తట్టెపల్లిలో మాట్లాడుతున్న మంత్రి మహేందర్‌రెడ్డి
సాక్షి, పెద్దేముల్: గిరిజనుల బతుకులు బాగుపడాలనే సంకల్పంతో తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిన కేసీఆర్‌కే మళ్లీ పట్టం కట్టాలని ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డి కోరారు. పెద్దేముల్ మండల పరిధిలోని ఇందూరు, బాయిమీదితండా, ఆత్కూర్, తట్టెపల్లి, బండమీదిపల్లి, అడ్కిచెర్ల, ఓంలానాయక్‌తండా, హన్మాపూర్ గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తండాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముం దుకు వెళ్తోందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని స్పష్టంచేశారు.
రైతులు, మధ్యతరగతి ప్రజలకు కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీల అడ్రస్ గల్లంతవుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మరోసారి సీఎం కుర్చీని అలంకరిస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ధి సంఘం చైర్మన్ గాజీపూర్ నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు నర్సింలు, నాయకులు ద్యావరి విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ నారాయణగౌడ్, ప్రకాశ్, అంజిల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రాములుయాదవ్,శ్రీనివాస్‌రెడ్డి, గెమ్యానాయక్, మల్లేశ్, జనార్దన్‌రెడ్డి, రాంచెంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment