
కరీంనగర్ క్రైం: మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డిపై మరో ఏసీబీ కేసు నమోదు అయింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన కిన్నర సారయ్య, వేల్పుల ఓదయ్య, దాడి కనుకయ్య కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. వీరు వ్యాపారం నిమిత్తం మోహన్‌రెడ్డి వద్ద 2014 నవంబర్ 17న రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నారు.
ఇందుకు రేణికుంట టోల్‌గేట్ వద్ద ఉన్న 30 గుంటల భూమిని తనఖా పెట్టారు. దీనికి మోహన్‌రెడ్డి తమ్ముడైన మహేందర్‌రెడ్డి పేరు మీద సేల్‌కమ్ జీపీఏ చేయించారు. వీటితోపాటు ముగ్గురికి చెందిన ప్రామిసరి నోట్లు, బాండ్ పేపర్లు, తెల్ల కాగితాలు రాయించుకున్నారు. 2015 వరకు మొత్తం రూ.30 లక్షలు చెల్లించామని, అయినా భూమిని తిరిగి ఇవ్వకుండా గన్‌తో బెదిరించాడని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment