tummapala
-
కోట్లలో అప్పులు
అనకాపల్లి:తుమ్మపాల చక్కెర కర్మాగారంలో అప్పుల గోల, బ్యాంకు డిపాజిట్ల యుద్ధం తారాస్థాయికి చేరింది. 1957లో సహకార రంగంలోకి వచ్చిన తుమ్మపాల చక్కెర కర్మాగారంలో గత సీజన్లో గానుగాటను నిలిపివేయడంతో పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికీ అధికారపార్టీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆధునీకరిస్తామని «ఢాంబికాలు పలికి తాజాగా కర్మాగారంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. 2011–12 ఆర్థిక సంవత్సరం వరకు జరిగిన ఆడిట్ నివేదికలో 49.50 కోట్ల నష్టం కర్మాగారానికి ఏర్పడిందని తేలింది. తదుపరి నాలుగు ఆర్థిక సంవత్సరాల నష్టాన్ని లెక్కిస్తే కర్మాగారం ఇపుడు 60 కోట్లపైబడి నష్టంలో కొనసాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితిలో కర్మాగారాన్ని ఆధునీకరిస్తే కనీసం 185 కోట్ల నిధులు అవసరమని తేలుస్తున్నారు. అదే సమయంలో కర్మాగారానికి వున్న అన్ని రకాల ఆస్తులను లెక్కిస్తే 100 కోట్లుపైబడి తేలుతోంది. ఇలా ఎటు చూసినా ఆర్థిక నష్టాలు, అవసరాలు కోట్లను దాటితే ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పైసా కూడా విదల్చలేని దుస్థితిలో ఉంది. ఇంకా అందని బకాయిలు... తుమ్మపాల చక్కెర కర్మాగారానికి 2014–15 సీజన్లో చెరకును తరలించిన రైతులకు ఇంకా కోటి 98 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. కర్మాగారంలో వున్న 31 మంది రెగ్యులర్ ఉద్యోగులతోపాటు సీజన్లో పని చేసే ఎన్ఎంఆర్ ఉద్యోగులకు 3.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు రిటైర్ అయిన 160 మంది కార్మికుల గ్రాడ్యూటీ 2010 మార్చి వరకు రెండుకోట్లు చెల్లించాల్సి ఉందని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు కర్మాగారంలో పని చేస్తున్న కార్మికుల పీఎఫ్, దానిపై పెనాల్టీ కలిపి 2.50 కోట్లు బకాయి ఉంది. ఈ క్రమంలోనే కర్మాగారానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను పీఎఫ్ అధికారులు సీజ్ చేశారు. కోటక్ మహేంద్రలో వున్న 4.50 లక్షలు, అనకాపల్లి డీïసీసీబీ బ్రాంచ్‌లో వున్న 30 వేల రూపాయలు సీజ్ చేయగా ఐసీఐసీఐ బ్యాంకులో వున్న 12 లక్షల రూపాయలను ఇటీవల కర్మాగార అధికారులు విత్‌డ్రా చేసి కర్మాగార అవసరాల కోసం దాచారు. ఇది తెలుసుకున్న పీఎఫ్ టాస్క్‌ఫోర్స్ అధికారి సదరు నిధులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా కొద్దిపాటి యుద్ద వాతావరణ ఏర్పడింది. ఈక్రమంలో రాజకీయ నాయకుల జోక్యంతో 12 లక్షలను కర్మాగారంలో ఉంచినప్పటికీ ఏ సమయంలోనైనా వాటిని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో అధికారులు ప్రయత్నిస్తున్నారు. అప్పుల కుప్ప... ఇప్పటికే కార్మికులకు సంబంధించిన బకాయిలు, రైతుల బకాయిలు, పీఎఫ్, గ్రాడ్యూటీతోపాటు ఆప్కాబ్‌కు కర్మాగారం ఏడున్నర కోట్లు అప్పు ఉంది. డీసీసీబీ బ్రాంచ్‌కు రెండు కోట్లు, ఐవోసీకి 54లక్షలు, మెటిరీయల్ సప్లయ్ చేసిన సంస్థలకు కోటి 80 లక్షలు, ఇంద్రాణీ ట్రేడింగ్ ద్వారా తెచ్చుకున్న బాయిలర్ ట్యూబ్‌కు 24 లక్షలు, ట్రాన్స్‌పోర్టు సబ్సిడీ 25 లక్షలు ఇలా లక్షలు, కోట్లలో కర్మాగారంలో ఆర్థికంగా చితికిపోయి ఉంది. ఆగస్ట్ మూడోవారం రైతులకు నేరుగా చెల్లింపులు... ప్రస్తుతం కర్మాగారం పరిధిలో ఆర్థిక వివాదాలు, కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండడంతో ప్రభుత్వం నుంచి కర్మాగారానికి ఆర్థిక ఆసరా లభించే అవకాశంలేదు. ఈ క్రమంలో రైతులకు చెల్లించాల్సిన కోటి 98 లక్షలను ఆప్కాబ్ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికిగానూ కర్మాగారానికి ఎటువంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించి డ్రాప్ట్ జీవో రూపకల్పన జరుగుతున్న నేపథ్యంలో ఆగస్ట్ మూడోవారంలో రైతుల ఖాతాలోకి నేరుగా పాతబకాయిలను చెల్లించేందుకు రంగం సిద్ధమైంది. -
ఏమవుతుందో..!
రేపు తేలనున్న తుమ్మపాల సుగర్స్ భవితవ్యం సహకార కర్మాగారాలకు గడ్డుకాలమని ఐఏఎస్ అధికారి నివేదిక...? {పభుత్వ గ్యారెంటీ ఇస్తే రుణాలిస్తామన్న ఆప్కాబ్ అనకాపల్లి : తుమ్మపాల చక్కెర కర్మాగార భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సహకార రంగానికి గడ్డుకాలం ఉందని, ప్రధానంగా చక్కెర పరిశ్రమ జాతీయస్థాయిలో ఆర్థికంగా కుదేలవుతున్నందున సహకార రంగంలో కొనసాగుతున్న కర్మాగారాలకు తగిన సహకారం అందించినా నష్టాలే పునరావృతమవుతాయని ఓ ఐఏఎస్ అధికారి ఇవ్వనున్న నివేదిక దీనిపై తీవ్ర ప్రభావం చూపనుంది. రాష్ర్టంలో సహకార రంగంలో ఉన్న 11 చక్కెర కర్మాగారాల్లో ఇప్పటికే ఐదు మూతపడగా తాజాగా తుమ్మపాల చక్కెర కర్మాగారం అదే బాటలో పయనిస్తోంది. రూ.కోట్ల అప్పులు, నష్టాలతో కుదేలైన తుమ్మపాల చక్కెర కర్మాగారానికి ఈ సీజన్‌కు సంబంధించి రుణాలు ఇవ్వాలంటే ప్రభుత్వం గ్యారంటీ తప్పనిసరి అని ఆప్కాబ్ చెప్పి తప్పించుకుంది. వ్యాట్ మినహాయింపునకు నిర్ణయం బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో వ్యాట్ నుంచి చక్కెర కర్మాగారాలకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారే తప్ప సంక్లిష్ట స్థితిలో ఉన్న తుమ్మపాల చక్కెర కర్మాగారం గురించి చర్చించిన దాఖలాలు లేవు. ఈనెల 19న చక్కెర కర్మాగారాలపై ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. ఈ సబ్ కమిటీకి కర్మాగారాల గురించి ఒక ఐఏఎస్ అధికారి సమర్పించనున్న నివేదికే కీలకం కానున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాలకు వెయ్యి కోట్ల నిధులు కేటాయించినా ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం నుంచి చక్కెర పరిశ్రమలు బయటపడడం కష్టమని ఆయన పేర్కొంటున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో సహకార చక్కెర కర్మాగారాలకు రుణాలు అందించలేమని ప్రభుత్వం చేతులెత్తేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆర్థిక పరపతి లేని కర్మాగారాల్లో ఒకటైన తుమ్మపాల కర్మాగారానికి ఆప్కాబ్ నిధులు ఇవ్వడం కష్టమని, ఫలితంగా కర్మాగారంలో క్రషింగ్‌కు దారులు మూసుకుపోతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోవడం, చెరకు రైతుల నుంచి అగ్రిమెంట్లు తీసుకోకపోవడం, ఉన్న చెరకు ఏటికొప్పాక, తదితర కర్మాగారాలకు తరలిపోవడానికి అవకాశాలు పెరగడంతో ఇక ఈ ఏడాది క్రషింగ్ ఆశలు సన్నగిల్లినట్లేనని మరికొందరు పేర్కొంటున్నారు. అంధకారంలో కర్మాగారం... తుమ్మపాల చక్కెర కర్మాగారం ఆర్థిక వెతలు ఒక్కొక్కటికి బయటపడుతుండగా తాజాగా కర్మాగారం విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.సుమారు రూ.40 లక్షల వరకూ కర్మాగారం బకాయి పడినట్లు తెలుస్తోంది. ఎండీకి అనారోగ్యం... తుమ్మపాల చక్కెర కర్మాగారం ఎండీ సత్యప్రకాష్ గతకొద్దిరోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కర్మాగార స్థితిగతులు దిగజారిన సమయంలోనే ఎండీ అనారోగ్యానికి గురి కావడంతో మార్కెట్‌వర్గాలు మరింత డీలా పడ్డాయి. ఆప్కాబ్పై ఆశలు పెట్టుకోగా ఆప్కాబ్ అధికారులు ప్రభుత్వం వైపు బంతిని నెట్టేసి కర్మాగార భవితవ్యాన్ని మరింత జటిలం చేశారు. జీతాలు లేక ఇబ్బందులు గత 16 నెలలుగా జీతాలు లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నాం. ఇంటి పోషణ సైతం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు జీతాలు అందేలా సహకరించాలి. - డి.పైడిరాజు, రెగ్యులర్ ఉద్యోగి ఫ్యాక్టరీకోసం పనిచేస్తున్నాం జీతాలు అందకపోయినా గానుగాట జరపాలని పని చేస్తున్నాం. ఓవర్‌హాలింగ్ పనుల్లో పస్తులు ఉండి కూడా పాల్గొంటున్నాం. కర్మాగారంలో గానుగాడితేనే మాకు కుటుంబపోషణ ఉంటుంది. -పి.ఉమామహేశ్వరరావు, ఎన్ఎంఆర్ -
తేలని గానుగాట
సాంకేతికంగా సాధ్యం కాదని తేల్చిన చక్కెర శాఖ అధికారులు క్రషింగ్ పై ఎమ్మెల్యే ఆశ నేడు ఆప్కాబ్ అధికారుల చర్చలు రేపు కేబినెట్ సమావేశంలో మరింత స్పష్టత అనకాపల్లి: రాష్ట్రంలో ఈ సీజన్లో క్రషింగ్‌కు అనుమతి పొందని సహకార చక్కెర కర్మాగారాల్లో ఒకటైన తుమ్మపాల కర్మాగారం భవితవ్యంపై ఇంకా స్పష్టత రాలేదు. మిగిలిన సహకార చక్కెర కర్మాగారాల గానుగాట మూహూర్తాలు ఖరారు కావడంతో సన్నాహాలు జరుగుతుండగా తుమ్మపాలలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. నేడు, రేపు కీలకం... తుమ్మపాల చక్కెర కర్మాగార క్రషింగ్‌పై ఇప్పటికే చక్కెర శాఖ ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించడంతో డోలాయమానంలో పడిన కర్మాగార ఎండీ వాస్తవాలను బయటకు చెప్పలేక బంతిని ఎమ్మెల్యే కోర్టులోకి నెట్టివేశారు. ప్రస్తుతం తుమ్మపాల చక్కెర కర్మాగార భవితవ్యం అనకాపల్లి ఎమ్మెల్యే పీలాకు చిక్కుముడిని తెచ్చిపెట్టింది. సాంకేతికంగా ఈ సీజన్లో క్రషింగ్‌కు అవకాశాలు ఏమాత్రం లేనప్పటికీ గతంలో ఎమ్మెల్యే పీలా ఇచ్చిన హామీ మేరకు కడదాకా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి నుంచి కూడా సానుకూల స్పందన రాకపోవడం ఎమ్మెల్యేకు ఇబ్బందులను రెట్టింపు చేసింది. ఈ ప్రతికూల పరిణాల నేపథ్యంలో అనకాపల్లి నియోజకవర్గ ప్రజల నుంచి ముఖ్యంగా రైతుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోలేక తుమ్మపాల క్రషింగ్ ఎలాగైనా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెబుతూ ఉంటే చక్కెర శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు తుమ్మపాల కర్మాగార యాజమాన్యం సన్నాహాలపై నీళ్లు చల్లారు. ఇక్కడ నెలకొన్న నైరాశ్యం వీడాలంటే ఆర్థిక చిక్కుముళ్లు తొలగిపోవాలి. ఈ క్రమంలో తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆప్కాబ్ ఏజీఎం సోమవారం సందర్శించి ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. కర్మాగార ఆర్థిక స్థితిగతుల తోపాటు గోదాముల్లో ఉన్న చక్కెర నిల్వలపై తనిఖీలు జరిపారు. మంగళవారం విశాఖలో ఆప్కాబ్ అధికారులు నిర్వహించనున్న సమావేశంలో తుమ్మపాల అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే తుమ్మపాల కర్మాగారం అప్పులు ఆప్కాబ్‌కు సైతం చికాకు తెప్పిస్తుంటే కొత్తగా ఎలా అప్పులివ్వాలని ఆప్కాబ్ అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈనెల 16న జరిగే కేబినెట్ సమావేశంలో సహకార చక్కెర కర్మాగారాలపై చర్చకు వచ్చే అవకాశముంది. అదే సమయంలో తుమ్మపాలపై పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీయే ఆఖరి అవకాశం తుమ్మపాల చక్కెర కర్మాగారంలో ఈ సీజన్‌కు క్రషింగ్ జరగకపోతే పరిణామాలు మూతపడే స్థితికి చేరుస్తాయని కర్మాగార వర్గాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రషింగ్ జరుగుతుందని హామీలు వస్తున్నా తుమ్మపాల పరిధిలోని చెరకును ఏటికొప్పాక కర్మాగారానికి తరలించవచ్చనే ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయని తెలిసింది. ఈ ఏడాది గానుగాటకు సంబంధించి సుగర్కేన్ కమిషనర్ సూచనలు ప్రతికూలంగా ఒకవైపు ఉంటే గానుగాటపై తమ భవితవ్యాన్ని ఊహించుకుంటూ కార్మికులు, రైతులు తీపికబురు కోసం ఎదురు చూస్తున్నారు. కార్మికుల దయనీయ స్థితి తుమ్మపాల చక్కెర కర్మాగారంలో ఈ సీజన్‌కు సంబంధించి 30 మంది రెగ్యులర్ కార్మికులు, 150 మంది ఎన్ఎంఆర్ కార్మికులు పనిచేస్తున్నారు. గానుగాటపై దారులు మూసుకున్న నేపథ్యంలో ఓవర్‌హాలింగ్ కోసం ఖర్చు చేసిన 40 లక్షలు, ఎన్‌ఎంఆర్‌లకు చెల్లించాల్సిన జీతాలు మరింత భారం కానున్నాయి. ఇదే సమయంలో కార్మికుల ఉద్యోగ బకాయిలు 2.76 కోట్లు, రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 2 కోట్లు, కార్మికుల పీఎఫ్ కోటి 40 లక్షలు, గ్రాడ్యుటీ కోటి 15 లక్షలు, ఆప్కాబ్ రుణం 3.5 కోట్లు, ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన 4 కోట్లతో పాటు, విద్యుత్ చార్జీలు, పెండింగ్ బిల్లులు లక్షల్లో పేరుకుపోయాయి. దీంతో ఆర్థికంగా పరపతి కోల్పోయిన తుమ్మపాల చక్కెర కర్మాగారంలో ఆర్థిక కష్టాలు మరింత జటిలమయ్యాయి. ఈ కారణంగా భవితవ్యంపై ఆందోళనతో ఉన్న కొందరు ఎన్ఎంఆర్ కార్మికులు జీతాలు లేక అలమటిస్తూ రాత్రుళ్లు పరవాడ ఫార్మాసిటీలో అదనంగా విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. -
ప్రేమజంట మృతదేహాల వెలికితీత
అనకాపల్లి రూరల్: తుమ్మపాల సమీపంలోని ఏలేరు కాలువలో ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికుల జంట మృతదేహాలను సోమవారం ఉదయం వెలికి తీశారు. తుమ్మపాల గ్రామానికి చెందిన కండెళ్ల అప్పారావు, చింతనిప్పుల అగ్రహారానికి చెందిన చందక దుర్గలక్ష్మి మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష నిమిత్తం ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పట్టణ, రూరల్ పోలీసులు ఇరువర్గాలు, పెద్దలు సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఆత్మహత్యకు పాల్పడిన చందక దుర్గలక్ష్మి తల్లిదండ్రులు చినతల్లి, రాములకు ఏకైక కుమార్తె. తండ్రి రాము కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడు. మృతుడు కండెళ్ల అప్పారావు తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లకు పెద్దదిక్కుగా ఉండేవాడు. వీరిద్దరి ఆత్మహత్యతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
షుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయడం వీళ్లకు మామూలే: వైఎస్ జగన్
సహకార రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను నష్టాల్లోకి తీసేసి.. వాటిని సొంత మనుషులకు అమ్మేయడం ఈ ప్రభుత్వానికి మామూలేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హుదూద్ తుఫాను బారిన పడిన విశాఖపట్నంలోని తుమ్మపాల ప్రాంతాన్ని ఆయన శనివారం సందర్శించి, అక్కడి వారిని పరామర్శించారు. తుఫాను సాయం ఎలా అందుతోందో వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి చెరుకు రైతులు తమ గోడును వైఎస్ జగన్ వద్ద వెళ్లబోసుకున్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ రైతులకు 6 కోట్ల రూపాయలు బకాయి పడితే ఇప్పటికి కేవలం 3 కోట్లే ఇచ్చారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏడు నెలల నుంచి కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో కూడా 4 కోట్ల రూపాయలకు ఈ ఫ్యాక్టరీని అమ్మేయడానికి ప్రయత్నాలు చేయగా, అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారని ఆయన గుర్తుచేశారు. -
తుమ్మపాల సుగర్స్ అభివృద్ధికి కమిటీ
రైతులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి/తుమ్మపాల/అనకాపల్లి రూరల్/చోడవరం:తుమ్మపాల సహకార చక్కెర కర్మాగారాన్ని అభివృద్ధి చేసేందుకు నిపుణులతో కూడిన కమిటీని వేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ముఖ్యమంత్రి శుక్రవారం జిల్లాలో జరిపిన పర్యటనలో భాగంగా తుమ్మపాల చక్కెర కర్మాగార ఆవరణలో రైతులతో మాట్లాడుతూ మూడు నెలల్లో కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కర్మాగారం ఆధునికీకరణ, విస్తరణ వంటి అంశాలపై స్పష్టత వస్తుందన్నారు. డెరైక్టర్ ఆఫ్ సుగర్స్తో కూడిన బృందం ఇక్కడికి వచ్చి అధ్యయనం చేస్తుందన్నారు. నివేదిక ఆధారంగా రైతులకు శాశ్వతంగా ఉపయోగపడే విధంగా తుమ్మపాల కర్మాగారాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కర్మాగారంలో చక్కెరను విక్రయించి చెరకు రైతుల బకాయిలు, కార్మికుల జీతాల బకాయిలు చెల్లిస్తామన్నారు. ముఖ్యమంత్రి వెంట జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, కలెక్టర్ యువరాజ్, జేసీ ప్రవీణ్ కుమార్, ఆర్డీవో వసంతరాయుడు, కర్మాగారం ఎమ్డీ ప్రభుదాస్, ఎంపీపీ కొణతాల వెంకటసావిత్రి, టీడీపీ నేతలు కొణతాల శ్రీను, బుద్ధ నాగజగదీష్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. నూకాంబిక సన్నిధిలో చంద్రబాబు శ్రీ నూకాంబిక అమ్మవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం దర్శించుకున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన చంద్రబాబు ఆలయ ముఖ ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ఈయనకు మేళతాళాలతో ఎమ్మెల్యే పీలా గోవింద, దేవాదాయ శాఖాధికారులు ఎన్.ఎస్.ఎం.మూర్తి, పుష్కనాథం, ఎన్.ఎల్.ఎన్.శాస్త్రి, ఆలయ ఈఓ సుజాత స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు అమ్మవారి భారీ చిత్రపటాన్ని బహుకరించారు. ఆస్పత్రి వైద్యులతో సమీక్ష అనకాపల్లి వంద పడకల ఆస్పత్రిని ముఖ్యమంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మించనున్న భవనాన్ని, మహిళా, ఆరోగ్య శ్రీ వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రి వైద్యులతో సమీక్షా సమావేశమయ్యారు. ఆరోగ్యశ్రీకి నగదు పెంపు... ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ప్రస్తుతం ఇస్తున్న రూ.2 లక్షల మొత్తాన్ని రూ.2.5 లక్షలకు పెంచనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన వెంట మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీలా గోవింద, పంచకర్ల రమేశ్‌బాబు, పెతకంశెట్టి గణబాబు, వానపల్లి గణేశ్‌కుమార్, జెడ్పీ చైర్మన్ లాలం భవాని ఉన్నారు. గోవాడ సామర్థ్యం 8 లక్షల టన్నులకు పెంపు గోవాడ సహకార చక్కెర కర్మాగారం క్రషింగ్ సామర్థ్యాన్ని 8 లక్షల టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. చోడవరంలో శుక్రవారం జరిగిన ‘పొలం పిలుస్తోంది-ఆవిష్కరణ’ సభలో ఆయన మాట్లాడుతూ యాజమాన్యం చెరకు రైతుల పిల్లల కోసం ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తే అనుమతిస్తానని ప్రకటించారు. ఈ సందర్భగా చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి చక్కెర కర్మాగారం తరపున రూ.30 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి చైర్మన్ మల్లునాయుడు, ఎమ్డీ రమణారావు, ఎమ్మెల్యే రాజు అందజేశారు. అనంతరం కర్మాగారం అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. -
వరప్రసాద్ లాంటి మరణం కోరుకుంటున్నా!
అనకాపల్లిరూరల్/తుమ్మపాల, న్యూస్‌లైన్: గ్రేహౌం డ్స్ పోలీస్ అధికారి కరణం వరప్రసాద్‌లాంటి వీర మరణాన్ని కోరుకుంటున్నానని ఎస్పీ విక్రమ్‌జిత్ దు గ్గల్ అన్నారు. మండలంలోని మార్టూరులో శుక్రవా రం వరప్రసాద్ సంతాపసభకు ఆయన ముఖ్య అ తిథిగా హాజరయ్యారు. వరప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ అశోకచక్ర అవార్డు అందరికీ దక్కదని, విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శత్రువులతో పోరాడిన వరప్రసాద్‌లాంటి వారికే సాధ్యమన్నారు. దేశభక్తి, సామాజిక స్పృహ ఉన్న వరప్రసాద్ దేశం కోసం వీరమరణం పొందడం యావత్ జాతికే గర్వకారణమన్నారు. గ్రేహౌండ్స్ ఎస్పీ సి.రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రప్రథమంగా అశోక్చక్ర అవార్డు వచ్చిన ఘనత వరప్రసాద్‌కే దక్కుతుందని, ఆయనను ప్రతి పోలీస్ అధికారి ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వరప్రసాద్ విగ్రహం ఏర్పాటుకు కలెక్టర్‌తో మాట్లాడామని,త్వరలోనే నెల కొల్పుతామని తెలిపారు. కార్యక్రమంలో అదన పు ఎస్పీ నర్సింహకిషోర్, గ్రేహౌండ్స్ అడిషినల్ ఎస్పీ సీ తారాం, ఓఎస్డీ దామోదరరావు, నర్సీపట్నం ఎఎ స్పీ విశాల్‌గున్నీ, పాడేరు ఏఎస్పీ పకీరప్ప, అనకాపల్లి డీఎస్పీ మూర్తి, చింతపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్, పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ సిహెచ్.వివేకానంద, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ర్యాలీ, మానవహారం: తొలుత సుంకరమెట్ట జంక్షన్ నుంచి వరప్రసాద్ చిత్రపటాన్ని వాహనంపై ఉంచి యువకులు, మహిళలు భారీ ర్యాలీని నిర్వహించారు. దారి పొడవునా పూలు జల్లి నివాళులర్పించారు. నెహ్రూచౌక్‌లో మానవహారంగా ఏర్పడి వరప్రసాద్ అమర్ర హే అంటూ నినాదాలు చేశారు. మార్టూరులో ఆయన తల్లిదండ్రులు వెంకటరమణ, సత్యవతిలను ఘనంగా సత్కరించారు. చోడవరం సీఐ విశ్వేశ్వరరా వు పుణ్యభూమి నా దేశమంటూ ఆలపించిన దేశభక్తి గీతంతో కన్నీటి పర్యంతమయ్యారు. -
తీపి చేసేవారికి చేదు
=నాలుగు నెలలుగా పస్తులు =జీతానికి నోచుకోని ‘తుమ్మపాల’ కార్మికులు =రూ. కోటికి పైగా బకాయిలు =నేటి నుంచి క్రషింగ్ అందరికీ తీపిని పంచుతారు.. చెరకు నుంచి చక్కెర తయారు చేస్తారు.. వారు మాత్రం చేదు దిగమింగి బతుకంతా ఉసూరం టారు. శ్రమించి చక్కెరను ఉత్పత్తి చేసే తుమ్మపాల సుగర్స్ ఉద్యోగులు చేదును చవి చూస్తున్నారు. పనిచేస్తున్న కర్మాగారం భవితవ్యంపై నీలినీడలు అలుముకుంటూ ఉండడంతో బితుకుబితుకుగా కాలం గడుపుతున్నారు. జీతాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ అష్టకష్టాలతో నెట్టుకొస్తున్నారు. అనకాపల్లి, న్యూస్‌లైన్: సుదీర్ఘ చరిత్ర గల తుమ్మపాల సుగర్స్ అనేక రకాల సమస్యలతో సతమతమవుతోంది. ఆర్థిక భారంతో కుంగిపోతోంది. దాంతో ఉద్యోగులు కర్మాగారం భవితవ్యంపై కలవరపడుతున్నారు. మరోవైపున నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా యాజమాన్యం కాలం గడపడంతో విలవిలలాడుతున్నారు. కర్మాగారం పరిధిలో 40 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 120 మంది ఎన్ఎంఆర్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరికీ నాలుగు నెలలుగా జీతాలు లేవు. యాజమాన్యం రూ.కోటి వరకు చెల్లించాల్సి ఉంది. మరో మూడు రోజులు గడిస్తే బకాయిలు ఐదు నెలలకు చేరుతాయి. దీంతో ఉద్యోగుల కుటుంబాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. మరోవైపున శనివారం నుంచి క్రషింగ్ ప్రారంభిస్తున్నారు. మరో 302 మందిని సీజనల్ ఉద్యోగులుగా విధుల్లోకి తీసుకుంటారు. వీరికీ జీతాలివ్వాలి. గానుగాట చేపట్టాక ఉత్పత్తయిన పంచదార బస్తాలను తాకట్టు పెట్టి ఆప్కాబ్ ద్వారా రుణం తీసుకుని ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు యాజమాన్యం యోచిస్తోంది. సుమారు రూ. 40 కోట్లకు పైబడిన అప్పుల్లో యాజమాన్యం ఇప్పటికే కూరుకుపోయింది. రుణం చెల్లించాలంటూ ఏపీఐడీసీ, ఆప్కాబ్ ఒత్తిడి తెస్తున్నాయి. మిల్లు ఆధునికీకరణకు రూ.7.54 కోట్లు రుణంగా ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటించినా ఆ ఫైల్ పెండింగ్‌లోనే ఉంది. గతేడాది రూ. 63 లక్షల బకాయిలను రైతులకు ఇప్పటికీ చెల్లించలేదు. నేటి నుంచి గానుగాట 99వేల టన్నుల గానుగాట లక్ష్యంగా తుమ్మపాల సుగర్స్ శనివారం నుంచి గానుగాట ప్రారంభించబోతోంది. ఉదయం 8-41 గంటలకు క్రషింగ్ ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు టన్నుకు రూ. 2100 మద్దతు ధర చెల్లించాల్సి ఉంది. పురాతన యంత్రాల కారణంగా రికవరీ తగ్గిపోవడంతో బస్తా పంచదార ఉత్పత్తికి రూ.3,200 ఖర్చవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో బస్తా పంచదార రూ. 2650 మాత్రమే ధర పలుకుతోంది. క్రషింగ్ చేపట్టినా నష్టాలు తప్పని పరిస్థితుల్లో రైతుల మనోభావాలు దెబ్బతినకుండా గానుగాటకు యాజమాన్యం సిద్ధమైంది. జాతీయ చక్కెర సహకార సమాఖ్య సూచనల మేరకు రుణం మంజూరయితే మరో పదేళ్ల వరకు గానుగాట జరపొచ్చుననేది అధికారుల అభిప్రాయం