
కుమారుడి మృతదేహాన్ని వద్ద రోదిస్తున్న తల్లి, కుటుంబ సభ్యులు
గుంటూరు, ముప్పాళ్ల: ఉన్నత చదువుల కోసం వెళ్లిన బిడ్డ శవమై తిరిగి రావటాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేక పోయింది. కుటుంబ వారసుడు కళ్లముందు శవమై కనిపించటంతో వారి రోదన మిన్నంటింది. ఉన్నతంగా వస్తాడనుకుంటే శవమై వచ్చాడయ్యా అంటూ కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. మండల కేంద్రమైన ముప్పాళ్లకు చెందిన లోకసాని మోహన్‌రెడ్డి(25) ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లాడు. తమ బిడ్డ చదువుల కోసం తల్లిదండ్రుల తీవ్రంగా కష్టపడ్డారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం మోహన్‌రెడ్డి అకాల మృతి చెందాడు. గురువారం ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. బిడ్డ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
Comments
Please login to add a commentAdd a comment