కరీంనగర్‌లోని బొమ్మకల్ రోడ్డులోగల శ్రీయజ్ఞ వరాహస్వామి క్షేత్రంలో 27వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
కరీంనగర్ కల్చరల్, న్యూస్‌లైన్: కరీంనగర్‌లోని బొమ్మకల్ రోడ్డులోగల శ్రీయజ్ఞ వరాహస్వామి క్షేత్రంలో 27వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. విద్యుద్దీపకాంతులతో యజ్ఞవరాహ క్షేత్రం స్వర్ణ కాంతులీనుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం మెహినీ ఉత్సవం నిర్వహించారు.
సర్వవైదిక సంస్థానం కులపతి శ్రీభాష్యం విజయసారథి నేతత్వంలో శ్రీ వసుధాలక్ష్మి యజ్ఞవరాహస్వామి, శ్రీరమాసత్యనారాయణస్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. అమ్మవారిమాతా పితృస్థాన ప్రతినిధులుగా పచ్చిమట్ల సరళరవీందర్ దంపతులు, స్వామి వారి తరఫున బుర్ర సుగుణ మల్లయ్య దంపతులు ఆసీనులుకాగా.. మంగళవాయిద్యాలు, పండితుల వేదమంత్రాలతో కల్యాణోత్సవం జరిగింది. అనంతరం రాత్రి మాడవీధుల్లో భజాభజంత్రీలు, కోలాటాలు, మంగళవాయిద్యాల మధ్య గరుడ వాహనంపై సతీసమేతుడై యజ్ఞవరాహస్వామి ఊరేగారు. రతన్‌కుమార్ బృందం ఆలయ సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు.
ఈ పూజా కార్యక్రమంలో సంస్థానం ఉప కులపతి శ్రీభాష్యం వరప్రసాద్, ఆలయ బాధ్యులు వుచ్చిడి మెహన్ రెడ్డి, ముత్యంగౌడ్, తోట మెహన్, కేఎస్.అనంతాచార్య, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, తిరుపతిస్వామి, నర్సింహారెడ్డి, జనార్దన్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.