నల్లగొండ, న్యూస్‌లైన్ : చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించడంలో జిల్లా మహిళలకు సముచిత స్థానం లభించలేదనే చెప్పవచ్చు. 1952 నుంచి 2009 దాకా శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే బోధప డుతుంది. వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనైనా మహిళా ప్రాతినిధ్యం పెరుగు తుందని ఆశిద్దాం.
అసెంబ్లీకి...ఆరుట్ల మొదలు
రాష్ట్ర అవతరణకు ముందు తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి నడిపించిన ఆరుట్ల కమలాదేవి తొలిసారిగా 1952లో ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆమెతో మొదలైన మహిళల రాజకీయ ప్రస్థానం గత ఎన్నికల వరకు కొనసాగింది. ఇదే ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సుమిత్రాదేవి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి జరిగిన వరుస ఎన్నికల్లో పలువురు మహిళలు పోటీ చేసి ఓటమిపాలైనా చట్టసభల్లో అడుగుపెట్టేందుకు తమ వంతు ప్రయత్నమే చేశారు. ఇక రాష్ట్ర అవతరణ తర్వాత అంటే 1957, 1962లో కూడా ఆరుట్ల కమలాదేవి ఆలేరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ సాయుధ పోరాటంతో చరిత్రలో నిలిచిన కమలాదేవి మూడుసార్లు గెలుపొందడం పెద్ద హ్యాట్రిక్‌గా చెప్పొచ్చు. కమ్యూనిస్టు కంచుకోటగా పేరొందిన నకిరేకల్ సెగ్మెంట్ నుంచి 1972లో కాంగ్రెస్ తరపున తొలి మహిళ అభ్యర్థి మూసాపేట కమలమ్మ గెలుపొంది రికార్డు సృష్టించారు. తెలంగాణ సాయుధ పోరాటం, మద్యపాన వ్యతిరేక ఉద్యమం, ఇతర ప్రజా ఉద్యమాలతో చరిత్రకెక్కిన మల్లు స్వరాజ్యం తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 ఎన్నికల్లో టీడీపీ తరపున నల్లగొండ నుంచి పోటీ చేసిన గడ్డం రుద్రమదేవి కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా మోహన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె నల్లగొండ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1989 ఎన్నికల్లో మహిళలకు ప్రాతినిధ్యం లభించలేదు.
కానీ 1994, 99 ఎన్నికల్లో తుంగతుర్తి, మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేసిన మల్లు స్వరాజ్యం, సుందరి అరుణలు ఓటమి పాలయ్యారు. నక్సలైట్ల చేతిలో మాజీ హోంమంత్రి దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి హత్యకు గురైన తర్వాత ఆయన సతీమణి ఉమా మాధవరెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. మాధవరెడ్డి మరణంతో 2000 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో భువనగిరి నుంచి ఉమామాధవరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లో ఆమె భువనగిరి నుంచి పోటీ చేసి రెండుసార్లు గెలుపొందారు. మొత్తంగా ఉమామాధవరెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. నక్సలైట్ల కాల్పుల్లో అకాల మరణం చెందిన మరోనేత, గిరిజన నాయకుడు మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ సతీమణి భారతీ రాగ్యానాయక్ రాజకీయాల్లోకి వచ్చారు.
2002లో దేవరకొండలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా శాసన మండలికి ప్రాతినిధ్యం వహించారు. దీంతో పాటు ప్రభుత్వ చీప్‌విప్‌గా కూడా పనిచేశారు. పార్లమెంట్ స్థానాలకు వేర్వేరుగా తల్లీకూతురు పోటీ చేసి ఓరికార్డు నెలకొల్పారు. 1996లో అప్పటి మిర్యాలగూడ ఎంపీ స్థానానికి మల్లు స్వరాజ్యం పోటీచేశారు. కానీ ఆమె బద్దం నర్సింహారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2009 ఎన్నికల నాటికి ఆమె కూతురు పాదూరి కరుణ పోటీ చేసే అవకాశం దొరికింది. ఆమె 2009 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ప్రజారాజ్యం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డి
అసెంబ్లీకి అంతంతే..
Published Sat, Mar 8 2014 3:50 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement