న్యూఢిల్లీ: సాగర్ రాణా మృతికి కారణమైన రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే రాజకీయ పలుకుబడిని ఉపయోగించి సుశీల్ బయటకు వచ్చే అవకాశం ఉందని ఆరోపిస్తూ.. అతన్ని ఉరి తీయాలని సాగర్ రాణా తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
‘‘నా కొడుకును చంపిన వ్యక్తి ఒక మెంటర్‌గా ఉండడానికి అర్హుడు కాదు. అతనికి దక్కిన గౌరవాన్ని, పతకాల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. క్రిమినల్స్‌తో లింకులు ఉన్నాయి. రాజకీయ పలుకుబడితో బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాడు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి, కోర్టు ఎంక్వయిరీ జరిపిస్తే... దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు ఉండవు’’ అని సాగర్ పేరెంట్స్ కోరుతున్నారు.
కాగా, రెండుసార్లు గోల్డ్ మెడల్ సాధించిన సుశీల్ కుమార్, ఇరవై మూడేళ్ల ట్రైనీ రెజ్లర్ సాగర్ రాణా(23)ను అనుచరుల సాయంతో చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో సుశీల్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ కావడంతో పాటు ఆచూకీ చెప్పినవాళ్లకు లక్ష రూపాయల ప్రైజ్ మనీ కూడా ప్రకటించారు. చివరికి పంతొమ్మిది రోజుల తర్వాత ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, సుశీల్‌తో పాటు అజయ్ అనే సహ నిందితుడ్ని ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. నిందితులకు ఆరురోజుల రిమాండ్ విధించడంతో పోలీస్ కస్టడీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment