
కరీంనగర్ క్రైం: మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. కరీంనగర్‌కు చెందిన తనిగెల అనిల్‌కుమార్ కుటుంబ అవసరాల దృష్ట్యా 2008లో మోహన్‌రెడ్డి వద్ద రూ.17 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అనిల్ తన భార్య మణెమ్మ పేరుమీద ఉన్న ఇంటిని మోహన్‌రెడ్డి సూచన మేరకు కాసర్ల మహేందర్‌రెడ్డి పేరు మీద జీపీఏ కం సేల్‌డీడ్ రాసిచ్చాడు. ప్రతినెలా వాయిదాలు కడుతున్న సమయంలో అనిల్‌కు తెలియకుండా మోహన్‌రెడ్డి, కొండబత్తిని సాంబ మూర్తితోపాటు మరొకరి పేరు మీద సేల్‌డీడ్ చేశాడు.
దీనిపై మోహన్‌రెడ్డిని అనిల్ నిలదీయగా అప్పు చెల్లిస్తేనే ఇంటిని ఇస్తానని చెప్పడంతో వడ్డీతో కలిపి రూ.30 లక్షలు చెల్లించాడు. అయినా మోహన్‌రెడ్డి ఇంటిని అనిల్ భార్య పేరు మీద చేయలేదు. 2012లో మోహన్‌రెడ్డి, రేండ్ల నర్సింగం, పులుగం మల్లేశం, పూర్మ శ్రీధర్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి మణమ్మను తుపాకీతో బెదిరించి ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో అనిల్ కుటుంబం హైదరాబాద్ వలస వెళ్లింది. తర్వాత ఇల్లు పోయిందని మణెమ్మ గుండెపోటుతో మృతిచెందింది.