లాయర్​ దంపతుల హత్య: విచారణ పూర్తి.. చార్జ్​షీట్​ దాఖలు | Lawyers Murder: Chargesheet Submitted in Manthani Court | Sakshi
Sakshi News home page

లాయర్​ దంపతుల హత్య: విచారణ పూర్తి.. చార్జ్​షీట్​ దాఖలు

Published Fri, Jun 4 2021 2:15 PM | Last Updated on Fri, Jun 4 2021 9:31 PM

Lawyers Murder: Chargesheet Submitted in Manthani Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న్యాయవాద దంపతులైన  గట్టు వామనరావు,నాగమణి హత్యలపై విచారణ వివరాలను తెలపాలని తెలంగాణ హైకోర్టు ​ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా, తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌.. ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తయిందని హైకోర్టుకు విన్నవించారు. అయితే, ఛార్జీషీట్​ ఫైల్​ చేసారా అన్న ప్రశ్నకు.. గత నెల 19న విచారణను పూర్తి చేసి మంథని లోని ఫస్ట్​ క్లాస్​ మేజిస్ట్రేట్​ కోర్ట్​ ముందు చార్జ్​షీట్​ దాఖలు చేశామని ఏజీ తెలిపారు.

ఈ అభియోగపత్రం (చార్జిషీట్‌)​పై విచారణ ఈనెల 10 నుంచి మంథని కోర్ట్​లో జరుగుతుందని ఏజీ పేర్కొన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్యకేసును న్యాయస్థానం​ సుమోటోగా తీసుకుని విచారిస్తున్నసంగతి తెలిసిందే.

చదవండి: ఏడాదిన్నరగా భార్యను, కూతుళ్లను ఇంట్లోనే నిర్భందించాడు!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement