ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి | Teacher posts should be replaced | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి

Published Sat, Aug 9 2014 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

Teacher posts should be replaced

మహబూబ్‌నగర్ విద్యావిభాగం : తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సంఘం జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ మేరకు మాట్లాడారు. సర్విస్ రూల్స్‌ను రూపొందించి అర్హతగల ఉపాధ్యాయులకు జెల్, డైట్‌లెక్చరర్, డిప్యూటీఇఓలుగా పదోన్నతి కల్పించాలని అన్నారు.
 
ఆర్‌ఎంఎస్‌ఏ నిధుల ద్వారా పాఠశాలలకు వసతులు కల్పించాలని, నెలవారి పదోన్నతులను అడహక్ పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. అన్ని పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అమలు చేయాలని, ప్రతి పాఠశాలలో స్వీపర్, అటెండర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకం వెంటనే చేయించాలన్నారు. ప్రతి నియోజక వర్గానికి ఒక డిప్యూటీ డీఈఓ పోస్టులను కేటాయించాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సింహయ్య, వాహిద్, హేమచంద్ర, ప్రకాశ్, బాల్‌రాం, దశరథనాయక్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement