
వైఎస్సార్ జిల్లా కె.ఎర్రగుడి దళితవాడలో దివ్యాంగ బాలుడు సోమశేఖర్‌తో మాట్లాడుతున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, నెట్‌వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు, అధికారులు గురువారం క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లగా వారికి ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అండగా నిలుస్తున్నాయని, ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు.
వైఎస్ జగన్ పాలనలో తామంతా చాలా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆనందంగా తెలియజేశారు.