ప్రేమజంట మృతదేహాల వెలికితీత | Extraction of the bodies of love couple | Sakshi
Sakshi News home page

ప్రేమజంట మృతదేహాల వెలికితీత

Published Tue, May 26 2015 12:49 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

ప్రేమజంట మృతదేహాల వెలికితీత - Sakshi

ప్రేమజంట మృతదేహాల వెలికితీత

అనకాపల్లి రూరల్: తుమ్మపాల సమీపంలోని ఏలేరు కాలువలో ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికుల జంట మృతదేహాలను సోమవారం ఉదయం వెలికి తీశారు. తుమ్మపాల గ్రామానికి చెందిన  కండెళ్ల అప్పారావు, చింతనిప్పుల అగ్రహారానికి చెందిన చందక దుర్గలక్ష్మి మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష నిమిత్తం ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పట్టణ, రూరల్ పోలీసులు ఇరువర్గాలు, పెద్దలు సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

ఆత్మహత్యకు పాల్పడిన చందక దుర్గలక్ష్మి తల్లిదండ్రులు చినతల్లి, రాములకు ఏకైక కుమార్తె. తండ్రి రాము కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడు. మృతుడు కండెళ్ల  అప్పారావు తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లకు పెద్దదిక్కుగా ఉండేవాడు. వీరిద్దరి ఆత్మహత్యతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement