మోహన్‌రెడ్డి మళ్లీ అరెస్టు
- నారాయణరెడ్డి ఆత్మహత్య కేసులో సెప్టెంబర్ 6 వరకు రిమాండ్
-నయూమ్‌తో సంబంధాలపై విచారిస్తున్న పోలీసులు
కరీంనగర్ క్రైం/కరీంనగర్ లీగల్: అక్రమ ఫైనాన్స్ దందాతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఏఎస్సై బి.మోహన్‌రెడ్డిని పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. కరీంనగర్‌లోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య కేసులో మోహన్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కేసును పరిశీలించిన కోర్టు ఆయనకు సెప్టెంబర్ 6 వరకు రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. బెజ్జంకి మండలం గుండ్లపల్లికి చెందిన చాడ నారాయణరెడ్డి కరీంనగర్‌లో నివాసం ఉండేవాడు. ఆయన ఈ నెల 9న ఆత్మహత్య చేసుకున్నాడు.
తన చావుకు మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలు కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలపై కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నారాయణరెడ్డి భార్య, కూతురు.. తిరిగి సాయంత్రం మాట మార్చారు. తన తండ్రి ఆత్మహత్యతో మోహన్‌రెడ్డికి సంబంధం లేదంటూ ఫిర్యాదును వాపస్ తీసుకున్నారు. కానీ, అప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదరుుంది. ఈ కేసులో శ్యాంసుందర్‌రెడ్డి ముందస్తు బెరుుల్ పొందగా... మంగళవారం మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
నయూమ్‌తో సంబంధాలపై విచారణ: నయూమ్‌తో మోహన్‌రెడ్డికి సంబంధాలున్నాయని, ఇందుకు సంబంధించిన ఆధారాలున్నాయని మోహన్‌రెడ్డి బాధితుల సండ ఘం అధ్యక్షుడు ముస్కు మహేందర్‌రెడ్డి కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. ఈ కోణంలోనూ మోహన్‌రెడ్డిని విచారించినట్లు సమాచారం. నయూమ్‌తో సంబంధాలపై ఆరోపణలు చేసిన ముస్కు మహేందర్‌రెడ్డిని ఆధారాలు సమర్పించాలని కోరగా ఎలాంటి ఆధారాలను అందించలేదని సమాచారం. మోహన్‌రెడ్డికి నయూమ్‌తో ఉన్న సంబంధాలపై విచారించడానికి పోలీసు అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
న్యాయపరంగా పోరాడుతా: మోహన్‌రెడ్డి
కొందరు దురుద్దేశంతో తనకు నయూమ్‌తో సంబంధాలు అంటగడుతున్నారని, వారిపై న్యాయపరంగా పోరాడుతానని మంగళవారం కోర్టుకు వచ్చిన సందర్భంగా మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చాడ నారాయణరెడ్డి ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.