ఢిల్లీ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో చార్జిషీట్‌ | Delhi hit-and-drag case: Police file 800-page chargesheet | Sakshi
Sakshi News home page

ఢిల్లీ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో చార్జిషీట్‌

Published Sun, Apr 2 2023 6:00 AM | Last Updated on Sun, Apr 2 2023 7:18 AM

Delhi hit-and-drag case: Police file 800-page chargesheet - Sakshi

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఏడుగురు నిందితులపై పోలీసులు శనివారం 800 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేశారు. దాదాపు 120 మంది సాక్ష్యాలను అందులో పొందుపరిచారు. నిందితుల్లో నలుగురిపై హత్యా నేరం మోపారు. దీనిపై విచారణను ఏప్రిల్‌ 13కు మెట్రోపాలిటన్‌ జడ్జి సన్యా దలాల్‌ వాయిదా వేశారు.

గత డిసెంబర్‌ 31న ఢిల్లీలో న్యూ ఇయర్‌ వేడుకలు చేసుకుని అర్ధరాత్రి దాటాక స్కూటీపై వెళ్తున్న అంజలీసింగ్‌ అనే 20 ఏళ్ల యువతిని నిందితులు కారుతో ఢీకొట్టడం, ఆమె కారు కింద చిక్కుకుందని తెలిసి కూడా అలాగే 12 కిలోమీటర్లకు పైగా లాక్కెళ్లడం తెలిసిందే. దాంతో ఒళ్లంతా ఛిద్రమై అంజలి అత్యంత బాధాకరంగా మరణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement