నటి రంభకు సమన్లు | Summons to the actress Rambha | Sakshi
Sakshi News home page

నటి రంభకు సమన్లు

Published Thu, Jan 12 2017 4:22 AM | Last Updated on Wed, Apr 3 2019 9:14 PM

నటి రంభకు సమన్లు - Sakshi

నటి రంభకు సమన్లు

హైదరాబాద్‌: వరకట్న వేధింపుల కేసులో కోర్టుకు హాజరుకాని సినీ నటి రంభకు హైదరాబాద్‌ బంజారా హిల్స్‌ పోలీసులు తక్షణం న్యాయస్థానానికి హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె పద్మాలయ స్టూడియోలో జరుగుతున్న ఓ టీవీ చానెల్‌ డ్యాన్స్‌షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మంగళవారం రాత్రి 8 గంటలకు షో జరుగుతున్న ప్రాంతంలో ఆమెకు సమన్లు అందజేశారు. సినీ నటి రంభ సోదరుడు శ్రీనివాసరావు వివాహం 1999లో బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లో నివసించే పల్లవితో జరిగింది.

2014 నుంచి అత్తింటి వారి వేధింపులు ప్రారంభం కావడంతో.. పల్లవి అదే ఏడాది నాంపల్లిలోని మూడవ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో భర్త, అత్త మామలు, ఆడపడుచుపై పిటిషన్‌ దాఖలు చేసింది. కోర్టు ఆదేశం మేరకు 2014 జూలై 21న బంజారాహిల్స్‌ పోలీసులు రంభతోపాటు భర్త, అత్తమామలపై ఐపీసీ 498(ఏ) కింద కేసు నమోదు చేశారు. అయితే అమెరికాలో ఉంటున్న రంభకు సమన్లు జారీ చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా వీలు కాలేదు. అయితే ఇటీవల ఓ షో నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement