ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో కలసి టీడీపీ సాధించిందేమీ లేదని అన్నారు. ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ప్రధానమంత్రి మోదీపై సీఎం చంద్రబాబు నిందలు వేస్తున్నారని చెప్పారు