బాలికకు ఆరోగ్య రక్షణ కిట్టు అందజేస్తున్న ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బాలికల ఆరోగ్య రక్షణ కిట్టు పథకంలో భాగంగా అజీజ్‌నగర్‌లో శనివారం వాటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉండగా ఆయన ఇతర మండలానికి వెళ్లడంతో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికల ఆరోగ్యంగా ఉండేందుకు కేసీఆర్ ఆరోగ్య రక్షణ పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. బాలికలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నాదే సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడలేని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ప్రవేశపెడుతుందని తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. సాధ్యం కాని పథకాలను సైతం పవేశపెట్టి అమలుచేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని కొనియాడారు.
అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ అనితాశ్రీహరియాదవ్, జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, జిల్లా విద్యాధికారి సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ నాగయ్య, ఈఓపీఆర్‌డీ ఉషారాణి, ఎంపీటీసీ కొత్తమానిక్‌రెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మోహన్‌గౌడ్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ మంగలి మంగరాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లయ్య, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment