. మారుతున్న టెక్నాలజీతో వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోవడం అనే అంశంపై టాటా డొకొమో ‘ డు బిగ్ సింపోజియం’ నిర్వహించింది. ఈ కార్యక్రమంలోమోహన్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ - మొబైల్ - ఇంటర్నెట్ (ఎస్ఎంఐ) వినియోగించుకోవడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా టాటా డొకొమో ఎస్ఎంఐ సొల్యూషన్‌ను లాంఛనంగా ప్రారంభించింది. -
పీడీ మాకొద్దు
మంకమ్మతోట : ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్‌కు.. ఆ శాఖ ఉద్యోగులకు మధ్య ఏడాదికాలంగా జరుగుతున్న వివాదం మంగళవారం మరింత ముదిరింది. ఉద్యోగులు సహకరించడం లేదంటూ వేధిస్తున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. పీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగులు పెన్‌డౌన్ సమ్మెకు దిగారు. సమ్మెను విరమింపచేసేందుకు ఐసీడీఎస్ సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జయరామ్ నాయక్ జరిపిన చర్చలు ఫలించలేదు. పీడీ మోహన్‌రెడ్డి బదిలీపై వెళ్లిపోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈనెల 27నుంచి పీడీ వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఉద్యోగుల సంఘం జిల్లా నాయకత్వం చర్చలు జరిపినా సద్దుమణగకపోవడంతో రాష్ర్టం నాయకులు రంగంలోకి దిగారు. రెండు గంటలపాటు జరిపిన చర్చలు ఉద్యోగుల ఆరోపణలతో వాడివేడిగా కొనసాగాయి. ఏడు నెలలుగా ఫైళ్లు తన వద్దనే పెట్టుకుని సొంత పనులు చేసుకుంటున్నారని, ఉద్యోగులకు పనిచేయడం రాదని ఇతరులతో చెబుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. చర్చల్లో తనపై వచ్చిన ఆరోపణలపై పీడీ స్పందించకపోగా.. ఉద్యోగులు కార్యాలయ పనులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, పీడీ అని గౌరవం లేకుండా మాట్లాడతున్నారంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో ఉద్యోగులు చర్చల నుంచి బయటికొచ్చి పీడీ వెళ్లిపోవాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రెండు రోజుల్లో పీడీ సెలవులో వెళ్లిపోతున్నట్లు ఉద్యోగవర్గాల ద్వారా తెలిసింది. పీడీ సెలువుపై వెళ్లిపోకపోతే ఉద్యోగులంతా మూకుమ్మడి సెలవుపై వెళ్లిపోతామని వారు స్పష్టం చేశారు. -
హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి
హన్మకొండ సిటీ : హక్కుల సాధనకు విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడాలని విద్యుత్ ఉద్యోగుల సంఘం-327(ఐఎన్టీయూసీ అనుబంధ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోఆర్డినేటర్ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ వడ్డేపల్లి రోడ్డులోని పల్లె రవీందర్‌రెడ్డి భవన్లో తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ విద్యుత్ వర్కర్స్ యూనియన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన అన్ని విభాగాల విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్ నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చినందున కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసే అవకశాలున్నాయని, ఎవరికి వారుగా చీలిపోకుండా ఒకే వేదికపైకి రావాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడం వల్ల సిబ్బంది కొరత సమస్య తీరుతుందన్నారు. యూనియన్ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై సబ్‌స్టేషన్ అపరేటర్లు, వాచ్మెన్లు, అటెండర్లు, స్వీపర్లు, డ్రైవర్లు, స్పాట్ బిల్లర్లు, కలెక్షన్ ఏజెంట్లు పని చేస్తున్నారని, అందరినీ రె గ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే సమ్మెకు వెళతామని హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ పరిధి అధ్యక్షుడు దారావత్ సికిందర్, కార్యదర్శి యుగంధర్, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు మహేందర్‌రెడ్డి, కె.హన్మంత్‌రాావు, జస్వంత్‌కుమార్, విజయ్‌కుమార్, శ్రీనివాస్, గంగాధర్, మోహిద్, గోపాల్‌రాావు, శ్రీనివాస్‌రావు, విజయగోపాల్, మోహిసిన్‌ఖాన్, నాగమల్లు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సంఘం జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ మేరకు మాట్లాడారు. సర్విస్ రూల్స్‌ను రూపొందించి అర్హతగల ఉపాధ్యాయులకు జెల్, డైట్లెక్చరర్, డిప్యూటీఇఓలుగా పదోన్నతి కల్పించాలని అన్నారు. ఆర్‌ఎంఎస్‌ఏ నిధుల ద్వారా పాఠశాలలకు వసతులు కల్పించాలని, నెలవారి పదోన్నతులను అడహక్ పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. అన్ని పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అమలు చేయాలని, ప్రతి పాఠశాలలో స్వీపర్, అటెండర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకం వెంటనే చేయించాలన్నారు. ప్రతి నియోజక వర్గానికి ఒక డిప్యూటీ డీఈఓ పోస్టులను కేటాయించాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సింహయ్య, వాహిద్, హేమచంద్ర, ప్రకాశ్, బాల్‌రాం, దశరథనాయక్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని సాధనే ధ్యేయం
‘‘ఒకప్పటి రాజధానిని త్యాగం చేయడంతో అభివృద్ధిలో వెనుకబడ్డాం. ప్యాకేజీలు, పదవులకు ఆశపడి మరోసారి మోసపోకూడదు. రాజధాని ద్వారానే అభివృద్ధి సాధ్యం. కర్నూలును రాజధానిగా ప్రకటించే వరకు సమష్టి పోరాటం సాగిద్దాం. ఒక్కటై గళం వినిపిద్దాం.’’ అని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని బిర్లా కాంపౌండ్‌లో ఉన్న శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఎస్వీ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించారు. కర్నూలు రాజధానిని కోల్పోవడం వల్ల రాయలసీమకు జరిగిన నష్టంపై సుదీర్ఘంగా చర్చించి కర్నూలు రాజధాని సాధన కమిటీని ఎన్నుకున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లపురెడ్డి జనార్ధన్‌రెడ్డి కమిటీ కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. రాజధాని సాధన కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఉద్యమబాట పట్టాలని కర్నూలు రాజధాని సాధన కమిటీ పిలుపునిచ్చింది. శుక్రవారం స్థానిక బిర్లా కాంపౌండ్‌లోని శ్రీలక్ష్మీ ఫంక్షన్ హాల్లో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమష్టిగా పోరాటం చేసి రాజధానిని సాధించుకుందామని ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన అన్ని హంగులు కర్నూలులో ఉన్నాయని గుర్తు చేశారు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కర్నూలు చుట్టూ అందుబాటులో ఉన్నాయన్నారు. సమావేశంలో వక్తల ప్రసంగాలు యథాతథంగా.. - కర్నూలు రాజధాని ద్వారానే అభివృద్ధి సాధ్యం రాజధాని ద్వారానే రాయలసీమ అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. రాజధాని కోల్పోవడంతో జరిగిన నష్టంపై రాయలసీమ ప్రజల్లో చైతన్యం తీసుకురాలి. - గౌరు చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసి అయి ఉండి కూడా ఈ ప్రాంతాన్ని విస్మరిస్తున్నారు. కోస్తా ప్రాంతం అభివృద్ధి చెందిందని, అక్కడ రాజధాని అవసరం లేదు. కర్నూలులో రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. - మణిగాంధీ, కోడుమూరు ఎమ్మెల్యే లక్షగళ ఘోష తరహాలో ఉద్యమం సాగాలి... రాజధాని సాధన కోసం లక్షగళ ఘోష తరహాలో ఉద్యమం నిర్వహించాలి. అందుకోసం ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ అండదండలు ఎల్లప్పుడు ఉంటాయి. - వల్లపురెడ్డి జనార్దన్‌రెడ్డి, కర్నూలు రాజధాని సమితి కమిటీ కన్వీనర్ జాతీయ స్థాయిలో ఒత్తిడి తేవాలి.. రాజధాని సాధన కోసం జాతీయ స్థాయిలో ఒత్తిడి తెచ్చే విధంగా ఆందోళనలు ఉద్ధృతం చేయాలి. విద్యార్థి సంఘాలు మొదలుకొని వృద్ధుల సంఘాల వరకు అందరూ కూడా ఆందోళనలో పాలు పంచుకోవడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెవాలి. - చెన్నయ్య, లెక్చెరర్ ప్రణాళికాబద్ధంగా ఉద్యమాలు... కర్నూలు రాజధాని సాధన కోసం ప్రణాళికాబద్ధంగా ఉద్యమాలు నిర్వహించాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గతంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల తరహాలోనే ఉద్యమించాల్సిన అవసరం ఉంది. - హేమలత, న్యాయవాదుల సంఘం జేఏసీ నాయకురాలు రాజధాని సాధనే లక్ష్యంగా ఉద్యమం.... రాజధాని సాధనే లక్ష్యంగా ఉద్యమం సాగాలి. అందుకోసం జిల్లా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. రాజధాని సాధన కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 11వ తేదిన తెలుగుతల్లి విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించే మహా ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలి. - సుధాకర్‌బాబు, ఎమ్మెల్సీ చారిత్రక అవసరం... పోగొట్టుకున్న రాజధానిని తిరిగి పొందడమనేది ఈ ప్రాంత ఆర్థిక, సాంఘిక, రాజకీయ అభ్యున్నతికి తోడ్పడుతుంది. అందుకే రాజధాని సాధన ఒక చారిత్రక అవసరం. జిల్లాలో ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో కర్నూలును రాజధాని ప్రకటించాలి. - ఓంకార్, లోక్‌సత్తా నాయకులు కర్నూలు బంద్‌కు వ్యాపారుల మద్దతు కర్నూలు రాజధాని సాధన కోసం ఈనెల 13వ తేదీన చేపట్టనున్న కర్నూలు నగర బంద్‌కు వ్యాపార సంస్థల సంపూర్ణ సహకారం ఉంటుంది. స్వచ్ఛందంగా దుకాణాలు మూసుకుని ఉద్యమంలో పాలు పంచుకుంటాం. - విజయ్‌కుమార్ రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ఎన్జీఓల సంపూర్ణ మద్దతు రాయలసీమ ప్రాంతాన్ని వదిలేసి గుంటూరు, విజ యవాడ ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని ప్రయత్నించడం సమంజసం కాదు. కర్నూలు రాజధాని సాధన కోసం ఎన్జీఓల సంపూర్ణ మద్దతు ఉంటుంది. - వెంగళ్‌రెడ్డి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక జేఏసి ఛైర్మన్ రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాలు... రాజధాని సాధన కోసం ఉద్యమం కర్నూలుకే పరిమితం కాకుండా సీమ వ్యాప్తం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాజధాని కోసం ఉద్యమంలో పాల్గొనాలి. - లీలమ్మ, టౌన్ స్కూల్స్ అసోసియేషన్ నాయకురాలు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి కర్నూలు రాజధానితో పాటు రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం పోరాటం తీవ్రతరం చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. - ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి రాజధానితో కూడిన స్వాతంత్య్ర వేడుకలు జరగాలి... కర్నూలులో జరిగే స్వాతంత్య్ర వేడుకలను రాజధానితో కూడిన వేడుకలుగా జరపాలి. కర్నూలు రాజధాని కోసం చేపట్టే ప్రతి ఆందోళన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. - బీవై.రామయ్య, డీసీసీ అధ్యక్షుడు ఉద్యమాన్ని ఉద్ధృతం చేద్దాం రాజధాని సాధన కోసం రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, యువకుల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేద్దాం. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని వర్గాల ప్రజలు ఆందోళనకు కలిసి రావాలి. - కేవీ సుబ్బారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ -
బలమైన ప్రతిపక్షంగా నిలుస్తాం
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: ప్రజల పక్షాన నిలిచి వారి మన్ననలు పొందే ప్రయత్నం చేస్తామని వైఎస్ఆర్సీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఎస్వీ మోహన్ రెడ్డి, అనిల్ యాదవ్, తిప్పేస్వామి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. కడప నగరంలోని జయరాజ్ గార్డెన్స్‌లో ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి వారు నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబులాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలను మోసపుచ్చలేక పోయారన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఓటమి చెందడానికి గల కారణాలను అన్వేషించి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదిక అందజేస్తామన్నారు. అలాగే గెలిచిన స్థానాల్లో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా.. అని తెలుసుకుంటున్నామన్నారు. ప్రతి జిల్లాలో ఈ సమీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 11,12 తేదీలలో అనంతపురంలో రాయలసీమ జిల్లాల పరిస్థితులపై వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో సమీక్ష జరుగుతుందన్నారు. టీడీపీ నాయకులు కోట్లాదిరూపాయలు ఎదజల్లి, ఎర్రచందనం స్మగ్లర్లను కలుపుకుని ప్రలోభాలకు గురిచేశారన్నారు. రాజంపేటలో తమ అభ్యర్థి ఓటమిపాలైనా నైతిక విజయం మాత్రం తమదేనని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రావడానికి, తమ ఓటమికి తేడా 1.90 శాతం ఓట్లేనన్నారు.అధికార పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ లోపలా, బయటా పోరాడుతుందన్నారు. కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపిటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల మనోభావాలు తెలుసుకొని పార్టీ పునర్నిర్మాణానికి కృషిచేస్తామన్నారు. వలసలను ప్రోత్సహించడానికి టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. విప్‌ను కాదని వేళ్లే వారిపై అనర్హత వేటు తప్పక పడుతుందని హెచ్చరించారు. నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి తన స్వార్థం కోసం, వ్యాపార ప్రయోజనాలను ఆశించి పార్టీ ఫిరాయించారన్నారు. ఆయనకు ప్రజలే బుద్ధిచెబుతారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి, ఐటీ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీ పనిచేసింది రైతు రుణమాఫీ హామీతోనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని వైఎస్సార్సీపీ నేతలు అభిప్రాయపడ్డారు. కడప నగర శివార్లలోని జయరాజ్ గార్డెన్స్‌లో ఆదివారం నియోజకవర్గాలవారీగా సమీక్ష నిర్వహించారు. రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి మండలాల వారీగా సుదీర్ఘ చర్చ, విశ్లేషణ చేశారు. టీడీపీ అభ్యర్థులు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేశారని, ఆ స్థాయిలో మనం ఖర్చు చేయలేక పోయామని పలువురు నాయకులు చెప్పినట్లు తెలిసింది. రాజంపేటలో టీడీపీ నాయకులు ఎర్రచందనం స్మగ్లర్లతో కలిసి కోట్లాదిరూపాయలు ఖర్చు చేశారన్నారు. ఎన్నికలకు ముందు ఇలాంటి సమీక్షలు నిర్వహించి ఉంటే కొంత ఉపయోగం ఉండేదన్నారు. సమీక్షలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అంజద్‌బాషా, కొరుముట్ల శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, జయరాములు, ఎమ్మెల్సీ దేవ గుడి నారాయణరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
అసెంబ్లీకి అంతంతే..
నల్లగొండ, న్యూస్‌లైన్ : చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించడంలో జిల్లా మహిళలకు సముచిత స్థానం లభించలేదనే చెప్పవచ్చు. 1952 నుంచి 2009 దాకా శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే బోధప డుతుంది. వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనైనా మహిళా ప్రాతినిధ్యం పెరుగు తుందని ఆశిద్దాం. అసెంబ్లీకి...ఆరుట్ల మొదలు రాష్ట్ర అవతరణకు ముందు తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి నడిపించిన ఆరుట్ల కమలాదేవి తొలిసారిగా 1952లో ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆమెతో మొదలైన మహిళల రాజకీయ ప్రస్థానం గత ఎన్నికల వరకు కొనసాగింది. ఇదే ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సుమిత్రాదేవి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి జరిగిన వరుస ఎన్నికల్లో పలువురు మహిళలు పోటీ చేసి ఓటమిపాలైనా చట్టసభల్లో అడుగుపెట్టేందుకు తమ వంతు ప్రయత్నమే చేశారు. ఇక రాష్ట్ర అవతరణ తర్వాత అంటే 1957, 1962లో కూడా ఆరుట్ల కమలాదేవి ఆలేరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ సాయుధ పోరాటంతో చరిత్రలో నిలిచిన కమలాదేవి మూడుసార్లు గెలుపొందడం పెద్ద హ్యాట్రిక్‌గా చెప్పొచ్చు. కమ్యూనిస్టు కంచుకోటగా పేరొందిన నకిరేకల్ సెగ్మెంట్ నుంచి 1972లో కాంగ్రెస్ తరపున తొలి మహిళ అభ్యర్థి మూసాపేట కమలమ్మ గెలుపొంది రికార్డు సృష్టించారు. తెలంగాణ సాయుధ పోరాటం, మద్యపాన వ్యతిరేక ఉద్యమం, ఇతర ప్రజా ఉద్యమాలతో చరిత్రకెక్కిన మల్లు స్వరాజ్యం తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 ఎన్నికల్లో టీడీపీ తరపున నల్లగొండ నుంచి పోటీ చేసిన గడ్డం రుద్రమదేవి కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా మోహన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె నల్లగొండ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1989 ఎన్నికల్లో మహిళలకు ప్రాతినిధ్యం లభించలేదు. కానీ 1994, 99 ఎన్నికల్లో తుంగతుర్తి, మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేసిన మల్లు స్వరాజ్యం, సుందరి అరుణలు ఓటమి పాలయ్యారు. నక్సలైట్ల చేతిలో మాజీ హోంమంత్రి దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి హత్యకు గురైన తర్వాత ఆయన సతీమణి ఉమా మాధవరెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. మాధవరెడ్డి మరణంతో 2000 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో భువనగిరి నుంచి ఉమామాధవరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లో ఆమె భువనగిరి నుంచి పోటీ చేసి రెండుసార్లు గెలుపొందారు. మొత్తంగా ఉమామాధవరెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. నక్సలైట్ల కాల్పుల్లో అకాల మరణం చెందిన మరోనేత, గిరిజన నాయకుడు మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ సతీమణి భారతీ రాగ్యానాయక్ రాజకీయాల్లోకి వచ్చారు. 2002లో దేవరకొండలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా శాసన మండలికి ప్రాతినిధ్యం వహించారు. దీంతో పాటు ప్రభుత్వ చీప్‌విప్‌గా కూడా పనిచేశారు. పార్లమెంట్ స్థానాలకు వేర్వేరుగా తల్లీకూతురు పోటీ చేసి ఓరికార్డు నెలకొల్పారు. 1996లో అప్పటి మిర్యాలగూడ ఎంపీ స్థానానికి మల్లు స్వరాజ్యం పోటీచేశారు. కానీ ఆమె బద్దం నర్సింహారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2009 ఎన్నికల నాటికి ఆమె కూతురు పాదూరి కరుణ పోటీ చేసే అవకాశం దొరికింది. ఆమె 2009 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ప్రజారాజ్యం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డి -
రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం, న్యూస్‌లైన్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు యు వత రక్తదానం చేయాలని రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక నవోదయ ఆస్పత్రిలో వైద్య విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పదన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి నాలుగు నెలలకోసారి రక్తదానం చేయవచ్చన్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రితోపాటు ఇతర ఆస్పత్రులకు ప్రతిరోజూ ఎంతో మంది వివిధ శస్త్ర చికిత్సల కోసం, ప్రమాదాల్లో గాయపడిన వారు వస్తుంటారన్నారు. అలాంటి వారికి రక్తం చాలా అవసరం ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ కార్యదర్శి ఎం.బాలయ్య, వైస్ చైర్మన్ నటరాజ్, సభ్యులు యాదయ్యగుప్తా, చంద్రమౌళి, నవోదయ ఆస్పత్రి డెరైక్టర్ రవీందర్‌రెడ్డి, వైద్యులు కిరణ్మయి, సిబ్బంది ఎల్లస్వామి, రవి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నులపండువగా కల్యాణోత్సవం
కరీంనగర్ కల్చరల్, న్యూస్‌లైన్: కరీంనగర్‌లోని బొమ్మకల్ రోడ్డులోగల శ్రీయజ్ఞ వరాహస్వామి క్షేత్రంలో 27వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. విద్యుద్దీపకాంతులతో యజ్ఞవరాహ క్షేత్రం స్వర్ణ కాంతులీనుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం మెహినీ ఉత్సవం నిర్వహించారు. సర్వవైదిక సంస్థానం కులపతి శ్రీభాష్యం విజయసారథి నేతత్వంలో శ్రీ వసుధాలక్ష్మి యజ్ఞవరాహస్వామి, శ్రీరమాసత్యనారాయణస్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. అమ్మవారిమాతా పితృస్థాన ప్రతినిధులుగా పచ్చిమట్ల సరళరవీందర్ దంపతులు, స్వామి వారి తరఫున బుర్ర సుగుణ మల్లయ్య దంపతులు ఆసీనులుకాగా.. మంగళవాయిద్యాలు, పండితుల వేదమంత్రాలతో కల్యాణోత్సవం జరిగింది. అనంతరం రాత్రి మాడవీధుల్లో భజాభజంత్రీలు, కోలాటాలు, మంగళవాయిద్యాల మధ్య గరుడ వాహనంపై సతీసమేతుడై యజ్ఞవరాహస్వామి ఊరేగారు. రతన్‌కుమార్ బృందం ఆలయ సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ పూజా కార్యక్రమంలో సంస్థానం ఉప కులపతి శ్రీభాష్యం వరప్రసాద్, ఆలయ బాధ్యులు వుచ్చిడి మెహన్ రెడ్డి, ముత్యంగౌడ్, తోట మెహన్, కేఎస్.అనంతాచార్య, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, తిరుపతిస్వామి, నర్సింహారెడ్డి, జనార్దన్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. -
న్యాయవాదులే దాడులు చేయడం సమంజసమేనా?
హైకోర్టులో దాడులను ఖండించిన సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ సాక్షి, హైదరాబాద్: శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమపై తెలంగాణ న్యాయవాదులు భౌతిక దాడులకు దిగారని, మహిళా న్యాయవాదులని కూడా చూడకుండా దుర్భాషలాడారని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు. పోలీసులు కూడా తెలంగాణ న్యాయవాదులతో కుమ్మక్కై తమపై దాడికి సహకరించారని ఆరోపించారు. సీమాంధ్ర న్యాయవాదులు నలుగురికి రక్త గాయాలయ్యాయని, ఒకరికి ముఖం పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. ‘‘రాజ్యాంగాన్ని రక్షించాల్సిన న్యాయవాదులే భౌతిక దాడులకు దిగారు. ప్రజాస్వామ్యంలోని కనీస హక్కులకు కూడా భంగం కలిగించేలా వ్యవహరించారు. ఇది ఎంతవరకు సమంజసమో వారే ఒక్కసారి ఆలోచించుకోవాలి’’ అని ఆయన తెలంగాణ న్యాయవాదులకు హితవు పలికారు. హైకోర్టు వద్ద శుక్రవారం సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదుల పోటాపోటీ నిరసనలు ఘర్షణకు దారితీశాయి. ప్రివెంటివ్ కస్టడీ కింద దాదాపు 60 మంది సీమాంధ్ర న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఉత్తర్వుల ద్వారా విడుదలైన సీమాంధ్ర న్యాయవాదులు శుక్రవారం సాయంత్రం గన్‌ఫౌండ్రీలోని ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మానవహారం నిర్వహించేందుకు పోలీసుల అనుమతి తీసుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మోహన్‌రెడ్డి చెప్పారు. పోలీసులు కూడా దాడికి సహకరించారని అన్నారు. శనివారం నాటి ఏపీఎన్జీవోల సభలో సీమాంధ్ర న్యాయవాదులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.