mahendra reddy
-
నల్లగొండ డీసీసీబీ చైర్మన్‌పై దాడికి యత్నం
తుర్కపల్లి: టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడికి ఎన్నిక వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్భంగా నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డిపై పలువురు కార్యకర్తలు దాడికి యత్నించారు. శనివారం యాదా ద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలకేంద్రం లో మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తుర్కపల్లి మండల కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పడాల శ్రీనివాస్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, వెంకటాపురం సర్పంచ్ కల్లూరి ప్రభాకర్‌రెడ్డి మధ్య పోటీ ఏర్పడింది. నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నరేందర్‌రెడ్డిని అధ్యక్షుడిగా నియమి స్తూ మహేందర్‌రెడ్డి రాత్రి 7 గంటల సమయం లో ప్రకటన చేశారు. సమావేశం నిర్వహించిన ఫంక్షన్హాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో మహేందర్‌రెడ్డి బయటకు వచ్చారు. ఆయన తన కారు వద్దకు వెళ్తుండగా కొందరు కుర్చీలు విసిరారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. కొందరు రాళ్లు విసరడం తో మహేందర్‌రెడ్డి కారు అద్దాలు పగిలాయి. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. దీంతో పడాల శ్రీనివాస్‌కు మద్దతుగా పలువురు నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సమావేశంలో ఆందోళనకు దిగిన కార్యకర్తలు -
రంజిత్.. ఓ అజ్ఞాతవాసి!
సాక్షి, హైదరాబాద్/మద్దూరు(హుస్నాబాద్): దళంలో పుట్టిపెరిగిన రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ అనే మావోయిస్టు తాజాగా జనజీవనస్రవంతిలో కలిశాడు. మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరుగా ఉండి మృతి చెందిన రామన్న కుమారుడే రంజిత్. అతడు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి వద్ద బుధవారం హైదరాబాద్‌లో లొంగిపోయాడు. రంజిత్ మావోయిస్టు దంపతులు సావిత్రి– రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్నలకు 1998లో దండకారణ్యంలో జన్మించాడు. ‘‘సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం బెక్కల్ గ్రామానికి చెందిన రామన్న 1982లో పార్టీలో చేరి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అక్కడే సావిత్రిని వివాహం చేసుకున్నాడు. సావిత్రి ఛత్తీస్‌గఢ్‌లోని కిష్టారం డివిజనల్ కమిటీ మెంబర్‌గా ఉంది. రంజిత్ దండకారణ్యంలోని జనతన సర్కారు పాఠశాలలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత నిజామాబాద్‌లోని కాకతీయ స్కూల్లో శ్రీకాంత్ అని పేరు మార్చుకుని 10వ తరగతి వరకు చదివాడు. 2017లో తండ్రి ఆదేశాల మేరకు పార్టీలో చేరాడు. 2019లో రామన్న దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న సమయంలో అనారోగ్యంతో చనిపోయాడు. అనంతరం పార్టీలో రంజిత్‌కు అవమానాలు, వేధింపులు ఎక్కువకావడంతో తాళలేక పోలీసులకు లొంగిపోదామని తల్లి వద్ద ప్రతిపాదించగా ఆమె తిరస్కరించింది’’అని డీజీపీ వివరించారు. రంజిత్‌కు సాయం రంజిత్‌కు పునరావాసం కింద రూ.4 లక్షలు, తక్షణ ఆర్థిక అవసరాల కింద రూ.ఐదువేలను డీజీపీ అందజేశారు. కాగా, హరిభూషణ్ స్థానంలో తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా దామోదర్ బాధ్యతలు తీసుకున్నట్లుగా తమకు సమాచారం ఉందని డీజీపీ తెలిపారు. మాకు సంతోషంగా ఉంది... ‘మా తమ్ముడు రావుల రామన్న 12 ఏళ్లప్పుడు కుటుంబాన్ని వదిలి ఉద్యమంలోకి వెళ్లాడు. తర్వాత తిరిగి రాలేదు. 2019లో అనారోగ్యంతో బాధపడుతూ చనిసోయాడని పోలీసుల ద్వారా తెలిసింది. మా తమ్ముడికి కొడుకు రంజిత్ ఉన్నాడని పోలీసుల ద్వారానే తెలిసింది. అతడు ఉద్యమ బాటను విడిచి జనజీవితంలో కలవడం మాకు సంతోషంగా ఉంది. –రావుల చంద్రయ్య (రావుల శ్రీనివాస్ అన్న) -
గుడ్‌న్యూస్: సీజ్ చేసిన వాహనాలు రిలీజ్
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన వాహనదారులకు తెలంగాణ పోలీస్‌శాఖ శుభ వార్తను అందించింది. లాక్డౌన్ కాలంలో జప్తు చేసిన వాహనాలను విడుదల చేయాలని రాష్ట్ర డీజీపీ నిర్ణయించారు. వాహనాలను భద్రపరచడం సమస్యగా మారడంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వాహనాల విడుదలపై డీజీపీ మహేందర్ రెడ్డి పలు మార్గదర్శకాలను జారీ చేశారు. మోటార్ వెహికిల్ చట్టం (ఎంవీ యాక్టు) కింద జప్తు చేసిన వాహనాలకు జరిమానా విధించి యజమానులకు ఇవ్వాలని సూచించారు. ఐపీసీ, ఇతర చట్టాల కింద జప్తు చేస్తే యజమాని నుంచి బాండ్ రాయించుకని, జిరాక్స్ పత్రాలు తీసుకోవాలి తెలిపారు. (తెలంగాణలో కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు) కోర్టుల్లో కేసులకు సంబంధించిన ప్రక్రియ యథాతథంగా కొనసాగించాని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ అమలు నేపథ్యంలో చాలా మంది వాహనదారులు ఆంక్షలను ఉల్లంఘించిన విషయం తెలిసిందే. పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1.60 లక్షల వాహనాలను సీజ్ చేసినట్టు పోలీసుశాఖ ద్వారా సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే లక్షకు పైగా వాహనాలు ఉన్నట్లు తెలిసింది. (దేశంలో కొత్తగా 3390 పాజిటివ్ కేసులు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1401284236.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘సై’రా మహేంద్ర
పట్టుదల, ఏకాగ్రతతో జాతీయస్థాయిలో క్రీడల్లో రాణించి తర్లుపాడు మండలం నాయుడుపల్లె గ్రామానికి వన్నె తెచ్చాడో ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి. ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే అయినా రగ్బీ ఆటపై అతనికున్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆటకు తమ సహాయ సహకారాలు అందించి జాతీయస్థాయిలో రాణించే విధంగా తోడ్పడ్డారు. సాధనతో ఏదైనా సాధించవచ్చని నిరూపించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు గాలి మహేంద్రరెడ్డి. తర్లుపాడు: జిల్లాలోని తర్లుపాడు మండలం నాయుడుపల్లె గ్రామానికి చెందిన గాలి వెంకట రంగారెడ్డి, జి.వి.శివ దంపతుల కుమారుడు మహేంద్రరెడ్డి. పాఠశాల స్థాయిలో రగ్బీ ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. పోటీల్లో రాణిస్తూ పలు బహుమతులు సాధించాడు. రగ్బీపై మహేంద్రరెడ్డికి ఉన్న ఆసక్తి, రాణిస్తున్న తీరును గమనించి ఫారిన్ కోచ్‌లు పలు సూచనలు చేస్తూ కర్నూలులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పంజాబ్‌లోని లూథియానాలో జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు గతనెల 30 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు నిర్వహించారు. ఆ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృందానికి మహేంద్రరెడ్డి కెప్టెన్‌గా సెమీ ఫైనల్ ఆడటం మండలం, జిల్లా, రాష్ట్రానికే వన్నె తెచ్చింది. రగ్బీ క్రీడ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.జి.భరత్, సెక్రటరీ బి.రామాంజనేయులు, సీనియర్ క్రీడాకారుల ప్రొత్సాహంతో పలు విభాగాల్లో రాణించి ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికయ్యాడు. రెండేళ్ల క్రిందట జిల్లా స్థాయి పోటీల్లో రాణించాడు. ఆ తరువాత 2017 సెప్టెంబర్‌లో సౌత్ జోన్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ పోటీల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రగ్బీ క్రీడాకారులు పాల్గొన్నారు. సౌత్ జోన్ పోటీల్లో మహేంద్రరెడ్డి రాణించటంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ప్రభుత్వం చేయూతనివ్వాలి: జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు ప్రభుత్వం చేయూతనిచ్చి ప్రొత్సహించాల్సి ఉంది. ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మండల, పట్టణ కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి శిక్షకులను నియమించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న పేద క్రీడాకారులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఉపకార వేతనం అందించాలని పలువురు క్రీడాభిమానులు కోరుతున్నారు. ప్రతిభ ఉన్నా ఆర్థికస్థోమత లేని క్రీడాకారులు ఎందరో మరుగున పడుతున్నారని వారిని గుర్తించి ప్రోత్సహించాలంటున్నారు. రగ్బీ క్రీడలో ఆల్ ఇండియా డివిజన్ 2లో 15ఎస్ ఛాంపియన్షిప్ ఆడిన గాలి మహేంద్రరెడ్డి జాతీయ స్థాయి క్రీడాకారుడిగా పశ్చిమ ప్రకాశానికి వన్నె తెచ్చాడని సాధన డిగ్రీ కళాశాల డైరెక్టర్ జి.ఎల్.రమేష్‌బాబు విద్యార్థిని అభినందించారు. కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న మహేంద్రరెడ్డి జాతీయ క్రీడల్లో రాణించటం కళాశాలకే గర్వకారణంగా ఉందన్నారు. -
కూటమి.. ఓటమే
యాలాల: మహాకూటమికి జనాదరణ లేదని, ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా.. ఓటమి చవిచూడటం తప్ప వారు చేసేదేమీ లేదని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం లక్ష్మీనారాయణపూర్ నుంచి చేపట్టిన బైక్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. ప్రజల్లో తమకు పెరుగుతున్న మద్దతు చూసి ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వీరికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని వెల్లడించారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా పథకాలు అన్నివర్గాల ప్రజలకు వరంగా నిలిచాయని స్పష్టంచేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పెట్టుబడి సాయాన్ని రూ.5 వేలకు పెంచుతామని, ఆసరా పింఛన్లు రెండింతలు చేస్తామని, దివ్యాంగులకు రూ.3 వేల పెన్షన్ ఇస్తామని, సొంత స్థలం ఉన్నవారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు చెబుతున్న కల్లబొల్లి మాటలను పట్టించుకోవద్దని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సారథ్యంలో చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేస్తామని ప్రకటించారు. పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని చెప్పారు. భారీ మెజార్టీతో గెలిపిస్తాం.. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిద్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించే నాయకుడిగా పేరున్న మంత్రి మహేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో వచ్చి హడావుడి చేసే నాయకులను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ నాయ కులు చేస్తున్న విషప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాయన్నగౌడ్, రైతు సమితి మండల కన్వీనర్ సురేందర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వడ్డే రాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శంకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ సిద్దారెడ్డి, మాజీ వైఎస్ చైర్మన్ అనంతయ్య, మాజీ సర్పంచ్‌లు శివకుమార్, వెంకటయ్య, బిచ్చన్నగౌడ్, సీనియర్ నాయకులు పగిడియాల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి.. తాండూరు: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని కులాలకు సముచిత స్థానం లభించిందని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా హోలియ దాసరి సంఘం అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దాసరి వెంకటయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం టీఆర్ఎస్లో చేరారు. పెద్దేముల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు, వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరు తున్నారని తెలిపారు. అనంతరం విశ్రాంత ఉద్యోగి నరేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి తనతో కలిసి రావాలని ఆయనను కోరారు. పార్టీ నాయకులు కోహిర్ శ్రీనివాస్, కిషన్‌రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, రమేష్‌కుమార్, కృష్ణయ్యగౌడ్, ఎర్ర బాలప్ప, రవీందర్, ఆజంఖాన్, విఠల్, ప్రసాద్, రఘు ఉన్నారు. -
కేసీఆర్‌కే పట్టం కట్టాలి
సాక్షి, పెద్దేముల్: గిరిజనుల బతుకులు బాగుపడాలనే సంకల్పంతో తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిన కేసీఆర్‌కే మళ్లీ పట్టం కట్టాలని ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డి కోరారు. పెద్దేముల్ మండల పరిధిలోని ఇందూరు, బాయిమీదితండా, ఆత్కూర్, తట్టెపల్లి, బండమీదిపల్లి, అడ్కిచెర్ల, ఓంలానాయక్‌తండా, హన్మాపూర్ గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తండాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముం దుకు వెళ్తోందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని స్పష్టంచేశారు. రైతులు, మధ్యతరగతి ప్రజలకు కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీల అడ్రస్ గల్లంతవుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మరోసారి సీఎం కుర్చీని అలంకరిస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ధి సంఘం చైర్మన్ గాజీపూర్ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు నర్సింలు, నాయకులు ద్యావరి విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ నారాయణగౌడ్, ప్రకాశ్, అంజిల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రాములుయాదవ్,శ్రీనివాస్‌రెడ్డి, గెమ్యానాయక్, మల్లేశ్, జనార్దన్‌రెడ్డి, రాంచెంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బాలికల ఆరోగ్య రక్షణ కిట్టు పథకంలో భాగంగా అజీజ్‌నగర్‌లో శనివారం వాటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉండగా ఆయన ఇతర మండలానికి వెళ్లడంతో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికల ఆరోగ్యంగా ఉండేందుకు కేసీఆర్ ఆరోగ్య రక్షణ పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. బాలికలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నాదే సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడలేని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ప్రవేశపెడుతుందని తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. సాధ్యం కాని పథకాలను సైతం పవేశపెట్టి అమలుచేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని కొనియాడారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ అనితాశ్రీహరియాదవ్, జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, జిల్లా విద్యాధికారి సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ నాగయ్య, ఈఓపీఆర్డీ ఉషారాణి, ఎంపీటీసీ కొత్తమానిక్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోహన్‌గౌడ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ మంగలి మంగరాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లయ్య, అధికారులు పాల్గొన్నారు. -
దేశానికి తెలంగాణ దిక్సూచి
బషీరాబాద్(తాండూరు) : స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు రైతుల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం అమలు చేయనివిధంగా టీఆర్ఎస్ సర్కారు రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికే తెలంగాణ దిక్సూచిలా మారిందని చెప్పారు. శనివారం ఆయన బషీరాబాద్ మండలం జీవన్గీ, దామర్‌చెడ్, బాద్లాపూర్ గ్రామాల్లో రైతుబంధు చెక్కులు, పాసు పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో కుంటుపడిపోయిన వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అన్నారు. బీడుభూములను సాగులోకి తీసుకురావడానికి ప్రాజెక్టుల నిర్మాణాలు, చెరువుల పునరుద్ధరణ, నిరంతర ఉచిత విద్యుత్, ఎకరాకు రూ.4వేల పెట్టుబడి సాయం, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పండించిన పంటకు గిట్టుబాటు ధర తదితర కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. ఖరీఫ్, రబీ రెండు పంటలకు రూ. 4వేల చొప్పున ఏడాదికి రూ.8వేల పెట్టబడి సాయం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రూ.12వేల కోట్లతో ఈ పథకాన్ని రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతిగా నిలిచిందనడానికి అమలు చేస్తున్న పథకాలే నిదర్శనమని తెలియజేశారు. జిల్లాలో 243.33కోట్ల నిధులు ఈ ఖరీఫ్ సీజన్‌కు పెట్టుబడి సాయంగా ఇస్తున్నామని చెప్పారు. మళ్లీ నవంబర్‌లో రెండో విడత కింద సాయం చేస్తామన్నారు. ఏళ్ల తరబడి భూ వివాదాలతో కార్యాలయాల చుట్టూ తిరిగిన రైతులకు భూ ప్రక్షాళనలో భాగంగా సమస్యలను పరిష్కరించి నేరుగా రైతుల వద్దకు అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి పాసుపుస్తకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రైతుల కోసం తెలంగాణ సర్కారు అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలియజేశారు. రైతులు పెట్టుబడి సాయాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించుకోకుండా కేవలం లాగోడి కోసమే వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కరుణ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ద్వారా బషీరాబాద్ మండలంలో 12వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. తాండూరు ఆర్డీఓ వేణు మాధవ్‌రావు మాట్లాడుతూ.. రైతుబంధు పథకంలో రైతులకు ఎలాంటి సమస్య వచ్చిన హెల్ప్‌డెస్క్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కళావతి, వైస్ చైర్మన్ మాణిక్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి జాకబ్, తహసీల్దార్ వెంటకయ్య, రైతు సమితి జిల్లా సభ్యుడు అజయ్ ప్రసాద్, మండల కోఆర్డినేటర్ శంకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, జీవన్గీ, కాశీంపూర్, దామర్‌చెడ్ సర్పంచులు పద్మమ్మ, కుందేలు గంగమ్మ, సబిత, ఎంపీటీసీలు స్వరూప, అరుణ, రాజేందర్‌రెడ్డి, గ్రామ కోఆర్డినేటర్లు నర్సిరెడ్డి, కాశీనాథ్, పంతులు, వ్యవసాయ శాఖ ఏడీఏ సచిన్దత్, పలువురు రైతులు పాల్గొన్నారు. -
చెక్కులివ్వకపోతే చిక్కులే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘రైతుబంధు’ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందజేస్తామని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారి పట్టాదార్ పుస్తకాలు, రైతులకు ఆర్థిక చేయూతనందిస్తున్న రాష్ట్రం మనదేనని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘రైతుబంధు’ పథకంపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్నివర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి వివాదరహిత భూములకు చెక్కులను పంపిణీ చేస్తున్నప్పటికీ, మిగతా వాటికి దశలవారీగా సాయం అందజేస్తామన్నారు. వక్ఫ్, దేవాదాయ, భూదాన్ భూముల విషయంలో ప్రభుత్వంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, యాదయ్య, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పెంటారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కోఅర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ హరీశ్, వివిధ మండలాల రైతు సమన్వయ సమితి సమన్వయకర్తలు, బ్యాంకర్లు పాల్గొన్నారు. రైతు రావాలి.. ఆధార్ చూపాలి...కలెక్టర్ రఘునందన్‌రావు.. వ్యక్తిగతంగా రైతు వస్తేనే చెక్కు అందజేస్తాం. ఆధార్‌ను తప్పనిసరిగా చూపాలి. చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీకి ప్రత్యేక బృందాలను నియమించాలి. రెవెన్యూ గ్రామం యూనిట్‌గా చెక్కులు పంపిణీ చేస్తాం. ప్రతి మండలానికి నోడల్ బ్యాంకును గుర్తించాం. 10వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య ఉదయం 7 నుంచి 11 గంటలవరకు, సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు చెక్కులను నిర్దేశిత ప్రదేశంలో అందజేస్తాం. చెక్కుల జారీ, తేదీ, స్థలం తదితర వివరాలతో కూడిన స్లిప్పులను రెండు రోజలు ముందటే ఆయా గ్రామాల్లో రైతులకు పంపిణీ చేస్తాం. వక్ఫ్, దేవాదాయ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూదాన్ బోర్డు అసైన్డ్ చేస్తే ఆ రైతులకు మాత్రం పెట్టుబడి సాయం దక్కుతుంది. పట్టాదార్లకు కాకుండా ఇతరులకు చెక్కుల పంపిణీ జరగదు. ఆధార్ వివరాలు ఇవ్వని 22 వేల మందికి చెక్కులు ఇవ్వడంలేదు. జిల్లావ్యాప్తంగా 93శాతం రికార్డుల ప్రక్షాళన జరిగింది. మిగతా 7 శాతంలో వివాదాస్పద, కోర్టు కేసులు ఇతరత్రా భూ వివాదాలున్నవి ఉన్నాయి. రైతు బంధు పథకం కింద రూ.283.05 కోట్ల సాయం అందజేస్తున్నాం. బ్యాంకుల్లో నగదును సమృద్ధిగా ఉంచుకోవాలని ఆదేశించాం. నగదు మార్పిడిలో ఇబ్బందులు తలెత్తకుండా బ్యాంకులకు పోలీస్‌బందోబస్తును ఏర్పాటు చేస్తాం. చెక్కులివ్వకపోతే చిక్కులే.. 1965లో భూదాన్ యజ్ఞబోర్డు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ భూములను ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న రైతులకు పెట్టుబడి సాయం అందించలేమనడం సరికాదు. కబ్జాలో ఉన్న ప్రతి రైతుకూ సాయం చేయాల్సిందే. అలా చేయకపోతే పథకం ఉద్ధేశం పక్కదారి పట్టి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. 93శాతం మందికి చెక్కులు పంపిణీ చేసి.. మిగతావారిని విస్మరించడాన్ని కొందరు అనుకూలంగా మలుచుకునే వీలు లేకపోలేదు. -
'నయీం తరహాలో మోహన్‌రెడ్డి అరాచకాలు'
కరీంనగర్: గ్యాంగ్‌స్టర్ నయీం తరహాలోనే మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడ్డాడని మోహన్‌రెడ్డి బాధితుల సంఘం అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆరోపించారు. నయీం గ్యాంగ్‌తో మాజీ ఏఎస్ఐకి సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. అందుకు నయీం డైరీలో కేఎన్ఆర్ హెచ్‌సీ అని రాసి ఉండటమే నిదర్శనమన్నారు. శనివారం కరీంనగర్లో మహేందర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... మోహన్‌రెడ్డితోపాటు అతడి తండ్రి ఆదిరెడ్డిని అరెస్ట్ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. 432 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తే మోహన్‌రెడ్డి, నయీంల బినామీలు.. వారి మధ్య సంబంధాలు వెలుగులోకి వస్తాయని మహేందర్ రెడ్డి తెలిపారు. -
హనుమాన్ జయంతి ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
హైదరాబాద్ : గౌలిగూడలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా వందల కెమెరాలతో నిరంతర భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. గురువారం గౌలిగూడలో రేపు జరగనున్న హనుమాన్ జయంతి ఊరేగింపు ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డితోపాటు మహేందర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 5 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు మహేందర్‌రెడ్డి వివరించారు. -
గవర్నర్‌తో తెలంగాణ డీపీజీ, సీపీ భేటీ
-
గవర్నర్‌తో తెలంగాణ డీజీపీ, సీపీ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మంగళవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఓటుకు నోటు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇదే అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న గవర్నర్‌తో సమావేశమైన విషయం విదితమే. మరోవైపు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఈరోజు ఉదయం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. -
'జానారెడ్డిది సీటు కోసం ఆరాటం'
వికారాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత జానారెడ్డి పదవుల కోసం పాకులాడుతున్నారని మంత్రులు హరీష్‌రావు, మహేందర్ రెడ్డి విమర్శించారు. పొన్నాలది పదవి కోసం ఆరాటం, జానారెడ్డి సీటు కోసం ఆరాటం అంటూ ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో రైతు బజార్ ను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సర్వే జరుగుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రతీ కార్యకర్తను ఆదుకుంటామని మంత్రులు హామీయిచ్చారు. -
యువకుడిపై నిర్భయ కేసు
మెదక్ టౌన్, న్యూస్‌లైన్: యువతి పట్ల అసభ్యంగా వ్యవహరించిన ఓ యువకుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోని రాంనగర్లో నివాసం ఉండే యువతి(19) తన స్టడీ సర్టిఫికెట్ల నిమిత్తం సోమవారం హైదరాబాద్ వెళ్లి వస్తుండగా మెదక్ బస్సు తూప్రాన్ వద్దకు రాగానే మెదక్‌లోని పిట్లంబేస్ వీధికి చెందిన జక్కుల ప్రభాకర్ బస్సు ఎక్కి ఆ యువతి పక్క సీటులో కూర్చున్నాడు. ఈ క్రమంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు వెనకసీటోని మెదక్‌కు చెందిన మహేందర్‌రెడ్డికి విషయాన్ని చెప్పింది. దీంతో అతను ప్రభాకర్ ను నిలదీయగా దుర్బాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. పట్టణానికి చేరుకోగానే ఆ యువతి పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేసింది. ఈ మేరకు ప్రభాకర్‌పై నిర్భయ కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. -
సబిత సోదరుడికి బీజేపీ గాలం!
తాండూరు, న్యూస్‌లైన్: ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో బీజేపీ నాయకత్వం అభ్యర్థుల వేటను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్టీ గెలుపునకు అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్న అసెంబ్లీ స్థానాలపై కమలనాథులు కన్నేశారు. ఈసారి తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్‌ను పార్టీ అధిష్టానం లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ హోంమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి సోదరుడు నర్సింహారెడ్డి(బాబు)కి కమలనాథులు వల వేస్తున్నారు. తాండూరు నుంచి ఆయనను బరిలోకి దించాలని ఆపార్టీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నర్సింహారెడ్డితో బీజేపీ రాష్ట్రస్థాయి కీలక నేత ఒకరు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. నర్సింహారెడ్డి సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. టికెట్ విషయంలో కచ్చితమైన హామీ లభిస్తేనే రంగంలోకి దిగుతానని నర్సింహారెడ్డి సన్నిహిత వర్గాలతో ప్రస్తావించినట్టు సమాచారం. ఆసక్తిగా మారిన రాజకీయాలు.. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఒకవేళ తాను శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయాల్సి వస్తే తాండూరు నుంచి టీడీపీ తరపున తన సతీమణి, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డిని పోటీ చేయించాలని మహేందర్‌రెడ్డి యోచిస్తున్నారు. ఒకవేళ టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిరితే తాండూరు స్థానాన్ని బీజేపీకి కేటాయించి నర్సింహారెడ్డిని బరిలోకి దించేందుకు చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే నాయకుడు ఒకరు వ్యవహారం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. నర్సింహారెడ్డి బీజేపీ నుంచి బరిలోకి దిగితే తాండూరులో రాజకీయ సమీకరణాలు మారనున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ నుంచి నర్సింహారెడ్డికి అవకాశం ఇవ్వొద్దని టీడీపీ ప్రజాప్రతినిధి అయిన జిల్లా కీలక నేత ఒకరు తెరవెనుక పావులు కదుపుతున్నట్లు సమాచారం. తాండూరు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ విషయమై నర్సింహారెడ్డి ‘న్యూస్‌లైన్’ తో మాట్లాడుతూ బీజేపీ నాయకులు తనను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. -
కూతురును కంటావా
రాజుపాళెం, న్యూస్‌లైన్: ఆడపిల్లను కనిందని కట్టుకున్న భార్యను గెంటేసిన భర్త ఉదంతమది. మండలంలోని గాదెగూడూరు గ్రామానికి చెందిన మహేంద్రారెడ్డి భార్య శివలక్ష్మిని గెంటేశాడు. మూడునెలల క్రితం శివలక్ష్మి ఆడపిల్లకు జన్మనిచ్చింది. గర్భవతిగా ఉన్న సమయంలో స్కానింగ్ చేయించగా ఆడపిల్ల అని తెలియడంతో భర్త, అత్త, మామల నుంచి శివలక్ష్మికి వేధింపులు మొదలయ్యాయి. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నె గ్రామానికి చెందిన శివలక్ష్మికి 2009 నవంబరు 23వ తేదీన రాజుపాళెం గాదెగూడూరు గ్రామానికి చెందిన గొంగటి మహేంద్రారెడ్డితో వివాహమైంది. అప్పట్లో వరకట్నం కింద రూ.2.50 లక్షలు డబ్బు ఇచ్చారు. దాంతో బంగారు నగలను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి సజావుగా సాగిన సంసారంలో రెండేళ్ల నుంచి చిన్నపాటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో శివలక్ష్మి గర్భవతి అయింది. అడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలని కోరారు. పెళ్లయిన చాలా ఏళ్లకు గర్భం వస్తే అబార్షన్ చేయించుకోమంటారా అంటూ శివలక్ష్మి పుట్టింటికి వెళ్లింది. మూడు నెలల అనంతరం తిరిగి కాపురానికి రావడంతో శివలక్ష్మిని ఇంట్లోకి రానీయకుండా చేశారు. మూడు రోజులుగా శివలక్ష్మి ఇంటి ఆరుబయటే పడిగాపులు కాస్తోంది. సంఘటనపై రాజుపాళెం ఎస్ఐ సుబ్బారావు విచారణ చేపట్టారు. భర్త, మామలతో మాట్లాడారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. దీంతో పాపతో పాటు శివలక్ష్మిని ఇంట్లోకి తీసుకెళ్లారు. -
మీరేమైపోతే మాకేం!
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : భారీ వర్షాలు, వరద ముప్పుతో జిల్లా కొట్టుమిట్టాడుతున్న సమయంలో అధికార యంత్రాంగం మొత్తం హైదరాబాద్ బాట పట్టింది. వీరు వెళ్లింది అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకో లేక వ్యక్తిగత పనులకో అనుకుంటే పొరపాటే. మున్సిపల్‌శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి కుమార్తె పెళ్లి వేడుకలో పాల్గొనేందుకేనట! పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు అధికారులు అధిక ఆసక్తి చూపారు. మూడు రోజుల నుంచి వర్షాలతో జిల్లా అతలాకుతలమవుతుంటే అదేమీ పట్టని అధికారులు హైదరాబాద్ బాటపట్టారు. ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు,జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో బుధవారం తీవ్ర వరద ముప్పు నెలకొంది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు మున్సిపల్ సిబ్బంది అందుబాటులో లేరు. ఒంగోలు నగర కార్పొరేషన్ కమిషనర్‌తో సహా పలువురు సాంకేతిక సిబ్బంది, కందుకూరు మున్సిపల్ కమిషనర్ ఆయన సిబ్బంది హైదరాబాద్‌లోనే మకాం వేశారు. నగర కమిషనరైతే కనీసం ఫోన్లో కూడా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. జిల్లాలో కలెక్టర్ మినహా దాదాపు రెవెన్యూ సిబ్బందిదీ ఇదే పరిస్థితి. ఒంగోలు ఆర్డీఓ సైతం హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. తహసీల్దార్లు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరస్థితి నెలకొంది. మూడు రోజుల నుంచే జిల్లాలో వర్షాలు పడుతున్నాయి.. మున్సిపల్ కాంట్రాక్టు సిబ్బంది సమ్మెలో ఉన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమీ పట్టించుకోకుండా హైదరాబాద్ వెళ్లడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
గుండెకోత!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాపై జలఖడ్గం విరుచుకుపడింది. భారీ వర్ష బీభత్సంతో జిల్లా తల్లడిల్లిపోయింది. రికార్డు స్థాయి వర్షపాతంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గిద్దలూరులో ఓ విద్యార్థిని వాగులో కొట్టుకుపోయి దుర్మరణం పాలైంది. కొమరోలులో వాగులో పడి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వేలాది ఎకరాల పంటపొలాలు నీటమునిగాయి. రోడ్లను ముంచెత్తిన వాగులతో రాకపోకలు స్తంభించిపోయాయి. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కాలనీలు జలమయమయ్యాయి. జిల్లాలో జన జీవనం అస్తవ్యస్థమైంది. బాధితులను ఆదుకోవాల్సిన అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో విఫలమైంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి కనీస స్పందన లేకుండాపోయింది. దాంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్లపైకి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ వర్ష బాధితులకు ఆపన్నహస్తం అందించింది. గుండ్లకమ్మకు భారీ వరద కనీవినీ ఎరుగని రీతిలో జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తునే ఉంది. ఉరుములు... మెరుపులు... పిడుగులతో ప్రజల గుండెలు దద్దరిల్లాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఒంగోలులోనే గరిష్టస్థాయిలో 34సెం.మీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. చిలకలేరు, కొంకివాగు, నల్లవాగు, భవనాశి చెరువు అలుగు పొంగిపొర్లడంతో గుండ్లకమ్మకు వరదనీరు ముంచెత్తింది. సంతనూతలపాడులో చిన్న కాల్వ, పెద్దకాల్వ పొంగిపొర్లుతున్నాయి. చీమకుర్తిలో ముదిగొండవాగుకు వరద ముంచెత్తింది. గిద్దలూరు నియోజకవర్గంలో పరిస్థితి ఇంతకంటే భీతావాహంగా మారింది. పైలేరు, సర్వేరెడ్డిపల్లెవాగు, పగిలేరు వరద నీటితో పొంగిపొర్లుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పాణం తీసిన వ రద పోటెత్తిన వాగులు, వంకలు ఒకర్ని బలితీసుకున్నాయి. మరో ముగ్గురు గల్లంతయ్యారు. గిద్దలూరులో పైలేరులో విజయలక్ష్మి అనే 8వ తరగతి విద్యార్థిని కొట్టుకుపోయింది. ఆమెను రక్షించేందుకు స్థానికులు, అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విజయలక్ష్మి మృతదేహాన్ని పోతవరం వద్ద గుర్తించారు. కొమరోలులో పొంగిపొర్లుతున్న సర్వేరెడ్డిపల్లెవాగు బీభత్సమే సృష్టించింది. రోడ్లుపై నుంచి ప్రవహిస్తున్న వాగును దాటబోయి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. 16 మంది విద్యార్థులు ఒకరి చేతలు ఒకరు పట్టుకుని రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న వాగులోకి నడుచుకుంటూ వస్తున్నారు. కాగా వరద ఉధృతికి మొదట నడుస్తున్న బత్తుల శ్రీను అనే డిగ్రీ విద్యార్థి కొట్టుకుపోయాడు. ఆ వెంటనే మిగిలిన 15 మంది కూడా వాగులో పడిపోయారు. అప్రమత్తమైన స్థానికులు వాగులోకి దూకి గాలింపు చర్యలు చేపట్టారు. వాగులో కొట్టుకుపోతూ ఓ చెట్టును పట్టుకుని ఉన్న 9 మందిని స్థానికులు గుర్తించి రక్షించారు. మొదట కొట్టుకుపోయిన ముగ్గురి ఆచూకీ బుధవారం రాత్రి వరకు లభించలేదు. తీవ్రంగా నష్టపోయిన రైతులు ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలు అన్నదాత ఆశలను తుడిచిపెట్టేశాయి. భారీ వర్షాలకు జిల్లాలో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. పత్తిపంట దాదాపుగా తుడిచి పెట్టుకుపోయింది. వరి, రాగి, మొక్కజొన్న పంటలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. వాటితో పోల్చుకుంటే పొగనారుమళ్ల నష్టం తక్కువుగానే ఉంటుందని భావిస్తున్నారు. పంటల నష్టాన్ని అప్పుడే చెప్పలేమని అధికారులంటున్నా నష్టం మాత్రం అనూహ్యంగా ఉండనుందని స్పష్టమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 16వేల హెక్టార్ల పత్తిపంట, 600 హెక్టార్ల రాగిపంట, 10 వేల హెక్టార్ల మిర్చిపంట, 8 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 5 వేల ఎకరాల్లో వరి పంట, 500 హెక్టార్ల పొగాకు నారుమళ్లు దెబ్బతిన్నాయి. కాగా అనధికారిక లెక్కల ప్రకారం పంటల నష్టం అంతకు రెట్టింపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక్క పత్తిపంటే దాదాపు 30 వేల హెక్టార్లలో పత్తిపంట నష్టపోయినట్టు తెలుస్తోంది. పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో పత్తిపంట పూర్తిగా నాశనమైపోయింది. సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి, కందుకూరు నియోజకవర్గాల్లో కూడా పత్తిపంట బాగా దెబ్బతింది. చీరాల నియోజకవర్గంలో 2వేల ఎకరాల వరి పంట నీటమునిగింది. జల దిగ్బంధంలో గ్రామాలు జిల్లాలో గ్రామాలకు గ్రామాలు నీటమునిగాయి. రాకపోకలు స్తంభించిపోయాయి. ఎన్.జి.పాడు మండలంలో గుండ్లకమ్మ చాప్టా మీదుగా నీరు ప్రవహిస్తుడటంతో రాకపోకలకు విఘాతం కలిగింది. ఒంగోలుతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్.ఎన్.పాడు మండలంలో ముంగమూరు, మద్దులూరు, ఎం.వేములపాడు, కొమ్మపల్లివారిపాలెం గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. చీరాలలో మూడు చేనేత కార్మికుల కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. చేనేత మగ్గాలు నీటమునిగాయి. ఒంగోలు నగరంలో 50 కాలనీలు జలమయమవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. నగరంలోని ప్రధాన రహదారులపైన 4అడుగుల ఎత్తున నీరు ప్రవహించడం గమనార్హం. ఒంగోలులోని 220 కేవీ విద్యుత్‌సబ్ స్టేషన్లలోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. దాంతో ఒంగోలు నగరంలో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. భారీ వర్షాలు ఆర్టీసీపైనా ప్రభావం చూపించాయి. జిల్లాలో 28 రూట్లలో 113 బస్సు సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. దాంతో ఆర్టీసీకి * 10లక్షలు నష్టం వాటిల్లింది. మంత్రిగారి ఇంట పెళ్లంట! భారీ వర్షాలైతే మాకేంటంట!! ఇదీ అధికార యంత్రాంగం తీరు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల జిల్లాలో బుధవారం భారీ వర్షాలు పడతాయని వాతవరణ శాఖ మంగళవారమే హెచ్చరించింది. అయితే మాకేంటీ అన్నట్టుగా ఉంది జిల్లాలో ఎక్కువమంది అధికారుల తీరు. హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన మంత్రి మహిధర్‌రెడ్డి కుమార్తె వివాహానికే వారు మొగ్గుచూపారు. పొలో మంటూ హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. జిల్లాలో సగం మంది అధికారులు హైదరాబాద్‌లో ఉన్నారు. వారిలో ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా ఉండటం గమనార్హం. దాంతో జిల్లాలో వర్ష బాధితులకు సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు అధికారుల కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రం ఒంగోలులో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. సహాయ కార్యక్రమాలు అందించేవారు లేకపోవడంతో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఒంగోలు జయప్రకాష్ కాలనీ, నెహ్రూ నగర్ వాసులు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్ విజయకుమార్ కలెక్టరేట్లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆయన ఒంగోలులోని గుర్రం జాషువా కాలనీలో బుధవారం సాయంత్రం పర్యటించి బాధితులను పరామర్శించారు. సహాయక చర్యల్లో వైఎస్సార్సీపీ వైఎస్సార్సీపీ నేతలు వర్ష బాధితులకు అండగా నిలిచారు. హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యే బాలినేని తక్షణం స్పందించారు. వర్ష బాధిత ప్రాంతాల ప్రజలకు ఆహారం పంపిణీతో పాటు ఇతర సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బాలినేని గురువారం ఒంగోలులో వర్ష బాధితులను పరామర్శించనున్నారు.