
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌ను మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టే పరిణామం! దాదాపు ఏడాదిన్నర క్రితం రెజ్లర్ సాగర్ ధన్‌కర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ పేరును ఢిల్లీ పోలీసులు తాజాగా చార్జ్ షీట్‌లో చేర్చారు.
సుశీల్‌తో పాటు మరో 17 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. ఇకపై చార్జ్‌షీట్‌కు అనుగుణంగా పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి కోర్టులో విచారణ సాగనుంది. 2021 మే 4 ఛత్ర్‌శాల్ స్టేడియంలో సాగర్‌పై దాడి జరగ్గా, తీవ్రంగా గాయపడిన అతను ఆ తర్వాత మృతి చెందాడు. గత ఏడాది మే 23న అరెస్టయిన సుశీల్ ఇంకా తీహార్ జైలులోనే ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment