వరప్రసాద్ లాంటి మరణం కోరుకుంటున్నా! | Wanted, such as the death of a generous offer! | Sakshi
Sakshi News home page

వరప్రసాద్ లాంటి మరణం కోరుకుంటున్నా!

Published Sat, Feb 1 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

వరప్రసాద్ లాంటి మరణం కోరుకుంటున్నా!

వరప్రసాద్ లాంటి మరణం కోరుకుంటున్నా!

అనకాపల్లిరూరల్/తుమ్మపాల, న్యూస్‌లైన్: గ్రేహౌం డ్స్ పోలీస్ అధికారి కరణం వరప్రసాద్‌లాంటి వీర మరణాన్ని కోరుకుంటున్నానని ఎస్పీ విక్రమ్‌జిత్ దు గ్గల్ అన్నారు. మండలంలోని మార్టూరులో శుక్రవా రం వరప్రసాద్ సంతాపసభకు ఆయన ముఖ్య అ తిథిగా హాజరయ్యారు. వరప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ అశోకచక్ర అవార్డు అందరికీ దక్కదని, విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శత్రువులతో పోరాడిన వరప్రసాద్‌లాంటి వారికే సాధ్యమన్నారు.   దేశభక్తి, సామాజిక స్పృహ ఉన్న వరప్రసాద్ దేశం  కోసం వీరమరణం పొందడం యావత్ జాతికే గర్వకారణమన్నారు. గ్రేహౌండ్స్ ఎస్పీ సి.రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రప్రథమంగా అశోక్‌చక్ర అవార్డు వచ్చిన ఘనత వరప్రసాద్‌కే దక్కుతుందని, ఆయనను ప్రతి పోలీస్ అధికారి ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

వరప్రసాద్ విగ్రహం ఏర్పాటుకు కలెక్టర్‌తో మాట్లాడామని,త్వరలోనే నెల కొల్పుతామని తెలిపారు. కార్యక్రమంలో అదన పు ఎస్పీ నర్సింహకిషోర్, గ్రేహౌండ్స్ అడిషినల్ ఎస్పీ సీ తారాం, ఓఎస్‌డీ దామోదరరావు, నర్సీపట్నం ఎఎ స్పీ విశాల్‌గున్నీ, పాడేరు ఏఎస్పీ పకీరప్ప, అనకాపల్లి డీఎస్పీ మూర్తి, చింతపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్, పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ సిహెచ్.వివేకానంద, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
 
ర్యాలీ, మానవహారం: తొలుత సుంకరమెట్ట జంక్షన్ నుంచి వరప్రసాద్ చిత్రపటాన్ని వాహనంపై ఉంచి యువకులు, మహిళలు భారీ ర్యాలీని నిర్వహించారు. దారి పొడవునా పూలు జల్లి నివాళులర్పించారు. నెహ్రూచౌక్‌లో మానవహారంగా ఏర్పడి వరప్రసాద్ అమర్‌ర హే అంటూ నినాదాలు చేశారు. మార్టూరులో ఆయన తల్లిదండ్రులు వెంకటరమణ, సత్యవతిలను ఘనంగా సత్కరించారు. చోడవరం సీఐ విశ్వేశ్వరరా వు పుణ్యభూమి నా దేశమంటూ ఆలపించిన దేశభక్తి గీతంతో కన్నీటి పర్యంతమయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement