భార్యను వేధించిన భర్తకు రెండేళ్ల శిక్ష వేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు.
కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురి చేశాడో ప్రబుద్ధుడు. వేధింపులు తాళలేక భార్య కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన మెట్రోపాలిటన్ కోర్టు ఆ వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు,రూ. 20 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. వివరాలు.... నాచారం మల్లాపూర్ ప్రాంతంలో నివాసముండే మోహన్‌రెడ్డి, అంజలి భార్యాభర్తలు. అంజలి తల్లిదండ్రులు వీరి వివాహాన్ని అప్పట్లో ఘనంగా నిర్వహించారు.పెళ్లి అయిన కొంతకాలానికే మోహన్‌రెడ్డి అంజలిని అదనపు కట్నం కోసం వేధించ డంతో పోలీసులను ఆశ్రయించింది.