న్యూఢిల్లీ: హత్య కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉంటున్న రెజ్లర్ సుశీల్ కుమార్.. తన సెల్‌లో టీవీ పెట్టించాలని జైలు అధికారులను డిమాండ్ చేశాడు. ఇటీవలే తనకు ప్రత్యేకమైన ఆహారం ఇవ్వాలని కోరిన ఆయన..తాజా మరో గొంతెమ్మ కోరిక కోరాడు. వార్తలు చూడటానికి, అలాగే రెజ్లింగ్‌లో అప్‌డేట్స్ తెలుసుకోవడానికి తనకు తప్పనిసరిగా టీవీ కావాలని జైలు అధికారులకు రాసిన ఓ లేఖలో పేర్కొన్నాడు. రెండుసార్లు ఒలింపిక్ మెడల్స్‌ను సాధించిన సుశీల్.. రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం సుశీల్.. తీహార్‌లోని జైల్ నంబర్ 2లో సాధారణ ఖైదీగా ఉంటున్నాడు. జైలు నిబంధనల సాధారణ ఖైదీలకు న్యూస్ పేపర్స్ మాత్రమే ఇస్తారు. అయితే సుశీల్.. తనను విఐపీ ఖైదీగా పరిగణించి, ప్రత్యేక ఆహారం, టీవీతో పాటు మరిన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరుతున్నాడు.ఈ విషయమై గతంలో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని కొట్టి వేసింది. హత్యారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఈ సదుపాయాలు కల్పించడం కుదరదని ఘాటుగా బదులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment