Metropolitan Court
-
ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో చార్జిషీట్
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో ఏడుగురు నిందితులపై పోలీసులు శనివారం 800 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. దాదాపు 120 మంది సాక్ష్యాలను అందులో పొందుపరిచారు. నిందితుల్లో నలుగురిపై హత్యా నేరం మోపారు. దీనిపై విచారణను ఏప్రిల్ 13కు మెట్రోపాలిటన్ జడ్జి సన్యా దలాల్ వాయిదా వేశారు. గత డిసెంబర్ 31న ఢిల్లీలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుని అర్ధరాత్రి దాటాక స్కూటీపై వెళ్తున్న అంజలీసింగ్ అనే 20 ఏళ్ల యువతిని నిందితులు కారుతో ఢీకొట్టడం, ఆమె కారు కింద చిక్కుకుందని తెలిసి కూడా అలాగే 12 కిలోమీటర్లకు పైగా లాక్కెళ్లడం తెలిసిందే. దాంతో ఒళ్లంతా ఛిద్రమై అంజలి అత్యంత బాధాకరంగా మరణించింది. -
ఆ సమయంలో అమ్మాయిని ఫాలో కావడం అసాధ్యం.. కోర్టు కీలక తీర్పు
ముంబై: మహిళపై వేధింపుల కేసులో ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు గతవారం కీలక తీర్పునిచ్చింది. 40 ఏళ్ల నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైలో ఉదయం వేళ చాలా రద్దీగా ఉంటుందని, ఆ సమయంలో ఒకరిని మరొకరు ఫాలో కావడం అసాధ్యమని వ్యాఖ్యానించింది. ఏం జరిగిందంటే..? ముంబై చిరా బజార్లో నివసించే ఓ మహిళ.. ఓ వ్యక్తి తనను రోజు ఫాలో అవుతున్నాడని ఆరోపించింది. ఉదయం రైల్వే స్టేషన్‌కు వెళ్లే సమయంలో అతడు తనను బైక్‌పై అనుసరిస్తున్నాడని, తనవైపే చూస్తూ ఇబ్బంది పెడుతున్నాడని కేసు పెట్టింది. నిందితుడు కూడా అదే ప్రాంతంలో ఓ గ్యారేజీ నడుపుతున్నాడు. ఆమె వెళ్లేదారిలోనే ఆ షాపు కూడా ఉంది. అయితే మహిళ చేసిన ఆరోపణలపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముంబైలో ఉదయం వేళ చాలా రద్దీగా ఉంటుందని, ఆపీసులకు వెళ్లేవారితో రోడ్లు కిక్కిరిపోతాయని పేర్కొంది. అలాంటి సమయంలో ఒకరిని మరొకరు ఫాలో చేయడం అసలు సాధ్యం కాదని చెప్పింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్ ఇచ్చింది. ఈ కేసు 2017 ఆగస్టు 3న నమోదైంది. చదవండి: ఇండియన్ కరెన్సీ నోట్లపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు -
జగన్‌పై హత్యాయత్నం కేసు.. విజయవాడకు బదిలీ
-
జగన్‌పై హత్యాయత్నం కేసు.. విజయవాడకు బదిలీ
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం కేసును విశాఖపట్నం నుంచి విజయవాడకు బదిలీ చేయాలంటూ మెట్రోపాలిటన్ కోర్టు తీర్పునిచ్చింది. జగన్‌పై హత్యాయత్నం కేసులో ప్రభుత్వం తమకు సహకరించడం లేదని.. ఈ కేసును విజయవాడకు బదిలీ చేయాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి.. ఈ కేసును విశాఖపట్నం నుంచి విజయవాడకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను ఎన్ఐఏకు అప్పగించాలంటూ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
వైఎస్ జగన్ షర్టును 23న కోర్టుకు సమర్పించండి
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్టోబర్ 25వ తేదీన విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన సమయంలో ఆయన ధరించిన చొక్కాను తమకు సమర్పించాలని విశాఖ 7వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు ‘సిట్’ అధికారులను ఆదేశించింది. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు కత్తి గాయం కారణంగా చిరిగిన ఆయన చొక్కాకు రక్తం మరకలు అయ్యాయి. దీంతో వైఎస్ జగన్ ఆ చొక్కాను వీఐపీ లాంజ్‌లోనే మార్చుకుని మరో షర్టు ధరించి విమానంలో హైదరాబాద్ వెళ్లి చికిత్స కోసం నేరుగా ఆసుపత్రికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఘటన సమయంలో వైఎస్ జగన్ ధరించిన షర్టును అందచేయాలన్న ఉత్తర్వులపై సిట్ అధికారిగా వ్యవహరిస్తున్న విశాఖ ఏసీపీ బీవీఎస్ నాగేశ్వరరావును ‘సాక్షి’ శనివారం రాత్రి వివరణ కోరగా ఆ చొక్కాను ఈ నెల 23న కోర్టుకు సమర్పించాలని ఆదేశించిందన్నారు. అయితే ఈ విషయంలో వైఎస్ జగన్, ఆయన పీఏ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరంలేదని, ఆ చొక్కాను ఎవరైనా తీసుకొచ్చి అప్పగించవచ్చని చెప్పారు. -
నటి రంభకు సమన్లు
హైదరాబాద్: వరకట్న వేధింపుల కేసులో కోర్టుకు హాజరుకాని సినీ నటి రంభకు హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసులు తక్షణం న్యాయస్థానానికి హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె పద్మాలయ స్టూడియోలో జరుగుతున్న ఓ టీవీ చానెల్ డ్యాన్స్షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మంగళవారం రాత్రి 8 గంటలకు షో జరుగుతున్న ప్రాంతంలో ఆమెకు సమన్లు అందజేశారు. సినీ నటి రంభ సోదరుడు శ్రీనివాసరావు వివాహం 1999లో బంజారాహిల్స్ రోడ్ నం.2లో నివసించే పల్లవితో జరిగింది. 2014 నుంచి అత్తింటి వారి వేధింపులు ప్రారంభం కావడంతో.. పల్లవి అదే ఏడాది నాంపల్లిలోని మూడవ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో భర్త, అత్త మామలు, ఆడపడుచుపై పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశం మేరకు 2014 జూలై 21న బంజారాహిల్స్ పోలీసులు రంభతోపాటు భర్త, అత్తమామలపై ఐపీసీ 498(ఏ) కింద కేసు నమోదు చేశారు. అయితే అమెరికాలో ఉంటున్న రంభకు సమన్లు జారీ చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా వీలు కాలేదు. అయితే ఇటీవల ఓ షో నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేశారు. -
ట్రాఫిక్ విధుల్లో ‘డ్రంకన్ డ్రైవర్లు’
హిమాయత్‌నగర్: ‘డ్రంకన్ డ్రైవ్’లో పోలీసులకు చిక్కిన 31 మంది మందు బాబులకు సోమవారం మూడవ మెట్రోపాలిటన్ కోర్టు వినూత్న శిక్ష విధించింది. సుమారు 5 గంటల పాటు నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ విధులు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో వీరంతా మంగళవారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో పోలీస్ కంట్రోల్ రూమ్ , కోఠి, మోహంజా మార్కెట్ల్లోని సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తించారు. వీరంతా సుమారు 40 ఏళ్ల వయసులోపే వారని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
భార్యను వేధించిన వ్యక్తికి రెండేళ్ల జైలు
కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురి చేశాడో ప్రబుద్ధుడు. వేధింపులు తాళలేక భార్య కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన మెట్రోపాలిటన్ కోర్టు ఆ వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు,రూ. 20 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. వివరాలు.... నాచారం మల్లాపూర్ ప్రాంతంలో నివాసముండే మోహన్‌రెడ్డి, అంజలి భార్యాభర్తలు. అంజలి తల్లిదండ్రులు వీరి వివాహాన్ని అప్పట్లో ఘనంగా నిర్వహించారు.పెళ్లి అయిన కొంతకాలానికే మోహన్‌రెడ్డి అంజలిని అదనపు కట్నం కోసం వేధించ డంతో పోలీసులను ఆశ్రయించింది. -
'పరువు'కు పోతే ఫైన్ పడింది!
- ఎయిర్ ఇండియా మాజీ అధికారిపై పరువునష్టం దావాలో మాజీ కేంద్ర మంత్రికి షాక్ - విచారణకు హాజరుకాకపోవటంపై కోర్టు ఆగ్రహం.. రూ. 3వేల జరిమానా ముంబై: సాధారణంగా నిందితులు లేదా ఆరోపణలు ఎదుర్కునే వ్యక్తుల గౌర్హాజరుపై ఆగ్రహం వ్యక్యంచేసే కోర్టులు కొన్ని సందర్భాల్లో మాత్రమే పిటిషనర్ తీరును తప్పుబతూఉంటాయి. ఓ ఉన్నతాధికారిపై పరునష్టం దావావేసి కనీసం ఒక్కసారైనా విచారణకు హాజరుకాకుండా తిరుగుతోన్న మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ విషయంలోనూ ముంబై మెట్రోపాలిటన్ కోర్టు అదేతరహా అసహనం వ్యక్తం చేస్తూ ఏకంగా రూ. 3వేల జరిమానా విధించింది. ప్రఫుల్ పటేల్ విమానయాన మంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా తీవ్రంగా నష్టపోయిందని ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్ర భార్గవ తన ఆత్మకథా పుస్తకంలో పేర్కొన్నారు. అయితే జితేంద్ర తన పుస్తకంలో పేర్కొన్న విషయాలు అవాస్తవాలని ఆరోపిస్తూ మంత్రి ఫ్రఫుల్ పటేల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ మాజీ మంత్రివర్యులు ఒక్కసారైనా విచారణకు హాజరుకాలేదు. గురువారం విచారణ సందర్భంగా మరోసారి హాజరు మినహాయింపు కోరిన ప్రఫుల్ పటేల్ తరఫు న్యాయవాదిని కోర్టు చివాట్లు పెట్టింది. 'ఇంకెన్నిసార్లు ఇలా చేస్తారు? మీరు కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని అర్థమవుతోందా?' అంటూ ఆగ్రహంవ్యక్తం చేసిన మెజిస్ట్రేట్ వి.పి. అధోనే.. విచారణకు గైర్హాజరవుతున్నందుకుగానూ ప్రఫుల్ పటేల్ కు రూ.3వేల జరిమానా విధించారు. -
స్పెషల్ కోర్టు తీర్పును కొట్టేయండి
మెట్రోపాలిటన్ కోర్టులో ‘సత్యం’ నిందితుల పిటిషన్ విచారణార్హతను ఈ నెల 15న తేల్చనున్న జడ్జి సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ ఆర్థిక అవకతవకల కేసులో ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను సవాల్ చేస్తూ రామలింగరాజు, ఇతర నిందితులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వారి తరపు న్యాయవాదులు సోమవారం అప్పీళ్లు దాఖలు చేశారు. నేర విచారణ చట్టం(సీఆర్పీసీ) సెక్షన్ 374 కింద వాటిని సమర్పించారు. కుట్ర పన్నామనేందుకు ఆధారాలేమీ లేవని, తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిందని మొరపెట్టుకున్నారు. తమ అప్పీళ్లను విచారణకు స్వీకరించాలని, శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. పిటిషన్లను పరిష్కరించే వరకూ తమకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్లను పరిశీలించిన జడ్జి టి.రజని విచారణను ఈ నెల 15కు వాయిదా వేశారు. కాగా, ఈ కేసులో మరో ఇద్దరు దోషులు అప్పీళ్లు దాఖలు చేయాల్సి ఉంది. -
గడ్కరీ పరువునష్టం పిటిషన్‌పై డిసెంబర్ 20న విచారణ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దాఖలుచేసిన పిటిషన్‌ను డిసెంబర్ 20వ తేదీన స్థానిక న్యాయస్థానం విచారించనుంది. మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ గోమతి మనోచా శిక్షణా తరగతులకు వెళ్లడంతో శనివారం ఈ పిటిషన్ విచారణకు నోచుకోలేదు. అయితే నితిన్‌తో రాజీకి వచ్చే అవకాశముందంటూ ఇప్పటికే కేజ్రీవాల్.. కోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే.