న్యూఢిల్లీ: రెజ్లర్ సాగర్ ధంకర్ హత్య కేసులో అరెస్టయిన ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌ను మండోలి జైలు నుంచి తీహార్ జైలుకు తరలించారు. సుశీల్‌కుమార్‌తో పాటు అతని సహచరుడు అజయ్‌ను మే 23న ఢిల్లీ స్పెషల్ పోలీసులు దేశ రాజధానిలోని ముండ్కా ప్రాంతంలో అరెస్టు చేశారు. అయితే, భద్రతా కారణాలతో సుశీల్‌ను తిహార్ జైలు-2కు తరలించినట్లు తెలుస్తోంది. కాగా, జైలు అధికారులు మాత్రం సాధారణ ప్రక్రియలో భాగంగానే తరలింపు జరిగిందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద మే 4న సాగర్‌తో పాటు అతని స్నేహితులు సోను, అమిత్ కుమార్‌పై సుశీల్ కుమార్, అతని స్నేహితులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. తీవ్ర గాయాలు కావడంతో సాగర్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. దాడి అనంతరం పరారీలో ఉన్న సుశీల్ కుమార్‌తో పాటు సహ నిందితుడు అజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా కోర్టు తిరస్కరించింది. ఇదే కేసులో సుశీల్ జూడో కోచ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
చదవండి: WTC 2021-23: టీమిండియా షెడ్యూల్ ఖరారు.. ఇంగ్లండ్ సిరీస్‌తో షురూ
Comments
Please login to add a commentAdd a comment