Vara Prasad
-
వాంగ్మూలంలో నేనా విషయాలు చెప్పలేదు
పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన వాంగ్మూలమంటూ కొన్ని పత్రికల్లో ప్రచురితమైన విషయాలు పూర్తిగా అవాస్తవమని పులివెందుల మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్ చెప్పారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ అధికారులు తనను అడగని విషయాలు, తాను చెప్పని విషయాలను వాంగ్మూలంగా కొన్ని పత్రికలు ప్రచురించడాన్ని ఖండిస్తున్నానన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డిల మధ్య విభేదాలు ఉన్నాయని. అవినాష్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని వివేకానందరెడ్డి వ్యతిరేకించారని తాను వాంగ్మూలం ఇచ్చినట్లుగా వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని తెలి పారు. ‘సీబీఐ అధికారులు పిలిస్తే గత ఏడాది ఆగస్టు 9న వెళ్లాను. వివేకానందరెడ్డి మరణించిన రోజున ఏం జరిగిందని అడిగారు. వివేకా చనిపోయారని తెలిసి ఆ రోజు ఉదయం 7.45 గంటల సమయంలో అక్కడకు వెళ్లానని, వివేకా మృతదేహం బెడ్రూంలో ఉందని చెప్పాను. అప్పటికే ప్రజలు ఎక్కువగా వస్తుండటంతో వారిని నియంత్రిస్తూ అక్కడే ఉన్నానని తెలిపాను. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లిన తర్వాత ఇంటికి వచ్చేసినట్లు చెప్పాను. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తే వైఎస్సార్సీపీ గెలుస్తుందని అడిగారు. వైఎస్సార్సీపీకి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉందని, ఎవరు అభ్యర్థి అయినా పార్టీ గెలుస్తుందని చెప్పాను. అప్పటికే అవినాష్‌రెడ్డి విజయం కోసం వివేకా ప్రచారం చేస్తున్నారని కూడా చెప్పాను. కడప ఎంపీ టికెట్ అంశంపై సీబీఐ అధికారులు అడిగింది అదొక్కటే. నేను చెప్పింది ఇంతే. కానీ నన్ను అడగని విషయాలు, నేను చెప్పని విషయాలను సీబీఐ నా వాంగ్మూలంగా రాసుకోవడం దిగ్భ్రాం తికి గురి చేసింది. వివేకా జీవించి ఉంటే 2019లో కడప ఎంపీ టికెట్ ఆయనకే ఇచ్చేవారని నేను చెప్పినట్లుగా వాంగ్మూలంలో రాశారు. ఎంపీ టికెట్ వైఎస్ షర్మిలకు ఇవ్వాలని వివేకా భావించారని కూడా నేను చెప్పినట్లు పేర్కొన్నారు. వివేకా, అవి నాష్‌రెడ్డి మధ్య విభేదాలు ఉన్నట్లు చెప్పానని రాసుకున్నారు. ఇవన్నీ పూర్తిగా అవాస్తవం. ఆ విషయాలేవి నన్ను అడగలేదు, నేను చెప్పలేదు’ అని వరప్రసాద్ స్పష్టం చేశారు. ‘కొందరు సీబీఐ అధి కారులు దురుద్దేశంతోనే నా పేరిట తప్పుడు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. దానినే మీడియాకు లీక్ చేస్తున్నారు. ఈ కేసును, ప్రజలను తప్పుదోవ ప ట్టించేందుకే ఆ అధికారులు ఇలా నిబంధనలకు వి రుద్ధంగా, అనైతికంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయడమే ఏకైక అజెండాగా ఉన్న కొన్ని పత్రికలు, టీవీ, యూట్యూబ్ చానళ్లు ఇదే అవకాశంగా తప్పుడు వార్తలు ప్రచురిస్తూ కేసును ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయి. సీబీఐ అధికారులు, ఆ మీడియా సంస్థలపై న్యాయపరంగా పోరాడుతాను. కుట్రలను తిప్పికొడతాము’అని వరప్రసాద్ పేర్కొన్నారు. -
మహానేతకు నివాళి - ఎమ్మెల్యే రాచమల్లు వరప్రసాద్
-
డ్రగ్స్ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ ఆస్తులపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు: డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గుంటూరు రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ మోతికి వెంకట శివ సత్యనారాయణ వరప్రసాద్ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం సోదాలు నిర్వహించింది. ఈ వివరాలను ఏసీబీ ప్రధాన కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. 1989 జనవరి 11న వరప్రసాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరారు. 2011న అసిస్టెంట్ డైరెక్టర్‌గా, 2018న డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదు రావడంతో ఏసీబీ బుధవారం ఏకకాలంలో గుంటూరు, విజయవాడ సహా నాలుగు చోట్ల దాడులు నిర్వహించింది. రిజి్రస్టేషన్ విలువ ప్రకారం రూ.3,43,80,000 విలువైన నాలుగు గృహ సముదాయాలను ఏసీబీ గుర్తించింది. రూ.6 లక్షల విలువైన అపార్టుమెంట్ ఫ్లాట్, రూ.15,64,000 విలువైన మూడు ఇళ్ల స్థలాలు, రూ.1,35,850 విలువైన 2.47 ఎకరాల భూమి, రూ.1,18,580 నగదు, రూ.18 లక్షల విలువైన 1,118 గ్రాముల బంగారం, రూ.15.32 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.50.60 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లున్నట్లు సోదాల్లో తేలింది. మొత్తంగా రూ.3.7 కోట్ల అక్రమాస్తులను గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రసాద్‌ను విజయవాడ ఏసీబీ స్పెషల్ జడ్జి కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ తెలిపింది. -
సంక్రాంతికి అదనంగా 4940 బస్సులు: టీఎస్ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతికి సన్నాహాలు ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి కావడంతో ఇప్పటికే తమ సొంత ఊర్లకు చేరుకునేందుకు ప్రజలు టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంజీబీఎస్‌లోని రంగారెడ్డి ఆర్ఐ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా 4940 అదనపు బస్సులను సిద్ధం చేసినట్లు రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. వీటిలో తెలంగాణకు 3414 బస్సులను ఆంధ్ర ప్రాంతానికి 1526 బస్సులను అదనంగా కేటాయించామన్నారు.. జనవరి 9వ తేది నుంచి 13 వరకు ఈ అదనపు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అలాగే ఊర్ల నుంచి తిరిగి వచ్చే వారి కోసం జనవరి 17న అదనపు బస్సలు నడుపుతున్నామన్నారు. సంక్రాంతి సందర్భంగా గతేడాది రూ. 5 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది రూ. 6 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
‘హామీల అమలు దిశగా అడుగులు’
సాక్షి, అమరావతి: పల్నాడు ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రకటించడం అభినందనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో నడవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై వైఎస్సార్సీపీ నేతలతో సహా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ఉద్దానం ప్రాంతంకు బడ్జెట్లో సరైన ప్రాధాన్యత ఇచ్చారని పలాస ఎమ్మెల్యే డాక్టర్ అప్పల రాజు సంతోషం వ్యక్తం చేశారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చర్యలు అభినందనీయమన్నారు. తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతానికి పునర్ నిర్మాణం దిశగా ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. జీడి, మామిడి, అరటి, కొబ్బరి పంటలకు మంచి కేటాయింపులు చేశారన్నారు. పేద ప్రజలను, వెనుకబడిన ప్రాంతాలను ఆదుకునే విధంగా బడ్జెట్‌ను రూపొందించడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. దేశంలోనే తొలిసారి.. పారదర్శక పాలనకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ వ్యాఖ్యానించారు. జ్యుడీషియల్ కమిషన్ ద్వారా అవినీతిని నియంత్రించాలని కృతనిశ్చయంతో ఉందన్నారు. అమ్మ ఒడి పథకం అనేది దేశంలోనే తల్లులకు మొట్టమొదటి సారిగా అందిస్తున్న ప్రోత్సాహమని ఆయన స్పష్టం చేశారు. రైతులకు పూర్తి బరోసా కల్పించే చర్యలు, ఆరోగ్యశ్రీ పౌరసరఫరా సేవలను నేరుగా ప్రజల ఇంటికే అందించే చర్యలు అభినందనీయంమన్నారు. మహిళా సంక్షేమం కోసం సున్నావడ్డీ అమలు, ఎస్సీ, ఎస్డీ,బీసీ, మైనార్టీలకు బడ్జెట్లో కేటాయింపులు అద్భుతంగా ఉన్నామని అభినందించారు. -
ఓటర్లకు నేను విశ్వాసంగా ఉన్నా: వరప్రసాద్
సాక్షి, గూడూరు (నెల్లూరు) : తిరుపతి ఎంపీగా గెలిపించిన ఓటర్లకు తాను విశ్వాసంగా ఉన్నానని, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగలేదని మాజీ ఎంపీ, గూడూరు అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి వరప్రసాద్ తెలిపారు. వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తనను ఎంపీగా గెలిపించిన గూడూరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తనతో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను కూడా ఇక్కడి ప్రజలు గెలిపించారని, కానీ ఆ ఎమ్మెల్యే అమ్ముడుపోయి గెలిపించిన ఓటర్లకు తీవ్రని అన్యాయం చేశారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిందే కాకుండా సొంత ఇంటికి వెళ్లినట్లు ఉందని సిగ్గులేకుండా చెప్పారన్నారు. ఆయన గెలుపు కోసం అహర్నిషులు కృషి చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే 250 కేసులు పెట్టించారని వరప్రసాద్ ధ్వజమెత్తారు. ప్రతి ఊరు తిరుగుతానని, ప్రతి ఇంటికి వస్తానని ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుంటానన్నారు. తనను గూడూరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఐఏఎస్ అధికారిగా ఉన్న అనుభవంతో నిధులు తీసుకొచ్చి గూడూరు అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. చంద్రబాబూ నీవు ముఖ్యమంత్రివా? ప్రత్యేకహోదాను ఏనాడు చంద్రబాబు కోరలేదని, ఆయన మేనిఫెస్టో అంతా అబద్ధాలమయమని మండిపడ్డారు. 600 హామీలిచ్చి ప్రతీ ఒక్కరినీ చంద్రబాబు మోసం చేశారన్నారు. ఐదేళ్ల నుంచి యువకుల ఉద్యోగాల గురించి చంద్రబాబుకు గుర్తుకు రాలేదన్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని మహిళలను బాబు మోసం చేశారని, రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు దగా చేశారని, రుణమాఫీ కాదు కదా.. రుణాలపై వడ్డీలను కూడా మాఫీ చేయలేదన్నారు. చంద్రబాబును నమ్మిన యువకులను నట్టేటా ముంచారని, మత్సకారులు, దళితులు సహా అందర్నీ చంద్రబాబు మోసం చేశారన్నారు. విభజన హామీలు తీసుకురాలేని చంద్రబాబు ఒక అసమర్థత ముఖ్యమంత్రని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు తాయిలాలు ప్రకటిస్తారని, నాలుగున్నరేళ్ల పాలనలో చంద్రబాబు ఏమీ చేయలేదని విమర్శించారు. -
రాజధానిలో అన్నీ తాత్కాలికమే: ఆనం
కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, సోనియా ఇటలీ దెయ్యం అని గత ఎన్నికల సమయంలో చెప్పి ఇప్పుడదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాకినాడలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆనం మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు కూడా మాయమాటలు చెబుతూ మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. చంద్రబాబుతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజధానిలో శాశ్వత భవనాలు ఉండవు..అన్నీ తాత్కాలికమేనని, తాత్కాలిక రాజధానితో రాజధాని లేకుండా బాబు తీర్చిదిద్దారని తీవ్రంగా మండిపడ్డారు. కనీసం పోస్టల్ పిన్‌కోడ్ కూడా తెచ్చుకోలేని పరిస్థితికి బాబు తెచ్చారని విమర్శించారు. బీజేపీతో ఉన్నన్ని రోజులూ నవ నిర్మాణ దీక్షలు..ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి మరో పోరాటం అంటూ మోసానికి తెరలేపారని అన్నారు. బాబు విద్యార్ధి దశ నుంచే వంచన చేస్తూ వచ్చారని, రాజకీయాల్లో ఆనాడు కాంగ్రెస్‌ను వంచించారని వ్యాక్యానించారు. అధికారం ఇచ్చిన ముఖ్యమంత్రులను, చేరదీసి కుటుంబంలో సభ్యుడిగా చేసుకున్న ఎన్టీఆర్‌ను కూడా వంచించారని ఆరోపించారు. ఏపీని విభజించండి అభ్యంతరం లేదని కాంగ్రెస్‌కు లేఖ ఇచ్చి, మళ్లీ ప్రజల వద్దకు వచ్చి రెండు కళ్ల సిద్ధామంతమంటూ డ్రామాలాడారని తీవ్రంగా దుయ్యబట్టారు. వైఎస్ జగనే లక్ష్యంగా బాబు పాలన: మోపిదేవి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డే లక్ష్యంగా చంద్రబాబు పాలన చేశారు తప్పితే పేద ప్రజల పరిస్థితి మెరుగుపడేందుకు ఏనాడూ చేయలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అధోగతిపాలు చేశారని, ఏపీ పరువు ప్రతిష్టలను చంద్రబాబు దిగజార్చారని మండిపడ్డారు. రైతులు, యువత, మహిళలను ఏ మాత్రం కూడా చంద్రబాబు పట్టించుకోలేదని, బీజేపీతో కలిసున్నన్ని రోజులూ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావనే తేలేదని అన్నారు. హోదాను అవహేళన చేసింది బాబే: వర ప్రసాద్ ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదాపై పోరాడదామని పిలుపునిచ్చినపుడు హోదాను చంద్రబాబు అవహేళన చేశారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వర ప్రసాద్ గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా అంటున్నారని మండిపడ్డారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టాం..రాజీనామాలు చేసి ఢిల్లీలో వారం రోజుల పాటు ఆమరణ దీక్షలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తుంది వైఎస్సార్సీపీయేనని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలో అంశాలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. ఏపీ విభజనకు బాబే కారణం: రౌతు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని వైఎస్సార్సీపీ నేత రౌతు సూర్యప్రకాశ రావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితుల డబ్బు కాజేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనేత వైఎస్సాఆర్ ఒక్కరేనని కొనియాడారు. -
జడ్జీల సంఘం అధ్యక్షుడిపై ఏసీబీ కేసు
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో మరో న్యాయాధికారిపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీకి హైకోర్టు అనుమతినిచ్చింది. హైకోర్టు అనుమతితో రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు వైద్య వరప్రసాద్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయన ఇళ్లపై బుధవారం దాడులు నిర్వహించారు. ఆయన సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజాము నుంచి ఏసీబీ ప్రత్యేక బృందాలు సరూర్‌నగర్ గడ్డిఅన్నారం, కొండాపూర్ ఇజ్జత్‌నగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాయి. అలాగే హైదరాబాద్ నగరంలో మరో నాలుగు చోట్ల, సిరిసిల్లలోని మూడు ప్రాంతాలు, మహారాష్ట్రలో రెండు చోట్ల తనిఖీలు నిర్వహించాయి. వరప్రసాద్ భారీ ఖర్చుతో తన కుటుంబ సభ్యులతోసహా పలుసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు ఏసీబీ గుర్తించింది. ఆయన చేసిన భారీ ఖర్చులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సేకరించింది. రూ.1.50 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. వీటి మార్కెట్ విలువ రూ.3 కోట్లపైనే ఉంటుందని ఏసీబీ తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అనుమతిలేకుండా ప్రెస్‌మీట్! ఇటీవల తెలంగాణ న్యాయాధికారుల విభజన వ్యవహారంపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినందుకే ఈ దాడి జరిగిందన్న ప్రచారాన్ని హైకోర్టు వర్గాలు తోసిపుచ్చాయి. గత మూడు నెలలనుంచి వరప్రసాద్ ఆస్తులపై ఏసీబీ విచారణ చేస్తోందని, ఏసీబీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగానే వరప్రసాద్‌పై కేసు నమోదుకు ప్రధాన న్యాయమూర్తి అనుమతినిచ్చారని ఆయా వర్గాలు తెలిపాయి. ఏసీబీ విచారణ గురించి తెలుసుకున్నాకే సానుభూతి కోసం ఆయన విలేకరుల సమావేశంలో న్యాయాధికారుల విభజన అంశంపై మాట్లాడారని, విలేకరులతో మాట్లాడేందుకు ఆయన హైకోర్టు అనుమతి కూడా తీసుకోలేదని ఆ వర్గాలు చెప్పాయి. మూడు నెలలుగా ఆధారాల సేకరణ వరప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు మూడు–నాలుగు నెలల క్రితం హైకోర్టుకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన హైకోర్టు ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించాలని ఏసీబీని ఆదేశించింది. ఆదాయానికి మించి ఆయన ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా తేల్చింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను హైకోర్టు ముందు ఉంచింది. సాక్ష్యాధారాలపై సంతృప్తి వ్యక్తంచేసిన హైకోర్టు వరప్రసాద్‌పై కేసు నమోదుకు అనుమతినిచ్చింది. ఏసీబీ కేసు నమోదుచేసిన నేపథ్యంలో వరప్రసాద్‌ను త్వరలో హైకోర్టు సస్పెండ్ చేయనుంది. ఏసీబీ గుర్తించిన ఆస్తులివే..: కొండాపూర్‌లో రూ.53 లక్షలు విలువ చేసే ఫ్లాట్, దిల్‌సుఖ్‌నగర్‌లోని వికాస్‌నగర్‌లో రూ.12.63 లక్షల ఫ్లాట్, అక్కడే రూ.5.68 లక్షల విలువ చేసే ఫ్లాట్, పలు బ్యాంకుల్లో రూ.38.16 లక్షల డబ్బు, రూ.14 లక్షల విలువచేసే హోండా సిటీ కారు, రూ.5.13 లక్షల విలువ చేసే ఐ10 కారు, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఇంటిలో వస్తువులు రూ.2.61 లక్షలు, కొండాపూర్ ఇంటిలో రూ.9.80 లక్షల విలువైన వస్తువులు. తొమ్మిది నెలల్లో నాలుగో కేసు.. గత 9 నెలల్లో న్యాయాధికారులపై ఏసీబీ నమోదు చేసిన నాల్గవ కేసు ఇది. ఈ మార్చి, ఏప్రిల్‌ల్లో న్యాయాధికారులు మధు, మల్లంపాటి గాంధీ, ఎస్.రాధాకృష్ణమూర్తిలపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. లంచం అడిగిన కేసులో మధు, రాధాకృష్ణమూర్తిలపై ఏసీబీ కేసు నమోదుచేయగా, గాంధీపై ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో కేసు నమోదైంది. వీరందరినీ కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. -
కేంద్రంపై టీడీపీ ఒత్తిడి తీసుకురాలేదు..
-
రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉంది
ఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉందని తిరుపతి వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎంపీగా రాజీనామా చేసినా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం వివిధ శాఖల మంత్రులను కలుస్తున్నానని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము రాజీనామా చేశామని, ఆ విషయం ప్రజలకు తెలుసునని అన్నారు. బీజేపీ, టీడీపీలు ప్రత్యేక హోదా హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నాయని ఆరోపించారు. కేంద్రంపై టీడీపీ ఒత్తిడి తీసుకురాలేదు..అందుకే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని విమర్శించారు. లోక్‌సభలో తామే ముందు అవిశ్వాస తీర్మానం పెట్టామని..కానీ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్లే రాజీనామా చేశామని తెలిపారు. కేంద్రమంత్రులను, అధికారులనూ తాను కలుస్తున్నానని చెప్పారు. ఓఎన్జీసీ అధికారులను కలిసి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరాను..ఆరోగ్య మంత్రిని కలిసి రూయా ఆసుపత్రికి రూ.50 కోట్లు, స్విమ్స్‌కి రూ.50 కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. మా సమయం వృథా కానివ్వకుండా ప్రత్యేక హోదా కోసం ప్రజలతో కలిసి పోరాడుతున్నామని చెప్పారు. ఇప్పుడు ఎంపీలం కాకపోయినా నిథుల కోసం మంత్రులు, అధికారులను కలుస్తున్నామని వివరించారు. వైఎస్ జగన్ వల్లే ప్రత్యేక హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కడప స్టీల్ ఫ్లాంట్, దుగరాజపట్నం పోర్టు, ఎయిర్‌పోర్టు కావాలంటే..ఒక డైనమిక్ లీడర్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. -
హోదా తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు
-
చంద్రబాబు ముఖ్యమంత్రా?
సాక్షి, అనంతపురం: ‘మనం ఇప్పుడు కూడా నడుం కట్టకపోతే చంద్రబాబు దుష్టపాలన అంతం కాదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పింఛన్లు, మరో 10 లక్షలు రేషన్ కార్డులు, 2 లక్షల కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించార’ని తిరుపతి వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా సోమవారం అనంతపురం లోని ఆర్ట్స్ కాలేజీలో వంచనపై గర్జన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 60 ప్రభుత్వ సంస్థలను మూసేసిన ఈయన ముఖ్యమంత్రా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబును ‘పీకే ముఖ్యమంత్రి అనొచ్చు’ అంటూ ధ్వజమెత్తారు. ఏ రాష్ట్రంలోనైనా ఈ జన్మభూమి కమిటీలు ఉన్నాయా అని సూటిగా అడిగారు. చంద్రబాబు ఒక పిరికిపంద అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ ఒక్కసారన్నా సొంతంగా ముఖ్యమంత్రి అయ్యారా అని సూటిగా అడిగారు. సింహం సింగల్‌గా వస్తుంది.. పిరికివాడు భయపడుతూ వెళ్తాడని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముగ్గురు వైఎస్సార్ సీపీ ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు. విభజన చట్టాన్ని చంద్రబాబుకు సత్తా ఉంటే అమలు చేయించాలి లేదంటే మిన్నకుండాలని సూచించారు. ముఖ్యమంత్రికి, టీడీపీ అధ్యక్షుడికి తేడా లేకుండా పోయిందని విమర్శించారు. స్వలాభాలు, ప్యాకేజీ కోసం హోదాను తాకట్టు పెట్టారని.. ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హత లేదని ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రతి రంగాన్ని, అందర్నీ మోసం చేశారని ఆరోపించారు. 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని కోరి.. ఆ తర్వాత ప్యాకేజీ సరిపోతుందని చెప్పి.. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యంలో ఉన్నామని మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. దళితుల పట్ల చంద్రబాబు గౌరవం లేదని, దళితులను అవమానించారని తెలిపారు. ఐదేళ్లలో ప్రతి కుటుంబానికి మేలు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలైన ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పేరుతో పేదవాడి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయారని, వైఎస్సార్ పాలన సువర్ణయుగమని ప్రశంసించారు. -
ఉప ఎన్నికలు వస్తే మాదే విజయం
-
ఉప ఎన్నికలు వస్తే మాదే విజయం: వైఎస్సార్ సీపీ
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో కలసి టీడీపీ సాధించిందేమీ లేదని అన్నారు. ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ప్రధానమంత్రి మోదీపై సీఎం చంద్రబాబు నిందలు వేస్తున్నారని చెప్పారు. సోమవారం అనంతపురంలో వైఎస్సార్ సీపీ వంచన గర్జన దీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలతో పాటు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. మేకపాటి ఫైర్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కూడా చంద్రబాబు అదే పనిగా విమర్శలు చేస్తున్నారని మేకపాటి అన్నారు. తనకు తాను లౌకికవాదినని చెప్పుకుంటున్న చంద్రబాబు, బీజేపీతో వైఎస్ జగన్ స్నేహం చేస్తున్నారని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మోదీ గ్రాఫ్ తగ్గుతోందని భావించినందునే చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరకుంటారా అన్న చంద్రబాబు, దళిత తేజం పేరుతో ఏదో ఉద్దరిస్తామని చెప్పడం శోచనీయమన్నారు. కేవలం ఎన్టీఆర్ అల్లుడు అనే ట్యాగ్ కారణంగానే చంద్రబాబు సీఎం అయ్యారని చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు బాబు ఇచ్చిన 600లకు పైచిలుకు హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఈ విషయంపైనే చంద్రబాబు ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటారని అన్నారు. ముందస్తు ఎన్నికల వస్తాయో, లేదో తనకు తెలియదని చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసమే పార్టీ నేతలు ఎంపీ పదవులకు రాజీనామాలు చేసినట్లు వెల్లడించారు. కేంద్రంపై వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టగానే చంద్రబాబు భయపడ్డారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 25 ఎంపీ స్థానాలు గెలుపొంది వైఎస్సార్ సీపీ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఎన్నికలకు వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందని, ఉప ఎన్నికలు వచ్చినా కచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను సాధిస్తాం : మిథున్ రెడ్డి ఏపీ ప్రయోజనాలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ సీపీ నేత మిథున్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాను వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్ సీపీ సాధిస్తుందని చెప్పారు. కరవుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు. రైతులను కూడా దాగా చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌కు అవకాశమిస్తే ఏపీ రూపురేఖలు మారుస్తారని చెప్పారు. చంద్రబాబు భారీ అవినీతి : వరప్రసాద్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత వరప్రసాద్ ఆరోపించారు. చంద్రబాబు ఓ జిత్తుల మారి నక్క అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. డబ్బు కోసమే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని అన్నారు. నాలుగేళ్లలో బాబు చేసిన అక్రమాలను కాగ్ తన రిపోర్టులో ఎత్తి చూపిందని చెప్పారు. కనీస ఇంగితజ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు దళితుల్ని తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. దేశవిదేశాలకు వెళ్లి చంద్రబాబు ఏపీకి ఏం తెచ్చారని ప్రశ్నించారు. విభజన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. పేదవాళ్లను అవమానించే వ్యక్తికి సీఎంగా కొనసాగే అర్హత లేదని అన్నారు. కడప ఉక్కుపై బాబు కన్ను కడప స్టీల్ ఫ్యాక్టరీపై చంద్రబాబు కన్నుపడిందని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి అన్నారు. పోలవరం కాంట్రాక్టు పనులను తీసుకున్నట్లే కడప ఉక్కు పరిశ్రమను తన బినామీలకు ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. టీడీపీ-బీజేపీ వంచనపై రేపు దీక్ష చేపట్టనున్నామని తెలిపారు. -
ఎవరెస్టు ప్రసాద్
ఒళ్లు కొరికే చలి..చుట్టూ మంచు గడ్డలు.. 8,848 మీటర్ల ఎత్తు..ఇదెక్కడో ఊహించే ఉంటారు. ఎవరెస్టు శిఖరం. అత్యంత ఎత్తయిన పర్వతం..అధిరోహించాలంటే ఎంతటి ధైర్యం కావాలి. ఎంత సాహసం చేయాలి.. మూడు నెలలు కఠోరంగా కష్టపడి ఓ యువకుడు అనుకున్నది సాధించా డు. తాను కలలు గన్న ఎవరెస్టు ఎక్కి భారత పతాక ఎగురేశాడు. జిల్లాకు చెంది న వరప్రసాద్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఎలాగో తెలుసుకుందాం.. చిత్తూరు రూరల్: చిత్తూరు రూరల్ మండలం పాలంతోపు గ్రామానికి చెందిన వరప్రసాద్‌కు తొలినాళ్ల నుంచి పర్వతారోహణపై విపరీతమైన ఆసక్తి..ఆ మక్కువే అతడ్ని ఎవరెస్టు శిఖరాలకు చేర్చింది. నాగరాజు, జమున దంపతులకుమారుడు వరప్రసాద్ ఎంసీఏ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి కొండలెక్కడమంటే ఇష్టం.. గతేడాది సెట్విన్ (యువజన సర్వీసుల శాఖ) ఇచ్చిన ప్రకటన అతడ్ని ఆకట్టుకుంది. ఎవరెస్టు అధిరోహణకు ఆ శాఖ అక్టోబర్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. అధికారులు నవంబర్ 18న తిరుపతిలోని ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ నిర్వహించింది. వరప్రసాద్ ఈ శిక్షణలో పాల్గొన్నాడు. రన్నింగ్, లాంగ్‌జంప్ వంటి విభాగాల్లో ప్రతిభ కనబరిచాడు. రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు. శిక్షణ ఇలా...గత ఏడాది డిసెంబర్లో విజయవాడ సీబీఆర్ అకాడమి వద్ద జరిగిన రాష్ట్రస్థాయి ఎంపికల్లో వరప్రసాద్ పాల్గొన్నాడు. ఐదు రోజుల పాటు జంగిల్ ట్రాకింగ్, రాక్ క్లైంబింగ్, వాల్ క్లైంబింగ్ వంటి విభాగాల్లో కఠోర శిక్షణ పొందాడు. మరో 40 మంది కూడా ఈ శిక్షణలో ఫిజికల్ ఫిట్నెస్ పొందారు. వీరంతా ఈ ఏడాది జనవరి 18న డార్జిలింగ్‌లోని హిమాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనింగ్‌లో 20 రోజుల పాటు మళ్లీ శిక్షణ పొందారు. ఇక్కడ ప్రతిభ చాటిన 20 మందిలో వరప్రసాద్ ఒకడు. దీంతో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని పెహల్గామ్లో జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనింగ్ శిక్షణ కేంద్రానికి పంపించారు. పర్వతారోహణలో సాహసోపేత శిక్షణ పొందాడు. ఏప్రిల్ 20న చైనా ప్రాంతంలోని లాసాకు చేరుకున్నాడు. అక్కడి నుంచిఎవరెస్ట్ బేస్‌క్యాంప్ చేరుకుని కొద్ది రోజుల పాటు ఎవరెస్ట్ ఎక్కుతూ, దిగుతూ వాతావరణ అనుమతుల కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఏడాది మే 13న ఎవరెస్ట్ పర్వతారోహణ ప్రారంభించాడు. గతనెల 19 నాటికి 8,848 మీటర్ల ఎత్తుగల ఎవరెస్ట్‌ను ఎక్కి రికార్డు సృష్టించాడు. నాలుగు రోజుల్లోనే పూర్తిచేసి ఎవరెస్టు శిఖరానికి చేరుకుని జాతీయ జెండాను ఎగురవేశాడు. జిల్లాలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి యువకుడిగా చరిత్ర సృష్టించాడు. కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్‌బాబు, ఏఎస్పీ రాధికలతో పాటు పలువురు ఇటీవల వరప్రసాద్‌ను సన్మానిం చారు. జూలై 5వ తేదీన సీఎం చేతుల మీదుగా వరప్రసాద్ రివార్డు, అవార్డు అందుకోనున్నాడు. అందరి సహాయ, సహకారాలతోనే.. ఏదో ఒక రంగంలో రాణించాలనే పట్టుదల నన్ను ఎవరెస్టు ఎక్కేలా చేసింది. అమ్మానాన్న బాగా ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచి విద్యతో పాటు క్రీడలు, ఇతర రంగాల్లోనూ ప్రోత్సహించారు. సొంత ఊరివారు స్వాగతించిన తీరును ఎప్పటికీ మరిచిపోలేను. ఇది ఒక మధురానుభూతి. - వరప్రసాద్ -
సంప్రదాయాలు మంటగలుపుతున్న సీఎం
సాక్షి, విజయవాడ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో విభేదాల కారణంగా సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో విధులకు రావడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్ వ్యాఖ్యానించారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాంటి ఆదేశాలు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు టీటీడీ సంప్రదాయాలను మంటగలుపుతున్నారంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా విజయవాడలో టీటీడీ వివాదంపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టీటీడీపై వచ్చిన భారీ ఆరోపణలపై బాధ్యత గల సీఎం విచారణ జరిపించాలి. ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన వారిపై కక్ష సాధింపు చర్యలు సరికాదు. టీటీడీ బోర్డులో అర్హతలేని వారిని సభ్యులుగా నియమించారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడం కోసం దేవుళ్లను చంద్రబాబు వాడుకుంటున్నారు. ఇన్ని తప్పులు చేస్తున్న చంద్రబాబుకి సీఎంగా ఉండే అర్హత లేదు, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏం చెయ్యడానికైనా వెనకాడరంటూ’ ఎంపీ వరప్రసాద్ మండిపడ్డారు. -
విభజన హామీల సాధనలో చంద్రబాబు విఫలమయ్యారు
-
చంద్రబాబు మౌనంగా ఉన్నారెందుకు?
సాక్షి, నెల్లూరు: విభజన హామీల సాధనలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శించారు. స్వప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దకొండూరులో జరుగుతున్న కీలక సమావేశానికి వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. భేటీకి ముందు వారు ‘సాక్షి’ టీవీతో మాట్లాడారు. డ్రామాలేంటి బాబు: ధర్మాన ప్రసాదరావు ‘కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ఆయన వల్లే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టింది. విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రంపై చంద్రబాబు ఎందుకు ఒత్తిడి తేవడం లేదు? కేంద్ర ప్రభుత్వంలో ఉండి డ్రామాలేంటి? రాష్ట్రానికి అన్యాయం చేసి సంబరాలు చేసుకోవడమేంటి? ప్రజల ఆగ్రహం నుంచి బయటపడేందుకు డ్రామాకు తెర లేపారు’ తేడా ఉంది: ఎంపీ వరప్రసాద్ ‘ప్రత్యేక హోదాకు, ప్యాకేజీకి చాలా తేడా ఉంది. హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం. ప్యాకేజీతో ఒరిగేదేమీ ఉండదు. ప్యాకేజీతో చంద్రబాబుకు మేలు జరుగుతుంది. ప్రజలకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుంది. హోదాకోసం మేం నాలుగేళ్లుగా పోరాడుతున్నాం. జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేశారు. హోదా సహా విభజన హామీలన్నీ అమలు చేయాలి. అప్పటివరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుంది’ ఇంకెన్నాళ్లు మోసం: ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ‘కేసు భయంతోనే కేంద్రానికి చంద్రబాబు భయపడుతున్నారు. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటారా? ఇంకెన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారు? నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో ఉండి సాధించిందేంటి? ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారు’ -
మతం కన్నా మానవత్వమే మిన్న
► ఎంపీ వరప్రసాద్ ► సమస్యలపై ముస్లింలంతా ఏకతాటిపై ఉండాలి : భూమన తిరుపతి మంగళం: మనుషులను దూరం చేసే మతం కన్నా ఆత్మీయతతో వారిని ఒక్కటిగా చేసే మానవత్వం ఎంతో గొప్పదని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ఎంఆర్‌పల్లి పరిధిలోని మసీదులో శనివారం ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. సౌత్ఇండియా సయ్యదులు అసోసియేషన్ ఉపాధ్యక్షులు, జిల్లా హదరీపీఠం పీఠాధిపతి సయ్యద్ షఫీ అహ్మద్‌ఖాదరీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా తిరుపతి ఎంపీ వరప్రసాద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వరప్రసాదరావు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఒకరికి మేలు చేయడం తప్ప హాని చేయడం తెలియదన్నారు. అలాంటి వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని ముస్లిం సోదరులంతా ఏకతాటిపై ఉంటారన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వారి సంక్షేమం కోసం రిజర్వేషన్ లు కల్పించారని.. దాంతో ఎంతో మంది ఉన్నతస్థాయికి ఎదిగారన్నారు. ముస్లిం సోదరుల సంక్షేమం కోసం పార్టీలకతీతంగా కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా హిందూ– ముస్లింలు సోదరభావంతో మెలగాలని పిలుపునిచ్చారు. గత 1200 సంవత్సరాల నుంచి హిందూ–ముస్లింలు కలిసిమెలిసి జీవిస్తున్నామని సౌత్ ఇండియా సయ్యదుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ హిల్లారీఫీర్ సామీరి పేర్కొన్నారు. సమావేశంలో ముస్లిం నాయకులు జుభేదఖాదరీ, జాకీర్‌హుసేన్, రఫీ, డాక్టర్ హమీనుల్లా ఖాదరీ పాల్గొన్నారు. -
ప్రేమికుడితోనే పెళ్లి జరిపించాలని...
విజయనగరం: ప్రేమించిన యువకుడితోనే తన పెళ్లి జరిపించాలని కోరుతూ ఓ యువతి నిరాహార దీక్షకు కూర్చుంది. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన దొనక రోహిణి(20), తాపీ మేస్త్రీగా పని చేస్తున్న వరప్రసాద్ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. దీంతో ఆమెకు వరప్రసాద్ అబార్షన్ చేయించాడు. రోహిణి పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ వర ప్రసాద్ వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఇటీవల గట్టిగా నిలదీయగా ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వరప్రసాద్‌కు స్థానిక టీడీపీ నేతలు కొమ్ముకాయటంతో రోహిణి ఫిర్యాదును పోలీసులు పట్టించుకో లేదు. దీంతో విసిగిపోయిన రోహిణి వారం క్రితం పోలీస్‌స్టేషన్‌లోనే పురుగు మందు తాగేందుకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను వారించి నచ్చ చెప్పి ఇంటికి పంపారు. తనకు న్యాయం దక్కేలా లేదని భావించిన బాధితురాలు మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షకు పూనుకుంది. వరప్రసాద్‌తోనే తనకు వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఆమెకు బీజేపీ, సీపీఎం, ఐద్వా, సీఐటీయూ తదితర ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. -
ఎమ్మెల్యే గొల్లపల్లి తీరుపై రాపాక ఆగ్రహం
మలికిపురం : రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు తీరుపై అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాపాక వర పసాదరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మలికిపురంలో గురువారం ఆయన విలేకరులతోమాట్లాడుతూ ఇటీవల తన స్వగ్రామం చింతలమోరిలో రూ.38 కోట్లతో మంజూరైన ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని వేరే గ్రామానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శంకరగుప్తం సర్పంచ్ ఉల్లూరు గోపాలరావు సూచనల మేరకు పూర్తి ఉప్పనీరు కల శంకరగుప్తంలో ఈ పథకం ఏర్పాటుకు ఎమ్మెల్యే యత్నిస్తున్నారని పేర్కొన్నారు. చింతలమోరి ఎత్తిపోతల పథకాన్ని తన హయాంలో ప్రతిపాదించి నిధుల కోసం కృషి చేస్తే, గొల్లపల్లి ఇలా చేయడం దారుణమన్నారు. గొల్లపల్లి చర్యలపై కలెక్టరు అరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేస్తానని, నియోజకవర్గంలో ఆయన అక్రమాలపై పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు ఇసుక రీచ్ నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉంటే టీడీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణా సాగించి దండుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గానికి స్థానికేతరులైన గొల్లపల్లి పాలనపై అవగాహన లేక ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో సర్పంచ్ కారుపల్లి విజయమోహన్, నాయకులు రాపా క యోహన్, రాపాక వాల్మీకి పాల్గొన్నారు. రాపాక ఆరోపణల్లో వాస్తవం లేదు : ఎమ్మెల్యే గొల్లపల్లి రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు చెప్పారు. రాపాక ఆరోపణల సంగతి తెలిసిన వెంటనే ఆయన రావులపాలెం నుంచి మలికిపురం విలేకరులతో ఫోన్ చేసి మాట్లాడారు. రాపాక హయాంలోనే ప్రతిపాదించిన చింతలమోరి లిప్ట్ ఇరిగేషన్ పథకం మూలన పడి ఉంటే తాను నీటిపారుదల శాఖ మంత్రి చుట్టూ తిరిగి మంజూరు చేయించానని, చింతలమోరిలోనే ఆ పథకం ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. రాపాక ఎటువంటి అపోహలు పడనవసరం లేదని పేర్కొన్నారు. -
క్రీస్తు జననం.. లోకానికి వరం
క్రిస్మస్ పర్వదిన వేడుకలు గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. లోక రక్షకుడి రాకను సూచిస్తూ బుధవారం అర్ధరాత్రి క్రైస్తవ ప్రధాన గురువులు, బిషప్‌లు, ఫాదర్లు, ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లోకానికి క్రీస్తు రాకలోని ఆంతర్యాన్ని వివరించారు. అనంతరం క్రిస్మస్ కే క్‌ను పంచి పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి తిరిగి ప్రార్థనా కార్యక్రమాలను ప్రారంభించారు. కడప నగర ఆరోగ్యమాత చర్చిలో ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. మేత్రాసన బిషప్ డాక్టర్ గల్లెల ప్రసాద్ దైవ సందేశం ఇచ్చారు. సీఎస్ఐ సెంట్రల్ చర్చిలో మాజీ బిషప్ ఏసు వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై వాక్య పరిచర్య చే శారు. ఫాస్ఱర్ బెన్హర్బాబు దైవ సందేశం ఇస్తూ లోకంలో అందరికి శాంతి, సమాధానాలు అందజేసిన క్రీస్తును అందరం ఆదర్శంగా తీసుకోవాల్సి ఉందన్నారు. స్థానిక క్రైస్ట్ చర్చిలో ఫాస్టర్ ముత్తయ్య దైవ వాక్యాన్ని వివరించారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు , ప్రార్థనాగీతాల ఆలాపన నిర్వహించారు. -
విద్యార్థి మృతిపై జ్యుడిషియల్ విచారణ చేయాలి
తిరుపతి గాంధీరోడ్డు : తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో ఇటీవల విద్యార్థి మోహన్‌కృష్ణారెడ్డి మృతి చెందడంపై జ్యుడిషియల్ విచారణ చేయాలని తిరుపతి ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం మోహన్‌కృష్ణ కుటుంబసభ్యులను ఆ యన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇటీవల విద్యార్థులకు రక్షణ కరువైందన్నారు. కనీసవసతులు కూడా లేకుండా పాఠశాల ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నించారు. విద్యార్థి మృతి చెంది పది రోజులు దాటినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ చేసి విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలన్నారు. యాజమాన్యంకు ఏమీ సంబంధం లేకుంటే సంఘటన స్థలంలో సాక్ష్యాలను ఎందుకు భద్రపరచలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు జగదీష్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కో-ఆప్షన్ కోలాటం
ఏలూరు : ఏలూరు నగరపాలక సంస్థ, ఏడు మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించేందుకు యం త్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నగరపాలక సంస్థలో ఐదు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలో మూడేసి చొప్పున మొత్తం 28 కో-ఆప్షన్ పదవులకు ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఈనెల 3న ఆయూ సంస్థల్లో కొత్త పాలకవర్గాలు పగ్గాలు చేపట్టిన విషయం విదితమే. పాలకవర్గాలు కొలువైన రెండు నెలల్లోగా కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సభ్యుల ఎన్నికకు ఏర్పాట్లు చేయూల్సిందిగా పురపాలక శాఖ డెరైక్టర్ డి.వరప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసి, ఆగస్టు 15లోగా ఎన్నిక ప్రక్రియను ముగించే అవకాశాలు కనిపిస్తున్నారుు. ఈ పదవులను ఎవరికి కట్టబెట్టాలనే విషయమై టీడీపీ పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు. పురపాలనలో అనుభవం గల వారిని కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోవాలని మునిసిపల్ చట్టం చెబుతోంది. పురపాలక సంఘాల్లో పనిచేసి రిటైరైన అధికారులు, రోడ్లు, భవనాల శాఖ, వాటర్ వర్క్స్, టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో పనిచేసిన నిపుణులను తీసుకోవాల్సి ఉంది. స్టాండింగ్ కమిటీల్లో మూడే ళ్లు పనిచేసిన న్యాయవాదుల్లో కనీసం ఒక్కరికైనా అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. తద్వారా పురపాలనలో అమూల్యమైన సలహాలు, సూచనలు పొం దేందుకు కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలని చట్టం చెబుతోంది. అరుుతే, ఆ దిశగా ఏ ప్రభుత్వాలూ చర్యలు తీసుకోవలేదు. ప్రస్తుత ప్రభుత్వం పరి స్థితి కూడా అలాగే కనిపిస్తోంది. కనీసం మైనార్టీల నుంచి ఎంపిక చేసే సభ్యుల విషయంలోనూ అనువభవజ్ఞులకు చో టు కల్పించే దిశగా పాలకవర్గాలు అడుగులు వేయాల్సిన అవసర ం ఉంది. -
ఆ రికార్డ్ నాదే..!
బిహైండ్ ది రీల్ సత్యశ్రీ రికార్డులు బద్దలు కొట్టడం.. చరిత్ర తిరగ రాయడం... వందేళ్ల భారతీయ సినీ చరిత్రలో ఈ సంచలనాలు సృష్టించిన వారు ఎందరో... కానీ, సత్యశ్రీ రికార్డుని మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేరు.. ఒకవేళ కొట్టాలంటే.. తల బద్దలు కొట్టుకోవాల్సిందే... రెండు చేతులూ పోగొట్టుకోవాల్సిందే... విచిత్రంగా ఉంది కదూ.. జీవితమే విచిత్రాలమయం... కొన్ని విచిత్రాలు ఆనందానికి గురిచేస్తాయి.. కొన్ని జీవితాన్ని తలకిందులు చేసేస్తాయి.. సత్యశ్రీకి అలానే జరిగింది కానీ... తలకిందులైన జీవితాన్ని ఆయన ఓ గాడిన పెట్టుకున్నారు... ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవగలిగారు.. మనోనిబ్బరానికి చిరునామాగా నిలిచిన సత్యశ్రీ జీవితం వైపు ఓ ప్రయాణం... మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు తనికెళ్ల సత్యనారాయణ వరప్రసాద్. సినిమాలంటే చాలా ఇష్టం. రచన, దర్శకత్వం, నటన.. ఇలా ఏ శాఖలో అయినా రాణించాలనుకున్నారు. ఎన్నో కలలను మోసుకుంటూ హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. లక్కీగా ప్రొడక్షన్ మేనేజర్ సింహంతో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా ప్రముఖ నిర్మాత ఓఎస్సార్ ఆంజనేయులుతో పరిచయం. ఆయన నిర్మించిన చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేరారు. మరోవైపు పలు చిత్రాలకు కామెడీ ట్రాక్స్ రాశారు. కలం పేరు ‘సత్యశ్రీ’. ఆ పేరుతోనే ఇండస్ట్రీలో పాపులర్. రాసినందుకు ‘డబ్బు కావాలా...’, రాశారంటూ టైటిల్స్‌లో ‘పేరు కావాలా..’ తేల్చుకోమన్నారు. డబ్బు లేకపోతే పొట్ట నింపుకోవడం ఎలా? ‘డబ్బే కావాలి’ అన్నారు సత్యశ్రీ. అంతే.. డబ్బిచ్చారు కానీ.. ఆయన రాసిన అద్భుతమైన కామెడీ ట్రాక్‌లు, ఇతర రచనలకు పేరు వేయలేదు. ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆరంభించి, ఎంతోమంది నటీనటులను, సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దారు. ఇలా ఓ పదిహేనేళ్లు గడిచిపోయాయి. తెరపైన పేరు రాకపోయినా.. తెరవెనక మాత్రం బాగానే పేరు సంపాదించుకున్నారు సత్యశ్రీ. అలానే ఉంటే.. తెరపైన కూడా పేరు కనిపించేదేమో.. కానీ... అది 1997. దర్శకునిగా ‘ముగ్గురూ ముగ్గురే’ అనే సినిమాకి శ్రీకారం చుట్టారు సత్యశ్రీ. కొన్నాళ్లు షూటింగ్ సజావుగానే సాగింది. నవంబర్ 28న ఆ దుర్ఘటన జరిగి ఉండకపోతే విడుదల అయ్యుండేది. కానీ, సత్యశ్రీకి ఊహించని షాక్ తగిలింది. టీవీ సరిగ్గా రాకపోవడంతో యాంటెనా సరిచేద్దామని మేడపెకైళ్లారాయన. రెండు చేతులతో యాంటెనాని పట్టుకున్నారు... అంతే పెద్ద శబ్దం. ‘‘ఆ శబ్దం సమయం కేవలం తొమ్మిది సెకన్లే’’ అన్నారు సత్యశ్రీ. ఆ మేడ మీద నుంచి అమాంతం కిందపడ్డారు. ‘ఇక అయిపోయాం...’ అనుకుంటూనే స్పృహ కోల్పోయారు. కట్ చేస్తే... ఆస్పత్రిలో చేర్చారు. ‘ప్చ్ లాభం లేదు..’ డాక్టర్లు తేల్చేశారు. అక్కణ్ణుంచి మరో ఆస్పత్రికి. అక్కడా అదే సమాధానం. ‘‘ఈ మాటలన్నీ లీలగా వినిపించాయి. దాదాపు ఆశలు వదిలేసుకున్నా’’ అన్నారు సత్యశ్రీ. మరో ఆస్పత్రిలో ‘ఓకే’ అన్నారు. చికిత్స ప్రారంభమైంది. తల మీద పెద్ద గాయం. చేతులు తెగిపోయాయి. కాళ్ల పరిస్థితి ఘోరం. ఏడు శస్త్ర చికిత్సలు జరిగాయి. మూడు నెలలకు పైగా ఆస్పత్రిలోనే. మొత్తం వైద్యానికి అయిన ఖర్చు ‘ఆరు లక్షలు’. ‘‘ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నాకు చిత్రసీమవారు అందించిన సహాయం మరువలేనిది. ముఖ్యంగా దర్శకులు దాసరి నారాయణరావుగారు, శ్రీనివాస్‌రెడ్డి (‘డమరుకం’ ఫేం) చేసిన మేలు మర్చిపోలేనిది’’ అన్నారు సత్యశ్రీ. ఇటీవల ఎడిటర్ కేయస్ మోహన్‌గారు హైదరాబాద్‌లో 20 ఎకరాల భూమి ఇచ్చారనీ, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కూడా ఆయన అన్నారు. చికిత్స పూర్తయ్యింది. ‘‘ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చేశారు. రెండు చేతులూ లేవు. కాళ్లు అంతంత మాత్రంగా నడవనిస్తున్నాయి. ఏం చేయాలి? ఇతరుల మీద ఆధారపడి బతకాలా?... నో... అలాగని ఆత్మహత్య చేసుకోవాలా? చేసుకొని సాధించేదేంటి? ఉంటే ఏదైనా సాధించొచ్చుగా అనుకున్నారు. అప్పుడెన్నో పుస్తకాలు తిరగేశారు. చేతులు, కాళ్లు విరిగినవాళ్లకి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసే కృత్రిమ అవయవాల గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు. మరి.. సత్యశ్రీ కొన్ని కోట్ల మందికి స్ఫూర్తి కావాలని ఆ భగవంతుడు అనుకున్నాడేమో. మార్గం చూపించేశాడు. పంజాబ్‌లో ఓ ప్రోస్థటిక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కృత్రిమ అవయవాలు అమరుస్తున్నారని సత్యశ్రీకి తెలిసింది. మనసులో చిన్న ఆశ. పంజాబ్ వెళ్లారు. నిజమైన చేతులను తలపించే ‘ప్రోస్థటిక్ హ్యాండ్స్’ అమర్చారు. కానీ, వీటివల్ల ఉపయోగం ఏంటి? అనుకున్నారు సత్యశ్రీ. రాయలేని బతుకు ఎందుకు? అని నిరాశపడ్డారు. సత్యశ్రీ పట్టుదల, రాయాలనే ఆరాటం గమనించిన డాక్టర్లు రాసుకోవడానికి వీలుగా చేతులు అమర్చారు. ‘‘బహుశా ప్రపంచంలో తొలిసారి ఇలాంటి చెయ్యిని అమర్చింది నాకేనేమో! మళ్లీ కలం పట్టే అవకాశం ఆ దేవుడు కల్పించాడు. నేనెవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ చేతులతో నేను వంట చేసుకోగలను, నా బట్టలు నేనే ఉతుక్కోగలను’’ అని చెప్పారు సత్యశ్రీ. ఇప్పటివరకు తనకు సహాయం చేసినవారిని మర్చిపోలేదు సత్యశ్రీ. తనకు చికిత్స చేసినప్పుడు హిందువులు, ముస్లిమ్‌లు, క్రైస్తవులు.. ఇలా అందరూ రక్తం ఇచ్చారని ఆయన చెప్పారు. అందుకే తన కుమారుడికి ఏదో ఒక మతాన్ని ప్రస్తావిస్తున్నట్లుగా కాకుండా ‘కుందన్ సాయి’ అని పేరు పెట్టుకున్నారు. అన్నట్లు.. సత్యశ్రీకి పెళ్లయ్యింది ఆయనకు ప్రమాదం జరిగిన తర్వాతే. వ్యక్తిగత జీవితపరంగా ఆనందంగా ఉన్న సత్యశ్రీ ఇప్పుడు వృత్తిపరంగా కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం ‘టెన్షన్... టెన్షన్’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘సినిమా ప్రారంభించిన రోజునే సీడెడ్ ఏరియా హక్కులు అమ్ముడైపోయాయి’’ అన్నారు సత్యశ్రీ. ఈ చిత్రంతో ఆయన గిన్నిస్ రికార్డ్ సాధించనున్నారు. ‘‘అంగ వైకల్యం ఉన్న వ్యక్తి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఈ నాలుగు శాఖలకూ పని చేసిన దాఖలాలు లేవు. ఆ రికార్డ్ నాదే’’ అని చెప్పారు సత్యశ్రీ. పస్తుతం సత్యశ్రీ కోరిక ఒక్కటే.. నిజమైన చేతులు అమరుస్తారని తెలిసిందట. ‘‘ప్రపంచంలో ఇప్పటికే 33 మందికి ఈ చేతులు విజయవంతంగా అమర్చారు. నా తదుపరి అడుగులు ఈ ప్రయత్నంవైపే’’ అన్నారు సత్యశ్రీ. దీనికి 45 లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. అంత భరించగలరా? అంటే.. ‘‘ఆర్థికంగా ఫరవాలేదు. నాకు సహాయం చేయడానికి సినిమా పరిశ్రమలో బోల్డంత మంది మంచివాళ్లు ఉన్నారు’’ అని నమ్మకంగా చెప్పారు సత్యశ్రీ. - డి.జి. భవాని -
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
బాలాజీనగర్(రేణిగుంట): గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ పంచాయతీల వారీగా అనుబంధ గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తామని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామితో కలసి రేణిగుంట మండలం కేఎల్ఎం హాస్పిటల్ సమీపంలోని బాలాజీనగర్‌లో పర్యటించారు. గాజులమండ్యం సర్పం చ్ శ్రీరాజ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ సర్పంచ్ల సహకారంతో ఐదేళ్లలో అన్నివిధాలా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి కుటుంబానికి రుణిపడి ఉంటానన్నారు. నాయకులు, కార్యకర్తలను కాపాడే బాధ్యత తనదేనన్నారు. తిరుపతి(రేణిగుంట) విమానాశ్రయం విస్తరణ పనులు ఏడాది లోపు పూ ర్తయ్యేలా కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజును కోరామన్నారు. విదేశాలకు విమాన సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామన్నారు. మన్నవ రం ప్రాజెక్టును ఉత్పత్తి స్థాయికి తీసుకొచ్చేం దుకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పొన్ను రాధాకృష్ణన్‌తో చర్చించామన్నారు. ఎస్ఎస్ కెనాల్, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందించేలా పోరాడతామని ఆయ న పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై సేవ చేస్తా ప్రజలకు మేలు చేసేందుకు వారితో మమేకమై పార్టీలకతీతంగా సేవ చేస్తామని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నా రు. నిస్వార్ధంగా సేవ చేసే మంచి నాయకుడి ని తిరుపతి ఎంపీగా ఎన్నుకున్నారని ప్రజల ను అభినందించారు. మాజీ ఎంపీ చింతామోహన్ చివరలో సర్పంచులకు వీధిలైట్లు ఇచ్చి మోసం చేశారే తప్ప అభివృద్ధి అంటే ఏమిటో ఆయని ఎరుగడని విమర్శించారు. ఎస్సీల ఇళ్లలో మంచినీళ్లు కూడా తాగడానికి ఆయనకు ఇష్టం ఉండదన్నారు. జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కులాలు, పార్టీలను చూసి పాలన చేయడం మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను షరతులు, కమిషన్లు ఏర్పాటు చేయకుండా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, ఎమ్మెల్యే నారాయణస్వామిని గాజులమండ్యం సర్పంచ్ శ్రీరాజ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ బీరేంద్రవర్మ, ఎలమండ్యం సర్పంచ్ చిన్నికృష్ణయ్య, నాయకులు మోహన్, స్థానికులు, వార్డుమెంబర్లు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
పట్టుదలే పెట్టుబడి
ఎస్ఐ ఉద్యోగమంటే ఎంతో ‘ఖర్చు’ అనుకునే ఈ రోజుల్లో చాలా అవలీలగా ఉద్యోగం సంపాదించి అందరి చేత ఔరా అనిపించుకుంటున్నారు పాలమూరు ముద్దు బిడ్డలు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో పుట్టినా పట్టుదలే పెట్టుబడిగా ముందుకు సాగారు. లక్ష్య సాధనలో అనేక అవరోధాలు ఎదురైనా అన్నింటినీ అధిగమిస్తూ గమ్యం చేరుకున్నారు. శనివారం వెలువడిన ఎస్ఐ ఫలితాల్లో పాలమూరు పేద విద్యార్థులు ప్రతిభ చూపారు. పేద కుటుంబాల నుంచి... కొల్లాపూర్ నుంచి ముగ్గురు యువకుల ఎంపిక కొల్లాపూర్‌రూరల్,న్యూస్‌లైన్ : మండలం నుంచి ముగ్గురు యువకులు ఎ స్ఐ పోస్టులకు ఎంపికయ్యారు. శని వారం రాష్ట్రపోలీస్ శాఖ విడుదల చేసిన ఎస్ఐ ఫలితాల్లో చుక్కాయిపల్లి,రామాపురం, సింగోటం గ్రామాలకు చెందిన ముగ్గురు యువకులు తమ ప్రతిభ కనబర్చి ఎస్ ఐలుగా ఎంపికయ్యారు. చుక్కాయిపల్లికి చెందిన వరప్రసాద్ జనరల్ కేటగిరిలో 172మార్కులు సాధించి సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యాడు. సింగోటంకు చెందిన ధర్మేష్, రా మాపురానికి చెందిన నాగరాజులు ఎస్ఐ పోస్టుకు ఎంపికైన ట్లు గ్రామస్తులు తెలిపారు. చుక్కాయిపల్లికి చెందిన వరప్రసాద్ వనపర్తి ఫైర్స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మొదటి ప్రయత్నంలోనే ఎస్ఐ పోస్టుకు ఎంపిక కావడంతో గ్రామస్తులతో పాటు స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. ఉప్పునుంతల, న్యూస్‌లైన్ : ఉప్పునుంతలకు చెందిన అంతటిలోని ఓ అనే యువకుడు ఎస్ఐగా ఎంపికయ్యాడు. గత మార్చిలో రాజేష్‌గౌడ్ వీఆర్ఓగా ఎంపికవడంతో ప్రస్తుతం అచ్చంపేటలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇతను 10వ తరగతి వరకు ఉప్పునుంతల పాఠశాలలో చదివాడు. ఇంటర్ అచ్చంపేటలోని ప్రగతి కళాశాలలో, డిగ్రీ సీబీఎం కళాశాల కల్వకుర్తిలో, ఎంబీఏ హైదరాబాద్‌లోని టీకేఆర్ కళాశాలలో పూర్తిచేశాడు. 2012లో పట్టుదలతో సన్నద్దమై ఎస్ఐ ఎంపిక పరీక్ష రాసి ఎంపికయ్యాడు. దీంతో గ్రామస్తులు పలువురు రాజేష్గౌడ్ను అభినందించారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఉప్పునుంతల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న సైదులు, వెంకటేష్‌లు కూడా ఎస్ఐకి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సైదులు వెల్దండ మండలం చంద్రాయణపల్లికి చెందిన వ్యక్తి కాగా, వెంకటేష్ మిడ్జిల్ మండలం రామిరెడ్డిపల్లి నివాసి. ఇరువురు యువకులు 2013లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై ఇక్కడకు వచ్చారని ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 2014 బ్యాచ్‌లో ఇద్దరూ ఎస్ఐ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఎస్ఐ వారిని అభినందించారు. -
ప్రజలు గౌరవించేలా నడచుకుంటా
మీట్ ది ప్రెస్‌లో భూమన కరుణాకర రెడ్డి తిరుపతి సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పా 70 వేల గడపలు తొక్కి ప్రజాసమస్యలు తెలుసుకున్నా టీటీడీ చైర్మన్‌గా మహిళా క్షురకులను నియమించా తాగునీటి ఎద్దడి పరిష్కారానికి రాజీలేని పోరాటం సాక్షి, తిరుపతి: ‘‘మా ఎమ్మెల్యే ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.. మా సమస్యలు పట్టించుకుని పరిష్కరిస్తారని, ప్రజలు నన్ను గౌరవించే విధంగా నడచుకుంటా’’ అని తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆయన ఆదివారం ఒక ప్రైవేట్ హోటల్లో ఏపీడబ్యూయూజే నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్నారు. ఆయన తో పాటు మీట్ ది ప్రెస్‌లో వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, నేతలు భూమన్, రామచంద్రారెడ్డి, ఎస్కే.బాబు, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ, తాను అధికారంలోకి రాగానే తిరుపతిని సాంస్కృతిక నగరం, సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. తిరుపతి నగరంలో అత్యవసర సమస్యల పరిష్కారానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళతామని చెప్పారు. తిరుపతి నగరం అభివృద్ధికి రూ.450 కోట్లు ఇస్తామని ఉప ఎన్నికలప్పుడు చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆ తరువాత రూపాయి కూడా విదిల్చలేదన్నారు. రాష్ట్రం విడిపోతే వచ్చే సమస్యలు, అనర్థాలు ఏంటనేది నాలుగు నెలల పాటు ప్రజలకు విడమర్చి చెబుతూ, సమైక్యాంధ్ర కోసం ఉద్యమించానని గుర్తు చేశారు. తిరుపతి ప్రజలు మానవ విలువలు, తాత్విక చింతన ఉన్న తనలాంటి వారినే ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని కోరారు. తిరుపతి సమస్యలపై అసెంబ్లీలో గళం తిరుపతి నుంచి ఎన్నికైన ఏ ఇతర ఎమ్మెల్యేలు గతంలో తిరుపతి సమస్యలపై అసెంబ్లీ లో గళమెత్తిన సందర్భం లేదు. ఆ ఘనత నాకే దక్కుతుంది. తిరుపతి నియోజకవర్గ సమస్యలపట్ల, నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం అనుసరించిన మోసపూరిత వైఖరి పట్ల అసెంబ్లీలో నాలుగుసార్లు గళం వినిపించా. అసెంబ్లీ సాక్షిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని ఈ అంశంపై ఎండగట్టా. రాష్ట్రం విడిపోతే వచ్చే నష్టాలపై అసెంబ్లీలో నాలుగున్నర గంటలు అనర్గళంగా ప్రసంగించి అందరి మన్ననలు అందుకున్నా తిరుపతి నగరంలోని వార్డుల్లో కాలినడకన పర్యటించి 625 రోజుల్లో 70 వేల గడపలు ఎక్కి ప్రజా సమస్యలు లోతుగా తెలుసుకున్నా. నగరంలో ఎక్కడ ఏవార్డులో ప్రజలు ఏ తరహా సమస్య ఎదుర్కొంటున్నారన్న దానిపై నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. తిరుపతి తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అనేకసార్లు ధ ర్నాలు చేసి, ప్రజల తరఫున పోరాటం చేశా. టీటీడీ చైర్మన్‌గా చాలా చేశా.. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆలయంలో తొలిసారిగా మహిళా క్షురకులను నియమించేందుకు చర్యలు తీసుకున్నా. 30 వేల పేద జంటలకు రాష్ట్రవ్యాప్తంగా కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు ఉచితంగా జరిపించాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు, కోట్లాదిమంది హిందువులు వీక్షిస్తున్న ఎస్వీ భక్తిచానల్ ఏర్పాటు నా ఆలోచనే. శ్రీవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు శ్రీవారి కళ్యాణాలు ప్రారంభించాం. తిరుపతిలో వేదవిశ్వవిద్యాలయం స్థాపన కూడా నా కృషే. వేదం చదివే విద్యార్థులకు భవిష్యత్ లేదన్న ఆందోళనను పరిష్కరించి, వేదపాఠశాల విద్యార్థులకు రూ.3 లక్షల డిపాజిట్ స్కీం అమలు చేశాం. తిరుపతిని సాంస్కృతిక నగరంగా రూపొందించేందుకు గతంలో తెలుగుభాష బ్రహ్మోత్సవాలు, ఉగాది సంబరాలు, గ్రామీణ క్రీడలు ఇలా అనేక కార్యక్రమాలను జయప్రదం చేశాం. హిందువుల్లో అనైక్యత ఏర్పడిన సమయంలో అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పీఠాధిపతులతో తిరుమలలో సమ్మేళనం నిర్వహించా. -
కల్యాణ వైభోగమే..
నక్కపల్లి, న్యూస్‌లైన్: కల్యాణ కాంతులతో ఉపమాక కళకళలాడింది. కోనేటిరాయుని పరిణయోత్సవం ఉపమాకకు వినూత్న అందాలను తీసుకువచ్చింది. ప్రసిద్ధి గాంచిన ఉపమాక వెంకన్న వార్షిక కల్యాణం గురువారం తెల్లవారుజామున కనుల పండువగా జరిగింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి కల్యాణం ఘట్టాన్ని తనివితీరా చూసి పులకించిపోయారు. ఉపమాకకు చెందిన సింహాద్రాచార్యుల ఇంటి వద్ద స్వర్ణాలంకరణ భూషితుడైన వేంకటేశ్వరస్వామిని గరుడ వాహనంపైన, పట్టువస్త్రాలు బంగారు ఆభరణాలతో ముస్తాబైన శ్రీదేవి, భూదేవిని సప్పరవాహనంపైన ఉంచి పెళ్లి మాటల తంతును నిర్వహించారు. ఈ సందర్భంగా సింహాద్రాచార్యుల కుటుంబీకులు స్వామివారికి పసుపు కుంకుమలు, పండ్లు, పట్టు వస్త్రాలు, తాం బూలం సమర్పించారు. అనంతరం చిన్నరథంపై తిరువీధిసేవ నిర్వహించారు. తదుపరి స్వామివారి కల్యాణాన్ని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భద్రాచలంకు చెందిన రామాయణం శర్మ, తెలుగు పండితురాలు డాక్టర్ వేదాల గాయత్రీ దేవి, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఈవోలు శేఖర్‌బాబు, రంగనాథస్వామి, వెంకటాద్రి, పాలకమండలి సభ్యులు బుజ్జి, సింహాద్రి, శ్రీను, చిరంజీవి, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు మణిరాజు, శివాలయం మాజీ చైర్మన్లు సిద్దాబత్తుల జోగారావు, కొండబాబు పాల్గొన్నారు. కల్యాణోత్సవాల సందర్భంగా వెంకన్నకు అలంకరించేందుకు విశాఖలోని ట్రెజరీ నుంచి తీసుకొచ్చిన బంగారు ఆభరణాలను గురువారం తిరిగి పంపించేశారు. -
వరప్రసాద్ లాంటి మరణం కోరుకుంటున్నా!
అనకాపల్లిరూరల్/తుమ్మపాల, న్యూస్‌లైన్: గ్రేహౌం డ్స్ పోలీస్ అధికారి కరణం వరప్రసాద్‌లాంటి వీర మరణాన్ని కోరుకుంటున్నానని ఎస్పీ విక్రమ్‌జిత్ దు గ్గల్ అన్నారు. మండలంలోని మార్టూరులో శుక్రవా రం వరప్రసాద్ సంతాపసభకు ఆయన ముఖ్య అ తిథిగా హాజరయ్యారు. వరప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ అశోకచక్ర అవార్డు అందరికీ దక్కదని, విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శత్రువులతో పోరాడిన వరప్రసాద్‌లాంటి వారికే సాధ్యమన్నారు. దేశభక్తి, సామాజిక స్పృహ ఉన్న వరప్రసాద్ దేశం కోసం వీరమరణం పొందడం యావత్ జాతికే గర్వకారణమన్నారు. గ్రేహౌండ్స్ ఎస్పీ సి.రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రప్రథమంగా అశోక్చక్ర అవార్డు వచ్చిన ఘనత వరప్రసాద్‌కే దక్కుతుందని, ఆయనను ప్రతి పోలీస్ అధికారి ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వరప్రసాద్ విగ్రహం ఏర్పాటుకు కలెక్టర్‌తో మాట్లాడామని,త్వరలోనే నెల కొల్పుతామని తెలిపారు. కార్యక్రమంలో అదన పు ఎస్పీ నర్సింహకిషోర్, గ్రేహౌండ్స్ అడిషినల్ ఎస్పీ సీ తారాం, ఓఎస్డీ దామోదరరావు, నర్సీపట్నం ఎఎ స్పీ విశాల్‌గున్నీ, పాడేరు ఏఎస్పీ పకీరప్ప, అనకాపల్లి డీఎస్పీ మూర్తి, చింతపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్, పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ సిహెచ్.వివేకానంద, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ర్యాలీ, మానవహారం: తొలుత సుంకరమెట్ట జంక్షన్ నుంచి వరప్రసాద్ చిత్రపటాన్ని వాహనంపై ఉంచి యువకులు, మహిళలు భారీ ర్యాలీని నిర్వహించారు. దారి పొడవునా పూలు జల్లి నివాళులర్పించారు. నెహ్రూచౌక్‌లో మానవహారంగా ఏర్పడి వరప్రసాద్ అమర్ర హే అంటూ నినాదాలు చేశారు. మార్టూరులో ఆయన తల్లిదండ్రులు వెంకటరమణ, సత్యవతిలను ఘనంగా సత్కరించారు. చోడవరం సీఐ విశ్వేశ్వరరా వు పుణ్యభూమి నా దేశమంటూ ఆలపించిన దేశభక్తి గీతంతో కన్నీటి పర్యంతమయ్యారు. -
పెనుకొండ వద్ద రైట్.. రైట్..
పెనుకొండ, న్యూస్‌లైన్ : ఏసీబీ వరుస దాడులతో పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్టు సిబ్బంది బెంబేలెత్తిపోయారు. అనారోగ్య కారణాలు చూపుతూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐలు) మూకుమ్మడిగా మెడికల్ లీవ్‌లో వెళ్లారు. ఇటీవలి కాలంలో నాలుగు సార్లు జరిగిన దాడుల్లో అధికారులు, సిబ్బందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంవీఐలు వరప్రసాద్, సుబ్బరాయుడు, ప్రసాద్, క్రాంతికుమార్, నాగేంద్ర ప్రసాద్ మెడికల్ లీవ్‌పై వెళ్లిపోయారు. దీంతో రెండు రోజుల నుంచి హిందూపురం, అనంతపురం నుంచి ఇద్దరు అధికారులను డెప్యూటేషన్‌పై ఇక్కడకు పంపారు. మళ్లీ దాడులు జరుగుతాయేమోనని వారు భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న ఈ చెక్‌పోస్టు వద్ద లారీలు ఆపి.. డ్రైవర్లు అంతో ఇంతో సమర్పించుకోవడం పరిపాటి. ఈ నేపథ్యంలో అలవాటు ప్రకారం లారీలు ఆగగానే.. వెళ్లిపోండని సిబ్బంది సైగ చేస్తున్నారు. కాగా, ఎన్నో చెక్‌పోస్టులు ఉండగా.. ఈ చెక్‌పోస్టుపైనే పనిగట్టుకుని వరుస దాడులు జరగడంలో మర్మమేంటని సిబ్బంది గుసగుసలుపోతున్నారు.. -
లక్షలు నొక్కిన టక్కరులు!
కాకినాడ రూరల్, న్యూస్‌లైన్ :దూడ లేదని పాలివ్వడానికి మొరాయించే పాడిపశువును నమ్మించడానికి తోలులో గడ్డికూరి దూడ ఆకారంలో తయారు చేసి పొదుగు గుడిపినట్టు చేసి, చేపులు రప్పిస్తుంటారు పశుపాలకులు. ఆ గడ్డిబొమ్మను ‘చేటపెయ్యి’ అంటారు. చేటపెయ్యితో పశువును నమ్మించిన బాపతుగానే నిరుద్యోగులను పశుసంవర్ధకశాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి లక్షలు దండుకున్నారు దగాకోరులు. కామధేనువే తమ వద్దకు నడిచి వస్తోందన్నంత సంబరపడిన నిరుద్యోగులు తంటాలు పడో, తాకట్టు పెట్టో తలో లక్షా, లక్షన్నరా చెల్లించుకున్నారు. అయితే తమకు దక్కబోయింది పాడి ఆవు కాదని, ముగ్గురు కలిసి ఆడిన మోసక్రీడలో తాము పావులమయ్యామని, తమ పని వట్టిపోయిన గొడ్డు పొదుగును పితకబోయినట్టయిందని తేలడంతో లబోదిబోమంటున్నారు. పశుసంవర్ధక శాఖలో పని చేస్తున్న ఓ డాక్టర్, ఓ అటెండర్, మరో వ్యక్తి కలిపి నాలుగు జిల్లాలకు (తూర్పు, పశ్చిమ, కృష్ణా, విశాఖపట్నం) చెందిన 33 మందిని నమ్మించి, రూ.45 లక్షల వరకు కాజేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రమైన కాకినాడలోని పశుసంవర్థకశాఖ పోలీ క్లినిక్ కేంద్రంగా జరిగిన దగాపర్వం గురించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని పద్మానగర్‌లో నివసిస్తున్న శీరం లలితాదేవి పశుసంవర్ధకశాఖ పోలీ క్లినిక్‌లో అటెండర్‌గా పనిచేస్తోంది. అదే క్లినిక్‌లో వెటర్ననరీ అసిస్టెంట్‌గా పని చేస్తున్న డాక్టర్ కాకర్ల వరప్రసాద్ అలియాస్ వేళంగి వరప్రసాద్ కరప మండలం వేళంగి పశువైద్యశాల ఇన్చార్జిగా కూడా వ్యవహరిస్తున్నాడు. కరప మండలం పెనుగుదురుకు చెందిన పిల్లి వీర్రాజు రాజమండ్రి పేపరు మిల్లులో పేపర్ కట్టర్‌గా పనిచేస్తున్నాడు. 2011లో పోలీ క్లినిక్‌లో అటెండర్‌గా చేరిన లలితాదేవి విధులకు తరచూ గైర్హాజరవుతోందని జిల్లా అధికారులు 2013 జూలై 7న సస్పెండ్ చేశారు. సస్పెండయ్యాక కొలువుల కుతంత్రం అనంతరం ఆమె డాక్టర్ వరప్రసాద్ ద్వారా పశు సంవర్ధకశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను ప్రలోభపెట్టింది. వారికి నమ్మకం కలిగేలా కొందరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నామని, రాజమండ్రి ఆనంద్ రీజెన్సీకి రావాలని చెప్పడంతో డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు అక్కడకు వెళ్లారు. ఆనంద్ రీజెన్సీలో పిల్లి వీర్రాజును డాక్టర్ వేళంగి వరప్రసాద్‌గా పరిచయం చేసి రెండు, మూడు రోజుల్లో పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని చెప్పించింది. ఆ నిరుద్యోగ యువకులు తమకు ఉద్యోగం రానుందని స్నేహితులకు చెప్పడంతో వారిలో మరికొందరు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారు. నాలుగు రోజుల క్రితం లలితాదేవి డబ్బులు చెల్లించిన యువకులకు పోస్టింగ్ ఆర్డర్లు అంటూ ధృవీకరణ పత్రాలు పంపిణీ చేసింది. అవి నకిలీవని తేలడంతో హతాశులైన నిరుద్యోగ యువకులు గత రెండు రోజులుగా ఆమెపై చేయి చేసుకున్నారు. తమ సొమ్ములు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఉన్నతాధికారులకూ ప్రమేయం? ఈ వ్యవహారం తెలిసిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు రెండురోజుల క్రితం డాక్టర్ వరప్రసాద్‌ను, లలితాదేవిని పిలిపించి ప్రశ్నించారు. లలితాదేవి ఎవరో తనకు తెలియదని, ఆమె సొమ్ములు వసూలు చేయడానికి, తనకూ ఎలాంటి సంబంధం లేదని డాక్టర్ వరప్రసాద్ అనడంతో అధికారులు మిన్నకున్నారు. ఈ నేపథ్యంలో లలితాదేవిపై సస్పెన్షన్ రద్దు చేస్తూ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. దీన్ని బట్టి ఈ వ్యవహారంలో ఆ శాఖ ఉన్నతాధికారులకూ ప్రమేయం ఉందన్న అనుమానాన్ని బాధిత యువకులు వ్యక్తం చేస్తున్నారు. కాగా డబ్బులు చెల్లించిన వారిలో కొందరు లలితాదేవిపై చేయి చేసుకోవడంపై ఆమె తల్లి పద్మావతి ఆదివాకం సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు లలితాదేవి, డాక్టర్ వరప్రసాద్, పిల్లి వీర్రాజులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు చెపుతున్న విషయాలు పరస్పరం పొంతన లేకుండా ఉన్నాయి. లలితాదేవి తాను వీర్రాజు ద్వారా వసూలు చేసిన సొమ్ము డాక్టర్ వరప్రసాద్‌కే ఇచ్చానని చెపుతుండగా.. ఆమె ఎవరో తనకు తెలియనే తెలియదని డాక్టర్ వరప్రసాద్ అంటున్నాడు. తనకు కూడా ఉద్యోగం ఇస్తాననడంతో లలితాదేవి చెప్పినట్టు డాక్టర్‌గా నటించానని వీర్రాజు అంటున్నాడు. మొత్తం మీద ఉద్యోగాల ఎరతో నిరుద్యోగులకు టోకరా వేసిన ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటో.. పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. ఏదేమైనా.. నెలనెలా ఠంచనుగా జీతాలు పొందే సర్కారీ కొలువు దక్కుతుందని ఆశపడితే తమ చేతి చమురే భారీగా వదిలిందని డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. -
కన్నులపండువగా కల్యాణోత్సవం
కరీంనగర్ కల్చరల్, న్యూస్‌లైన్: కరీంనగర్‌లోని బొమ్మకల్ రోడ్డులోగల శ్రీయజ్ఞ వరాహస్వామి క్షేత్రంలో 27వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. విద్యుద్దీపకాంతులతో యజ్ఞవరాహ క్షేత్రం స్వర్ణ కాంతులీనుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం మెహినీ ఉత్సవం నిర్వహించారు. సర్వవైదిక సంస్థానం కులపతి శ్రీభాష్యం విజయసారథి నేతత్వంలో శ్రీ వసుధాలక్ష్మి యజ్ఞవరాహస్వామి, శ్రీరమాసత్యనారాయణస్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. అమ్మవారిమాతా పితృస్థాన ప్రతినిధులుగా పచ్చిమట్ల సరళరవీందర్ దంపతులు, స్వామి వారి తరఫున బుర్ర సుగుణ మల్లయ్య దంపతులు ఆసీనులుకాగా.. మంగళవాయిద్యాలు, పండితుల వేదమంత్రాలతో కల్యాణోత్సవం జరిగింది. అనంతరం రాత్రి మాడవీధుల్లో భజాభజంత్రీలు, కోలాటాలు, మంగళవాయిద్యాల మధ్య గరుడ వాహనంపై సతీసమేతుడై యజ్ఞవరాహస్వామి ఊరేగారు. రతన్‌కుమార్ బృందం ఆలయ సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ పూజా కార్యక్రమంలో సంస్థానం ఉప కులపతి శ్రీభాష్యం వరప్రసాద్, ఆలయ బాధ్యులు వుచ్చిడి మెహన్ రెడ్డి, ముత్యంగౌడ్, తోట మెహన్, కేఎస్.అనంతాచార్య, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, తిరుపతిస్వామి, నర్సింహారెడ్డి, జనార్దన్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఉపమాకలో బ్రహ్మోత్సవాలు
నక్కపల్లిన్యూస్లైన్: ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఉపమాకలో వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శని వారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రతిఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఉపమాకలో నేత్రపర్వంగా జరుగుతాయి. తిరుపతిలో మాదిరిగా ఇక్కడ కూడా ఏటా కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవా లు, ధనుర్మాసోత్సవాలను దేవాదాయశాఖ ఘనంగా నిర్వహిస్తుంది. బ్రహ్మోత్సవాల్లో బాగంగా శని వారం రాత్రి అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆదివారం (6వతేదీ) మధ్యాహ్నం ధ్వజారోహణ, రాత్రి తిరువీధి సేవ నిర్వహిస్తారు. ఆలయంలో ధ్వజ స్తంభం వద్ద ధ్వజ పటాన్నిఎగురవేసి అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించే కార్యక్రమంజరుగుతుంది. ఏడు నుంచి 14 వరకు ఉదయం, రాత్రి స్వామివారికి తిరువీది సేవలు నిర్వహిస్తారు. తిరువీధి సేవల్లో బాగంగా శ్రీదేవి,భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామిని వివిధ వాహనాల్లో ఉంచి ఉపమాక మాడ వీధుల్లో ఊరేగిస్తారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11న ఇత్తడి గరుడవాహనంపై స్వామికి తిరువీధి సేవ జరుగుతుంది. 12 రాత్రి రథోత్సవం సందర్భంగా స్వామిని, అమ్మవార్లను పుణ్యకోటి వాహనంపై తిరువీధుల్లో ఊరేగిస్తారు.13న సాయంత్రం మృగయా వినోదం కార్యక్రమం అనంతరం గజవాహనంపై తిరువీధి సేవ చేస్తారు. ఈరోజే విజయదశమి కావడంతో శమీపూజ నిర్వహించిన అనంతరం పుణ్యకోటి వాహనంపై తిరువీధి నిర్వర్తిస్తామని ప్రధానార్చకుడు వరప్రసాద్ చెప్పారు. 14న మధ్యాహ్నం పూర్ణాహుతి, వినోదోత్సవం, ఆపై స్వామివారి చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు సంబందించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో శేఖర్‌బాబు తెలిపారు. -
త్వరలో పంచాయతీల కంప్యూటరీకరణ
హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : కేంద్ర ప్రభుత్వం రాజీవ్ పంచాయతీ స్వశక్తి అభియాన్ పథకం అమలుకు శ్రీకారం చుట్టిందని పంచాయతీ రాజ్ కమిషనర్ వరప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రామపంచాయతీలకు సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ మేరకు భవన నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని... ఈ పథకం కింద ప్రతి మండలం, జిల్లా స్థాయిలో రీసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. హసన్‌పర్తిలోని సాంస్కృతి విహార్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న గ్రామసర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ముఖ్య అతిథిగా వరప్రసాద్ మాట్లాడుతూ... గ్రామపంచాయతీలకు సకాలంలో ఎన్నికల జరగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు పూర్తిగా ఆగిపోయూయన్నారు. ఎన్నికలు జరిగిన దృష్టా పంచాయతీలకు త్వరలోనే నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా తొలి విడతలో ఐదు వేల పంచాయతీలను కంప్యూటరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకు సంబంధించిన సమాచారాన్ని ఎక్కడి నుంచైనా పొందే అవకాశముంటుందని వివరించారు. గ్రామసభలకు 17 శాఖలకు సంబంధించిన అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. అధికారులు హాజరుకానిపక్షంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని సర్పంచ్‌లకు సూచించారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని, వచ్చే నెల మూడో తేదీన గ్రామసభ నిర్వహించి అందుకు సంబంధించిన సమాచారాన్ని పంపించాలన్నారు. సర్పంచ్‌లు ప్రజల కోసం ఆలోచించాలి : కలెక్టర్ కిషన్ సర్పంచ్‌లు తమ గురించి కాకుండా ప్రజల కోసం ఆలోచించాలని కలెక్టర్ కిషన్ సూచించారు. గ్రామానికి ఏ పథకం వర్తించినా... పంచాయతీ తీర్మానం అవసరమన్నారు. తీర్మానం లేకుండా ఎవరికైనా పథకం వర్తింపజేస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బైఫరికేషన్ అయిన పంచాయతీలకు వెంటనే ఆ పరిధికి సంబంధించిన నిధులను వారి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావొచ్చన్నారు. జిల్లాలోని 962 పంచాయతీ సర్పంచ్‌లకు త్వరలో సిమ్ కార్డులు అందజేస్తామని వివరించారు. దీంతో జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన అధికారులతో సర్పంచ్‌లతో ఉచితంగా మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. మూడు నెలలకోసారి ములాఖత్... ప్రతి మూడు నెలలకోసారి జిల్లాలోని అన్ని పంచాయతీ సర్పంచ్‌లతో ములాఖత్ అవుతానని కలెక్టర్ తెలిపారు. త్వరలోనే డివిజన్, మండలస్థాయిల్లో సర్పంచ్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సర్పంచ్‌లకు పునఃశ్చరణ తరగతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్‌ఫ్రీ నంబర్‌కు మెసేజ్ పంపించాలని సూచించారు. రూ. 10 వేల గౌరవ వేతనం చెల్లించాలి : నూతన సర్పంచ్ల విజ్ఞప్తి తమకు రూ. 10వేల గౌరవ వేతనం అందించాలని కమిషనర్‌కు నూతన సర్పం చ్‌లు విజ్ఞప్తి చేశారు. కార్యదర్శులతో సంబంధం లేకుండా చెక్ పవర్‌ను తమకే ఇవ్వాలని కోరారు. ఒక్కో కార్యదర్శి నాలుగైదు పంచాయతీలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తుండడంతో పాలన అస్తవ్యస్తంగా మారిందని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం శిక్షణ పొందిన సర్పంచ్‌లకు కమిషనర్ సర్టిఫికెట్లు అందజేశారు. పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు, జిల్లా పరిషత్ సీఈఓ ఆంజనేయులు, డీపీఓ ఇస్లావత్నాయక్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజాత్రివిక్రమ్ పాల్గొన్నారు. పల్లెసీమలను అభివృద్ధి చేసే భాగ్యం సర్పంచ్‌లదే.. . కాజీపేట : ప్రజలు అందించిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాజకీయపార్టీలకతీతంగా పల్లెసీమల అభివృద్ధికి కృషిచేసే భాగ్యం ఒక సర్పంచ్‌లకే దక్కుతుందని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ వరప్రసాద్ అన్నారు. ఫాతిమానగర్ దివ్యదీప్తి భవన్లో ఏఎంఆర్-ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది అకాడమీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న గ్రామపంచాయతీ మహిళ సర్పంచ్ల శిక్షణ శిబిరంలో శనివారం సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.ప్రభుత్వ నిధుల మంజూరుపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. స్థానికంగా నిధుల సమీకరణకు వీలైనంత మేరకు ప్రయత్నించాలని... పన్నుల వసూళ్లలో రాజీపడితే అభివృద్ధిలో వెనుకబడిపోవడం ఖాయమన్నారు. కలెక్టర్ జి.కిషన్‌తోపాటు ఎంపీడీఓలు వీరచంద్రం, వసుమతి, అడిట్ అధికారి రమాదేవి, ఈఓపీఆర్డీ రవీందర్‌రెడ్డి, ఎన్జీఓ హరికుమారి హాజరయ్యూరు. ఆత్మకూర్, చిట్యాల, హన్మకొండ, గీసుగొండ, హసన్‌పర్తి, పరకాల, సంగెం మండలాలకు చెందిన మహిళా సర్పంచ్‌లు పాల్గొన్నారు.