Welfare schemes implementation
-
నాడు 87 శాతం హామీలు.. వంద రోజుల్లోనే అమలు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే 87 శాతం హామీలను అమలుచేసి దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఖజానాలో రూ.వంద కోట్లు మాత్రమే మిగిల్చి దిగిపోయిన చంద్రబాబు సర్కారు... అప్పులు కూడా పుట్టకుండా తరువాత ప్రభుత్వం చేయాల్సిన అప్పులను కూడా చేసేసింది. అయినా సరే.. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి తొలి కేబినెట్ సమావేశంలోనే పలు హామీల అమలుకు నిర్ణయాలు తీసుకుని అమలుచేయడం ప్రారంభించారు. ఖజానా ఖాళీగా ఉందనే సాకులతో హామీల అమలును ఏనాడూ వాయిదా వేయకుండా సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మేనిఫెస్టోను ఎదురుగా పెట్టుకుని వాటి అమలుకు నిరంతరం తపనపడ్డారు. తొలి కేబినెట్ భేటీలోనే అనేక హామీలకు ఆమోదంనిజానికి.. 2019 జూన్ 10న జరిగిన తొలి కేబినెట్ భేటీలోనే పలు హామీలు అమలుకు ఆమోదముద్ర వేశారు. నాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి వైఎస్ జగన్ హామీల అమలులో ఎక్కడా వెనకడుగు వేయలేదు. వంద రోజుల పాలనలోనే పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు సామాజికన్యాయం, మహిళా సాధికారత, పాలనలో పారదర్శకతకు పలు చారిత్రక చట్టాలను చేశారు. ఇందులో సాహసోపేతమైన చర్యలు కూడా ఉన్నాయి. ఇలా హామీల అమలు ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తొలి వంద రోజుల పాలనలోనే ప్రజల మన్ననలు పొందారు. ఇదీ హామీలపట్ల వైఎస్ జగన్ చిత్తశుద్ధి. అలాగే, ప్రజల వద్దకే పాలన, పథకాలు నేరుగా లబ్ధిదారులకే తీసుకెళ్లడం ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం తొలి వంద రోజుల్లోనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి 2019 అక్టోబరు 2న ప్రారంభించారు. ఈ సచివాలయాల్లో విధుల నిర్వహణకు ఏకంగా కొత్తగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను సృష్టించి పారదర్శకంగా భర్తీచేశారు. గ్రామాల్లో ప్రతీ 50 ఇళ్లకు, పట్టణాల్లో 75 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రజల సేవకు వలంటీర్లను నియమించారు.తొలి వంద రోజుల్లో జగన్ అమలు చేసిన హామీలివే..⇒ వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు పెన్షన్లను రూ.2,250కి పెంచారు. వికలాంగులకు రూ.3 వేలకు.. డయాలసిస్ పేషెంట్లకు రూ.10వేలకు పెన్షన్‌ను పెంచారు. ఇలా పెంచిన మొత్తాన్ని జూన్ 2019కి సంబంధించిన పింఛన్‌ను ఆ తర్వాత నెల జూలై 1న పంపిణీ చేశారు.⇒ ఉద్యోగులకు జూలై నుంచి 27 శాతం మధ్యంతర భృతి.⇒ అక్టోబరులో వైఎస్సార్ రైతుభరోసా అమలు.. 56 లక్షల మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం.⇒ అక్టోబరు 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం..⇒ అన్ని శాఖల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.18 వేలకు పెంపు.⇒ అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తల వేతనాలూ పెంపు.⇒ డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్ పర్సన్స్‌కు రూ.10 వేలు గౌరవ వేతనం⇒ మహిళల పేరు మీద ఉగాది రోజున రిజిస్ట్రేషన్.⇒ వచ్చే నాలుగేళ్లలో వైఎస్సార్ పేరుతో 25 లక్షల ఇళ్లు నిర్మాణం.⇒ జనవరి 26 నుంచి తెల్లకార్డు ఉన్న ప్రతీ తల్లికి అమ్మఒడి కింద రూ.15 వేలు.⇒ సెప్టెంబరు 1 నుంచి గ్రామ వలంటీర్ల ద్వారా ప్రతీ గడపకు నాణ్యమైన బియ్యంతోపాటు ఇతర సరుకులతో రేషన్ పంపిణీ.⇒ రాష్ట్రంలో 40 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్పు.. అన్ని సౌకర్యాల కల్పన.⇒ నాణ్యమైన విద్య, ఫీజుల నియంత్రణకు విద్యా సంస్కరణల కమిటీ ఏర్పాటు.⇒ ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లు అమలు. ⇒ జూలై 8న వైఎస్సార్ పుట్టిన రోజు రైతు దినోత్సవంగా నిర్వహణ.⇒ రూ.3,000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి.⇒ రైతులకు ఉచితంగా బోర్లు.. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లోకి 200 రిగ్‌ల కొనుగోలు.⇒ సున్నా వడ్డీ అమలుకు శ్రీకారం.⇒ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.⇒ అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1,150 కోట్లు.⇒ ఈ ఏడాది ఇళ్ల జాగాలు లేని ఆడపడుచులందరికీ ఇళ్ల స్థలాలు.⇒ ఆస్పత్రుల అభివృద్ధికి ఎమ్మెల్యేల అధ్యక్షతన కమిటీలు.⇒ 108, 104 వాహనాల ఆధునికీకరణ⇒ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే ఇచ్చిన హామీలకు చట్టబద్ధత.⇒ టెండర్లలో అవినీతి అరికట్టేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు.⇒ ప్రైవేట్ విద్యా సంస్థల నియంత్రణకు వేగంగా అడుగులు.⇒ భూముల రీసర్వే–శాశ్వత హక్కుల కల్పనకు చట్టం.⇒ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుకు చట్టం.⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ల చట్టం.⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ల చట్టం.⇒ ప్రభుత్వ నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల చట్టం.⇒ పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించే చట్టం. -
సంక్షేమం పేదల హక్కు
ఇటీవలి కాలంలో బాగా చర్చ లోకి వస్తున్న రెండు అంశాలు: సంక్షేమం, అభివృద్ధి. సమాజంలో ఉన్న పరిస్థితుల వల్ల లాభపడిన వర్గాలు సంక్షేమం అంటే గవర్నమెంట్ పేద వాళ్లకు దోచి పెట్టడం అనే అపోహను సృష్టించారు. నిజానికి సంక్షేమం అంటే గవర్నమెంట్ పేద వాళ్ళ పట్ల తనకు ఉన్న బాధ్యతను నెరవేర్చడమే. ఒక రకంగా చెప్పాలి అంటే సంక్షేమం పేద వాళ్ళ హక్కు. ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం తన ప్రజల బాగోగులు అయినప్పుడు సంక్షేమం అందులో ముఖ్య భూమిక పోషించక తప్పదు. చరిత్రలో వేల సంవత్సరాల క్రితమే సమ్రాట్ అశోకుడు తన ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టారు. తమిళనాడు లాంటి రాష్ట్రాలలో ద్రావిడ రాజకీయాల వల్ల ఇప్పటికీ వందేళ్లుగా సంక్షేమానికి పెద్ద పీట వేయడం కొన సాగుతోంది. తమిళనాడు ఈ రోజున చాలా ప్రమాణాల్లో దేశంలోనే ముందంజలో ఉండడానికి కారణం అక్కడ అమలు కాబడుతున్న సంక్షేమ పథకాలే. గడచిన ఐదేళ్లలో జగన్ సారథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ అమలు చేస్తున్న సంక్షేమం కూడా నిరవధికంగా ఇక ముందు కూడా కొనసాగితే అభివృద్ధి ఉరకలు వేస్తుంది. ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ విద్య వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. చిన్న వయసులోనే పేద కుటుంబాల నుంచి వస్తున్న పిల్లలకు గ్లోబల్ లింక్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్‌పై పట్టు కల్పిస్తే వాళ్లలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. తద్వారా రాష్ట్రానికీ కొత్త అభివృద్ధి ద్వారాలూ తెరుచుకుంటాయి. ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రతి విద్యార్థి విజయం సాధిస్తారు అని కాదు కానీ, తప్పనిసరిగా విజయం సాధించ గలిగే వారి నిష్పత్తి పెరగబోతోంది. తద్వారా ఒక మెట్టు పైన నిలబడగలిగే సామర్థ్యం గల యువశక్తి తయార వుతుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి ఉపయో గపడే అంశాలే. వృద్ధాప్య పెన్షన్ స్కీముల వల్ల కూడా తిరిగి సమాజానికీ, రాష్ట్రానికే ప్రయోజనం. వాళ్ళు ఇంకొకరిపై ఆధార పడే అవసరాన్ని తగ్గించడం వల్ల వారు కానీ, వారి కుటుంబీకులు కానీ పలు ఉత్పాదక పనుల్లో వారి శ్రమను వెచ్చించే అవకాశం కలుగుతుంది. ఇతర సంక్షేమ పథకాలూ ఇవే ఫలితాలనిస్తాయి. అయితే ప్రజలు వీటి వల్ల సోమరులవుతున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటి కువిమర్శలు ప్రజలను తక్కువగా చూడడం కంటే మరొకటి కాదు. ఇలాంటి విమర్శకులు ఎప్పుడూ కూడా ఉచిత భూమి, నిధులు పొందుతున్న బడా పారిశ్రా మికవేత్తలను నామమాత్రంగానైనా ప్రశ్నించరు. గతంలో తమిళనాడులో కరుణానిధి గవర్న మెంట్ హయాంలో ఉచిత కలర్ టీవీ పథకాన్ని అమలు చేశారు. దీన్ని కొందరు హేళన చేశారు. అయితే, కరుణానిధి ఆ పథకం ప్రవేశపెట్టడా నికి ఒక బలమైన కారణం చెప్పారు. గ్రామాలలో పేద, ముఖ్యంగా దళిత బహుజన వర్గాలకు చెందిన జనాలు గొప్పింటి వారి ఇంటి బయట నుంచుని టీవీలు చూసేవారు. ఈ కలర్ టీవీ పథకం ద్వారా ఎవరింటిలో వారు కూర్చునే టీవీని చూడగల ఆత్మ గౌరవం సాధించగలిగారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ జరిపిన ఒక పరిశోధన కలర్ టీవీల వల్ల మహిళా సాధికారత బలపడినట్టు తేల్చడం గమనార్హం. మిరిమిట్లు కొలిపే రహదారులూ, ఆకాశ హర్మ్యాలూ, పేరుకే తప్ప ఆచరణలో నిలబడలేని ‘స్మార్ట్ సిటీ’లు అభివృద్ధికి సూచీలుగా చంద్రబాబు లాంటివారు పేర్కొంటారు. కింది వర్గాల ప్రజల స్థితిగతుల్ని మార్చే ప్రయత్నం చేయకుండా కేవలం వీటి మీదే దృష్టి కేంద్రీకరిస్తే వచ్చే అభివృద్ధి మాయాజాలమే అవుతుందని ఇప్పటికే పలుమార్లు రుజువయ్యింది. తాను హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణం కావించానని ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు. కానీ హైదరాబాద్‌లో టీడీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. దాని అర్థం ఏమంటే ఎక్కడైతే అభివృద్ధి జరిగింది అని చెప్పారో అక్కడి ప్రజలే దానికి బలి అయ్యి తమ బ్రతుకులను ఛిద్రం చేసిన బాబును తిరస్కరించారు. మళ్ళీ 2019లో అమరావతి పేరు మీద చేసిన రియల్ ఎస్టేట్ ‘అభివృద్ధి’ దందాను కూడా రాష్ట్రం మొత్తం తిరస్కరించడమే కాకుండా అక్కడి ప్రజలు కూడా ఛీత్కరించారు. వారు చెప్పే ‘ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్’ ఆర్థిక పరిపుష్టి గలిగిన అమెరికా లాంటి దేశాల్లోనే విఫలమై నేడు అక్కడ కూడా సంక్షేమ అవసరాన్ని గుర్తిస్తున్నారన్న విషయాన్ని గమనించాలి. ప్రజలందరికీ గవర్నమెంటే ఆరోగ్య బీమా కల్పించాలి (మెడికేర్ ఫర్ ఆల్), సార్వత్రిక ప్రాథమిక ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్) గవర్నమెంటే కల్పించాలి అనే నినాదాలు మొదలయ్యాయి అక్కడ. కొన్ని వేల ఏళ్లుగా వేళ్ళూనుకుపోయిన కుల, వర్గ వైషమ్యాలతో నిండిన సమాజంలో వంచిత ప్రజల సంక్షేమంతో కూడిన అభివృద్ధి మాత్రమే ముందుకు తీసుకువెళ్లే మార్గం. డా‘‘ జి. నవీన్ వ్యాసకర్త సామాజిక,రాజకీయ అంశాల విశ్లేషకులు -
విప్లవాత్మక పరిపాలన
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా విప్లవాత్మక మార్పులతో 52 నెలలుగా సుపరిపాలన అందిస్తున్నామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గత పాలకులకు భిన్నంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన 99 శాతం వాగ్దానాలను అమలు చేయడం ద్వారా జగన్ చెప్పాడంటే చేస్తాడని.. మాట నిలబెట్టుకుంటాడని.. కష్టమైన, నష్టమైనా అండగా ఉంటాడనే మంచి పేరును దేవుడి దయతో తెచ్చుకోగలిగామన్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు మన ప్రభుత్వం చేసిన మంచే మన ధైర్యం.. మన బలం.. మన ఆత్మవిశ్వాసమని పార్టీ ప్రతినిధులకు ఉద్బోధించారు. సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల సదస్సులో గత 52 నెలలుగా అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేసిన మంచిని వివరిస్తూ సీఎం జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. మనం చేసిన మంచితో ప్రతి ఇంట్లో.. ప్రతి గ్రామంలో.. ప్రతి నియోజకవర్గంలో మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా అడుగులు వేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులను సమన్వయం చేసుకుంటూ ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి ఇంటికీ వెళ్లి మనం చేసిన మంచిని వివరిస్తూ ప్రతిపక్షాల తీరును ఎండగట్టి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ అడుగులు ముందుకు వేయించాల్సిన బాధ్యత మీ భుజస్కందాలపై పెడుతున్నానని మార్గనిర్దేశం చేశారు. బహుశా మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. టీడీపీ, జనసేన సహా విపక్షాల తీరుపై సీఎం జగన్ పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ ప్రజలతో మరింతగా మమేకమయ్యేందుకు చేపట్టనున్న ఎనిమిది కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ప్రకటించారు. సదస్సులో సీఎం జగన్ ఏమన్నారంటే.. అధికారం మనకు బాధ్యత మాత్రమే.. దేవుడి దయతో ప్రజలిచ్చిన అధికారం అన్నది మనకి బాధ్యతను మాత్రమే నేరి్పందని తెలియచేస్తూ వారికి తొలి సేవకుడిగా మీ ముందు మాట్లాడుతున్నా. అలా బాధ్యతగా వ్యవహరించాం కాబట్టే ఈ 52 నెలల్లో పౌరసేవల డెలివరీ విధానం, డీబీటీ ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చాం. మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులను ప్రకటించే నిర్ణయం తీసుకున్నాం. 26 జిల్లాలను ఏర్పాటు చేశాం. ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్ధాయిలో సచివాలయ వ్యవస్ధ, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్ధను తేగలిగాం. ప్రభుత్వ పథకాలను అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ అందించగలుగుతామా? ఇది సాధ్యమేనా? అనుకునే పరిస్థితుల నుంచి ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా పారదర్శకంగా అందించే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలిగాం. డీబీటీలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు 75 శాతానికిపైనే ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు మేనిఫెస్టో గురించి చెబుతారు. ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో వేసిన గత పాలకులకు భిన్నంగా మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం వాగ్దానాలు అమలు చేయడం ద్వారా జగన్ చెప్పాడంటే చేస్తాడని, మాట నిలబెట్టుకుంటాడని, కష్టమైనా నష్టమైనా అండగా ఉంటాడనే మంచి పేరును దేవుడి దయతో నాలుగున్నరేళ్ల పాలనలో తెచ్చుకోగలిగాం. అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలను గుండెల నిండా ప్రేమతో అభిమానించాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, బీసీలు, మైనార్టీలంటూ.. ప్రతి మాటకు ముందు నా అనే మాటకు అర్ధం చెబుతూ రూ.2.35 లక్షల కోట్లను డీబీటీ ద్వారా బటన్ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. నా అనే మాటకు అర్ధం చెబుతూ నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు 75 శాతానికి పైచిలుకు ఇవ్వగలిగాం. 80 శాతానికిపైగా ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పటివరకూ 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే కేవలం ఈ నాలుగున్నరేళ్లలో మరో 2.07 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా మీ బిడ్డ ప్రభుత్వం ఇవ్వగలిగింది. ఇందులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏకంగా 80 శాతం పైచిలుకు ఉద్యోగాలను ఇవ్వగలిగాం. 31 లక్షల ఇళ్ల పట్టాలను నా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. 22 లక్షల ఇళ్లు ఈ రోజు వారి పేరుతో వేగంగా కడుతున్నాం. ఇందులో అత్యధికంగా 80 శాతం పైచిలుకు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. సామాజిక న్యాయం అనే పదానికి అర్ధం చెబుతూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ కాంట్రాక్టుల్లో ఏకంగా 50 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చట్టం చేసి మరీ ఇవ్వగలిగాం. పేదలకు తోడుగా నిలబడ్డాం.. విద్య, వైద్య వ్యవసాయ రంగాలు బాగుంటేనే మారుమూల పల్లెల్లో పేద కుటుంబాలకు మంచి జరుగుతుందని నమ్మి ఈ మూడు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదరికం పోవాలని, పేదరికంలో ఉన్నవాళ్లు పైకి రావాలని, పేదరికం అడ్డు రాకూడదని ఈ మూడు స్తంభాలను బలపర్చాం. రైతులు, రైతు కూలీలు, మహిళలకు తోడుగా నిలిచాం. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రాంతాలవారీగా, సామాజిక వర్గాల వారీగా గుర్తించిన ప్రతి సమస్యకూ ఈ 52 నెలల కాలంలో పరిష్కారం చూపగలిగాం. నా సేనానులు.. దళపతులు ఈ రోజు ఇక్కడికి వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, జేసీఎస్ కో ఆర్డినేటర్లు, నియోజకవర్గాల పరిశీలకులు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, ఏఎంసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలు, జెడ్పీటీసీలు,ఎంపీపీలు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, కార్పొరేటర్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ గుర్తు మీద ఎన్నికైన మండలం, ఆపై స్థాయిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు, వారితో పాటు సమావేశానికి వచ్చిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నా మంత్రిమండలి సహచరులందరికీ మీ తమ్ముడిగా, అన్నగా నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రెండు మెట్లు ఎదిగి మరో రెండు మెట్లు ఎదగడానికి సిద్ధంగా ఉన్న ప్రజాసేవకులు, నా సేనానులే. ఇక్కడకు రాలేని నా కుటుంబ సభ్యులైన ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు అందరూ నా దళపతులే. జనవరి 1 నుంచి మరో నాలుగు కార్యక్రమాలు అక్టోబరు 25 నుంచి మొదలయ్యే నాలుగు కార్యక్రమాలు జనవరి 15 వరకు జరుగుతాయి. అవే కాకుండా జనవరి 1 నుంచి మరో నాలుగు కార్యక్రమాలు కూడా మొదలవుతాయి. జనవరి 1 నుంచి పెన్షన్ పెంపు.. నా అవ్వాతాతలకు, నా వితంతు అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.3,000 వరకూ పెంచుకుంటూ పోతామని చెప్పిన పెన్షన్ పెంపు కార్యక్రమానికి జనవరి 1న శ్రీకారం చుడతాం. ఈ కార్యక్రమం జనవరి 10వ తారీఖు వరకు 10 రోజుల పాటు జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తే ఇవాళ మీ బిడ్డ హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లిస్తున్నాడన్న విషయాన్ని చెప్పాలి. మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్ల ఖర్చు కేవలం రూ.400 కోట్లు కాగా ఈ రోజు మీ బిడ్డ చిరునవ్వుతో భరిస్తున్న భారం నెలకు అక్షరాలా రూ.2,000 కోట్లు అని వివరించాలి. జనవరి 10 నుంచి వైఎస్సార్ చేయూత జనవరి 10 నుంచి రెండో కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత మొదలవుతుంది. జనవరి 10 నుంచి జనవరి 20 వరకు ప్రతి గ్రామంలోనూ జరుగుతుంది. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా ఇప్పటికే మూడు దఫాల్లో రూ.14,129 కోట్లు ఇచ్చాం. జనవరిలో ఇవ్వబోయేది కూడా కలుపుకొంటే ఈ ఒక్క కార్యక్రమానికే ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇచ్చినట్లవుతుంది. అంతే కాకుండా వారికి బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందిస్తున్నాం. అక్కచెల్లెమ్మలు విజయగాధలను అందరికీ తెలియచేసే ఈ పండుగ వాతావరణంలో మీరందరూ భాగస్వాములై వారి ఆశీస్సులు తీసుకోవాలి. జనవరి 20 నుంచి వైఎస్సార్ ఆసరా.. జనవరి 20 నుంచి 30వతేదీ వరకు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం చివరి విడత నిధుల్ని చెల్లిస్తూ జగనన్న మాట నిలబెట్టుకుంటున్నాడని చెప్పాలి. నాలుగు దఫాలుగా నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటానని చెప్పా. మన ప్రభుత్వం రాకమునుపు పొదుపు సంఘాల ఎన్పీఏలు, అవుట్ స్టాండింగ్‌లు 18 శాతం కాగా ఈరోజు కేవలం 0.3 శాతం మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే మూడు దఫాలుగా ఆసరా కార్యక్రమం ద్వారా రూ.19,178 కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. చివరి విడతగా మరో రూ.6500 కోట్లు నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం జనవరి 20 నుంచి 30 వరకు ఆసరా ద్వారా చెల్లించి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. కేవలం వైఎస్ఆర్ ఆసరా ద్వారానే దాదాపు రూ.26 వేల కోట్లు వారి చేతిలో పెట్టాం. సున్నావడ్డీ ద్వారా మరో రూ.5వేల కోట్లు ఇచ్చాం. ఫిబ్రవరి: మళ్లీ జగనన్ననే తెచ్చుకుందాం ఇక ఫిబ్రవరిలో మళ్లీ జగనన్ననే తెచ్చుకుందాం కార్యక్రమాన్ని చేపట్టాలి. ఇది జగనన్న పంపించిన మేనిఫెస్టో అని చెబుతూ ప్రతి ఇంటికీ తీసుకుని వెళ్లే కార్యక్రమం చేస్తాం. ఫిబ్రవరిలో ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మార్చిలో ఎన్నికలకు సన్నద్ధం కావాలి కాబట్టి మనం చేసిన మంచిని గ్రామ గ్రామాన, ఇంటింటా అందరికీ తెలియజేసేలా, పర్యవేక్షించే బాధ్యతను మీ భుజస్కంధాలపై మోపుతున్నాం. మీలో ప్రతి ఒక్కరూ ఇక్కడ తెలుసుకున్న ప్రతి అంశంపైన గ్రామస్ధాయిలో అవగాహన కలిగించాలి. ఎన్నికల తర్వాతా.. జనంలోనే మన మాదిరిగా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా నిరంతరం జనంలో ఉన్న పార్టీ దేశంలో మరొకటి లేదని సగర్వంగా తెలియజేస్తున్నా. కోవిడ్ సమయంలో ఆదాయాలు తగ్గినా కూడా మాటకు కట్టుబడి ప్రజలకు మంచి చేశాం. మన బలం మాట నిలబెట్టుకోవడం. మన బలం విశ్వసనీయత అన్న పదానికి నిజమైన అర్ధం చెప్పడం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాలకు నిండు మనసుతో చేసిన మంచి మన బలం. 87 శాతం పైచిలుకు ఇళ్లల్లో మనం చేసిన మంచే కనిపిస్తుంది. నాలుగున్నరేళ్లలో మనం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మరి వై నాట్ 175? మనమంటే గిట్టని వారు ఎన్ని చెబుతున్నా అది కచ్చితంగా సాధ్యమే. ఇక మరింతగా ప్రజల్లోకి.. ఇప్పుడు అక్టోబరులో ఉన్నాం. బహుశా ఎన్నికలు మార్చి, ఏప్రిల్‌లో జరుగుతాయి. ఇన్ని అడుగులు మనం వేశాం. రాబోయే నెలల్లో వేసే అడుగుల గురించి మీ అందరితో నా ఆలోచనలను ఇవాళ పంచుకుంటా. వాటిని మీరు గ్రామస్ధాయిలోకి తీసుకెళ్లి కచ్చితంగా, బాగా అమలయ్యేలా మీరు పర్యవేక్షించాలి. ఈ బాధ్యతను మీరు తీసుకోవాలి. గ్రామ స్ధాయిలో సమావేశాలను నిర్వహించి గొప్పగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలి. జగనన్న ఆరోగ్య సురక్ష.. నాలుగు కార్యక్రమాల్లో ఒకటి.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. ఇది ఇప్పటికే జరుగుతోంది. మీరు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీవల్ల ప్రజలకు మరింత ఉపయోగం ఈ కార్యక్రమం ద్వారా జరగాలి. గత నెల 30న మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నవంబరు 10 వరకు కొనసాగుతుంది. ప్రివెంటివ్ కేర్‌లో దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేస్తున్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా సచివాలయాల పరిధిలో 15 వేల క్యాంపులను అర్బన్, రూరల్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. మొత్తంగా 1.60 కోట్ల ఇళ్లను కవర్ చేస్తున్నాం. ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని మ్యాపింగ్ చేస్తున్నాం. ఉచిత పరీక్షలకు శ్రీకారం చుట్టాం. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నాం. ఆ ఇంట్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వారిని చేయిపట్టుకుని నడిపించడమే కాకుండా అన్ని రకాలుగా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తున్నాం. మొత్తం 5 దశలలో నిర్వహిస్తున్నాం. ఐదో దశ కీలకం. మీరు ఎక్కువగా నిమగ్నం కావాల్సిన దశ ఇదే. ఇక మీదట ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా జరుగుతుంది. గ్రామాల్లో ప్రతి 6 నెలలకొకమారు ఈ క్యాంపు జరుగుతుంది. ‘‘వై ఏపీ నీడ్స్ జగన్..’’ ఇక రెండో కార్యక్రమం.. ‘‘వై ఏపీ నీడ్స్ జగన్’’. ప్రజలందరి ఆశీస్సులతో వారికి మరింత సేవ చేయడానికి, మరింత మంచి చేయడానికి కొనసాగాల్సిన అవసరాన్ని వివరించే కార్యక్రమమే ఇది. ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలని వివరిస్తూ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమం నవంబరు 1 తేదీ నుంచి మొదలవుతుంది. డిసెంబరు 10 వరకు దాదాపు 40 రోజులపాటు జరుగుతుంది. ఇందులో రెండు ముఖ్యమైన దశలుంటాయి. మొదటిది మన గ్రామాల్లోని సచివాలయాలను సందర్శించడం. రెండో దశగా రాష్ట్రంలో ఉన్న 1.60 కోట్ల ఇళ్లకు, ప్రతి గడపకూ వెళ్లేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఎంతమందికి లబ్ధి జరిగింది? వీటికి సంబంధించిన బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమంలో మీరంతా పాల్గొనాలి. ఆ తర్వాత గ్రామంలో పార్టీ జెండా ఎగరవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. స్ధానిక పెద్దల ఇంటికి వెళ్లి వారి ఆశీస్సులు పొందాలి. ఈ 52 నెలల కాలంలో గ్రామం నుంచి రాజధానుల వరకు మన ప్రభుత్వం ఎన్నెన్ని మార్పులు తెచ్చిందో ఇటీవల స్వాతంత్ర దినోత్సవం రోజు నా ప్రసంగంలో సుదీర్ఘంగా వివరించా. అందులో ప్రతి అంశాన్ని మండలస్ధాయి నాయకత్వం అర్ధం చేసుకోవాలి. గ్రామ స్ధాయి నాయకత్వానికే కాకుండా పెద్దలందరికీ వివరించే కార్యక్రమం జరగాలి. సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లు, గృహ సారధులు ప్రతి ఇంటినీ, ప్రతి గడపనూ విధిగా సందర్శించాలి. 99 శాతం వాగ్ధానాలను పూర్తి చేసిన విషయాన్ని మేనిఫెస్టో చూపిస్తూ వివరించాలి. అదే సమయంలో మన సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు 2014లో గత ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోను కూడా చూపించాలి. ప్రతి వాగ్ధానాన్ని వాళ్లు ఎలా ఎగ్గొట్టారో, ప్రజలను ఎలా మోసం చేశారో వివరించాలి. ఆ మోసాల గురించి ప్రతి ఇంట్లో టైం తీసుకుని వినయంగా, సుదీర్ఘంగా చెప్పే కార్యక్రమం చేయాలి. బస్సు యాత్రలు.. మూడో కార్యక్రమంగా బస్సు యాత్రలు అక్టోబరు 25వ తేదీన మొదలవుతాయి. డిసెంబరు 31 వరకు దాదాపు 60 రోజుల పైచిలుకు జరిగే కార్యక్రమమిది. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు జరుగుతాయి. ఒక్కో టీమ్‌లో పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సీనియర్ నాయకులంతా ఉంటారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మీటింగ్‌లు ఆ నియోజకవర్గంలో జరుగుతాయి. రోజూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు మీటింగ్‌లు జరుగుతాయి. ఒక్కో రోజు ఆ ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి మీటింగ్ పెట్టి ప్రభుత్వం చేసిన మంచి గురించి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, మారిన మన ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల గురించి, మారిన మన వ్యవసాయం గురించి, జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ స్ధానికంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రానికి మూడు ప్రాంతాల్లో మూడు పబ్లిక్ మీటింగ్‌లు, బస్సు పైనుంచే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభకు స్ధానిక ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ కన్వీనర్ అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా 60 రోజుల పాటు ప్రతిరోజూ మూడు ప్రాంతాల్లో మూడు మీటింగ్‌లు ఉంటాయి. మీరంతా ఈ బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొని మమేకం కావాలి. ఇది మామూలు బస్సు యాత్ర కాదు. ఒక సామాజిక న్యాయ యాత్ర. పేదవాడికి జరిగిన మంచిని వివరించే యాత్ర. 60 రోజుల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు జరుగుతాయి. ఆడుదాం ఆంధ్రా.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత నాలుగో కార్యక్రమంగా డిసెంబర్ 11 నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ మొదలవుతుంది. ఇది డిసెంబర్ 11 నుంచి సంక్రాంతి వరకు అంటే జనవరి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబరం. ఆడుదాం ఆంధ్రా ద్వారా నైపుణ్యం ఉన్నవారిని గ్రామస్ధాయి నుంచి గుర్తించి ప్రోత్సహించడం ప్రభుత్వ ఉద్దేశం. భారతదేశ టీమ్‌లో వైనాట్ ఆంధ్రప్రదేశ్? అనే రీతిలో కార్యక్రమం జరగాలి. ఈ కార్యక్రమం 45 రోజుల పాటు జరుగుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి మొదలై మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్ధాయిలో ఈ క్రీడా సంబరాలు జరుగుతాయి. మన గ్రామంలో మరుగునపడి ఉన్న మన పిల్లల టాలెంట్‌ను దేశానికే పరిచయం చేసే కార్యక్రమం ఇది. ఇక నుంచి ఈ కార్యక్రమం ఏటా జరుగుతుంది. -
AP: గడపల్లో ఘన స్వాగతం
సాక్షి, అమరావతి: ఓట్లు దండుకుని మొహం చాటేసిన మనుషులనే ఇన్నాళ్లూ చూశాం! ఎన్నికలు ముగియగానే మేనిఫెస్టోను మాయం చేసి చెత్తబుట్ట పాలు చేసిన పార్టీల గురించే మాకు తెలుసు! అధికారం చేపట్టాక ప్రజా సమస్యలను గాలికి వదిలేసి గ్రామాల వైపు తిరిగి చూడని నేతల పాలనలో దశాబ్దాల పాటు నలిగిపోయాం! మళ్లీ ఎన్నికలు వస్తే గానీ మా గుమ్మం తొక్కని నాయకులతో విసిగిపోయాం! అలాంటిది.. చరిత్రలో తొలిసారిగా 99 శాతం హామీలను నెరవేర్చి చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో మా గుమ్మం వద్దకు వస్తున్న ప్రజా ప్రతినిధులను ఇప్పుడే చూస్తున్నాం..! ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? ఇంకా ఏమైనా సమస్యలున్నాయా?.. ఆశీర్వదించండంటూ ఆత్మీయంగా గడప గడపనూ పలుకరిస్తున్న నాయకులను చూడటం ఇదే మొదటిసారి అని రాష్ట్ర ప్రజానీకం పేర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంతో ప్రతి గడప పులకరిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ నెల 20వతేదీ నాటికి ఎమ్మెల్యేలు 83,83,908 గృహాలను సందర్శించారు. ఆయా కుటుంబాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేకూర్చిన ప్రయోజనాలను వివరించి వారి ఆశీర్వాదాలను పొందారు. రాష్ట్రంలోని మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకుగానూ ఇప్పటివరకు ఎమ్మెల్యేలు 9,316 సచివాలయాలను సందర్శించారు. గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా సచివాలయాల వారీగా పర్యటిస్తూ ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజలను కలుసుకుంటున్న ఎమ్మెల్యేలు ఆయా కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చిన మేలును వివరిస్తూ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? అని ఆరా తీస్తూ ఆయా కుటుంబాలతో టిక్ పెట్టిస్తున్నారు. ప్రాధాన్యత పనులను గుర్తించి నిధులు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం మేర వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది. నవరత్నాల్లో భాగంగా కులమతాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ పారదర్శకంగా, సంతృప్త స్థాయిలో ప్రయోజనాలను అందించింది. ఏటా సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి ఆయా పథకాల కింద లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేస్తోంది. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులంతా ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజలను కలుసుకునేలా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గతేడాది మే 11వ తేదీన ప్రారంభించింది. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చిన ప్రయోజనాలను వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖలను అందజేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే సచివాలయాల పరిధిలో రెండు రోజుల పాటు పర్యటించడంతో పాటు స్థానికంగా ప్రజలకు అవసరమైన, ప్రాధాన్యత కలిగిన పనులను గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మంజూరు చేస్తున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో రూ.20 లక్షల చొప్పున అత్యంత ప్రాధాన్యత పనులను గుర్తించి వెంటనే మంజూరు చేస్తున్నారు. సచివాలయాలవారీగా నివేదికలు సిద్ధం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ నెల 20వతేదీ వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు పాల్గొన్నారనే వివరాలతో సచివాలయాలవారీగా నివేదికను ప్రణాళికా శాఖ రూపొందించింది. ఇప్పటి వరకు ఎన్ని గృహాలను సందర్శించారు? సచివాలయాల వారీగా ఎన్ని ప్రాధాన్యత పనులను గుర్తించారు? ఎన్ని పనులకు నిధులు మంజూరు చేశారు? ఎన్ని ప్రారంభమయ్యాయి? ఎన్ని పనులు పూర్తి చేశారు? తదితర వివరాలను నివేదికలో పొందుపరిచారు. సచివాలయాల్లో ఎన్ని రోజులు? (ఈనెల 20 వరకు) ► ఒక్కో సచివాలయంలో ఒక రోజు గడిపిన ఎమ్మెల్యేలు 9 మంది ► ఒక్కో సచివాలయంలో రెండేసి రోజులు గడిపిన ఎమ్మెల్యేలు 85 మంది ► ఒక్కో సచివాలయంలో మూడు రోజులు గడిపిన ఎమ్మెల్యేలు 46 మంది ► ఒక్కో సచివాలయంలో మూడు రోజులకు పైగా గడిపిన ఎమ్మెల్యేలు 11 మంది ఎంత మంది.. ఎన్ని రోజులు వెళ్లారు? (ఈ నెల 20 వరకు) ► 150 రోజులకు పైగా గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 40 మంది ► 121 – 150 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 43 మంది ► 91 – 120 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 38 మంది ► 61 – 90 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 18 మంది ► 31 – 60 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 11 మంది ► 1 – 30 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యే 1 గడప గడపకూ ప్రాధాన్యత పనులు ఇలా (ఈనెల 20 వరకు) ► రూ.1,454.30 కోట్ల విలువైన 37,725 ప్రాధాన్యత పనులు అప్లోడ్ ► రూ.1,342.68 కోట్ల విలువైన 34,767 పనులు మంజూరు ► రూ.1,179.06 కోట్ల విలువైన 31,346 పనులు ప్రారంభం ► రూ.251.22 కోట్ల విలువైన 6,554 పనులు పూర్తి -
23 నుంచి ‘జగనన్న సురక్ష’
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం, అర్హులెవరూ మిగిలిపోకుండా పథకాలను అందించడమే లక్ష్యంగా ఈనెల 23వతేదీ నుంచి జూలై 23 వరకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా, పటిష్టంగా అమలు చేసేందుకు దీన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం తొలిదశలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష గురించి వివరిస్తారు. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి అక్కడ ఇంకా ఎవరికైనా అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదా? ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? వివిధ రకాల సర్టిఫికెట్లను పొందడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా? అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తారు. ఆ వివరాలను నమోదు చేసుకుంటారు. ఆ తరువాత వెంటనే రెండో దశ కింద నిర్దేశిత తేదీల్లో మండల స్థాయి అధికారులు ఆయా గ్రామాల్లో సచివాలయాలను సందర్శిస్తారు. అర్హులుగా గుర్తించిన వారిని సచివాలయాల వద్దకు ఆహ్వానించి వారికి అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అదే రోజు అందచేస్తారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటారు. జగనన్న సురక్షా ద్వారా అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1వతేదీన లబ్ధి చేకూర్చనున్నారు. ఈమేరకు స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్షా కార్యక్రమం, గడప గడపకూ మన ప్రభుత్వంపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి జల్లెడ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్షా కార్యక్రమం గురించి వివరిస్తారు. ఆ ఇంటికి సంబంధించి ఇన్కమ్, మ్యారేజీ, డెత్ సర్టిఫికెట్ల నుంచి ప్రభుత్వ పథకాలను పొందడం దాకా ఏమైనా సమస్యలున్నాయా? అనే అంశంపై జల్లెడ పడతారు. ఒక్కరు కూడా మిస్ కాకుండా అన్ని వినతులు పరిష్కారం కావాలి. సమస్యలేమీ లేకుంటే కుశల ప్రశ్నలు వేసి వారి ఆశీస్సులు తీసుకుని మరో ఇంటికి వెళతారు. ఇంటింటికి వెళ్లిన సమయంలో ఎవరైనా సర్టిఫికెట్ల సమస్య లేదా ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నా, అర్హత ఉన్నా పథకాలు అందడం లేదని గుర్తించినా వివరాలు నమోదు చేసుకుంటారు. అనంతరం నిర్దేశిత తేదీల్లో గ్రామ సచివాలయాలకు వచ్చే మండల స్థాయి బృందాలు, వార్డు సచివాలయాలకు వచ్చే మున్సిపల్ స్థాయి బృందాలు అక్కడికక్కడే సర్టిఫికెట్లను ఇచ్చేస్తాయి. గ్రామాలకు రెండు బృందాలు మండల స్ధాయిలో ఎంపీడీవో, డిప్యూటీ తహశీల్దార్ ఒక బృందంగా, తహశీల్దార్, పంచాయతీరాజ్ ఈవో కలసి రెండో టీమ్‌గా ఏర్పాటవుతారు. ఈ రెండు బృందాలు గ్రామాలకు వెళ్తాయి. సచివాలయానికి వచ్చే తేదీ వివరాలను ముందే నిర్ణయించి అప్పటిలోగా గ్రామంలో ఉన్న క్షేత్రస్ధాయి సిబ్బంది ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తారు. నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటినీ జల్లెడ పడతారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలు, అర్హతలు తదితరాలకు సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు. సమస్యలున్న వారిని సచివాలయాల వద్దకు ఆహ్వానించి వారికి అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ అందిస్తారు. దీనివల్ల సమస్యలు మళ్లీ ఉత్పన్నం కాకుండా పరిష్కారమయ్యే అవకాశం కలుగుతుంది. వార్డులకు మున్సిపల్ బృందాలు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, సిబ్బంది ఒక టీమ్‌గా ఉంటారు. జోనల్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్, సిబ్బంది మరో బృందంగా ఏర్పడి వార్డుల్లో పర్యటిస్తారు. ఈ మొత్తం కార్యక్రమం జూన్ 23 నుంచి జూలై 23 వరకు నెలరోజుల పాటు జరుగుతుంది. సేవల్లో ఉన్నత ప్రమాణాలు.. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా అందే వినతుల పరిష్కారంలో క్వాలిటీ చాలా ముఖ్యం. గ్రామ సచివాలయాల దగ్గర నుంచి కలెక్టర్లు, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులంతా దీనిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు పెట్టారంటే ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో పరిష్కారం కాని వినతులను కూడా సమర్ధంగా, నాణ్యతతో పరిష్కరించాలి. సగటు మనిషి ముఖంలో చిరునవ్వులు చూడాలి. నిర్దేశించుకున్న సమయంలోగా నాణ్యతతో వినతులను పరిష్కరించడం ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతున్నాం. 99.35 శాతం వినతులు పరిష్కారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజులు గడిచింది. ఇందుకోసం 1902 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాం. 30 ప్రభుత్వ శాఖలు, 102 మంది హెచ్‌వోడీలతో పాటు రెండు లక్షల మందితో కూడిన ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు వినతుల పరిష్కారంపై దృష్టిపెట్టింది. సీఎంవో, సచివాలయం, విభాగాధిపతుల దగ్గర నుంచి జిల్లాలు, మండల స్థాయిల్లో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకూ 59,986 వినతులు అందగా నిర్దేశిత సమయంలోగా 39,585 విజ్ఞాపనలు పరిష్కరించాం. మరో 20,045 పరిష్కారం దిశగా పురోగతిలో ఉన్నాయి. 99.35 శాతం వినతులు పరిష్కారమయ్యాయి. వినతులు పరిష్కరించే తీరు బాగున్నా సంతృప్తి స్థాయి పెరగాల్సి ఉంది. తిరస్కరిస్తే ఇంటికెళ్లి వివరించాలి ఒకవేళ గ్రీవెన్స్‌ను రిజెక్ట్ చేస్తే సంబంధిత ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్లి ఎందుకు తిరస్కరణకు గురైందో వారికి వివరించాలి. సచివాలయ సిబ్బంది, వలంటీర్ వెళ్లి సంబంధిత వ్యక్తికి వివరించాలి. ఈమేరకు ఎస్‌వోపీలో మార్పులు తేవాలి. రిజెక్ట్ చేసిన గ్రీవెన్స్‌ను కలెక్టర్లు పరిశీలించాలి. ఇంకా పరిశీలించని గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే 24 గంటల్లోగా పరిష్కరించాలి. సంబంధిత విభాగానికి 24 గంటల్లోగా పంపాలి. ఈ మేరకు ప్రతి ఉద్యోగికి దీనికి సంబంధించి అవగాహన కల్పించాలి. గడప గడపకూ పనులకు నిధుల కొరత లేదు గడప గడపకూ మన ప్రభుత్వంలో ప్రాధాన్యతగా గుర్తించిన పనుల విషయంలో కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి. ఆయా గ్రామాల్లో ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం రూ.20 లక్షలు ప్రతి సచివాలయానికి ఇస్తున్నాం. ఇది చాలా ప్రాధాన్యాంశం. గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గుర్తించిన పనులకు ఈ డబ్బులు మంజూరు చేయాలి. వెంటనే ఆ పనులు ప్రారంభమయ్యేలా చూడటం, నిధుల మంజూరు సక్రమంగా జరగాలి. నిధులకు ఎలాంటి కొరత లేదు. మంజూరు చేసిన పనులను వెంటనే మొదలు పెట్టేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకుని పనులను ముందుకు తీసుకెళ్లాలి. ఆగస్టు 1న అర్హులకు పథకాలు జగనన్న సురక్ష ద్వారా వివిధ పథకాలకు అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1వతేదీన మంజూరు చేసి లబ్ధి చేకూరుస్తారు. అర్హత ఉన్నవారు ఎవరూ మిస్ కాకూడదన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశాల్లో ఒకటి. 26 జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమించిన అధికారులంతా ఆయా ప్రాంతాల్లో నెలకు రెండు దఫాలు పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. కలెక్టర్ల పర్యటన కూడా చాలా ముఖ్యమైన అంశం. ప్రతి జిల్లా కలెక్టర్ వారానికి రెండు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలి. నాలుగు సచివాలయాల్లో జాయింట్ కలెక్టర్ పర్యటించాలి. కార్యదర్శులు, హెచ్ఓడీలు నెలకు కనీసం రెండు సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలి. ఐటీడీవో పీవో, సబ్ కలెక్టర్, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలి. -
సీఎం జగన్ నిర్ణయం చరిత్రాత్మకం
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది మొదలు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం వినూత్నమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీల కుల గణనకు సంకల్పించి ఆ వర్గాల చిరకాల వాంఛ నెరవేర్చారు. గద్దెనెక్క దల్చుకున్న ప్రతి పార్టీ అట్టడుగు వర్గాల ఉద్ధరణే ధ్యేయమని ప్రకటించటం మన దేశంలో రివాజు. అధికారం వస్తే గిస్తే ఆ వర్గాల నేతల్లో కొందరికి మొక్కుబడిగా పదవులివ్వటం, ఆ వర్గాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునే పేరుతో నామమాత్రంగా నిధులు విదల్చటం కూడా షరా మామూలే. కానీ జగన్మోహన్ రెడ్డి ఇందుకు భిన్నంగా సాధారణ ప్రజానీకానికి అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే తన కేబినెట్లో 68 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కేటాయించి ఔరా అనిపించారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ చట్టసభల్లో, స్థానిక సంస్థల పదవుల్లో అట్టడుగు కులాలకు ప్రాతినిధ్యం గణనీయంగా పెంచటమే కాదు... అన్ని రకాల నామి నేటెడ్ పదవుల్లో, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో కూడా ఆ వర్గాలకు 50 శాతం కేటాయించాలని నిర్దేశించారు. వెనకబడిన కులాల్లో ఇంతవరకూ ఎవరి దృష్టీ పడని కులాలకు సైతం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి సామాజిక ఆర్థిక ప్రగతికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో బీసీల కుల గణనకు పూనుకోవాలనుకోవటం అత్యంత కీలక నిర్ణయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా, జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీ కులాలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో పెద్దగా ప్రాధాన్యత లేదు. వివక్ష కారణంగా వెనకబాటుతనానికి గురవుతున్న కులాలను గుర్తించేందుకు 1979లో కేంద్రంలోని అప్పటి జనతా పార్టీ ప్రభుత్వం మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇచ్చిన సమగ్రమైన నివేదికను పట్టించుకుని తగిన చర్యలు తీసుకోవాలన్న స్పృహ ఎవరికీ లేని కారణంగా దశాబ్దంపాటు అది మూలనపడింది. 1989లో అప్పటి ప్రధాని వీపీ సింగ్ నేతృత్వంలోని సర్కారు ఆ నివేదిక దుమ్ము దులిపి ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించటం ఆ వర్గాల వారికి విద్య, ఉద్యోగావకాశాలను కల్పించటం మాత్రమే కాదు... దేశ రాజకీయాల గతినే మార్చేసింది. ఆ తర్వాత నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదోమేరకు ఆ వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. అరకొరగానైనా ఆ వర్గాలకు రాజకీయ పదవులు దక్కుతున్నాయి. విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు ఇంకా పూర్తి స్థాయిలో అమలుకావటం లేదు. ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లోనూ, ఇతరత్రా ప్రభుత్వరంగ సంస్థ ల్లోనూ కోటా అమలు అంతంతమాత్రంగానే ఉన్నదని బీసీ వర్గాలు తరచు ఆరోపిస్తున్నాయి. జనాభాలో మెజారిటీ వర్గ ప్రజలు అభ్యున్నతి సాధించకుండా దేశం ఉన్నత స్థాయికి చేరుకోవటం సాధ్యమవుతుందా? దేశంలో చివరిసారి కులగణన బ్రిటిష్ పాలకుల హయాంలో 1931లో జరిగింది. స్వతంత్ర భారతదేశంలో పదేళ్లకోసారి నిర్వహించే జనాభా లెక్కల సేకరణ 1951లో మొదలు కాగా, 2011లో జరిగిన జనాభా లెక్కల సేకరణ వరకూ బీసీ కులాల గణన జోలికే మన పాలకులు పోలేదు. పశుపక్ష్యాదుల లెక్కలు సైతం తెలుసుకోవాలనుకునే ప్రభుత్వాలకు బీసీ జనాభా గణన పట్టకపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఒకపక్క అట్టడుగు వర్గాల ఉద్ధరణ ధ్యేయమంటూ పథకాలు రూపొందించిన పాలకులు అవి లక్షిత వర్గాలకు చేరుతున్నాయో లేదోనన్న స్పృహ లేకుండా గడిపారు. అందువల్లే ఇన్నేళ్లుగా ఆశించిన ఫలితాలు రాలేదన్నది వాస్తవం. వేళ్లమీద లెక్కించదగ్గ కులాలు మినహా ఇప్పటికీ చాలా బీసీ కులాలు సంక్షేమ పథకాల మాట అటుంచి కనీస అవసరాలు కూడా దక్కించుకోలేకపోతున్నాయి. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీ కులాలు 2,666 కాగా సంక్షేమ ఫలాలు అందుకునే కులాలు అందులో పట్టుమని పదిశాతం కూడా ఉండటం లేదు. బీసీ జనాభా సంఖ్య ఎంతన్నది మిస్టరీగా మిగిలిపోవటం వల్ల ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధిపరంగా ఆ వర్గాల స్థితిగతులేమిటన్నది ప్రభుత్వాలకు తెలియటం లేదు. రూపొందించే పథకాలు, అందు కోసం కేటాయించే నిధుల వ్యవహారం చీకట్లో తడుములాటగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 341 రోజులపాటు సాగించిన 3,641 కిలోమీటర్ల ప్రజా సంకల్పయాత్రలో కోట్లాదిమంది అట్టడుగు ప్రజానీకం కష్టాలనూ, కడగళ్లనూ జగన్ కళ్లారా చూసినందువల్లే నవరత్నాల పేరిట అనేక సంక్షేమ పథకాలు పొందుపరిచి మేనిఫెస్టో రూపొందించారు. వాటిని అమలు చేస్తూనే ఇతరేతర వర్గాలకు లబ్ధి చేకూరేలా మరిన్ని పథకాలను ఆచరణలోకి తీసుకొచ్చి సంక్షేమ ఫలాలు సంపూర్ణంగా అందేలా చర్యలు తీసుకున్నారు. బీసీల జనాభా గణన పూర్తయితే ఇది మరింత పదునుతేరుతుందన్న ఆలోచన ఆయనది. అందువల్లే ఈసారి జనాభా లెక్కల్లో బీసీ కులాలను గణించాలన్న బీసీ వర్గాలకు అందరికన్నా ముందు మద్దతు పలకటమేకాక, ఆ డిమాండ్‌ను సమర్థిస్తూ పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలతో మాట్లాడించారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేశారు. బీసీల కుల గణన నిర్ణయానికి అనువుగా ఇప్పటికే ఆ దిశగా అడుగులేసిన రాష్ట్రాల్లో కార్యాచరణ ఏ విధంగా ఉందన్న అంశాన్ని అధ్యయనం చేసేందుకు, మార్గదర్శకాలు రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. జాతీయ పక్షాలుగా ముద్రపడిన పార్టీలు సైతం బీసీ వర్గాల డిమాండ్‌పై నికరమైన విధానం ప్రకటించలేని నిస్సహాయతలో పడగా ఆదినుంచీ అందుకు మద్దతిస్తున్న జగన్మోహన్ రెడ్డి తన తాజా నిర్ణయంతో ఆ వర్గాలకు మరింత చేరువయ్యారు. -
రెట్టించిన వృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో వేగంగా వృద్ధి చెందుతున్నట్లు సామాజిక ఆర్థిక సర్వే 2022 – 23 వెల్లడిస్తోంది. అన్ని రంగాల్లో వృద్ధి రేటు దగ్గర నుంచి తలసరి ఆదాయం వరకు దేశ సగటు కంటే రాష్ట్రంలో అధికంగా నమోదు కావడం గమనార్హం. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో 13.98 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2022 – 23 సంవత్సరానికి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 16.22 శాతం వృద్ధి నమోదు కాగా ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి 15.9 శాతంగా ఉంది. 2021 – 22 (తొలి సవరించిన అంచనాల ప్రకారం) రాష్ట్ర జీఎస్డీపీ రూ.11,33,837 కోట్లు కాగా 2022–23 ముందస్తు అంచనాల ప్రకారం రూ.13,17,728 కోట్లకు చేరనుంది. అంటే ఒక్క సంవత్సరంలోనే నికరంగా రూ.1,83,891 కోట్ల విలువైన ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థకు వచ్చి చేరింది. ఇదే సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 2021–22తో పోలిస్తే 2022–23లో రూ.26,931 పెరిగి రూ.2,19,518కు చేరుకుంది. దేశవ్యాప్తంగా చూస్తే తలసరి ఆదాయంలో వృద్ధి రూ.23,476గా నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్న పథకాలతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను వేగంగా చేరుకుంటోందని ఆర్థిక సర్వే విశ్లేషించింది. విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, వ్యవసాయం తదితర రంగాలకు వివిధ పథకాల ద్వారా ఇప్పటివరకు రూ.1.97 లక్షల కోట్లను నేరుగా లబ్థిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. 2022–23 సామాజిక ఆర్థిక సర్వేను సీఎం వైఎస్ జగన్ బుధవారం విడుదల చేశారు. అందులో ముఖ్యాంశాలు ఇవీ.. అన్ని రంగాల్లో రెండంకెల వృద్ధి జీఎస్డీపీలో కీలకమైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో రాష్ట్రం రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 13.18 శాతం వృద్ధి నమోదు కాగా పరిశ్రమల రంగంలో 16.36 శాతం, సేవా రంగంలో 20.52 శాతం వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా చూస్తే వ్యవసాయ రంగంలో 11.2 శాతం, పరిశ్రమల రంగంలో 13.9 శాతం, సేవా రంగంలో 17.4 శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్రంలో ఒక్క వ్యవసాయ రంగంలోనే 20.72 శాతం వృద్ధి నమోదు కాగా ఉద్యానవన పంటల్లో 12.58 శాతం, పశు సంపదలో 7.32 శాతం, ఆక్వాలో 19.41 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం వ్యవసాయం, అనుబంధ రంగాల విలువ రూ.4,39,645 కోట్లకు చేరింది. పరిశ్రమల రంగంలో 16.36 శాతం వృద్ధితో రూ.2,83,821 కోట్లకు చేరింది. పరిశ్రమల రంగంలో కీలకమైన మైనింగ్ రంగంలో 15.81 శాతం, తయారీ రంగంలో 11.81 శాతం, ఎలక్ట్రిసిటీ 30.96 శాతం, నిర్మాణ రంగంలో 16.94 శాతం వృద్ధి నమోదైంది. సేవా రంగంలోకూడా దేశ సగటు కంటే రాష్ట్రం అధిక వృద్ధి రేటును నమోదు చేసింది. 2022–23లో దేశవ్యాప్తంగా సేవా రంగంలో 17.4 శాతం వృద్ధి నమోదైతే, రాష్ట్రంలో 20.52 శాతం వృద్ధి నమోదయ్యింది. ఏపీలో 2021–22లో సేవా రంగ ఉత్పత్తి విలువ రూ.4,07,810 కోట్లుగా ఉంటే 2022–23లో రూ.4,91,496 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. సేవా రంగంలో వాణిజ్యం–హోటళ్ల విభాగంలో 28.42 శాతం, రైల్వేలు 17.82 శాతం, రవాణా రంగం 28.42 శాతం, రియల్ ఎస్టేట్ 13.14 శాతం వృద్ధి నమోదయ్యింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 36.19 శాతం కాగా పరిశ్రమలు 23.36 శాతం, సేవా రంగం వాటా 4.45 శాతంగా ఉంది. సామాజిక ఆర్థిక సర్వే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్, తదితరులు విద్య ► మనబడి నాడు – నేడు ద్వారా మూడు దశల్లో పాఠశాలల్లో మౌలిక వసతులు పటిష్టం. ► తొలిదశ కింద రూ.3,669 కోట్లతో 15,717 పాఠశాలల అభివృద్ధి. మూడేళ్లలో 57,189 పాఠశాలలు, 3,280 ఇతర విద్యా సంస్థల్లో రూ.16,022 కోట్లతో మౌలిక వసతుల కల్పన. ► చదువులను ప్రోత్సహిస్తూ జగనన్న అమ్మ ఒడి ద్వారా రూ.19,617.60 కోట్లు వ్యయం. ► జగనన్న విద్యా కానుక కింద ఒకటి నుంచి 10వ తరగతి చదివే 47.4 లక్షల మంది విద్యార్థులకు రూ.2,368 కోట్లు........... ► జగనన్న గోరుముద్ద కోసం రూ.3,239 కోట్లు వ్యయం. ► జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌తో 24.75 లక్షల మంది విద్యార్థులకు రూ.9,249 కోట్ల మేర ప్రయోజనం. ► జగనన్న వసతి దీవెనతో హాస్టళ్లలో ఉంటున్న 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.3,366 కోట్లు లబ్ధి. వైద్యం – మహిళా సంక్షేమం ► ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులను నియమించి ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం అమలు. ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 3,255 ప్రొసీజర్లకు ఉచితంగా వైద్యం. ఇప్పటివరకు 1.41 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం. ► నాడు – నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు బలోపేతం. ► 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, 528 అర్బన్ హెల్త్ కేర్ క్లినిక్స్ ఏర్పాటు ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా 35.7 లక్షల మంది గర్భవతులు, బాలింతలు, పిల్లల్లో రక్తహీనత నివారించి పౌష్టికాహారం అందించేందుకు రూ.6,141 కోట్లు వ్యయం. ► ప్రస్తుతం ఉన్న 11 మెడికల్ కాలేజీలకు అదనంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు. మహిళా సాధికారత ► వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 26.7 లక్షల మంది మహిళలకు రూ.14,129 కోట్లు పంపిణీ. ► వైఎస్సార్ ఆసరాతో స్వయం సహాయక సంఘాలకు చెందిన 78.74 లక్షల మంది మహిళలకు రూ.12,758 కోట్లు. ► వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలకు రూ.3,615 కోట్ల వడ్డీ చెల్లింపు. 1.02 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం. సుస్థిరాభివృద్ధి.. ► నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానం. ► ఎస్డీజీ ఇండియా 2020–21 నివేదికలో నాలుగో స్థానం సాధించిన ఏపీ. ► ఎస్డీజీ–7 లక్ష్యంలో మొదటి ర్యాంకు, ఎస్డీజీ 14 లక్ష్యంలో రెండో ర్యాంకు. ► రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలన విధానాలను అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాలు. ► ఆర్బీకేలు, సచివాలయాలు, భూముల సమగ్ర సర్వే తదితర కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు. గృహ నిర్మాణం ► పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా మహిళలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన 30.65 లక్షల ఇళ్ల పట్టాలు జారీ. ► ఇప్పటివరకు 21.25 లక్షల ఇళ్లు మంజూరు చేయగా 4.4 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి. వివిధ దశల్లో కొనసాగుతున్న మిగతా ఇళ్లు. ► వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.32,909 కోట్ల వ్యయం. ► వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ప్రతీ నెలా 64.45 లక్షల మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు రూ.66,823.79 కోట్ల పంపిణీ. రైతుల సంక్షేమం కోసం.. ► అన్నదాతలకు సేవలన్నీ ఒకేచోట అందించే విధంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు. ► వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం కింద 52.38 లక్షల మంది రైతులకు రూ.27,063 కోట్ల మేర ఆర్థిక సాయం. ► ఉచిత పంటల బీమా పథకంతో రూ.6,872 కోట్ల ప్రీమియం చెల్లించిన ప్రభుత్వం. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 73.88 లక్షల మంది రైతులకు రూ.1,834.55 కోట్ల వడ్డీ సబ్సిడీ చెల్లింపు. ► వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ కోసం రూ.27,800 కోట్ల సబ్సిడీ చెల్లింపు, ఆక్వా రైతులకు రూ.2,647 కోట్ల సబ్సిడీ చెల్లింపు. ► పామాయిల్, బొప్పాయి, కోకో, టమాటా, కొబ్బరి, ఎండుమిర్చి ఉత్పత్తిలో మొదటి ర్యాంకులో ఆంధ్రప్రదేశ్. ► వైఎస్సార్ జలకళ కింద 9,629 మంది రైతులు లబ్థి పొందేలా రూ.188.84 కోట్ల విలువైన 6,931 బోర్ల తవ్వకం. ► వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద 1.20 లక్షల మంది మత్స్యకార కుటుంబాలకు రూ.422 కోట్లు పంపిణీ. పరిశ్రమలు ► మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో విజయవంతంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహణ. ► 386 ఎంవోయూల ద్వారా రూ.13.11 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు. 6 లక్షల మందికిపైగా ఉపాధి. ► రూ.19,115 కోట్ల పెట్టుబడితో 1.52 లక్షల ఎంఎస్ఎంఈల ఏర్పాటు. 13.63 లక్షల మందికి ఉపాధి. ► రూ.1.35 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 69 భారీ ప్రాజెక్టుల నిర్మాణ పనులు. ► వరుసగా మూడేళ్లుగా సులభతర వాణిజ్యం ర్యాంకుల్లో మొదటి స్థానం దక్కించుకుంటున్న ఏపీ. ► మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం, కాకినాడ సెజ్‌లో పోర్టులతోపాటు తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ఇతర సంక్షేమ పథకాలు ► జగ్జీవన్ జ్యోతి పథకం కింద 15.14 లక్షల మంది ఎస్సీలు, 4.5 లక్షల మంది ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ► సొంత ఆటోలు, ట్యాక్సీలున్న 2.74 లక్షల మందికి వైఎస్సార్ వాహనమిత్ర కింద నాలుగేళ్లుగా రూ.1,041 కోట్లు పంపిణీ. ► వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా 81,783 చేనేత కుటుంబాలకు రూ.788.50 కోట్లు. ► వైఎస్సార్ కాపునేస్తం కింద 3.56 లక్షల మంది మహిళలకు రూ.1,518 కోట్లు. ► వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 3.94 లక్షల మందికి రూ.595.86 కోట్ల మేర లబ్ధి. ► జగనన్న చేదోడు కింద 3.30 లక్షల మందికి రూ.927.49 కోట్లు. ► వైఎస్సార్ లా నేస్తం ద్వారా 4,248 మంది యువ న్యాయవాదులకు రూ.35.40 కోట్లు. -
సంక్షేమ సర్కారు ఆదర్శ పాలన
సాక్షి, అమరావతి: సమాజంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన దేశానికి ఆదర్శప్రాయమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దారని అభినందించారు. రాజకీయ నేతల అంతిమ లక్ష్యం ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సమాజ శ్రేయస్సే కావాలని, సీఎం జగన్ దీన్ని ఆచరణలో చూపిస్తున్నారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీపై వెళ్తున్న హరిచందన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజయవాడలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ గవర్నర్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. అందరికీ సంక్షేమ ఫలాలు ఆశ్చర్యమే రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం సంతోషదాయకం. సమాజంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా సంక్షేమ పథకాలను అందిస్తుండటం నిజంగా అబ్బురం. వీటిపై మేం చాలాసార్లు చర్చించుకున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు అన్ని నిధులు ఎలా సమకూరుస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను అడిగితే అంతా దేవుడి ఆశీర్వాదమని వినమ్రంగా బదులిచ్చారు. చిత్తశుద్ధితో పథకాలను ఆయన విజయవంతంగా అమలు చేస్తున్నారు. దేశానికి ఆదర్శంగా ఆర్బీకేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు దేశానికి ఆదర్శప్రాయం. ఆయన కోరికపై ఓసారి వాటిని సందర్శించి ముగ్దుడినయ్యా. సమాజంలో దాదాపు 70 శాతం ఉన్న రైతుల అన్ని అవసరాలను ఒకేచోట తీర్చేలా ఆర్బీకేలను తీర్చిదిద్దారు. భూసార పరీక్షలు నిర్వహణ నుంచి విత్తనాలు, ఎరువుల పంపిణీ వరకు అన్ని సేవలు అక్కడే అందిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా రైతులు తమ పంటలను ఆర్బీకేల ద్వారా సరైన ధరకు విక్రయించగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు చెప్పా. కోవిడ్ సమర్థంగా కట్టడి కోవిడ్ మహమ్మరిని సమర్థంగా కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవంతమయ్యారు. అన్ని వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలను సమర్థంగా సమన్వయపరిచారు. వైద్యులు, వైద్య సిబ్బంది, సమాజంలో వివిధ వర్గాలు స్పందించిన తీరు అమోఘం. ఆరోగ్యశ్రీ ఓ అద్భుతమైన పథకం. అదే తరహాలో కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోంది. రాజ్యాంగ సంప్రదాయాన్ని పాటించారు సీఎం జగన్ సదా రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమ కోసం పని చేస్తున్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రం, దేశం అభివృద్ధి, సమాజానికి మేలు చేయడమే రాజకీయ నేతల అంతిమ లక్ష్యం కావాలి. అవన్నీ ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో చూపిస్తున్నారు. గవర్నర్‌తో సత్సంబంధాలను కొనసాగించి గొప్ప రాజ్యాంగ సంప్రదాయాన్ని పాటించారు. ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై మేం తరచూ సంప్రదింపులు జరిపాం. ప్రజల శ్రేయస్సే అత్యంత ప్రాధాన్యత అంశంగా మేమిద్దరం భావించాం. అందుకే సమస్యల పరిష్కారం కోసం మెరుగైన రీతిలో చర్యలు తీసుకోగలిగాం. ముఖ్యమంత్రి జగన్‌తో అనుబంధాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఆయన్ను మా కుటుంబ సభ్యుడిగా భావిస్తా. ప్రజా ప్రభుత్వం సజావుగా పని చేసేలా.. గవర్నర్ హోదాలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సుహృద్భావపూర్వక వాతావరణాన్ని నెలకొల్పి ప్రజా ప్రభుత్వం సజావుగా సాగేలా చొరవ తీసుకున్నా. అందులో చాలావరకు సఫలీకృతమైనట్లు భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌ను విడిచివెళ్లడం కాస్త బాధగానే ఉంది. విధి నిర్వహణలో భాగంగా చత్తీస్‌గఢ్ వెళ్తున్నా. ఏపీ ప్రజలు కనబరిచిన ప్రేమాభిమానాలు, ఆదరణను ఎప్పటికీ మరవలేను. ఆంధ్రప్రదేశ్‌ను నా రెండో ఇల్లుగా భావిస్తున్నా. నాకు సహకరించిన సీఎం జగన్, మంత్రులు, ప్రజలందరికీ కృతజ్ఞతలు. ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం ► గవర్నర్ హరిచందన్ వీడ్కోలు కార్యక్రమంలో సీఎం జగన్ ► రాజ్యాంగ విలువలకు పెద్దపీట వేశారు ► వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా ఉండాలో చూపారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించి రాజ్యాంగ విలువలకు పెద్దపీట వేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్‌గా మూడేళ్ల పదవీ కాలంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా ఉండాలో ఆచరణలో గొప్పగా చూపించారన్నారు. ఓ ఆత్మీయుడైన పెద్దమనిషిగా గవర్నర్ వ్యవస్ధకు నిండుతనం తెచ్చారని ప్రశంసించారు. చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా వెళుతున్న విశ్వభూషణ్ హరిచందన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం తరపున శుభాకాంక్షలతోపాటు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. గవర్నర్‌కు వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. గవర్నర్ వీడ్కోలు సభలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ విద్యావేత్త, న్యాయ నిపుణుడు, స్వాతంత్య్ర సమరయోధుడు.. గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాలపై ఈమధ్య కాలంలో చాలా సందర్భాలలో వార్తలు చూస్తూనే ఉన్నాం. మన రాష్ట్రం మాత్రం అందుకు భిన్నం. ఓ తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక్కడి ప్రజా ప్రభుత్వానికి మన గవర్నర్ సంపూర్ణంగా సహకరించి వాత్సల్యం చూపారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉన్నత విద్యావేత్త, న్యాయ నిపుణుడు. వీటన్నింటికీ మించి ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. ఒడిశా ప్రభుత్వంలో నాలుగుసార్లు మంత్రిగా పని చేసి తాను బాధ్యతలు నిర్వహించిన ప్రతి శాఖలోనూ తనదైన ముద్ర చూపారు. ఒడిశా అసెంబ్లీకి ఐదుసార్లు ఎన్నికైన ఆయన 2000 ఎన్నికల్లో సమీప ప్రత్యర్ధిపై 95 వేల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. న్యాయవాదిగా కూడా పనిచేసిన బిశ్వభూషణ్ హరిచందన్ ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ యాక్షన్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించి న్యాయవాదుల సంక్షేమం, హక్కుల కోసం నిరంతరం పాటుపడ్డారు. ఆయన సతీమణి సుప్రవ హరిచందన్ వెన్నుదన్నుగా నిల్చి ఎన్నో విజయాలకు కారణమయ్యారు. ఆమెకి కూడా రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం, నా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు నిండు నూరేళ్లు జీవించి ఇంకా ఎంతో సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నా. ఆయనతో పంచుకున్న తీపి జ్ఞాపకాలు మా మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. వెంకన్న చిత్రపటం బహూకరణ వీడ్కోలు సందర్భంగా తంజావూరు శైలిలో రూపొందించిన తిరుమల శ్రీవారు, పద్మావతి అమ్మవార్ల చిత్రాలతో కూడిన మెమెంటోను గవర్నర్ హరిచందన్‌కు సీఎం జగన్ బహూకరించారు. జ్ఞాపికను అందించే ముందు సీఎం జగన్ తన పాదరక్షలు విడిచి పెట్టి చిత్రపటాన్ని అందించగా గవర్నర్ కూడా తన పాదరక్షలను వదిలేసి జ్ఞాపికను స్వీకరించారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు. -
హామీల అమలులో సీఎం జగన్ నూతన ఒరవడి..
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోనప్పటికీ 2022లో నవరత్నాలు–సంక్షేమ పథకాల అమలును రాష్ట్ర ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగించింది. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేసి ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి ముఖ్యమంత్రి జగన్ అమలులోకి తెచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతోపాటు పాలన సజావుగా కొనసాగుతోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి జగన్ కొత్త ఒరవడి నెలకొల్పారు. పథకాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి తు.చ. తప్పకుండా అమలు చేసి చూపించారు. బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు పారదర్శకంగా నగదు జమ చేశారు. 2022 జనవరి – డిసెంబర్ 27 వరకు నగదు బదిలీ, కీలక ఘట్టాలు ► జనవరి 1: వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.2,500కి పెంపు. 61.75 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చిన సీఎం జగన్. పెన్షన్ పెంపుతో 2022లో లబ్ధిదారులకు అదనంగా రూ.1,852.50 కోట్ల మేర ప్రయోజనం. ► జనవరి 3: వైఎస్సార్ రైతు భరోసా ద్వారా 50.59 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.1,120 కోట్లు. తుపాను వల్ల పంట నష్టపోయిన 8.34 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.646 కోట్లు జమ. ► జనవరి 25: వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 3,96,674 మంది అగ్రవర్ణ పేద మహిళలకు రూ.589 కోట్లు అందించిన సీఎం జగన్ ► ఫిబ్రవరి 8: జగనన్న చేదోడు ద్వారా 2,85,350 మంది లబ్ధిదారులకు రూ.285.55 కోట్లు ► ఫిబ్రవరి 15: భారీ వర్షాలకు పంట నష్టపోయిన 5,97,311 మంది రైతులకు రూ.542.06 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ జమ. 1,220 రైతు గ్రూపులకు యంత్రసామగ్రికి రూ.29.51 కోట్లు జమ ► ఫిబ్రవరి 28: జగనన్న తోడు ద్వారా 5,10,462 మంది చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాల కింద రూ.510.46 కోట్లు. సకాలంలో రుణాలు చెల్లించిన చిరు వ్యాపారులకు వడ్డీ కింద రూ.16.16 కోట్లు జమ ► మార్చి 14: జగనన్న విద్యా దీవెన కింద 10.82 లక్షల మంది విద్యార్థులకు రూ.709 కోట్లు జమ ► ఏప్రిల్ 4 : నూతనంగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలను క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం ► ఏప్రిల్ 8: నంద్యాలలో జగనన్న వసతి దీవెన కింద 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ ► ఏప్రిల్ 22: ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ సున్నా వడ్డీ కింద 1,02,16,410 మంది మహిళలకు రూ.1,261 కోట్లు జమ ► ఏప్రిల్ 28: గ్రేటర్ విశాఖ పరిధిలో 1,24,581 మందికి ఇళ్ల స్థలాలు, 3,03581 మందికి గృహ మంజూరు పత్రాలు పంపిణీ ► మే 5: తిరుపతిలో జగనన్న విద్యా దీవెన కింద 10,85,225 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709.20 కోట్లు జమ ► మే 16: వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కింద 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,758 కోట్లు జమ ► జూన్ 14: వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద మూడో ఏడాది 15.16 లక్షల మంది రైతులకు రూ.2,977.82 కోట్లు ► జూన్ 27 : శ్రీకాకుళం జిల్లాలో మూడో ఏడాది జగనన్న అమ్మ ఒడి కింద 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు జమ ► జూలై 5: జగనన్న విద్యా కానుక కింద 47,40,421 మంది విద్యార్థులకు రూ.931.02 కోట్ల వ్యయంతో కిట్లు పంపిణీ ► జూలై 15: వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా మూడో ఏడాది 2,61,516 మందికి రూ.10 వేల చొప్పున రూ.261.52 కోట్లు సాయం ► జూలై 19: వివిధ పథకాల కింద మిగిలిపోయిన 3,39,096 మంది అర్హులకు రూ.137 కోట్లు ► జూలై 29: వైఎస్సార్ కాపు నేస్తం కింద 3,38,792 మంది కాపు మహిళలకు రూ.508.18 కోట్లు జమ ► ఆగస్టు 3: జగనన్న తోడు కింద 3.95 లక్షల మంది చిరువ్యాపారులకు వడ్డీ లేని రుణాల కింద రూ.395 కోట్లు. సకాలంలో రుణాలు చెల్లించిన చిరువ్యాపారులకు వడ్డీ రాయితీ కింద రూ.15.96 కోట్లు జమ ► ఆగస్టు 11: జగనన్న విద్యా దీవెన కింద 11.02 లక్షల మందికి రూ.694 కోట్లు జమ ► ఆగస్టు 25: వైఎస్సార్ నేతన్న నేస్తం కింద 80,546 మందికి రూ.193.31 కోట్లు సాయం ► సెప్టెంబర్ 23: చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్సార్ చేయూత కింద 26,39,703 మంది మహిళలకు రూ,4,949 కోట్లు జమ ► అక్టోబర్ 17: వైఎస్సార్ రైతు భరోసా కింద 50.92 లక్షల మంది రైతులకు రూ.2,096.14 కోట్లు సాయం ► నవంబర్ 28: ఇన్పుట్ సబ్సిడీ కింద 45,998 మంది రైతులకు రూ.39.39 కోట్లు జమ. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద 8,22,411 మంది రైతులకు రూ.160.55 కోట్లు జమ ► నవంబర్ 30: జగనన్న విద్యా దీవెన కింద 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.694 కోట్లు జమ ► డిసెంబర్ 27: మొత్తం 11 పథకాలకు సంబంధించి మిగిలిపోయిన 2,79,065 మంది అర్హుల ఖాతాలకు రూ.590.91 కోట్లు జమ -
CM Jagan YSR District Tour: ప్రణాళిక మేరకే సంక్షేమాభివృద్ధి
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సంతృప్తికరంగా ప్రజల గడప వద్దకే అందిస్తున్నామని చెప్పారు. ఈ వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఎక్కడా వివక్షకు తావివ్వకూడదని, పరిపాలన పారదర్శకంగా సాగినపుడే ప్రజా వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నారు. వైఎస్సార్ జిల్లాలో రెండు రోజుల పర్యటనకు గాను శుక్రవారం సతీమణి భారతితో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కడపకు చేరుకున్నారు. అనంతరం లింగాల మండలం పార్నపల్లె పరిధిలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) వద్ద పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు గావించి, పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. తొలుత సీబీఆర్ వద్ద పర్యాటక శాఖ రూ.4.1 కోట్ల పాడా (పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) నిధులతో అధునాతనంగా నిర్మించిన వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్, అందులోని అతిథి గృహాలు, పార్కుతోపాటు రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన నాలుగు సీట్ల స్పీడ్ బోటు, 18 సీట్ల ఫ్లోటింగ్ జెట్టి, పర్యాటక బోటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన శిలా ఫలకాలను, లేక్ వ్యూ పార్కులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రిజర్వాయర్‌లో జలకళను, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చటి కొండల అందాలను తిలకిస్తూ కొద్దిసేపు సేద తీరారు. పాంటున్ బోటులో కూర్చొని కాసేపు రిజర్వాయర్‌లో షికారు చేశారు. లేక్ వ్యూ రెస్టారెంట్లో జిల్లా నీటి పారుదల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఆ శాఖ అధికారులు జిల్లాలోని మేజర్ రిజర్వాయర్లు, ఇతర ప్రాజెక్టుల పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పార్నపల్లెలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్)ను సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పర్యాటకానికి అత్యంత అనువైన ఈ ప్రాంతంలో అన్ని రకాల వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక శాఖ ద్వారా మరింత అభివృద్ధి చేస్తామన్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ పేరు పేరున పలకరింపు.. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, లింగాల మండల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం నేతలను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. వారి నుంచి వినతులను స్వీకరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి గురించి వివరించారు. అవినీతి ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా.. కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ఆ తర్వాత అందరితో ఫొటోలు దిగారు. సాయంత్రం 5.40 గంటలకు అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. అక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, నేతలను పేరుపేరునా పలకరించారు. పలువురి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారి లివర్ మార్పిడికి సీఎం భరోసా ఎదుటి వారి కష్టం వినాలే కానీ, వెంటనే స్పందించడంలో తన తర్వాతే ఎవరైనా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకర్‌రెడ్డి దంపతుల మూడున్నరేళ్ల కుమారుడు యుగంధర్‌రెడ్డికి లివర్ దెబ్బతింది. చాలా మంది వైద్యుల వద్దకు తిరిగారు. ఈ క్రమంలో బెంగుళూరులోని సెయింట్ జాన్ ఆస్పత్రికి వెళ్లగా.. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని, పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దివాకర్‌రెడ్డి కుటుంబం అంత పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించలేని పరిస్థితి. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కలిశారు. ఆయన శుక్రవారం వైఎస్సార్ జిల్లా లింగాల మండలం పార్నపల్లెకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు బాధిత కుటుంబాన్ని తీసుకుని వచ్చారు. వీరి కష్టం విన్న సీఎం.. వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. తక్షణమే బాలుడికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజును ఆదేశించారు. దీంతో దివాకర్‌రెడ్డి దంపతులు ఆనంద బాష్పాలతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. – సాక్షి ప్రతినిధి, కడప నేడు వివాహ వేడుకకు హాజరు కానున్న ముఖ్యమంత్రి తొలిరోజు పర్యటన అనంతరం శుక్రవారం రాత్రి ఇడుపులపాయలో బస చేసిన సీఎం వైఎస్ జగన్.. శనివారం ఉదయం పులివెందులలోని ఎస్పీఎస్ఆర్ కల్యాణ మండపంలో తన వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ యాదవ్ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. -
ఏపీ ప్రభుత్వ పథకాలు భేష్
పెనమలూరు/పెదకాకాని: రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ బృందం ప్రశంసించింది. పథకాలు అన్ని వర్గాల ప్రజలకు పారదర్శకంగా అందుతున్నాయని అభినందించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అండర్ సెక్రటరీలు తారాచందర్, అవినాష్ చందర్ మంగళవారం కృష్ణా జిల్లా వణుకూరు, పెదపులిపాక గ్రామాలతో పాటు గుంటూరు జిల్లా నంబూరులోని ప్రభుత్వ సచివాలయాలు, ఆర్బీకేలు తదితరాలను సందర్శించారు. వణుకూరు సచివాలయంలో లబ్ధిదారుల వివరాలు, వారికి అందజేస్తున్న పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. అలాగే రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ సేవలను స్వయంగా పరిశీలించారు. వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి పొందిన చేబ్రోలు బుజ్జి నిర్వహిస్తున్న కిరాణా దుకాణాన్ని సందర్శించారు. వణుకూరు జగనన్న కాలనీలో లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్మిస్తున్న గృహాలను కూడా పరిశీలించారు. పెదపులిపాకలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి తడి, పొడి చెత్త సేకరణ, వర్మీ కంపోస్టు తయారీపై సంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నంబూరులో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, పింఛన్ల పంపిణీ విధానాన్ని ప్రశంసించారు. ఆర్బీకేలోని ఏటీఎంను పరిశీలించారు. 14, 15 ఆర్థిక సంఘాల నిధుల వినియోగం గురించి అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. కేంద్ర బృందం వెంట కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. -
సంక్షేమం వద్దనడం రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, అమరావతి: ఆది నుంచి భారతదేశం సంక్షేమ రాజ్యమని, ఆధునిక ప్రజాస్వామ్యంలో సైతం అదే భావన అనుసరిస్తున్నామని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ పీఠికలోనూ సంక్షేమ భావన స్పష్టంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయని, కోవిడ్ కష్టకాలంలో ఈ పథకాలే ప్రజలను ఆదుకున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఇంటలెక్చువల్స్– సిటిజన్స్ ఫోరం (ఎపిక్) ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘సంక్షేమ పథకాలు అభివృద్ధి సోపానాలా? నిరోధకాలా?’ అంశంపై జరిగిన ఈ చర్చలో పలువురు మేధావులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందులో రిటైర్డ్ ప్రొఫెసర్లు, హైకోర్టు న్యాయవాదులు, పాత్రికేయులు, పరిశ్రమ రంగ నిపుణులు పాల్గొన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతావని.. భారత రాజ్యాంగం సూచించిన సంక్షేమ రాజ్యంలో సగం కూడా చేరుకోలేదని, అయినా కొందరు రాజకీయ లబ్ధి కోసం సంక్షేమ పథకాలు ఉచితాలని, వీటిని రద్దు చేయాలని కోర్టుకెక్కడం విచారకరమన్నారు. నాయకుల చిత్రపటాలకు వేలకొద్దీ లీటర్ల పాలతో అభిషేకం చేసే దేశంలో.. గుక్కెడు పాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు కూడా ఉన్నారనే విషయం గమనించాలని కోరారు. పాలకులు ప్రజల సంక్షేమం చూడాల్సిందేనని, అది వారి బాధ్యత అని పేర్కొన్నారు. కూడు, గూడు ప్రజల ప్రాథమిక హక్కు పాలకులు ప్రజలకు కూడు, గూడు ఇచ్చి సంక్షేమం చూడాల్సిందే. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు కూడా అదే చెబుతున్నాయి. విమానాల్లో తిరిగినంత మాత్రాన అభివృద్ధి చెందామని, అందువల్ల సంక్షేమ పథకాలు వద్దనడం భావ్యం కాదు. టీవీ, ఫ్రిడ్జ్ వంటివి ఉచితాలు. – విజయబాబు, ఎపిక్ అధ్యక్షుడు, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ అధికారం కోసం పేదలను బలిచేయొద్దు కేంద్ర ప్రభుత్వం దేశంలో 80 కోట్ల మందికి రేషన్ సరుకులు అందిస్తోంది. అంటే ఆ స్థాయిలో నిరుపేదలు ఇంకా ఉన్నట్టే కదా! అభివృద్ధి చెందిన స్కాండినేవియన్ దేశాల్లో ఇప్పటికీ జాతీయాదాయంలో 70 శాతం విద్య, వైద్యంతో పాటు ప్రజల అభివృద్ధి పథకాలకు ఖర్చు చేస్తున్నారు. – కృష్ణంరాజు, సీనియర్ జర్నలిస్ట్ ఏపీ ప్రగతిలో సంక్షేమ పథకాలు భాగం కోవిడ్ లాంటి గడ్డు కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్యం అందించి ఆదుకుంది. ఇలాంటి వాటిని ఉచితంగా ఇవ్వడం అంటూ కోర్టులు తప్పు పట్టడం సబబుకాదు. విద్యా దీవెన, నేతన్న నేస్తం, చేయూత, ఆసరా, పేదలందరికీ ఇళ్లు.. తదితర పథకాలు ఏ లెక్కనా ఉచితాలు కావు. ఏపీ ప్రగతిలో సంక్షేమ పథకాలు భాగం అని గుర్తించాలి. – పిళ్లా రవి, హైకోర్టు న్యాయవాది ప్రజా సంక్షేమంపై కుట్ర! జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కోర్టుల ద్వారా కుట్ర జరుగుతోందనిపిస్తోంది. కొన్ని మీడియా వర్గాలు సంక్షేమ పథకాలను ఉచిత పథకాలని ప్రచారం చేయడం బాధాకరం. ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మందికి లబ్ధి చేకూరుస్తోంది. ఈ పథకాన్ని రద్దు చేయాలని ఎవరైనా అడగ్గలరా? – అశోక్, లోక్‌సత్తా నేత -
గడప గడపనా.. నీరాజనం
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు, అధికారులు గురువారం క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లగా వారికి ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అండగా నిలుస్తున్నాయని, ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో తామంతా చాలా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆనందంగా తెలియజేశారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉత్సాహంగా సాగింది. ఇందులో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా తమకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల వద్ద పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్లకు వస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులకు ప్రజలు వాడవాడనా ఎదురేగి స్వాగతం పలికారు. సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని దీవించారు. -
CM YS Jagan: మీ చిరునవ్వే ఆక్సిజన్
అధికారం అంటే ప్రజలపై అజమాయిషీ కాదు.. మమకారమని రుజువు చేసి చూపించాం. గత సర్కారు పథకాలను ఎలా ఎగ్గొట్టాలని చూస్తే ఇప్పుడు సంతృప్త స్థాయిలో అర్హులందరికీ అందజేస్తున్నాం. పేదలను వెతుక్కుంటూ వెళ్లి వారి గడప తడుతున్నాయి. మన పాలనలో మనసు ఉంది.. గత పాలనలో అది లేదు. ఆ మార్పు ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడప గడపలో కనిపిస్తున్న ప్రజల చిరునవ్వే ప్రభుత్వానికి ఆక్సిజన్ లాంటిదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ క్యాలండర్ ప్రకటించి అమలు చేస్తూ నవరత్నాల హామీలకు కట్టుబడి పరిపాలన కొనసాగుతోందన్నారు. ప్రజలు సంతోషంగా చెబుతున్న మాటలే ప్రభుత్వానికి నమ్మకాన్ని కలిగించి అడుగులు వేయిస్తున్నాయని తెలిపారు. విప్లవాత్మక మార్పులు తెచ్చి మంచి చేయగలిగాం కాబట్టే మళ్లీ మీ గడప తొక్కగలుగుతున్నామన్నారు. పలు పథకాలకు సంబంధించి అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో మిగిలిపోయిన 3,39,096 మంది లబ్ధిదారుల ఖాతాలకు సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి రూ.137 కోట్లను నేరుగా జమ చేశారు. ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్సార్ మత్స్యకార భరోసా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ కాపునేస్తం, వైఎస్సార్ వాహనమిత్ర, వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాలకు సంబంధించి అర్హత కలిగి మిగిలిపోయిన లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు. కొత్తగా 2,99,085 మందికి వైఎస్సార్ పెన్షన్ కానుక కార్డులు, (కొత్త సామాజిక పెన్షన్లకు ఏటా రూ.935 కోట్ల అదనపు వ్యయం), 7,051 మందికి బియ్యం కార్డులు (1,45, 47,036కి చేరిన బియ్యం కార్డులు), 3,035 మందికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల (1,41,12,752కి పెరిగిన ఆరోగ్యశ్రీ కార్డులు) జారీని సీఎం ప్రారంభించి మాట్లాడారు. వివరాలివీ.. వైఎస్సార్ పింఛన్ కానుక చెక్కును విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అర్హులు మిస్ కారాదనే తపనతో.. అర్హత ఉంటే ఏ ఒక్కరూ మిస్ కాకూడదు. మన ప్రభుత్వం పడుతున్న తపనకు ఈ కార్యక్రమం నిదర్శనం. గతంలో వివిధ కారణాల వల్ల పలు పథకాలను అందుకోలేకపోయిన దాదాపు 3.40 లక్షల మంది అర్హులందరికీ ఇవాళ రూ.137 కోట్లను నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. కొత్తగా పెన్షన్ కార్డులు, బియ్యంకార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం. ఇవాళ దాదాపు మరో 3.10 లక్షల కుటుంబాలకు ఈ కార్డులు ఇస్తున్నాం. అదనపు కార్డులు ఇవ్వడం వల్ల ఏటా మరో రూ.935 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతున్నా అర్హత కలిగిన ఏ ఒక్కరూ మిస్ కాకూడదన్న లక్ష్యంతో అందిస్తున్నాం. ఏటా రెండు దఫాలు.. ఇవన్నీ బాధ్యతతో, పేదల మీద ఉన్న మమకారంతో చేస్తున్నాం. ఇక్కడ కులం, మతం, వర్గం, రాజకీయాలు చూడటం లేదు. చివరకు మన పార్టీకి ఓటు వేయకపోయినా సరే అర్హులైతే మేలు చేస్తున్నాం. కేవలం అర్హత ఒక్కటే ప్రాతిపదికగా నవరత్నాల పాలన అందిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నాం. అర్హులు ఏ ఒక్కరు కూడా మిగిలిపోకుండా వారికి మళ్లీ అవకాశమిచ్చి మరోసారి గుర్తించే కార్యక్రమం చేపట్టాం. అర్హత ఉండీ ఏ కారణంతోనైనా పథకాలు అందని వారికి ఏటా రెండు దఫాలుగా జూలైలో ఒకసారి, డిసెంబరులో మరోసారి పథకాల ప్రయోజనాలను ప్రత్యేకంగా అందచేస్తున్నాం. గత డిసెంబరులో... గత డిసెంబరు 28 తేదీన వివిధ పథకాలకు సంబంధించి మిగిలిపోయిన 9,30,809 మంది అర్హులకు మేలు చేస్తూ రూ.703 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. ఇవాళ 3.40 లక్షల మందికి మంచి చేస్తూ రూ.137 కోట్లు జమ చేస్తున్నాం. నాడు.. ఎలా ఎగ్గొట్టాలనే మన ప్రభుత్వం అర్హులు ఎంతమంది ఉన్నా సరే శాచ్యురేషన్ (సంతృప్త స్థాయి) పద్ధతిలో పథకాలను అందచేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వీలైనంత ఎక్కువ మందికి రకరకాల కారణాలతో ఎగ్గొట్టిన పరిస్థితి. పార్టీలవారీగా, కులాలవారీగా ఎలా కత్తిరించాలి? ఎలా ఎగ్గొట్టాలి? అన్నదే గత సర్కారు విధానం. ఫలానా వారు తమకు వ్యతిరేకమని, జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వలేదని, గ్రామాలలో ఇంతమందికే కోటా అని సాధ్యమైనంత ఎక్కువ మందికి గత ప్రభుత్వ హయాంలో ఎగ్గొట్టారు. మరోవైపు నాడు ఇన్ని పథకాలూ లేవు. ఇచ్చే అరకొర పథకాల్లో కూడా కత్తిరింపులు. వారు ఇచ్చే రూ.వెయ్యికి ఆత్మాభిమానాన్ని చంపుకుని వృద్ధులు, దివ్యాంగులు, అక్కచెల్లెమ్మలు కాళ్లరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగితే తప్ప పని అయ్యేది కాదు. లంచాలు ఇవ్వనిదే పని అయ్యేది కాదు. లంచాలు ఇచ్చేటప్పుడు కూడా ముందు మీరు ఏ పార్టీకి చెందిన వారని ప్రశ్నించేవారు. పథకాలు, పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి కూడా చూశాం. సామాజిక తనిఖీలతో పారదర్శకంగా ఇవాళ పథకాలను పూర్తి పారదర్శకంగా అమలు చేసేందుకు సామాజిక తనిఖీ చేపట్టి గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శిస్తున్నాం. పక్షపాతం లేకుండా, ఎవరికీ అన్యాయం జరగకుండా అర్హులను ఎంపిక చేస్తున్నాం. రేషన్ కార్డులు, పెన్షన్లు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య గమనిస్తే గతంలో కంటే లక్షల్లో ఎక్కువగా ఉన్నారు. ఎక్కడా దళారులు, మధ్యవర్తులు లేరు. ప్రతి ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారుల చేతుల్లో పెట్టే విప్లవాత్మక మార్పులు తెచ్చాం. గడప వద్దే ప్రభుత్వ సేవలు.. వివిధ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే డబ్బులను బ్యాంకులు తీసుకోలేని రీతిలో అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాల్లో వేస్తున్నాం. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామో ముందుగానే సంక్షేమ క్యాలండర్లో ప్రకటించి ఆ ప్రకారం అమలు చేస్తున్నాం. ఇలా దేశంలో ఎక్కడా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు పేదలను వెతుక్కుంటూ సంక్షేమ పథకాలు వారి ఇంటి తలుపు తడుతున్నాయి. అప్పటికి, ఇప్పటికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది గొప్ప మార్పులకు శ్రీకారం కాదా? ప్రతి అక్కనూ పలుకరిస్తూ.. ఇలా మంచి చేయగలిగాం కాబట్టే మళ్లీ మీ గడప తొక్కగలుగుతున్నాం. గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికీ అడుగులు వేయగలుగుతున్నాం. తలుపు తట్టి ప్రతి అక్కనూ పలుకరిస్తూ ఈ మూడేళ్లలో ఇంత మంచి జరిగిందని వివరించగలుగుతున్నాం. అవును జరిగింది.. అని వాళ్లు చెప్పే మాటలే మన ప్రభుత్వానికి ఆక్సిజన్. బాగా చేశారు అని వారు చిరునవ్వుతో సంతోషంగా చెబుతున్న మాటలే.. మనల్ని వెన్ను తట్టి మన ప్రభుత్వానికి నమ్మకం ఇచ్చి అడుగులు ముందుకు వేయించగలుగుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్నవారికి నిబద్ధత, విశ్వసనీయత ఉండాలి. దేవుడి దయ వల్ల ఇవాళ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమంలో మంత్రులు బూడి ముత్యాలనాయుడు, ఆదిమూలపు సురేష్, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీఎస్ సమీర్‌శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు పాల్గొన్నారు. 3.40 లక్షల మంది అర్హులకు మేలు ఈబీసీ నేస్తం 6,965 మందికి, జగనన్న చేదోడు 15,215 మందికి, వైఎస్సార్ మత్స్యకార భరోసా 16,277 మందికి, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 49,481 మందికి, జగనన్న విద్యాదీవెన 17,150 మందికి, జగనన్న వసతి దీవెన 25,644 మందికి, వైఎస్సార్ సున్నావడ్డీ (మహిళలు అర్బన్) 2,04,891 మందికి, వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు ఖరీఫ్ 2020లో 1,233 మందికి, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు రబీ 2019 – 20లో 713 మందికి, వైఎస్సార్ కాపునేస్తం 1,249 మందికి, వైఎస్సార్ వాహనమిత్ర 236 మందికి, వైఎస్సార్ నేతన్న నేస్తం 42 మందికి.. మొత్తంగా వివిధ కారణాల వల్ల ఈ పథకాలకు అర్హత ఉండి కూడా అందుకోలేకపోయిన 3.40 లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తున్నాం. ఈ 12 పథకాలతో పాటు కొత్తగా మరో 2,99,085 మందికి పెన్షన్ కార్డులు, 7,051 మందికి బియ్యం కార్డులు, 3,035 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసి అర్హుల చేతికి నేరుగా అందిస్తున్నాం. ప్రతి ఇంట్లోనూ ఆనందం.. సీఎం జగన్ పాదయాత్రలో ప్రకటించిన నవరత్నాలను క్యాలెండర్ ప్రకారం అమలు చేయడంపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యల వల్ల మిగిలిపోయిన వారికీ ఆయా పథకాలు అందచేస్తున్న ప్రభుత్వం ఇది. మా మనవడు జగన్ వల్లే గొప్పగా బతుకుతున్నామని గడప గడపకూ కార్యక్రమంలో ప్రతి అవ్వా తాత చెబుతున్నారు. లంచం లేకుండా నేరుగా లబ్ధి చేకూర్చడం పట్ల ప్రతి కుటుంబం ఆనందంగా ఉంది. మళ్లీ మీరే సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు. – మంత్రి బూడి ముత్యాలనాయుడు పెద్ద మనసుకు నిదర్శనం టీడీపీ హయాంలో ఏ పథకం మొదలుపెట్టినా ఎంతమందికి ఇస్తారో తెలియదు. ఎప్పుడు ఆగిపోతుందో అంతుబట్టదు. రుణమాఫీ హామీని నీరుగార్చారు. బడుగు, బలహీన వర్గాలకే కాకుండా సంక్షేమ పథకాలను అందరికీ అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ ముందుకెళుతున్నారు. మూడేళ్లలో రూ.1.50 లక్షల కోట్లకుపైగా పేదల ఖాతాల్లోకి నేరుగా జమ చేసి దేశంలో ఆదర్శంగా నిలిచారు. సాంకేతిక కారణాలతో పథకాలు అందని అర్హులకు కూడా ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచన ఆయన పెద్ద మనసుకు నిదర్శనం. – మంత్రి ఆదిమూలపు సురేష్ గతంలో ఎవరూ ఆలోచించలేదు.. ఈబీసీ నేస్తం పథకం చాలా గొప్ప ఆలోచన. గతంలో ఏ సీఎం మా గురించి ఇలా ఆలోచించలేదు. పథకం కోసం డిసెంబర్లో దరఖాస్తు చేసుకుంటే కొన్ని కారణాలతో రాలేదు. ఈ ఏడాదీ రాదనుకున్నా.. కానీ వచ్చింది. మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల అందరికీ లబ్ధి చేకూరుతోంది. నా పిల్లలను చక్కగా చదివించుకుంటున్నా. ప్రతి పేదవాడు ఆనందంగా, సంతోషంగా ఉండాలని మీరు ఎంతో చేస్తున్నారు. – లక్ష్మి, ఈబీసీ నేస్తం లబ్ధిదారురాలు, శ్రీకాకుళం ఓసీలకూ మేలు చేస్తున్నారు జగనన్న చేదోడు పథకం ద్వారా రూ.10 వేలు అందాయి. ఈ డబ్బుతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నా. పొదుపు సంఘంలో సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా లబ్ధి పొందా. గతంలో íపింఛన్ కోసం క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు వలంటీర్ తెల్లవారుజామునే వచ్చి పింఛన్ ఇస్తున్నాడు. ఓసీలకు కూడా ప్రభుత్వ పథకాలను అందించిన మొదటి ముఖ్యమంత్రి మీరే. – జ్యోతి, జగనన్న చేదోడు లబ్ధిదారురాలు, అనంతపురం జిల్లా మీవల్లే ఇంగ్లిష్ మీడియం చదువులు పాాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకార భరోసా ఇస్తున్నారు. గతంలో రూ.4 వేలు మాత్రమే అందగా మా బాధలను గుర్తించి మీరు ఇప్పుడు ఏటా రూ.10 వేలు ఇస్తున్నారు. గత రెండేళ్లుగా అందింది. ఈ ఏడాది నా అకౌంట్ సరిగా లేకపోవడం వల్ల రాలేదు. గ్రామ సచివాలయానికి వెళ్లి నాకు రాలేదని చెప్పగానే వెంటనే సరిచేశారు. మత్స్యకారుల పిల్లలు మీవల్లే ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. – సైమన్, మత్స్యకార భరోసా లబ్ధిదారుడు, కాకినాడ -
Andhra Pradesh: మూడేళ్లలో సమూల మార్పు
మూడేళ్ల కిందట... సరిగ్గా ఇదే రోజు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొత్త చరిత్రను లిఖించే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. తన మేనిఫెస్టోను నమ్మి 150 సీట్ల అఖండ మెజారిటీతో జేజేలు కొట్టిన జనాకాంక్షలను నెరవేర్చడానికి తొలిరోజు నుంచే శ్రమించటం మొదలెట్టారు. ఫలితం... స్కూళ్లు, ఆసుపత్రులు మారాయి. ఆర్బీకేలతో రైతు జీవితమూ మారింది. సచివాలయాలు గ్రామాలకే వచ్చాయి. ప్రభుత్వ పథకాలు వలంటీర్ల చలవతో ఇళ్లకే వచ్చాయి. మొత్తంగా గ్రామాల జీవన చిత్రమే మారిపోయింది. రెండేళ్లకుపైగా కోవిడ్ జనజీవితాల్ని, ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసింది. అయినా రాష్ట్రంలో ఏ కార్యక్రమమూ ఆగలేదు. ఈ మూడేళ్లలో వివిధ సామాజిక వర్గాల్లోని నిరుపేదలు, నిరాధారుల అభ్యున్నతికి సీఎం జగన్ ఏకంగా రూ.1.84 లక్షల కోట్లు ఖర్చుచేశారు. దీన్లో 1.41 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే వేశారు. అందుకే... తానేం చేశారో ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను రాష్ట్రంలోని ప్రతి గడపకూ పంపి మరీ చెబుతున్నారు. అమరావతి–సాక్షి ప్రతినిధి: మే 30, 2019న ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనుంచి రాష్ట్ర ప్రజలందరికీ చెప్పిన మాటకు అనుగుణంగా మూడేళ్ల పాలన కొనసాగించారు. కోవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయి.. మరో పక్క వ్యయం పెరిగినప్పటికీ పేదల సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను నిరంతరంగా అమలు చేశారు. పైగా సంక్షేమ క్యాలెండర్‌ను ముందే ప్రకటించి ఆ మేరకు పథకాల ప్రయోజనాలను ఆయా వర్గాలకు అందించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మూడేళ్లలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపులు, అగ్రవర్ణ పేదల సంక్షేమం, అభ్యున్నతికి ఏకంగా రూ.1,84,930.60 కోట్లు వ్యయం చేశారు. ఇందులో ఆయా వర్గాల సంక్షేమ పథకాలకు నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.1,41,247.94 కోట్లు ఇవ్వగా, నగదేతర పథకాల ద్వారా రూ.43,682.65 కోట్లు వ్యయం చేశారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం కూడా ఈ వర్గాలకు ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయి మొత్తం వెచ్చించిన దాఖలాలు లేవు. గత చంద్రబాబు సర్కారులో ఈ వర్గాలకు బ్యాంకు రుణాలే దిక్కయ్యాయి. అవి కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే మంజూరయ్యేవి. టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారికి, లంచాలు ఇచ్చిన వారికే రుణాలు వచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. అర్హతే ప్రమాణికంగా లబ్దిదారుల ఖాతాలకు నగదు బదిలీ చేశారు. నగదు బదిలీలో అత్యధిక లబ్దిదారులు జనాభా నిష్పత్తి ప్రకారం బీసీ వర్గాలే. బీసీలకు తగిన వాటా బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ అంటూ పాద యాత్రతో పాటు ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ సదస్సులో కొత్త నిర్వచనం చెప్పిన వైఎస్ జగన్..మూడేళ్ల పాలనలో ఇటు అభివృద్ది, సంక్షేమంలో బీసీలకు సామాజిక న్యాయం చేశారు. నవరత్నాల్లోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల ద్వారా బీసీల కోసం రూ.89,024.67 కోట్లు వెచ్చించారు. ఇందులో రూ.65,973.10 కోట్లు నేరుగా నగదు బదిలీ ద్వారానే అందజేశారు. అభివృద్ది పథకాల కింద నాన్ డీబీటీ ద్వారా మరో రూ.23,051.56 కోట్లు వెచ్చించారు. ఇళ్ల స్థలాల లబ్దిదారుల్లో అత్యధికంగా 16.70 లక్షల మంది బీసీ లబ్దిదారులే. ఈ వర్గాల ఇళ్ల స్థలాల సేకరణ, పరిహారం చెల్లింపునకు ఏకంగా రూ.14,661 కోట్లు వెచ్చించారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 24.61 లక్షల బీసీ రైతులకు రూ.9,369.86 కోట్లు అందజేశారు. ఎస్సీ వర్గాలకు భారీ వ్యయం నవరత్నాల ద్వారా మూడేళ్లలోనే ఎస్సీల సంక్షేమం, అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.31,153.95 కోట్లు వ్యయం చేసింది. ఇందులో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీతో రూ.22,528.04 కోట్లను జమ చేయగా.. నగదేతర బదిలీ పథకాల ద్వారా రూ.8,625.91 కోట్లు వ్యయం చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 5.23 లక్షల ఎస్సీ రైతులకు రూ.2063.70 కోట్లు ఇచ్చారు. 6.36 లక్షల ఎస్సీల ఇళ్ల స్థలాల సేకరణ, పరిహారం కోసం రూ.5589 కోట్లు వ్యయం చేశారు. ఎస్టీల సంక్షేమానికి రూ.9,243.68 కోట్లు ఎస్టీల అభివృద్ది, సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.9,243.68 కోట్లు వ్యయం చేశారు. ఇందులో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా రూ. 7,035.51 కోట్లు నగదు బదిలీ చేయగా.. నగదేతర పథకాల ద్వారా మరో రూ.2,208.17 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. వైఎస్సార్ రైతు భరోసా కింద 3.92 లక్షల ఎస్టీ రైతులకు రూ. 1346.95 కోట్లు నగదు బదిలీ చేశారు. అలాగే 1.41 లక్షల ఎస్టీల ఇళ్ల స్థలాల సేకరణ, పరిహారం కోసం రూ.1242 కోట్లను వ్యయం చేశారు. మైనారిటీల కోసం రూ..8,595.50 కోట్లు చంద్రబాబు సర్కారులో మైనారిటీలంటే ఓటు బ్యాంకు మాత్రమే. జగన్ మూడేళ్లలో వారి సంక్షేమం, అభివృద్ది కోసం రూ.8,595.50 కోట్లు వ్యయం చేశారు. ఇందులో నేరుగా రూ.5,456.76 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయగా... మరో రూ.3,138.74 కోట్ల మేర ప్రయోజనాలు ఇతర పథకాల ద్వారా అందాయి. 2.52 లక్షల మంది మైనారిటీల ఇళ్ల స్థలాల సేకరణ, పరిహారం కోసం రూ.2,214 కోట్లు వ్యయం చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 60 వేల మైనారిటీ రైతులకు రూ.251.75 కోట్లు ఇచ్చారు. కాపుల కోసం రూ.14,438.78 కోట్లు చంద్రబాబు సర్కారు కాపులను రిజర్వేషన్ల పేరుతో మభ్యపెట్టి వంచించగా జగన్ సర్కారు ఆచరణ సాధ్యమైన హామీలనే ఇచ్చి మూడేళ్లలో అమలు చేసి చూపించింది. కాపుల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.14,438.78 కోట్లు వెచ్చించారు. దీన్లో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా రూ.12,011.50 కోట్లు నగదు బదిలీ చేశారు. ఇతర పథకాల ద్వారా మరో రూ. 2,427.20 కోట్ల మేర ప్రయోజనాలు అందాయి. 2.46 లక్షల మంది కాపుల ఇళ్ల స్థలాల సేకరణ, పరిహారం కోసం రూ.2,160 కోట్లు వ్యయం చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 7.85 లక్షల కాపు రైతులకు రూ.2923.59 కోట్లు ఇచ్చారు. అగ్రవర్ణ పేదలకు రూ.28,716.02 కోట్లు పేదరికానికి కులం, మతం లేదని గట్టిగా నమ్మిన జగన్... అగ్రవర్ణాల్లోని పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం మూడేళ్లలో రూ.28,716.02 కోట్లు వ్యయం చేశారు. -
పథకాల అమలుపై దృష్టి పెట్టండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు పూర్తిస్థాయిలో విజయవంతంగా అందేందుకు, వారికి మెరుగైన పాలన అందించేందుకు అన్ని శాఖల కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గల సీఎం సమావేశ మందిరంలో బుధవారం సీఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. గత కార్యదర్శుల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలు, సుస్థిరాభివృధ్ధి లక్ష్యాల సాధన, సైబర్ సెక్యూరిటీ, ఏపీ ఆన్లైన్ లీగల్ కేసుల పర్యవేక్షణ విధానం వంటి అంశాలపై సమీక్షించారు. కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి ఏపీ ఆన్లైన్ లీగల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టం (ఏపీ ఓఎల్‌సీఎంఎస్) చక్కటి విధానమని, న్యాయపరమైన కేసుల నిర్వహణకు సంబంధిత శాఖల్లోని లైజన్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సమీర్‌శర్మ అదేశించారు. ఆయా శాఖల లైజన్ అధికారులు ప్రతిరోజు కోర్టుల్లో నమోదైన కేసులు, వాటికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పరిశీలించి ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ కార్యదర్శికి తెలియజేయడం, సకాలంలో కౌంటర్లు దాఖలు చేయడంతోపాటు కోర్టులకు వివరాలను అందించాలన్నారు. ఇకపై ప్రతినెలా అడ్వకేట్ జనరల్‌తో కలిసి గవర్నమెంట్ ప్లీడర్లు సంబంధిత శాఖల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి కేసులపై సమీక్షించాలని, తద్వారా ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్ కేసులను తగ్గించేందుకు వీలుంటుందని సీఎస్ పేర్కొన్నారు. నీతిఆయోగ్ నిర్దేశించిన ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని అదేశించారు. -
ప్రజలతో మమేకమవుదాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘రాబోయే రెండేళ్లు ప్రజల్లోనే ఉందాం. జనంతో మమేకమవుతూ.. చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిద్దాం. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. వీలైనంత త్వరలోనే వైఎస్సార్ఎల్పీ సమావేశం నిర్వహించి, ఎమ్మెల్యేలకు భవిష్యత్ కార్యాచరణ వివరిస్తానని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సోమవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. అజెండా అంశాలు ముగిసి, అధికారులు వెళ్లిపోయిన అనంతరం మంత్రులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని, దానిపై ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ఆరంభమవుతుందని వివరించారు. అధికారంలోకి వచ్చిన 33 నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని చెప్పారు. కరోనా ప్రతికూల పరిస్థితుల వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ, సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రాబోయే రెండేళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని సూచించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలును ప్రజలకు వివరించాలని సూచించారు. గడప గడపకూ వెళ్లి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించాలని ఉద్బోధించారు. చేసిన అభివృద్ధిని వివరించి, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ భవిష్యత్ కార్యాచరణను ఎమ్మెల్యేలకు వివరించడానికి వైఎస్సార్ఎల్పీ సమావేశం నిర్వహిస్తామన్నారు. -
100 యూనిట్ల లోపు విద్యుత్తు చార్జీలు ఏపీలోనే చవక
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు వారి జీవన వ్యయాన్ని కూడా తక్కువ ఉండేలా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పేదలకు తక్కువ చార్జీలతో విద్యుత్తును అందిస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకంటే 100 యూనిట్ల లోపు విద్యుత్తు రాష్ట్రంలోనే చవగ్గా ఉంది. దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా, వాటిలో 23 చోట్ల్ల ఏపీ కంటే ఎక్కువగా విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. నెలకు 100 యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగించే వారిపై విధిస్తున్న చార్జీలు రాష్ట్రంలో చాలా తక్కువగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ దగ్గర్నుంచి కర్ణాటక, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్‌ఘడ్ తదితర రాష్ట్రాల్లోకంటే ఏపీలోనే తక్కువ ధరలు ఉన్నాయని సీఈఏ నివేదిక తేటతెల్లం చేసింది. వంద యూనిట్ల లోపు విద్యుత్ వినియోగానికి రాష్ట్రంలో యూనిట్‌కు రూ.2.66 మాత్రమే పంపిణి సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఇదే వినియోగానికి దేశ రాజధాని ఢిల్లీలో రూ. 4.73, అత్యధికంగా రాజస్థాన్‌లో రూ. 8.33 వసూలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకలో రూ.8.26, ఒడిశాలో రూ.4.66, ఛత్తీస్‌గఢ్‌లో రూ.4.49 వసూలు చేస్తున్నారు. నాలుగైదు రాష్ట్రాలు, కొన్ని కేంద్ర పాలితి ప్రాంతాల్లో మాత్రమే మన రాష్ట్రంకంటే స్వల్పంగా తక్కువ చార్జీలు ఉన్నాయి. వంద యూనిట్ల లోపు వినియోగానికి ఒడిశాలో ఒక వినియోగదారుడు నెలకు సగటున రూ. 374 చెల్లిస్తుంటే, ఛత్తీస్‌గఢ్‌లో రూ.449, ఢిల్లీలో రూ.473 చెల్లించాల్సి వస్తోంది. మన రాష్ట్రంలో ఇది కేవలం రూ.266 మాత్రమే. 400 యూనిట్ల వరకు వినియోగించే వినియోగదారుని చార్జీ ఛత్తీస్‌గఢ్‌లో రూ.494.10 ఉంటే ఒడిశాలో రూ.496.60 ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది తక్కువగా రూ.491.63గా ఉంది. నాణ్యతలోనూ ముందే విద్యుత్ సరఫరా, నాణ్యతలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. రాష్ట్రంలో కోతలు లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు. దేశంలో విద్యుత్ సరఫరాలో నాణ్యతపై 20–30 శాతం కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. దేశంలో 10 శాతం గృహాలకు ఎక్కువ సార్లు విద్యుత్ కోతలు ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. రాష్ట్రంలో ఇటువంటి ఫిర్యాదులు లేవు. ఒడిశాలో దాదాపు 85 శాతం కుటుంబాలు రోజుకు కనీసం ఒక సారి విద్యుత్ కోతను ఎదుర్కొంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఇది దాదాపు 84 శాతం. అదనపు చార్జీలు లేవు ఏపీలో వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారిపై ఎటువంటి ఫిక్స్డ్ చార్జీలు లేవు. ఎలక్ట్రికల్ డ్యూటీ కూడా 6 పైసలు మాత్రమే. మిగతా చాలా రాష్ట్రాల్లో ఈ రెండూ కూడా ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటకలో రూ.2.75 ఫిక్స్డ్ చార్జీ, 68 పైసలు ఎలక్రికల్ డ్యూటీ వేస్తున్నారు. ఒడిశాలో కూడా 60పైసలు, 16 పైసలు చొప్పున ఈ చార్జీలు కలిపే బిల్లులు వేస్తున్నారు. మన రాష్ట్రంలో 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించేది పేద ప్రజలే. అందుకే వారిపై అధిక భారం వేయడంలేదు. – ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ -
ఆంధ్రా పుణ్యంతోనే అన్నం తింటున్నాం..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రస్తుత ఆంధ్రా పాలకుల దయవల్ల ఆనందంగా జీవించగలుగుతున్నామని, తమను ఆంధ్రప్రదేశ్ వాసులుగానే పరిగణించాలని ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న అమ్మ ఒడి, వైఎస్సార్ రైతుభరోసా, జగనన్న చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి సంక్షేమ పథకాలు తమను ఎంతగానో ఆదుకుంటున్నాయని వారు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో వివాదాస్పదంగా మారిన కొటియా, గంజాయిభద్ర, పనికి, రణసింగి, దిగువశెంబి, ఎగువ శెంబి, సినివలస, కోనదొర తదితర కొటియా గ్రూపు 21 గ్రామాల నుంచి 50 మంది సోమవారం విజయనగరం కలెక్టరేట్లో స్పందన కార్యక్రమానికి వచ్చారు. కలెక్టర్ ఎ.సూర్యకుమారిని కలిసి తమ గ్రామాల సమస్యలను విన్నవించారు. తాము ఆంధ్రులమని, తమది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి తమకు రక్షణ కల్పించాలని విన్నవించారు. 21 కొటియా గ్రామాలను ఆక్రమించేందుకే ఒడిశా ప్రభుత్వం హుటాహుటిన భవనాల నిర్మాణం చేస్తోందని తెలిపారు. ఇటీవల కాలంలో కోరాపుట్ ఎమ్మెల్యే, పోలీసులు తమపై రౌడీయిజం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కూర్మనాథ్‌ను కూడా కొటియా గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. పూర్వం నుంచి తాము ఆంధ్రులమేనని, అందుకు సంబంధించిన భూమిశిస్తు తామ్రపత్రాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కొటియా ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం సమావేశ మందిరంలో కొటియా గ్రామప్రజలను కలెక్టర్ సత్కరించారు. వారితో కలిసి భోజనం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు జీసీ కిశోర్‌కుమార్, మహేష్‌కుమార్, వెంకటరావు, మయూక్ అశోక్, డీఆర్వో గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. అన్నివిధాలా రక్షణ... కొటియా గ్రామాల ప్రజలకు అన్నివిధాలా రక్షణ కల్పిస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక హామీ ఇచ్చారు. ఒడిశా పోలీసుల దౌర్జన్యాల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ కొటియా ప్రజలు ఆమెను కలిశారు. కొటియాలో త్వరలోనే పోలీసుస్టేషన్ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోరినట్లు ఆమె చెప్పారు. వారికి నిత్యావసర వస్తువులను ఎస్పీ అందించారు. -
పథకాల వారధులు సర్పంచులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువచేసే బాధ్యత పంచాయతీ సర్పంచులదేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులకు గ్రామ పంచాయతీ పాలనపై మొత్తం 60 కేంద్రాల్లో శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని నిమ్రా కాలేజీ ఆడిటోరియంలో విజయవాడ డివిజన్ పరిధిలోని సర్పంచులకు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 అంశాల్లో ఇస్తున్న ఈ శిక్షణను ఉపయోగించుకుని సర్పంచులు సమర్థ నాయకత్వంతో గ్రామాలను అభివృద్ధి పథంలో నిలపాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. అత్యుత్తమ పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామసచివాలయ, వలంటీర్ల వ్యవస్థలకు శ్రీకారం చుట్టారన్నారు. సర్పంచులు ఈ వ్యవస్థలను పర్యవేక్షిస్తూ, ప్రజలకు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందేలా చేయాలని సూచించారు. ఆగస్టు 15 నుంచి జగనన్న స్వచ్ఛసంకల్పం గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం, పారిశుధ్యంపై చైతన్యం పెంచడం కోసం ఆగస్టు 15 నుంచి 100 రోజులు జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సర్పంచులు నడుంకట్టాలన్నారు. పచ్చదనం పెంచేందుకు జగనన్న పచ్చతోరణం కింద మొక్కల పెంపకంను ప్రారంభించామని, గ్రామాల్లో 83 శాతం మొక్కలు బతికేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇంటిపన్ను, నీటిపన్ను, లైసెన్స్ ఫీజులు, కంపోస్ట్ ఎరువుల విక్రయాలు, వేలం పాటల ద్వారా పంచాయతీలకు ఆర్థిక వనరులను పెంచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాల గురించి మంత్రి వివరించారు. అంతకుముందు ఆయన అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామ సర్పంచుల కరదీపికను ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎస్ఐఆర్డీ డైరెక్టర్ జె.మురళి, కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్, జెడ్పీ సీఈవో సూర్యప్రకాశ్, డీపీవో జ్యోతి పాల్గొన్నారు. -
ఏపీలో సంక్షేమ పథకాలు భేష్
షేర్‌మహ్మద్‌పేట (జగ్గయ్యపేట అర్బన్) /మక్కపేట (వత్సవాయి) /నందిగామ: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ బృందం ప్రశంసించింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు–నేడు పథకాన్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎ.శ్రీదేవసేన నేతృత్వంలో 17 మంది ఉన్నతాధికారుల బృందం సోమవారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ మండలాల్లో పర్యటించింది. ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి ఆ బృందం జగ్గయ్యపేట మండలం షేర్మహ్మద్పేటలోని జెడ్పీ హైస్కూల్లో నాడు–నేడు పనులను పరిశీలించింది. ఈ పనులు చేపట్టిన విధానం, పనుల నిర్వహణ, నిధుల వినియోగం తదితర అంశాల గురించి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రమణను, విద్యాకమిటీ చైర్మన్, సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో 5 రోజులు 5 రకాల మెనూ అమలు చేస్తున్నట్లు హెచ్ఎం వివరించగా.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవసేన మాట్లాడుతూ తెలంగాణలో మనబడి నాడు–నేడు అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన నాడు–నేడు పనుల్లో నాణ్యత ప్రమాణాలు, పారదర్శకత, స్కూల్ కమిటీల భాగస్వామ్యం పరిశీలించామని, స్కూల్లోని మౌలిక సదుపాయాలు బావున్నాయని, పనులు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ విప్ ఉదయభాను మాట్లాడుతూ.. రాష్ట్రంలో 45,329 స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు నాణ్యమైన విద్యను అందించేందుకు 3 దశల్లో ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ రూపకల్పన చేశారని చెప్పారు. అనంతరం వత్సవాయి మండలం మక్కపేటలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పనులను ఈ బృందం పరిశీలించింది. జగనన్న విద్యాకిట్ల గురించి వాకబు చేసి కిట్‌లో ఉన్న వస్తువులను బృందం సభ్యులు పరిశీలించారు. నందిగామ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు–నేడు పనులను కూడా పరిశీలించారు. బృందంలో ట్రైనీ ఐఏఎస్ అధికారి మకందర్, పాఠశాల సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి శాఖ ఎండీ పార్థసారథి తదితరులున్నారు. -
కరోనా వేళ ‘సంక్షేమం’ భేష్
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్‌తో దేశమంతా వణికిపోతున్న ప్రస్తుత తరుణంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేయడం అభినందనీయమని సీపీఐ ప్రతినిధులు కొనియాడారు. వీటి ద్వారా ఎంతోమంది పేద ప్రజలు లబి్ధపొందారని వారు తెలిపారు. అలాగే, కరోనా థర్డ్ వేవ్‌లో చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుందన్న ముందస్తు అంచనాల మేరకు, పిల్లల కోసం ప్రత్యేకంగా మూడు కేర్ సెంటర్లు ఏర్పాటుచేయాలని సీఎం జగన్ ఉన్నతాధికారులను ఆదేశించటాన్ని కూడా వారు ప్రశంసించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సీపీఐ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయింది. ప్రజల అవసరాలు, సమస్యల ఆధారంగా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటాన్ని వారు కొనియాడారు. పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని వెంటనే అందజేసి, వారికి తగిన వసతులు కల్పించాలని, పెట్రోలు ధరలు తగ్గించేందుకు సీఎం జగన్ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. అలాగే, రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేసేలా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. సీపీఐ నేతల విన్నపాలకు సజ్జల సానుకూలంగా స్పందించి సీఎం దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. అంతకుముందు.. సీపీఐ నేతలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ల అప్పిరెడ్డితో భేటీ అయ్యారు. సజ్జలను కలిసిన వారిలో పి. హరినాథరెడ్డి, గుజ్జుల ఓబులేసు, మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ తదితరులున్నారు. -
Andhra Pradesh: పేదరికమే కొలమానం
సాక్షి, అమరావతి: పేదరికమే ప్రాతిపదికగా అగ్రవర్ణ పేదలకూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండేళ్ల పాలనలో భారీగా ప్రయోజనం కల్పించారు. ఎక్కడా కులమతాలు, ప్రాంతాలు, ఏ పార్టీ అనే అంశాలకు తావివ్వలేదు. సిఫారసులు, లంచాల ప్రసక్తే లేదు. కేవలం పేదలైతే చాలు. పేదరికమే ప్రామాణికంగా ఆఖరికి తనకు ఓటు వేయని వారికి సైతం అర్హులందరికీ మేలు చేకూర్చారు. నవరత్నాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులే ఇందుకు నిదర్శనం. అగ్రవర్ణ పేదలంతా నవరత్నాల ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనం పొందారు. గతంలో ఏ ప్రభుత్వమూ అగ్రవర్ణ పేదలకు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. 2019 జూన్ నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకు రాష్ట్రంలో 1,88,91,438 మంది అగ్రవర్ణ పేదలకు (కాపులను మినహాయించి) నేరుగా నగదు బదిలీతో పాటు నగదేతర బదిలీ పథకాల ద్వారా ఏకంగా రూ.21,272.36 కోట్ల మేర ఆర్థిక సాయం అందింది. నేరుగా నగదు బదిలీ పథకాల ద్వారా 1.49 కోట్ల మందికిపైగా అగ్రవర్ణ పేదలకు రూ.18,246.83 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఆరోగ్యశ్రీ, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, ఇళ్ల స్థలాల భూ సేకరణ లాంటి నగదు బదిలీయేతర పథకాల ద్వారా 39.70 లక్షల మంది అగ్రవర్ణ పేదలకు రూ.3,025.53 కోట్లను అందించారు. ఏ ప్రభుత్వానికికైనా ప్రాథమిక సూత్రం పేదరికం నిర్మూలనే అవుతుంది. అదే కోవలో నవరత్నాల లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానం తప్ప కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు కాదని ఆచరణలో అమలు చేసి చూపించిన తొలి సీఎంగా ముఖ్యమంత్రి జగన్ ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ఏడాదే ‘ఈబీసీ నేస్తం’ పథకం ద్వారా అగ్రవర్ణ పేద మహిళలకూ మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. -
బియ్యం బండిపై మొండిగా!
సాక్షి, అమరావతి: అది రెక్కాడితేగానీ డొక్కాడని పేదల కోసం ఎప్పుడో ప్రకటించిన పథకం. అదేమీ కొత్తది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికిపైగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. క్యూ లైన్లలో నించుని, కూలి పనులు మానుకుని చౌక ధరల దుకాణాల వద్ద పడిగాపులు కాసే దుస్థితి తప్పిందని, ఇన్నాళ్లకు తమ ఇంటివద్దే రేషన్ బియ్యం అందబోతున్నాయని గ్రామీణ పేదలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే పేదల ఇబ్బందులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది ఓ రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, పేదలకు తిండిగింజలు అందించటాన్ని సానుకూలంగా చూడాలని హైకోర్టు సైతం సూచించినా పెడచెవిన పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీ కోసం సిద్ధం చేసిన మొబైల్ వాహనాలపై ఉన్న రంగులతో పాటు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బొమ్మలను తొలగించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. తొలుత ఒక వాహనానికి మాత్రం ప్రస్తుతం ఉన్న రంగులను మార్చి తాను పరిశీలించేందుకు తీసుకుని రావాలని పేర్కొంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగు మార్చిన ఆ వాహనాన్ని పరిశీలించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ఆ మార్పులకు తాను అనుమతిస్తేనే వాహనాలు తిప్పాలన్నారు. ముందస్తు వ్యూహంతోనే.. మొబైల్ వాహనాలకు ప్రస్తుతం ఉన్న రంగులను మార్పు చేసి పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ పాత రంగులు వేయాలని భావించరాదని నిమ్మగడ్డ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని నిమ్మగడ్డ ప్రకటించారు. దీన్నిబట్టి ఆయన ముందస్తు వ్యూహంతో, నెలల తరబడి ఎన్నికల కోడ్ అమలులో ఉండేలా పక్కా స్క్రిప్టు ప్రకారం వ్యవహరిస్తున్నట్లు వెల్లడవుతోంది. ఎప్పుడో సిద్ధమైన వేల వాహనాలకు ఇప్పటికిప్పుడు రంగులు మార్చడం సాధ్యమయ్యే పనేనా? ఇదంతా ఇప్పట్లో జరిగేపని కాదనే ఎస్ఈసీ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కోర్టు విధించిన గడువు ముగుస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఉత్తర్వును జారీ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలతో నివేదిక ఇచ్చినా.. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా సరుకుల పంపిణీ కోసం మొబైల్ వాహనాలను వినియోగించడానికి వీల్లేదని గత నెల 28న ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ హైకోర్టును ఆశ్రయించగా.. ఈ పథకం రాజకీయ కార్యక్రమం కాదని, ఈ పథకం పేదలకు ఎంత అవసరమో గమనించాలని న్యాయస్థానం పేర్కొంది. ఇంటింటా రేషన్ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి వినతి అందుకున్న ఐదు రోజుల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు వాహనాల ద్వారా సరుకులు పంపిణీ వల్ల పేదలకు ఒనగూరే ప్రయోజనాల గురించి ఎస్ఈసీకి పౌరసరఫరాల శాఖ అధికారులు వివరించడంతో పాటు పూర్తి వివరాలతో నివేదిక కూడా ఇచ్చారు. పథకం అమలుæ కోసం వినియోగించనున్న మొబైల్ వాహనాలను ఈనెల 3న నిమ్మగడ్డ పరిశీలించారు. అయితే ఇటు ప్రభుత్వం అటు హైకోర్టు సూచించిన విషయాలను ఆయన ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తొలుత మొబైల్ వాహనాలపై ఉన్న రంగులను తొలగించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించడంతో పేదలు అగచాట్లు ఎదుర్కొంటున్నారు.