కర్నూలు(అగ్రికల్చర్): ముస్లింలు సుఖసంతోషాలతో జీవించాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చివరిరోజున శుక్రవారం ముస్లింలకు కలెక్టర్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. స్టేట్ గెస్ట్‌హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులు తరలివచ్చారు.
కార్యక్రమానికి జిల్లాపరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, జేసీ హరికిరణ్, దేశం నేతలు కేఈ ప్రతాప్, నాగేశ్వరరావు యాదవ్, ముస్లిం మైనార్టీ నేతలు హఫీజ్ ఖాన్, అల్లా బకాష్, పర్వేజ్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ మస్తాన్ వలీ, ఆల్‌మేవ నేతలు రోషన్ అలీ, సయ్యద్ హుసేన్, అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలసి కలెక్టర్, ఎస్పీ, జేసీ, ప్రజాప్రతినిధులు ప్రార్థనలు జరిపారు.
పవిత్ర రంజాన్ పర్వదినం జరుపుకోనున్న ముస్లిం సోదరులందరికి కలెక్టర్ తదితరులు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ఇచ్చిన ఇఫ్తార్ విందు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ పర్వదినం అన్ని ముస్లిం కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు.
ముస్లింలకు ఎస్పీ రంజాన్ శుభాకాంక్షలు
కర్నూలు: రంజాన్ పండుగను పురస్కరించుకుని జిల్లాలోని ముస్లింల కు, పోలీసు శాఖలోని సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఎస్పీ ఆకే రవికృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు జిల్లా మతసామరస్యానికి ప్రతీక అని, కులమతాలకు అతీతం గా అందరూ కలసిమెలసి ఉంటారని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతో పవిత్రంగా నెలరోజుల పాటు దీక్షలు చేసి కుటుంబ సభ్యులతో రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ మరో ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ ఆయన ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
సుఖసంతోషాలతో జీవించాలి
Published Sat, Jul 18 2015 3:11 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement
Advertisement