క్రిస్మస్ పర్వదిన వేడుకలు గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. లోక రక్షకుడి రాకను సూచిస్తూ బుధవారం అర్ధరాత్రి క్రైస్తవ ప్రధాన గురువులు, బిషప్‌లు, ఫాదర్లు, ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లోకానికి క్రీస్తు రాకలోని ఆంతర్యాన్ని వివరించారు. అనంతరం క్రిస్మస్ కే క్‌ను పంచి పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి తిరిగి ప్రార్థనా కార్యక్రమాలను ప్రారంభించారు.
కడప నగర ఆరోగ్యమాత చర్చిలో ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. మేత్రాసన బిషప్ డాక్టర్ గల్లెల ప్రసాద్ దైవ సందేశం ఇచ్చారు. సీఎస్‌ఐ సెంట్రల్ చర్చిలో మాజీ బిషప్ ఏసు వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై వాక్య పరిచర్య చే శారు. ఫాస్ఱర్ బెన్‌హర్‌బాబు దైవ సందేశం ఇస్తూ లోకంలో అందరికి శాంతి, సమాధానాలు అందజేసిన క్రీస్తును అందరం ఆదర్శంగా తీసుకోవాల్సి ఉందన్నారు. స్థానిక క్రైస్ట్ చర్చిలో ఫాస్టర్ ముత్తయ్య దైవ వాక్యాన్ని వివరించారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు , ప్రార్థనాగీతాల ఆలాపన నిర్వహించారు.
క్రీస్తు జననం.. లోకానికి వరం
Published Fri, Dec 26 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM
Advertisement
Advertisement