నయీం గ్యాంగ్తో మాజీ ఏఎస్ఐ మోహన్రెడ్డికి సంబంధాలు ఉన్నాయని మహేందర్ రెడ్డి ఆరోపించారు.
కరీంనగర్: గ్యాంగ్‌స్టర్ నయీం తరహాలోనే మాజీ ఏఎస్‌ఐ మోహన్రెడ్డి అరాచకాలకు పాల్పడ్డాడని మోహన్రెడ్డి బాధితుల సంఘం అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆరోపించారు. నయీం గ్యాంగ్తో మాజీ ఏఎస్ఐకి సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. అందుకు నయీం డైరీలో కేఎన్ఆర్ హెచ్సీ అని రాసి ఉండటమే నిదర్శనమన్నారు.
శనివారం కరీంనగర్లో మహేందర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... మోహన్రెడ్డితోపాటు అతడి తండ్రి ఆదిరెడ్డిని అరెస్ట్ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. 432 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తే మోహన్రెడ్డి, నయీంల బినామీలు.. వారి మధ్య సంబంధాలు వెలుగులోకి వస్తాయని మహేందర్ రెడ్డి తెలిపారు.