TSRTC is Arranging 4940 Additional Buses for Sankranthi Festival | సంక్రాంతికి అదనంగా 4940 బస్సులు - Sakshi
Sakshi News home page

సంక్రాంతికి అదనంగా 4940 బస్సులు: టీఎస్‌ఆర్టీసీ

Published Thu, Dec 26 2019 5:00 PM | Last Updated on Thu, Dec 26 2019 5:55 PM

4940 Additional  Buses  For Sankranthi Festival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతికి సన్నాహాలు ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి కావడంతో  ఇప్పటికే తమ సొంత ఊర్లకు చేరుకునేందుకు ప్రజలు టికెట్లు రిజర్వేషన్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంజీబీఎస్‌లోని రంగారెడ్డి ఆర్‌ఐ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా 4940 అదనపు బస్సులను  సిద్ధం చేసినట్లు రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌ తెలిపారు. వీటిలో తెలంగాణకు 3414 బస్సులను ఆంధ్ర ప్రాంతానికి 1526 బస్సులను అదనంగా కేటాయించామన్నారు.. జనవరి 9వ తేది నుంచి 13 వరకు ఈ అదనపు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అలాగే ఊర్ల నుంచి తిరిగి వచ్చే వారి కోసం జనవరి 17న అదనపు బస్సలు నడుపుతున్నామన్నారు. సంక్రాంతి సందర్భంగా గతేడాది రూ. 5 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది రూ. 6 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement