విద్యార్థి మృతిపై జ్యుడిషియల్ విచారణ చేయాలి | Judicial investigation into the death of a student | Sakshi
Sakshi News home page

విద్యార్థి మృతిపై జ్యుడిషియల్ విచారణ చేయాలి

Published Tue, Sep 16 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

విద్యార్థి మృతిపై జ్యుడిషియల్ విచారణ చేయాలి

విద్యార్థి మృతిపై జ్యుడిషియల్ విచారణ చేయాలి

తిరుపతి గాంధీరోడ్డు : తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో ఇటీవల విద్యార్థి మోహన్‌కృష్ణారెడ్డి మృతి చెందడంపై జ్యుడిషియల్ విచారణ చేయాలని తిరుపతి ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం మోహన్‌కృష్ణ కుటుంబసభ్యులను ఆ యన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇటీవల విద్యార్థులకు రక్షణ కరువైందన్నారు.
 
కనీసవసతులు కూడా లేకుండా పాఠశాల ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నించారు. విద్యార్థి మృతి చెంది పది రోజులు దాటినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ చేసి విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలన్నారు. యాజమాన్యంకు ఏమీ సంబంధం లేకుంటే సంఘటన స్థలంలో సాక్ష్యాలను ఎందుకు భద్రపరచలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జగదీష్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement