Ashoka Chakra Award
-
బాబూరామ్‌కు అశోక చక్ర
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత శౌర్య పతకం అశోక చక్రను జమ్మూకశ్మీర్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ బాబూరామ్‌కు, అలాగే, రెండో అత్యున్నత శౌర్యపతకం కీర్తి చక్రను కానిస్టేబుల్ అల్తాఫ్ హుస్సేన్ భట్‌లకు కేంద్రం ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై పోరులో ధైర్య సాహసాలు ప్రదర్శించి వీరు వీరమరణం పొందారని కొనియాడింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సాయుధ బలగాలకు 144 శౌర్య పతకాలను ప్రకటించారు. ఇందులో 15 శౌర్య చక్ర, 120 సేనా పతకాలు, అశోక చక్ర, కీర్తి చక్ర ఒక్కోటి చొప్పున ఉన్నాయి. జమ్మూలోని పూంఛ్ జిల్లాకు చెందిన బాబూ రామ్ 1999లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. 2002 శ్రీనగర్‌లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌లో బాధ్యతలు చేపట్టి, 14 ఎన్కౌంటర్లలో పాల్గొని 28 మంది ఉగ్రవాదులను అంతమొందించడంలో కీలకంగా ఉన్నారని పోలీసు శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టులో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన వీరమరణం పొందారని పేర్కొంది. శ్రీనగర్‌లోని రత్‌పొరాకు చెందిన కానిస్టేబుల్ భట్ గత ఏడాది అక్టోబర్ 6వ తేదీన గండేర్బల్లో విధుల్లో ఉండగా ఉగ్రవాదుల తూటాలకు వీరమరణం పొందారని అధికారులు తెలిపారు. మూడో అత్యున్నత సాహస పురస్కారం శౌర్యచక్రను ఆర్మీకి చెందిన ఆరుగురికి, వైమానిక దళానికి చెందిన ఇద్దరికి, ఒక నేవీ అధికారికి, ఆరుగురు పోలీస్ పారా మిలటరీ సిబ్బందికి కేంద్రం ప్రకటించింది. మొత్తం 15 పతకాల్లో నాలుగు మరణానంతరం ప్రకటించారు. గత ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మేజర్ అరుణ్ కుమార్ పాండే, రవి కుమార్ చౌధరి, కెప్టెన్ అశుతోష్ కుమార్ (మరణానంతరం), కెప్టెన్ వికాస్ ఖత్రి, రైఫిల్ మ్యాన్ ముకేశ్ కుమార్, సిపాయి నీరజ్ అహ్లావత్లకు శౌర్యచక్ర ప్రకటించినట్లు ఆర్మీ తెలిపింది. అదేవిధంగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 2019 ఎన్నికల సమయంలో నలుగురు మావోయిస్టులను చంపిన సీఆర్పీఎఫ్కు చెందిన ముగ్గురు కోబ్రా కమాండోలకు శౌర్యచక్ర ప్రకటించింది. 201వ బెటాలియన్‌కు చెందిన వీరు డిప్యూటీ కమాండెంట్ చితేశ్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ మంజీందర్ సింగ్, కానిస్టేబుల్ సునీల్ చౌధరి. వీరు 2019 మార్చి 26వ తేదీన సుక్మా జిల్లా జగర్గుండా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలో రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉన్న నలుగురు అగ్రశ్రేణి మావోయిస్టులను హత మార్చడంతోపాటు మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని మావోయిస్టులకు తీవ్ర నష్ట వాటిల్లింది. వీరితోపాటు, నేవీలో కెప్టెన్ సచిన్ రుబెన్ సెకిరాకు, వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ పర్మిందర్ అంటిల్, వింగ్ కమాండర్ వరుణ్ సింగ్‌లకు శౌర్య చక్రను ప్రకటించారు. -
ముకుంద్ వరదరాజన్‌కు అశోకచక్ర అవార్డు
టీనగర్: ఈ ఏడాది అశోకచక్ర అవార్డుకు చెన్నై తాంబరానికి చెందిన సైనిక మేజర్ ముకుంద్ వరదరాజన్, నాయక్ నీరజ్‌కుమార్ పేర్లను ప్రకటించారు. గత ఏడాది ఏప్రిల్ 25వ తేదీ కాశ్మీర్ సోపియాన్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు తీవ్రవాదులు చొరబడి దాడులు జరిపారు. వారిని పట్టుకునేందుకు వెళ్లారు. ఇక్కడ జరిగిన దాడిలో మేజర్ ముకుంద్ వరదరాజన్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ఆయన ఇద్దరిని హతమార్చి తను ప్రాణత్యాగం చేశారు. అదేవిధంగా నాయక్ నీరజ్‌కుమార్ గత ఏడాది ఆగస్టు 24వ తేదీన కాశ్మీర్ గుబ్వారా జిల్లాలో తీవ్రవాదుల తుపాకీ కాల్పుల్లో మృతిచెందారు. సోమవారం ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలలో మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెక్కాకు రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ అశోకచక్ర అవార్డు అందజేశారు. అదేవిధంగా నాయక్ నీరజ్‌కుమార్ భార్య అశోక చక్ర అవార్డును అందుకున్నారు. ఆరుగురు తమిళులకు పద్మ అవార్డులు తమిళనాడుకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు సుధారఘునాథన్, మాజీ భారత ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాల సామితో సహా ఆరుగురిని పద్మ అవార్డులు వరించాయి. అనేక రంగాలలో రాణించిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ అవార్డులను అందజేసి గౌరవిస్తోంది. ఈ ఏడాదికి పద్మ అవార్డులకు 104 మంది ఎంపికయ్యారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎంఆర్ శ్రీనివాసన్‌కు పద్మ విభూషణ్ అవార్డు, ఎన్ గోపాలసామి, సుధా రఘునాథన్ పద్మభూషణ్ అవార్డులకు ఎంపికయ్యూరు. ఎ.కన్యాకుమారి, పివి రాజారామన్, దివంగత ఆర్.వాసుదేవన్‌కు పద్మశ్రీ అవార్డులు అందజేశారు. -
వరప్రసాద్ లాంటి మరణం కోరుకుంటున్నా!
అనకాపల్లిరూరల్/తుమ్మపాల, న్యూస్‌లైన్: గ్రేహౌం డ్స్ పోలీస్ అధికారి కరణం వరప్రసాద్‌లాంటి వీర మరణాన్ని కోరుకుంటున్నానని ఎస్పీ విక్రమ్‌జిత్ దు గ్గల్ అన్నారు. మండలంలోని మార్టూరులో శుక్రవా రం వరప్రసాద్ సంతాపసభకు ఆయన ముఖ్య అ తిథిగా హాజరయ్యారు. వరప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ అశోకచక్ర అవార్డు అందరికీ దక్కదని, విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శత్రువులతో పోరాడిన వరప్రసాద్‌లాంటి వారికే సాధ్యమన్నారు. దేశభక్తి, సామాజిక స్పృహ ఉన్న వరప్రసాద్ దేశం కోసం వీరమరణం పొందడం యావత్ జాతికే గర్వకారణమన్నారు. గ్రేహౌండ్స్ ఎస్పీ సి.రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రప్రథమంగా అశోక్చక్ర అవార్డు వచ్చిన ఘనత వరప్రసాద్‌కే దక్కుతుందని, ఆయనను ప్రతి పోలీస్ అధికారి ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వరప్రసాద్ విగ్రహం ఏర్పాటుకు కలెక్టర్‌తో మాట్లాడామని,త్వరలోనే నెల కొల్పుతామని తెలిపారు. కార్యక్రమంలో అదన పు ఎస్పీ నర్సింహకిషోర్, గ్రేహౌండ్స్ అడిషినల్ ఎస్పీ సీ తారాం, ఓఎస్డీ దామోదరరావు, నర్సీపట్నం ఎఎ స్పీ విశాల్‌గున్నీ, పాడేరు ఏఎస్పీ పకీరప్ప, అనకాపల్లి డీఎస్పీ మూర్తి, చింతపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్, పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ సిహెచ్.వివేకానంద, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ర్యాలీ, మానవహారం: తొలుత సుంకరమెట్ట జంక్షన్ నుంచి వరప్రసాద్ చిత్రపటాన్ని వాహనంపై ఉంచి యువకులు, మహిళలు భారీ ర్యాలీని నిర్వహించారు. దారి పొడవునా పూలు జల్లి నివాళులర్పించారు. నెహ్రూచౌక్‌లో మానవహారంగా ఏర్పడి వరప్రసాద్ అమర్ర హే అంటూ నినాదాలు చేశారు. మార్టూరులో ఆయన తల్లిదండ్రులు వెంకటరమణ, సత్యవతిలను ఘనంగా సత్కరించారు. చోడవరం సీఐ విశ్వేశ్వరరా వు పుణ్యభూమి నా దేశమంటూ ఆలపించిన దేశభక్తి గీతంతో కన్నీటి పర్యంతమయ్యారు.